love pair
-
పబ్జీ ప్రేమకథలో మరో ట్విస్టు.. నువ్వు మాకొద్దు..
ఇస్లామాబాద్: పబ్జీ కారణంగా పరిచయమైన యువకుడిని వెతుక్కుంటూ పాకిస్తాన్ నుండి తన నలుగురు పిల్లలతో సహా వలసవచ్చిన మహిళ సీమా గులాం హైదర్ తిరిగి పాకిస్తాన్ వస్తే ఊరుకునేది లేదన్నారు ఆమె బంధువులు. హిందువైన యువకుడి కోసం వెళ్ళిపోయిన ఆమె ఇకపై ముస్లిం కాదని పిల్లల్ని మాత్రం వెంటనే పాకిస్తాన్ తిరిగి పంపించేయాలని డిమాండ్ చేశారు. కరోనా ప్రేమ.. కరోనా సమయంలో యావత్ప్రపంచమంతా బిక్కు బిక్కుమంటూ గడువుతోంటే పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్, భారత్ కు చెందిన సచిన్ మీనా మాత్రం హాయిగా ప్రేమలో మునిగి తేలారు. పబ్జీ ద్వారా మొదలైన పరిచయాన్ని ప్రేమగా మార్చుకున్నారు. అప్పటికే ఆ మహిళకు పెళ్ళై నలుగురు పిల్లలున్నా కూడా ప్రియుడిని కలుసుకునేందుకు భారత్ వచ్చే సాహసం చేసింది. వెళ్ళను గాక వెళ్ళను.. జులై 4న గ్రేటర్ నోయిడాలోని ప్రియుడు సచిన్ మీనాను చేరుకున్న సీమా హైదర్ పై అక్రమ చొరబాటు కేసు నమోదైన విషయం, ఆ కేసులో ఆమెకు బెయిల్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటికి కథ సుఖాంతమవడంతో సీమా ఇకపై నేను హిందువునని, తిరిగి పాకిస్తాన్ కు వెళ్ళేది లేదని తెగేసి చెప్పేసింది. మాక్కూడా నువ్వొద్దు.. తాజాగా ఆమె కుటుంబ సభ్యులు స్పందిస్తూ.. ఎప్పుడైతే హిందువుని వెతుక్కుంటూ వెళిపోయిందో అప్పుడే ఆమెతో సంబంధం తెగిపోయిందని, తను ఇప్పుడు ముస్లిం కాదని చెప్పారు. కానీ నలుగురు పిల్లలను వంటనే వెనక్కు పంపాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్లో ఆమె నివాసమున్న ఇంటి యజమాని కుమారుడు నూర్ మహమ్మద్ మాట్లాడుతూ.. గులాం హైదర్ అనే వ్యక్తితో సీమాకు పదేళ్ల క్రితం పెళ్లయిందని, ఆయన సౌదీలో పనిచేస్తుంటాడని ఆమె మాత్రం మూడేళ్ళుగా ఇక్కడ పిల్లలతో ఒంటరిగా ఉండేదన్నారు. వాళ్ళ మామయ్యగారు ఇక్కడికి చాలా దూరంగా ఉంటారని తెలిపారు. ఇది కూడా చదవండి: అసలు పుట్టేవాళ్లే తక్కువ.. మళ్లీ నియంత్రణ గోల ఏంటి? -
ఆ ఘటన నా మనసును కలచివేసింది: సీఎం జగన్
సాక్షి, తాడేపలి: ప్రకాశం బ్యారేజీ వద్ద నర్సింగ్ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన తన మనసును కలచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో ఎక్కడా జరగకూడదన్నారు. మహిళలు అర్ధరాత్రి కూడా తిరగగలిగే పరిస్థితి ఉన్నప్పుడే.. నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు గట్టిగా నమ్మే వ్యక్తిని తానని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇక మీదట ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల కోసం దిశ, అభయం యాప్‌లతో పాటు వారి రక్షణ కోసం దిశ చట్టం చేశాం అన్నారు సీఎం జగన్. మహిళల రక్షణకై దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసులను నియమించాం.. మహిళల కోసం ప్రత్యేకంగా 900 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశామని సీఎం జగన్ తెలిపారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే డీజీపీ డి.గౌతం సవాంగ్‌ను సీఎం జగన్ సోమవారం తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించకూడదని.. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. చదవండి: అత్యాచార ఘటనపై సర్కారు సీరియస్ -
అత్యాచార ఘటనపై సర్కారు సీరియస్
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్/గుంటూరు ఈస్ట్: గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ మండలం సీతానగరం పుష్కర ఘాట్ సమీపంలో శనివారం రాత్రి నర్సింగ్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. డీజీపీ డి.గౌతం సవాంగ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించకూడదని.. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. మరోవైపు బాధితురాలిని పరామర్శించి ప్రభుత్వం తరఫున భరోసా ఇవ్వాలని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితను, స్త్రీ శిశు సంక్షేమ శాఖ తానేటి వనితను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇదిలావుండగా.. ఇప్పటికే పోలీస్ శాఖ ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తును ముమ్మరం చేసింది. ఘటనపై డీజీపీ గౌతం సవాంగ్ స్పందిస్తూ.. అత్యాచారం చేసినవారు ఎంతటి వారైనా గుర్తించి కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. ఇటువంటి అమానవీయ ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిందితులకు కఠిన శిక్ష తప్పదు కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత సోమవారం పరామర్శించారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అనంతరం హోం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం అనేక చట్టాలు చేస్తున్నా ఉన్మాదులు బరి తెగిస్తున్నారన్నారు. పుష్కర ఘాట్‌లో నిఘా పెంచుతున్నామని, అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తానేటి వనిత మాట్లాడుతూ బాధితురాలిని పరామర్శించి భరోసా ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమను పంపించారని తెలిపారు. బాధితురాలికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాల్సిందిగా ఆదేశించారన్నారు. తమ శాఖ నుంచి రూ.50 వేలు ఇస్తున్నట్టు చెప్పారు. ఇదిలావుండగా.. బాధితురాలిని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేసు దర్యాప్తులో పురోగతి ఈ కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. సోమవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు కలిసి కొంతమంది అనుమానితులను విచారించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం అన్వేషణ ప్రారంభించామని చెప్పారు. తాడేపల్లి, మంగళగిరి, విజయవాడ కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాలకు చెందిన అనుమానితులను అదుపులోకి తీసుకుని పూర్తి విచారణ చేపట్టామన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కొంత సమాచారం వచ్చిందని, ఇందుకు కారణమైన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసేంతవరకు వివరాలు వెల్లడించబోమని పేర్కొన్నారు. మరో 24 గంటల్లో కేసును పరిష్కరించే అవకాశం ఉందని చెప్పారు. కృష్ణా తీరంలో గతంలోనే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, 19న పోలీసులందరూ హడావుడిగా ఉండటంతో అక్కడ ఆ రోజు నిఘా కొరవడిందన్నారు. గత 15 రోజుల వ్యవధిలో కృష్ణా తీరంలో మద్యం, గంజాయి సేవిస్తున్న వారిపై 15 కేసులు నమోదు చేశామని