వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని.. | The Young lady fall in love.. | Sakshi
Sakshi News home page

వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని..

Apr 24 2017 10:29 AM | Updated on Sep 5 2017 9:35 AM

వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని..

వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని..

వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని.. ఏర్పాట్లన్ని పూర్తవుతున్న సమయంలో పెళ్లి కూతురు పరారైంది.

ఆస్పరి(కర్నూలు): వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని.. ఏర్పాట్లన్ని పూర్తవుతున్న సమయంలో పెళ్లి కూతురు పరారైంది. ప్రేమించిన వాడిని కాదని తల్లిదండ్రులు బలవంతంగా మరో వ్యక్తితో పెళ్లి చేస్తుండటంతో.. తాను ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు, బంధువులు ప్రేమికుడి ఇంటి పై దాడి చేసి నానా బీభత్సం సృష్టించారు. యువకుడి ఇంటిని ధ్వంసం చేయడంతో పాటు అతని ద్విచక్రవాహనానికి నిప్పుపెట్టారు. అడ్డొచ్చిన తల్లిపై దాడి చేశారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడోన్‌ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. 
 
వివరాలు..  గ్రామానికి చెందిన రవి(21) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉండే నందినితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్ఛయించారు. మరో వారం రోజుల్లో పెళ్లి జరగనుండటంతో.. భయాందోళనలకు గురైన యువతి తాను ప్రేమించిన రవితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది.

దీంతో కోపోద్రిక్తులైన యువతి కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి రవి ఇంటి పై దాడి చేసి అతని ద్విచక్రవాహనం పై కిరోసిన్‌ పోసి నిప్పంటించడంతో పాటు ఇంటి పై కప్పు ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన రవి తల్లిపై దాడి చేశారు. సోమవారం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కాగా.. యువతి మైనర్‌ అని ఆమెను భయపెట్టి కిడ్నాప్‌ చేశాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement