ఒడిశా: ఒక యువ ప్రేమ జంటను అతి దారుణంగా హత్య చేసి మరో పరువు హత్యకు తెరలేపిన ఘటన ఒడిశాలోని బరంపూర్ సమీపంలోని హలిదియాపదారాలో కలకలం సృష్టించింది. 20 సంవత్సరాల యువతి, 22 సంవత్సారాల యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో నచ్చకపోవడంతో ప్రేమికులిద్దరినీ మారణాయుధాలతో దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.
ఆ యువకుడ్ని మరిచిపోమ్మని యువతికి ఆమె సోదరులు నచ్చ చెప్పారు. ఈ క్రమంలోనే వారు వేరే సంబంధానికి కూడా మగ్గు చూపి గత రాత్రి విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాగా, ఆ యువతి ప్రేమించిన వాడితోనే కలిసి బ్రతుకుతానని తేల్చి చెప్పి అతనితో వెళ్లి పోయింది. ఆమె సోదరులు కొంతమంది బంధువులతో కలిసి ఆ యువకుడి ఇంటికి వెళ్లారు. తమతో ఇంటికి రావాలని ఆ యువతిని మరోసారి అడిగారు. తాను తిరిగి ఇక ఇంటికి రానని చెప్పడంతో వారికి మరింత కోపం తెప్పించింది. దీంతో వారు తమతో తెచ్చుకున్న ఆయుధాలతో దాడి చేసి ఆ జంటను హత మార్చారు. రక్త మడుగులు పడి ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఆ యువతి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
ప్రేమించిన పాపానికి పరువు హత్య!
Published Sun, May 11 2014 3:08 PM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM
Advertisement