చెప్పారు. పుష్కర ఘాట్‌లోకి రాత్రి 9 గంటల తరువాత ఎవరినీ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం ఆహ్లాదకరమైనది కావడం, కృష్ణా నదిపై మూడు రైల్వే బ్రిడ్జిలు ఉండటం, నిర్జన ప్రదేశం కావడంతో అసాంఘిక శక్తుల కదలికలు ఎక్కువయ్యాయన్నారు. వారిని నివారించేందుకు రైల్వే పోలీసులతో సంయుక్త కార్యాచరణ రూపొందించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు, యువతుల భద్రతకు సీఎం ఆదేశాలు నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం ఘటన కేసులో దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను గుర్తించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. దిశ చట్టంలో ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నిందితులను గుర్తించి శిక్ష పడేట్టుగా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించకూడదని, ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చారని వివరించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణా నది పరిసరాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, యువతుల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని చెప్పారు. అన్ని జిల్లాల ఎస్పీలను అప్రమత్తం చేయాలని, అరాచక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారని తెలిపారు. ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నానని.. నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని డీజీపీ చెప్పారు. పాత నేరస్తుల పనేనా! పోలీసులు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులూ తాడేపల్లి ప్రాంతానికి చెందిన వారేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులు బ్రిడ్జి వద్ద రైళ్లు ఆగి.. బయలుదేరే సమయంలో ప్రయాణికుల నుంచి సెల్ఫోన్లు, మెడలో చైన్లు లాక్కొని పరారయ్యే బృందంగా తెలియవచ్చింది. ఇందులో ఓ యువకుడికి పడవ నడిపే అనుభవం ఉంది. మరో యువకుడు రెండేళ్ల క్రితం ఓ హత్య కేసులో నిందితుడని సమాచారం. పడవ నడిపే అనుభవం ఉన్న వ్యక్తి బందరు బీచ్‌లో ప్రేమ జంటపై దాడి చేయగా అక్కడ కూడా కేసు నమోదైనట్టు చెబుతున్నారు. చదవండి: ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం -
ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం
సాక్షి, గుంటూరు/తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా సీతానగరం పుష్కర్ ఘాట్ సమీపంలో శనివారం రాత్రి ఓ యువతి అత్యాచారానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియుడితో కలిసి కృష్ణా నది ఒడ్డున సేదతీరేందుకు వెళ్లిన ప్రేమ జంటపై ఇద్దరు దుండగులు దాడి జరిపారు. యువకుడిని బంధించి, యువతిపై అత్యాచారానికి తెగబడ్డారు. విజయవాడ గాంధీనగర్‌లోని పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న ఓ యువకుడు, నర్సుగా పనిచేస్తున్న యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను అంగీకరించిన పెద్దలు వివాహం చేయాలని నిశ్చయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివాహం వాయిదా పడింది. శనివారం రాత్రి 9 గంటలకు ఆ జంట కృష్ణా నది ఒడ్డున సీతానగరం రైల్వే బ్రిడ్జి దిగువన గల పుష్కర్ ఘాట్‌కు వచ్చి మాట్లాడుకుంటుండగా.. ఇద్దరు దుండగులు దాడికి పాల్పడి యువకుడిని బంధించి.. యువతిని పక్కకు లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం వారివద్ద ఉన్న సెల్ఫోన్లను తీసుకుని పడవలో నది మీదుగా పరారయ్యారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రేమజంట ప్రకాశం బ్యారేజి వద్దకు చేరుకుని అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు విషయం చెప్పారు. అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు, మంగళగిరి డీఎస్పీ దుర్గాప్రసాద్, తాడేపల్లి సీఐ శేషగిరిరావు రంగంలోకి దిగి.. బాధితురాలిని చికిత్సకు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. సెల్ టవర్ లొకేషన్స్, సీసీటీవీ ఫుటేజ్‌లు, బాధితులు తెలిపిన వివరాల ఆధారంగా కొందరు అనుమానితులను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. నాలుగు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతోందని అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. -
పెళ్లికి నిరాకరించిందని ప్రేమోన్మాది దారుణం
సాక్షి, జగిత్యాల క్రైం: పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడికి తెగబడ్డాడు. అనంతరం గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌కు చెందిన యువతి(25), అదే గ్రామానికి చెందిన కట్కం రాజ్‌కుమార్ స్నేహితులు. ఇద్దరూ పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఇంటర్ తర్వాత రాజ్‌కుమార్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. యువతి ఇక్కడే ఉంటూ పీజీ చేస్తోంది. వారిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. యువతి మెడకు తగిలిన గాయం ఇరవైరోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చి... ఇరవై రోజుల క్రితం రాజ్‌కుమార్ దుబాయ్ నుంచి స్వగ్రామం చేరుకున్నాడు. యువతిని కలిసేందుకు అతడు విఫలయత్నం చేశాడు. ఫోన్ చేసినా సరిగా స్పందించకపోవడమేకాకుండా తనతో పెళ్లికి నిరాకరించిందని కోపం పెంచుకున్నాడు. ఆగ్రహంగా ఉన్న రాజ్‌కుమార్ శనివారం మధ్యాహ్నం జాబితాపూర్‌కు చేరుకున్నాడు. యువతి ఇంట్లోకి వెళ్లి కత్తితో ఆమె మెడ, వీపుపై దాడి చేశాడు. యువతి తప్పించుకొని, కేకలు వేసింది. ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చేసరికి అతడు అదే కత్తితో తన గొంతు కోసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రాజ్‌కుమార్‌ను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన యువతి జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మృతుడి సెల్ఫోన్లో ఉన్న మెసేజ్‌లు, కాల్‌డేటాను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నమ్మలేకపోతున్నాం... రాజ్‌కుమార్ మృతితో మేడిపల్లి మండలం మన్నెగూడెంలో విషాదం నెలకొంది. అందరితో కలిసిమెలిసి ఉండే యువకుడు క్షణికావేశానికి లోనై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని, దీనిని తాము నమ్మలేకపోతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. రాజ్‌కుమార్‌కు ఒక సోదరి ఉంది. ఆమె వివాహం కాగా, తల్లిదండ్రులకు అతడు ఒక్కగానొక్క కొడుకు. -
పెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోయి.. ప్రియుడ్ని..
