
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై : అర్ధరాత్రి ప్రియురాలిని కలవడానికి వెళ్లిన యువకుడు, అతని స్నేహితుడిని ఊరి ప్రజలు కట్టేసి దాడిచేసిన ఘటన తంజావూర్ జిల్లా రక్తనాడు సమీపంలోని వడక్కి కోటలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇద్దరు మిత్రులు నిలబడి మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ దారిన వచ్చిన వారు చూసి అనుమానంతో ఇద్దరిని దొంగలుగా భావించి చుట్టముట్టి తాడుతో కట్టి వేసి చితకబాదారు. దెబ్బలు తట్టుకోలేక ఇద్దరు స్పృహతప్పి పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి స్థానికుల నుంచి రక్షించి పోలీస్ స్టేషన్‌కు తీసుకొని వెళ్లారు.
అనంతరం జరిపిన విచారణలో తంజావూరు జిల్లా ఒరత్తనాడు తాలూకా తెన్నమనాడు గ్రామానికి చెందిన ప్రవీణ్ (20). ఇతనికి ఒరత్తనాడు సమీపంలో ఉన్న వడికి కోట గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రియురాలిని చూడటానికి ప్రవీణ్ తన స్నేహితుడితో వడిక్కి కోట గ్రామానికి వచ్చాడు. ఈ సమాచారం ప్రియురాలికి తెలిపి ఆమె వచ్చే వరకు ఇంటి సమీపంలో ఇద్దరు ఎదురుచూస్తుండగా గ్రామస్తులు దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
చదవండి: చైనాతో యుద్ధానికి నేను సైతం.. రాష్ట్రపతికి రక్తంతో..
Comments
Please login to add a commentAdd a comment