
ఎల్లలు దాటిన ప్రేమ
గోదావరిఖని : ప్రేమకు హద్దులు లేవని నిరూపించారు జర్మనీ దేశానికి చెందిన యువతి, గోదావరిఖనికి చెందిన యువకుడు. గురువారం వీరిద్దరూ హిందూ సంప్రదాయ పద్థతిలో వివాహం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ఫైవ్ ఇంక్లయిన్కు చెందిన మంధెన శ్రీనివాస్ జర్మనీ దేశంలోని బెర్లిన్ నగరంలో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు.
అదే దేశానికి చెందిన ఎంబీఏ చదివిన మెలానీ అనే యువతితో శ్రీనివాస్కు పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను రెండు కుటుంబాలు అంగీకరించాయి. ఇటీవల జర్మనీ నుంచి శ్రీనివాస్, మెలానీ గోదావరిఖనికి వచ్చారు. ఈ జంట గురువారం మూడు ముళ్లు, ఏడడుగుల బంధంతో ఏకమయ్యారు. ఎల్లలు దాటిన వీరి ప్రేమను పలువురు అక్షింతలు చల్లి ఆశీర్వదించారు.