సాక్షి, మహబూబాబాద్ (మరిపెడ రూరల్): ప్రేమ జంట ఒక్కటైంది. ఇష్టం లేని వ్యక్తితో బలవంతంగా వివాహం చేస్తున్నారని ఓ యువతి పీటల మీద పెళ్లిని అడ్డుకున్న విషయం విదితమే. అయితే.. శుక్రవారం ప్రేమికులిద్దరూ ఓ ఆలయంలో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల గుండెపుడి గ్రామానికి చెందిన ఓ యువకుడితో కురవి మండలం కాంపెల్లికి చెందిన దివ్య వివాహాన్ని పెద్దల సమక్షంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గురువారం మరిపెడలో వివాహం జరుగుతున్న క్రమంలో వధువు పెళ్లి పీటల మీద నుంచి లేచి 100కు నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులను ఆశ్రయించింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, కాంపెల్లి గ్రామానికి చెందిన కొల్లు నరేశ్‌ను ప్రేమించినట్లు చెప్పింది. దీంతో శుక్రవారం మహబూబాబాద్ మండలం అనంతారం జగన్నాథ వెంకటేశ్వర ఆలయంలో దివ్య, నరేశ్ దండలు మార్చుకున్నారు. చదవండి: (కొద్ది క్షణాల్లో పెళ్లి.. 100కు కాల్ చేసిన వధువు) -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
సాక్షి, మదనపల్లె: మదనపల్లె మండలంలో ఓ ప్రేమజంట శుక్రవారం రాత్రి పురుగు మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. బాధితులు, ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసుల కథనం మేరకు, మదనపల్లె మండలం చీకిలబైలుకు చెందిన అమర(22) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వలసపల్లె పంచాయతీ కృష్ణాపురానికి చెందిన స్రవంతి(22) పుంగనూరు రోడ్డులోని 150మైలు వద్ద ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. (ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడి ఆత్మహత్య) ఇద్దరూ కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన ఇరువురి కుటుంబసభ్యులు వీరిని మందలించారు. దూరం చేస్తారన్న మనస్తాపంతో కృష్ణాపురం సమీపంలోని ఓ ఫ్యాక్టరీ వద్ద పురుగు మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు బాధితులను స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. సంఘటనపై రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (మైనర్‌తో వ్యభిచారం.. 9 మంది అరెస్ట్) -
ప్రేమించి పెద్దల్ని ఎదిరించి.. అంతలోనే..
సాక్షి, చెన్నై: వేర్వేరు చోట్ల ప్రేమికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నా, జీవిత పయనాన్ని సాగించలేక ముందే ముగించుకుంది. పెద్దలు వ్యతిరేకించడంతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న సమాచారంతో నీ వెంటే నేనూ అంటూ ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఈరోడ్ జిల్లా అందియూరు సమీపంలోని ఒరుచ్చేరికి చెందిన ఇలంగోవన్(23), తిరుచంగోడుకు చెందిన రమ్య(23) ప్రేమించుకున్నారు. పెద్దలు కాదన్నా ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడు నెలలుగా అందియూర్‌లో కాపురం ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం పని ముగించుకుని ఇంటికొచ్చిన ఇలంగోవన్, రమ్య ఉరి వేసుకుని మృతిచెందడం చూసి ఆందోళన చెందాడు. తాను సైతం అంటూ ఉరి పోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం ఈ ఇద్దరూ ఇంటినుంచి బయటకు రాకపోవడంతో ఇరుగు పొరుగు వెళ్లి చూడగా ఆత్మహత్య చేసుకుని ఉండడం వెలుగుచూసింది. ఉదయాన్నే ఇలంగోవన్ తనను తిట్టడంతో రమ్య తీవ్ర మనస్తాపానికి లోనైనట్టు విచారణలో తేలింది. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకోవడం, భయంతో ఇలంగోవన్ సైతం బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. (డ్రగ్స్ కేసు: ఆ ఇద్దరి ఫోన్లలో నీలి ఫోటోలు, వీడియోలు!) ప్రియురాలి మరణంతో.. చెన్నై తండయార్ పేటకు చెందిన కుమార్ కుమార్తె దివ్య(20), పాత చాకలి పేటకు చెందిన పెరుమాల్ కుమారుడు అయ్యప్పన్(21) ప్రేమలో పడ్డారు. అయితే, వీరి ప్రేమను పెద్దలు వ్యతిరేకించారు. పెద్దలు మందలించడంతో దివ్య మనస్తాపం చెంది ఆదివారం అర్ధరాత్రి బలన్మరణానికి యత్నించింది. ఆమెను కీల్పాకం ఆస్పత్రికి తరలించగా, సోమ వారం మృతిచెందింది. విషయం తెలిసి తీవ్ర మనోవేదనలో పడ్డ అయ్యప్పన్ నీ వెంటే నేనూ అంటూ సోమవారం అర్ధరాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ కోసం పిల్లలు బలన్మరణానికి పాల్పడడం వారి తల్లిదండ్రుల్ని, కుటుంబీకల్ని విషాదంలోకి నెట్టింది. -
తమిళనాడు ప్రేమజంట అదృశ్యం
