సంజయ్, ప్రవీణ
సాక్షి,చెన్నై: తమకు భద్రత కల్పించాలని భర్తతో పాటు ప్రేమజంట జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. కరూర్ జిల్లా పరమత్తి పరిధిలోని ఆత్తుమేడు వీధికి చెందిన ప్రవీణ (21) తన భర్తతో భద్రత కల్పించాలని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఫిటిషన్ అందజేసింది. అందులో ఇలా ఉంది. ఈ రోడ్‌జిల్లా, అవుడయార్‌పారై, పళయచోళకాళిపాళయం ప్రాంతానికి చెందిన తన తల్లిదండ్రులతో నివసిస్తూ బీ.కాం చదివానని, తాను, ఆత్తుమేడు వీధికి చెందిన సంజయ్ (21)ని గత ఏడాదిగా ప్రేమిస్తున్నట్టు తెలిపింది. ఈ ప్రేమ వ్యవహారం రెండు నెలల క్రితం తన తల్లిదండ్రులకు తెలియడంతో వారు వ్యతిరేకించారని, అంతేకాకుండా తనను గృహ నిర్భంధంలో ఉంచి ఇష్టం లేకుండా వేరొక వ్యక్తితో వివాహం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తూ వచ్చారని తెలిపారు. చదవండి: అమ్మా డాడీని లెమ్మను..
గత 11వ తేదీ ఇంటి నుంచి తప్పించుకుని తాంతోనిమలై కాళియమ్మన్ ఆలయంలో ఇద్దరం వివాహం చేసుకుని, ఆత్తుమేడు వీధిలో ఉన్న భర్త ఇంట్లో నివసిస్తున్నట్టు వెల్లడించింది. ఇలావుండగా గత 13వ తేదీ తన తల్లిదండ్రులు, బంధువులు కొందరు భర్త ఇంటికి వచ్చి అతన్ని హత్య చేసేందుకు, తనను తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. తాము అక్కడ నుంచి తప్పించుకుని వచ్చామని పేర్కొన్నారు. తన భర్త కుటుంబీకులను బెదిరించడమే కాకుండా భర్త సెల్‌ఫోన్‌కు హత్యా బెదిరింపులు వస్తున్నట్లు తెలిపారు. తమ కులాంతర వివాహానికి వ్యతిరేకత తెలుపుతూ భర్తను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్న తల్లిదండ్రులు, బంధువులపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని కోరారు. చదవండి: కాళ్ల పారాణి ఆరక ముందే..
Comments
Please login to add a commentAdd a comment