
అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి
లక్ష్మణచాంద : ప్రేమకు మతం, కులం, హద్దులు, ఎల్లలు, ప్రాంతాలు, దేశాలు, వయస్సు ఇలా ఏ ఒక్క అడ్డుకాదు. అదే మాదిరిగా లక్ష్మణచాంద అబ్బాయి, నేపాల్ అమ్మాయి మూడుమళ్ల బంధంతో సోమవారం పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోని లక్ష్మణచాంద మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ బిట్లింగ్ నారాయణ కుమారుడు బిట్లింగ్ శ్రీకాంత్‌రాజ్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఎంబీఏ చదువుతున్న నేపాల్‌కు చెందిన జ్యోతిసొనార్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. జీవితంలో స్థిరపడ్డ తర్వాత పెళ్లి చేసుకుందామనుకున్న వీరువురు నాలుగేళ్లకు పైగా ప్రేమించుకున్నారు.
శ్రీకాంత్‌రాజ్ డెల్ కంపెనీలో, జ్యోతిసొనార్ అమేజాన్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. తమ ప్రేమ విషయాన్ని ఇరువురూ తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఒప్పుకున్నారు. దీంతో వేదమంత్రాల సాక్షిగా వారివురికి అంగరంగ వైభవంగా హిందూసంప్రదాయం ప్రకారం లక్ష్మణచాంద మండల కేంద్రంలో సోమవారం వివాహం జరిగింది.