సాక్షి, చిత్తూరు : తమిళనాడుకు చెందిన ప్రేమజంట మిస్సింగ్ కేసుకు సంబంధించి నాగలాపురం మండలం రాజులకండ్రిగలో శనివారం తమిళనాడు పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల కథనం మేరకు నాగలాపురం మండలం రాజులకండ్రిగలో యోగ్యత పేరుపై ప్రభు అనాథ ఆశ్రమం నడుపుతున్నారు. ఈ ఆశ్రమంలో కొంతమంది అనాథలు ఉన్నట్లు సమాచారం. ఈ ఆశ్రమానికి తమిళనాడుకు చెందిన కొంతమంది యువకులు వచ్చి వెళ్తుంటారు. తమిళనాడు రాష్ట్రం ఆవడి సమీపంలోని కిల్లికుప్పం గ్రామానికి చెందిన శ్యామ్ శ్రీనివాస్(32) ఆశ్రమానికి తరచూ వస్తూ.. ఆశ్రమ నిర్వాహకుడు ప్రభుకు పరిచయమయ్యాడు. శ్యామ్‌శ్రీనివాస్‌కు తిరువళ్లూరు జిల్లా తిరుమల్‌వాయిల్‌కు చెందిన వర్ష(20)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. (విషాదం: తండ్రి మరణంతో కూతుళ్లు కూడా..) రాజులకండ్రిగ ఆశ్రమం వద్ద విచారణ నిర్వహిస్తున్న తమిళనాడు పోలీసులు (ఇన్సెట్లో) ఆశ్రమ నిర్వాహకుడు ప్రభు పది రోజుల కిందట శ్యామ్ శ్రీనివాస్, వర్ష పరారై రాజులకండ్రిగలోని ఆశ్రమానికి వచ్చేశారు. వర్ష తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తిరువళ్లూరు పోలీసులు ఆశ్రమానికి చేరుకుని విచారణ జరిపారు. వర్షను అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. రెండు రోజుల నుంచి వర్ష మళ్లీ కనబడలేదు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరువళ్లూరు సీఐ ఆర్ పురుషోత్తమన్ నేతృత్వంలో పోలీసులు శనివారం రాజులకండ్రిగకు చేరుకున్నారు. ఆశ్రమం వద్ద ప్రేమజంట వచ్చిన కారు ఉన్నట్లు గుర్తించారు. ఆశ్రమం నిర్వాహకుడిని ప్రభును విచారించారు. వారు ఇక్కడికి రాలేదని ప్రభు పోలీసులకు తెలిపాడు. దీంతో ప్రభును విచారణ నిమిత్తం తిరువళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
అర్ధరాత్రి ప్రియురాలి కోసం వెళ్తే..
సాక్షి, చెన్నై : అర్ధరాత్రి ప్రియురాలిని కలవడానికి వెళ్లిన యువకుడు, అతని స్నేహితుడిని ఊరి ప్రజలు కట్టేసి దాడిచేసిన ఘటన తంజావూర్ జిల్లా రక్తనాడు సమీపంలోని వడక్కి కోటలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇద్దరు మిత్రులు నిలబడి మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ దారిన వచ్చిన వారు చూసి అనుమానంతో ఇద్దరిని దొంగలుగా భావించి చుట్టముట్టి తాడుతో కట్టి వేసి చితకబాదారు. దెబ్బలు తట్టుకోలేక ఇద్దరు స్పృహతప్పి పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి స్థానికుల నుంచి రక్షించి పోలీస్ స్టేషన్‌కు తీసుకొని వెళ్లారు. అనంతరం జరిపిన విచారణలో తంజావూరు జిల్లా ఒరత్తనాడు తాలూకా తెన్నమనాడు గ్రామానికి చెందిన ప్రవీణ్ (20). ఇతనికి ఒరత్తనాడు సమీపంలో ఉన్న వడికి కోట గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రియురాలిని చూడటానికి ప్రవీణ్ తన స్నేహితుడితో వడిక్కి కోట గ్రామానికి వచ్చాడు. ఈ సమాచారం ప్రియురాలికి తెలిపి ఆమె వచ్చే వరకు ఇంటి సమీపంలో ఇద్దరు ఎదురుచూస్తుండగా గ్రామస్తులు దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. చదవండి: చైనాతో యుద్ధానికి నేను సైతం.. రాష్ట్రపతికి రక్తంతో.. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
సాక్షి,చెన్నై: తమకు భద్రత కల్పించాలని భర్తతో పాటు ప్రేమజంట జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. కరూర్ జిల్లా పరమత్తి పరిధిలోని ఆత్తుమేడు వీధికి చెందిన ప్రవీణ (21) తన భర్తతో భద్రత కల్పించాలని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఫిటిషన్ అందజేసింది. అందులో ఇలా ఉంది. ఈ రోడ్‌జిల్లా, అవుడయార్‌పారై, పళయచోళకాళిపాళయం ప్రాంతానికి చెందిన తన తల్లిదండ్రులతో నివసిస్తూ బీ.కాం చదివానని, తాను, ఆత్తుమేడు వీధికి చెందిన సంజయ్ (21)ని గత ఏడాదిగా ప్రేమిస్తున్నట్టు తెలిపింది. ఈ ప్రేమ వ్యవహారం రెండు నెలల క్రితం తన తల్లిదండ్రులకు తెలియడంతో వారు వ్యతిరేకించారని, అంతేకాకుండా తనను గృహ నిర్భంధంలో ఉంచి ఇష్టం లేకుండా వేరొక వ్యక్తితో వివాహం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తూ వచ్చారని తెలిపారు. చదవండి: అమ్మా డాడీని లెమ్మను.. గత 11వ తేదీ ఇంటి నుంచి తప్పించుకుని తాంతోనిమలై కాళియమ్మన్ ఆలయంలో ఇద్దరం వివాహం చేసుకుని, ఆత్తుమేడు వీధిలో ఉన్న భర్త ఇంట్లో నివసిస్తున్నట్టు వెల్లడించింది. ఇలావుండగా గత 13వ తేదీ తన తల్లిదండ్రులు, బంధువులు కొందరు భర్త ఇంటికి వచ్చి అతన్ని హత్య చేసేందుకు, తనను తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. తాము అక్కడ నుంచి తప్పించుకుని వచ్చామని పేర్కొన్నారు. తన భర్త కుటుంబీకులను బెదిరించడమే కాకుండా భర్త సెల్‌ఫోన్‌కు హత్యా బెదిరింపులు వస్తున్నట్లు తెలిపారు. తమ కులాంతర వివాహానికి వ్యతిరేకత తెలుపుతూ భర్తను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్న తల్లిదండ్రులు, బంధువులపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని కోరారు. చదవండి: కాళ్ల పారాణి ఆరక ముందే.. -
మంత్రి జోక్యం.. హైకోర్టును ఆశ్రయించిన ప్రేమజంట
సాక్షి, అమరావతి : పోలీసులు వేధిస్తున్నారంటూ కృష్ణా జిల్లాకు చెందిన ప్రేమజంట మంగళవారం ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. నందిగామకు చెందిన సురేష్, శ్రీజ కులాంతర వివాహం చేసుకున్నారు, వీరి వివాహానికి శ్రీజ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్రీజ మేనమామ కంచికచర్ల టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు కావడంతో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోక్యం చేసుకుంటునట్లు ప్రేమజంట ఆరోపిస్తోంది. ఇద్దరిని విడగొట్టాలని దేవినేని ఒత్తిడి తెస్తున్నారని, శ్రీజను ఇంట్లో బంధించి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారని సురేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు సీఎస్, డీజీపీ, కలెక్టర్, ఎస్పీతో పాటు తొమ్మిది మందికి నోటీసులు జారీ చేసింది. కేసును వెనక్కి తీసుకోవాలని నందిగామ డీఎస్సీ రాదేశ్ మురళి, ఏఎస్ఐ నాగేశ్వరరావు వేధింపులకు పాల్పడుతున్నారని ప్రేమజంట తెలిపారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
కళ్యాణదుర్గం: కులాంతర వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. మండల కేంద్రం బ్రహ్మసముద్రంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బ్రహ్మసముద్రం మండలం ఎస్.కోనాపురం గ్రామానికి చెందిన భీమరాజ్, మౌనిక ఏడాదిగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి కులాలు వేరుకావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. అబ్బాయి తండ్రి తిమ్మప్ప అమ్మాయి తల్లిదండ్రులు తిమ్మప్ప, పద్మావతిలను బ్రహ్మసముద్రం పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. అబ్బాయి, అమ్మాయి మేజర్లు అయినందున వారి ఇష్టప్రకారం పెళ్లి చేసుకోవచ్చని, ఎవ్వరూ వారిని బెదిరింపులకు గురి చేయరాదని పోలీసులు ఇరు కుటుంబాల సభ్యులకూ చెప్పి పంపించారు. అనంతరం భీమరాజ్ బ్రహ్మసముద్రంలో ఉంటున్న తన పెదనాన్న వద్దకు అమ్మాయిని తీసుకుని వెళ్లాడు. పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుదామని పెదనాన్న, వారి కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటికి వెళ్లారు. దీంతో పెళ్లికి ఆటంకాలు ఏర్పాడుతాయని భావించిన భీమరాజ్, మౌనికలు ఇంట్లోనే పెట్రోల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. కొద్దిసేపటి అనంతరం బాధితులను కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. ఔట్‌పోస్టు పోలీసులు వివరాలు నమోదు చేసుకుని బ్రహ్మసముద్రం పోలీసులకు సమాచారం అందించారు. -
ప్రేమ కోసం వచ్చిన ప్రియుడు.. కానీ
– రైలు కింద పడి మృతి –పది రోజుల కిందటే గల్ఫ్ నుంచి వచ్చిన ప్రియుడు రాజంపేట: ఒకరు పెళ్లి కాని యువకుడు. మరొకరు పెళ్లై ముగ్గురు సంతానం ఉన్న వివాహిత. వారిద్దరూ ఇష్టపడ్డారు. ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఎక్కడెక్కడో తిరిగారు. చివరికి ఆదివారం రాజంపేట రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలపై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచారు. మృతదేహాల వద్ద ఆధారాలను బట్టి రైల్వేపోలీసులు.. వారి వివరాలను సేకరించి, సంబంధీకులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి రేణిగుంట జీఆర్పీ సీఐ అశోక్‌కుమార్, మన్నూరు ఎస్ఐ మహేశ్‌నాయుడు, రైల్వే పోలీసులు చేరుకొని పరిశీలించారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. ఖాజీపేట మండలంలోని సుంకేసులు గ్రామానికి చెందిన రాజోలి నాగార్జునరెడ్డి (26), కొమ్మలూరు గ్రామానికి చెందిన పుత్తా లక్ష్మీదేవి (26) కలిసి ఇళ్లు విడిచి వెళ్లారు. తన భార్య కనిపించడం లేదని ఖాజీపేట పోలీస్‌స్టేషన్‌లో మృతురాలి భర్త కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆమెకు ముగుర్గు సంతానం ఉన్నారు. పది రోజుల కిందట ప్రియుడు గల్ఫ్ నుంచి స్వదేశానికి రావడం జరిగింది. వీరిద్దరూ ఇంటి నుంచి బయట పడి తిరుపతి తదితర ప్రాంతాల్లో తిరిగారు. చివరికి రాజంపేట రైల్వేస్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత మృతుడి దేహాన్ని సంబంధీకులకు అప్పగించారు. కాని మృతురాలి దేహాన్ని తీసుకెళ్లడానికి వారి కుటుంబ సభ్యులు ఇష్టపడలేదని తెలిసింది. ఈ సంఘటనపై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని..
ఆస్పరి(కర్నూలు): వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని.. ఏర్పాట్లన్ని పూర్తవుతున్న సమయంలో పెళ్లి కూతురు పరారైంది. ప్రేమించిన వాడిని కాదని తల్లిదండ్రులు బలవంతంగా మరో వ్యక్తితో పెళ్లి చేస్తుండటంతో.. తాను ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు, బంధువులు ప్రేమికుడి ఇంటి పై దాడి చేసి నానా బీభత్సం సృష్టించారు. యువకుడి ఇంటిని ధ్వంసం చేయడంతో పాటు అతని ద్విచక్రవాహనానికి నిప్పుపెట్టారు. అడ్డొచ్చిన తల్లిపై దాడి చేశారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడోన్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన రవి(21) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉండే నందినితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్ఛయించారు. మరో వారం రోజుల్లో పెళ్లి జరగనుండటంతో.. భయాందోళనలకు గురైన యువతి తాను ప్రేమించిన రవితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. దీంతో కోపోద్రిక్తులైన యువతి కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి రవి ఇంటి పై దాడి చేసి అతని ద్విచక్రవాహనం పై కిరోసిన్ పోసి నిప్పంటించడంతో పాటు ఇంటి పై కప్పు ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన రవి తల్లిపై దాడి చేశారు. సోమవారం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కాగా.. యువతి మైనర్ అని ఆమెను భయపెట్టి కిడ్నాప్ చేశాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పెద్దలకు చెప్పలేక.. ప్రేమను చంపుకోలేక
ఇల్లంతకుంట: మతాలు వేరైనా మనసులు ఒక్కటయ్యాయి.. ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామనుకున్నారు.. కానీ, ఈ విషయాన్ని కుటుంబ పెద్దలకు చెప్పుకోలేక.. ప్రేమను చంపుకోలేక మదనపడ్డారు. ఈ జన్మలో తమ వివాహాం కాదని.. కనీసం చావుతోనైనా ఒకటవుదామనుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారంలో శుక్రవారం వేకువజామున జరిగింది. గ్రామానికి చెందిన వొల్లాల రవి(26), అదే గ్రామానికి ఎండీ సమ్రీన్(20) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల తన ప్రేమ విషయాన్నిరవి స్నేహితుల వద్ద చర్చించాడు. ఇద్దరి మతాలు వేరుకావడంతో వివాహానికి రెండు కుటుంబాల సభ్యులు ఒప్పుకోరని స్నేహితులు చెప్పారు. ఇదే విషయాన్ని రవి, సమ్రీన్ చర్చించుకున్నారు. పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించకపోతే ఇక చావే పరిష్కారమని నిర్ణయించుకున్నారు. తొలుత సమ్రీన్ తన ఇంట్లో వేకువజామున 3 గంటలకు పురుగుల మందు తాగింది. అదే సమయంలో రవి తన వ్యవసాయ బావి వద్ద పురుగు మందు తాగాడు. వారి వారి కుటుంబసభ్యులు వేర్వేరుగా ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న రవి, సమ్రీన్ కుటుంబ సభ్యులను ఎస్సై లక్ష్మారెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం..
→ ప్రియుడు మృతి → ప్రాణాలతో పోరాడుతున్న ప్రియురాలు తిరువొత్తియూరు: నంగనల్లూరుకు చెందిన ప్రేమజంట మామల్లపురంలో ఆత్మహత్యకు ప్రయత్నించారు. వీరిలో ప్రియుడు మృతి చెందగా ప్రియురాలు ఆందోళనకరస్థితిలో వైద్యం పొందుతున్నది. చెన్నై నంగనల్లూరుకు చెందిన వ్యక్తి శివగురునాథన్ (30) నుంగంబాక్కంలో వున్న ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలో పని చేస్తున్నాడు. ఇతను, అదే సంస్థలో పని చేస్తున్న పెరంబలూరుకు చెందిన 24 ఏళ్ల యువతి ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు యువతి కుటుంబీకులు వ్యతిరేకత తెలిపారు. జాతకములు సరిపడలేదని, మరో యువకుడితో పెండ్లి సంబంధాలు చూశారు. దీంతో వేదన చెందిన ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఇందుకోసం మామల్లపురంలో బస్సు నిలయం వద్ద వున్న లాడ్జిలో గది తీసుకున్నారు. ఈ క్రమంలో చాలా సమయం వరకు గది తలుపులు తెరచుకోకపోవడంతో పోలీసులు సహాయంతో లాడ్జి ఉద్యోగులు గది తలుపులు పగులగొట్టి చూశారు. ఆ సమయంలో నిద్రమాత్రలు మింగిన శివగురునాథన్ మృతి చెంది పడి వున్నాడు. సమీపంలో అతని ప్రియురాలు సృహ తప్పిన స్థితిలో ప్రాణాలతో పోరాడుతున్నది. వెంటనే ఆమెను చికిత్సకోసం చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అదే ఆసుపత్రిలో శివగురునాథన్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం తీసుకొచ్చారు. ఈ సమచారం అందుకున్న ప్రేమికుల బంధువుల మధ్య ఘర్షణ జరిగింది. దీని తరువాత మెరుగైన చికిత్స కోసం వడపళణిలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో యువతిని అనుమతింప చేశారు. అక్కడ ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. దీనిపై మామల్లపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
సిరిసిల్ల(కరీంనగర్ జిల్లా): సిరిసిల్ల మండలం రగుడు వద్ద ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన సాయి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరానికి చెందిన ఎల్లమ్మ ప్రేమించుకుని ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లిని అమ్మాయి తరపు బంధువులు వ్యతిరేకిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భయపడిన జంట వేములవాడకు వచ్చి రగుడు వద్ద పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించారు. -
ప్రేమజంటపై దాడి
ఐదుగురి అరెస్ట్ తిరువొత్తియూరు: ప్రేమజంటపై దాడి చేసి నగదు, సెల్‌ఫోన్ అపహరించిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరు జిల్లా కుంభకోణం, కల్లూర్ మట్టియూర్కు చెందిన అయ్యప్పన్ (21). ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థ ఉద్యోగి. ఇతను తన సంస్థలో పని చేస్తున్న యువతితో కలసి శుక్రవారం రాత్రి స్వామిమలై ఆలయానికి వెళ్లాడు. తిరిగి కుం భకోణం వచ్చారు. ఆ యువతిని బస్సులో బస్సు ఎక్కించేందుకు అంజూర్ బైపాస్‌రోడ్డులో వేచి ఉ న్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఐదుగురు మద్యం మత్తులో వారిని అడ్డుకుని వారిపై దాడి చేసి ఆ యువతి వద్ద అసభ్యంగా ప్రవర్తించారు. ఈ లోపు ఒక కారు వస్తుండడం చూసి దుండగులు దూరంగా వెళ్లారు. యువతిని అయ్యప్పన్ బస్సులో ఎక్కించి తిరిగి బైకు తీయడానికి బైకు వద్దకు వచ్చా డు. తిరిగి అతని వద్దకు వచ్చిన ఐదుగురు యువతిని తీసుకురమ్మని గొడవ చేసి అతని వద్ద నున్న సెల్‌ఫోన్, ఏటీఎం కార్డును లాక్కున్నారు. దీనిపై అయ్యప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కుంభకోణం కొట్టయూరుకు చెందిన కళాశాల విద్యార్థులు విఘ్నేష్ (21), ఆనంద్ (24), రాంకి (24), కరుప్పన్ (22), అరుణ్ కుమార్ (21) అనే ఐదుగురిని అరెస్టు చేశారు. -
ప్రేమజంటను అడ్డుకున్న పెద్దలు
వర్ధన్నపేట టౌన్ : ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు. ఆసమయంలోనే ఒకరికొకరు ప్రేమించుకున్నారు. కలకాలం కలిసి ఉండేందుకు రెండు నెలల క్రితం ఇంట్లోంచి పారిపోయారు. అబ్బాయి తల్లిదండ్రులు ఆచూకీ తెలుసుకుని ఇంటికి తీసుకెళ్తుండగా అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు అడ్డుకున్నారు. వివరాలు ఇవీ.. మండలంలోని డీసీ తండా గ్రామపంచాయతీ పరిధి గుబ్బెడతండాకు చెందిన బానోతు అరుణదేవి(21) వరంగల్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీ-ఫార్మసీ చదువుతోంది. రాయపర్తి మండలం బోడికింది తండాకు చెందిన గుగులోతు బాలాజీ(23) మరో కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించనే ఉద్దేశంతో రెండు నెలల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్ పారిపోయారు. దీంతో అరుణదేవి తండ్రి మహబూబ్ తన కూతరు ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం బాలాజీ తల్లిదండ్రులు, బంధువులు గాలిస్తూ హైదరాబాద్‌లో ఉన్న బాలాజీ, అరుణదేవిని గుర్తించారు. వారిని స్వగ్రామానికి తీసుకొస్తుండగా, తమను ఏదైనా చేస్తారేమోననే భయంతో మహబూబ్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మహబూబ్.. తన బంధు, మిత్రులతో కలిసి వర్ధన్నపేట పాత బస్టాండ్ వద్ద బస్సు ఆపారు. ప్రేమజంటను కిందికి దించారు. ఈ క్రమంలో యువతి, యువకుడి తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫలితంగా రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలు స్తంభించారుు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇరు కుటుంబాలను సముదాయించి ప్రేమజంటను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రేమికులు మేజర్లు కావడంతో వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేస్తున్నారు. -
ప్రేమను పెద్దలు అంగీకరించలేదని...
మహబూబ్‌నగర్: మనస్తాపానికి గురైన ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం జిల్లాలోని కోడేరు మండలం నర్సాయిపట్టి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన తెలుగు మద్దిలేటి (17) అదే గ్రామానికి చెందిన కుర్వ నాగమణి(17) అనే యువతీ, యువకులు గత రెండు సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. అయినా మైనారిటి తీరగానే వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గత సోమవారం మద్దిలేటి, నాగమణిలు తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకునేందుకు ఊరు వదిలివెళ్లారు. దీంతో నాగమణి తండ్రి నారాయణ తన బిడ్డను మద్దిలేటి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని కోడేరు పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు. ఈవిషయాన్ని ఫోన్ ద్వారా మద్దిలేటికి గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో మనస్తాపం చెందిన ఇరువురు ప్రేమికులు గ్రామ సమీపంలో ఉన్న చిన్న బంగారయ్య మామిడి తోట వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. -
పోలీస్ స్టేషన్లో విషం తాగిన ప్రేమికులు
కొంతకాలం ప్రేమించుకొని.. కొద్ది రోజుల క్రితం విడిపోయిన ఓ ప్రేమజంట గొడవ పరిష్కారం కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. మాట్లాడుకుంటామంటూ పక్కకు వెళ్లి.. విడివిడిగా వెంటతెచ్చుకున్న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. సకాలంలో పోలీసులు స్పందించి వారిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులతోపాటు స్టేషన్ ప్రాంగణంలోఉన్న పలువురిని కలవరపాటుకు గురిచేసిన ఆ ప్రేమజంట వివరాల్లోకి వెళితే.. ఖైరతాబాద్ లో నివసించే హేమలత, శ్రీకృష్ణనగర్ లో ఉండే శివ కొంతకాలం ప్రేమించుకున్నారు. ఆ తర్వాత విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. ప్రేమ పేరుతో శివ తనను నమ్మించి మోసం చేశాడని, అతనితోనే వివాహం జరిపించాలని అర్ధిస్తూ హేమలత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోలీసులు బుధవారం శివను స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు. ప్రియురాలితో పెళ్లికి అంగీకరించేదేలేదని శివ తేల్చిచెప్పాడు. దీంతో ప్రేమికులిద్దరికీ పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి పరస్పరం చర్చించుకోవాల్సిందిగా సూచించారు. అదేసమయంలో హేమలత, శివ తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును ఒకరి ముందు ఒకరు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఆ ఇద్దరికి ప్రాణాపాయం తప్పిందని, వారిచ్చే ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేస్తామని పోలీసులు చెప్పారు. -
ప్రేమజంటపై దుండగుడి దాడి
యువకుడి మృతి, యువతికి తీవ్రగాయాలు నరసరావుపేట/వెల్దుర్తి/చిలకలూరిపేట: గుంటూరు జిల్లా కోటప్పకొండలో త్రికోటేశ్వరుని దర్శించుకుని తిరిగి వస్తున్న ప్రేమికుల జంటపై గుర్తుతెలియని వ్యక్తి దాడిచేసి యువకుడిని హతమార్చిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండాకు చెందిన బాణావత్ అంజినాయక్ నరసరావుపేట పట్టణంలోని పీఎన్‌సీకేఆర్ కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ప్రకాశం జిల్లా యర్రగుంటపాలెం మండలం పిచ్చిరాజుపురంతండాకు చెందిన రామవత్ స్వాతి గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని సాదినేని చౌదరయ్య పాలిటెక్నిక్ కళాశాలలో అగ్రికల్చర్ డిప్లమో చదువుతోంది. వీరు బుధవారం కోటప్పకొండ వచ్చిత్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని మెట్లమార్గంలో కిందకు బయలుదేరారు. మార్గమధ్యంలో గుర్తుతెలియని వ్యక్తి వీరిపై కత్తితో దాడికి దిగాడు. ఈ సంఘటనలో అంజినాయక్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన స్వాతి పెద్దగా అరవడంతో మెట్లమార్గంలో పనులు చేస్తున్న కూలీలు అక్కడకు చేరుకోవడంతో దుండగుడు పరారయ్యాడు. వెళ్తూ వెళ్తూ వారివద్ద ఉన్న సెల్‌ఫోన్, రోల్డ్‌గోల్డ్ గొలుసు దోచుకెళ్లాడు. గాయపడిన స్వాతిని 108లో పట్టణంలోని ఏరియా వైద్యశాలకు, అనంతరం మెరుగైన వైద్యచికిత్స కోసం గుంటూరు తరలించారు. ఆమె శరీరంపై నాలుగు కత్తిపోట్లు ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ కె.సి.వెంకటయ్య, సీఐలు వీరయ్యచౌదరి, ఎం.నాగేశ్వరరావు, ఎస్సైలు మహ్మద్ నాసర్‌బాషా, జేసీహెచ్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. కాగా, ఇది కచ్చితంగా స్వాతి తరఫు బంధువుల పనేనని మృతుడి తండ్రి బాలునాయక్ ఆరోపిస్తున్నారు. -
పోలీస్‌స్టేషన్‌లో ప్రేమజంట హల్చల్
హైదరాబాద్ సిటీ: కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఓ ప్రేమ జంట హల్చల్ చేసింది. తనను ప్రేమించి మోసం చేసిన ప్రియుడితో పెళ్లి జరిపించాలంటూ ఓ యువతి కుషాయిగూడ పోలీసులను ఆదివారం ఆశ్రయించింది. పోలీసులు శ్రమించి ఆ యువతి ప్రియుడిని పోలీసుస్టేషన్ కు తీసుకువచ్చారు. యువతి కోరిక మేరకు ప్రియుడితో వివాహం జరిపిస్తుండగా అతడు పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు వెంబడించి ప్రియుడిని పట్టుకున్నారు. యువతి తల్లిదండ్రులు అతికష్టం మీద యువకుడితో ఆమెకు వివాహం జరిపించారు. యువతికి న్యాయం చేసి పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. -
ప్రేమించిన పాపానికి పరువు హత్య!
ఒడిశా: ఒక యువ ప్రేమ జంటను అతి దారుణంగా హత్య చేసి మరో పరువు హత్యకు తెరలేపిన ఘటన ఒడిశాలోని బరంపూర్ సమీపంలోని హలిదియాపదారాలో కలకలం సృష్టించింది. 20 సంవత్సరాల యువతి, 22 సంవత్సారాల యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో నచ్చకపోవడంతో ప్రేమికులిద్దరినీ మారణాయుధాలతో దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఆ యువకుడ్ని మరిచిపోమ్మని యువతికి ఆమె సోదరులు నచ్చ చెప్పారు. ఈ క్రమంలోనే వారు వేరే సంబంధానికి కూడా మగ్గు చూపి గత రాత్రి విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాగా, ఆ యువతి ప్రేమించిన వాడితోనే కలిసి బ్రతుకుతానని తేల్చి చెప్పి అతనితో వెళ్లి పోయింది. ఆమె సోదరులు కొంతమంది బంధువులతో కలిసి ఆ యువకుడి ఇంటికి వెళ్లారు. తమతో ఇంటికి రావాలని ఆ యువతిని మరోసారి అడిగారు. తాను తిరిగి ఇక ఇంటికి రానని చెప్పడంతో వారికి మరింత కోపం తెప్పించింది. దీంతో వారు తమతో తెచ్చుకున్న ఆయుధాలతో దాడి చేసి ఆ జంటను హత మార్చారు. రక్త మడుగులు పడి ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఆ యువతి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.