ఇస్లామాబాద్: పబ్జీ కారణంగా పరిచయమైన యువకుడిని వెతుక్కుంటూ పాకిస్తాన్ నుండి తన నలుగురు పిల్లలతో సహా వలసవచ్చిన మహిళ సీమా గులాం హైదర్ తిరిగి పాకిస్తాన్ వస్తే ఊరుకునేది లేదన్నారు ఆమె బంధువులు. హిందువైన యువకుడి కోసం వెళ్ళిపోయిన ఆమె ఇకపై ముస్లిం కాదని పిల్లల్ని మాత్రం వెంటనే పాకిస్తాన్ తిరిగి పంపించేయాలని డిమాండ్ చేశారు.
కరోనా ప్రేమ..
కరోనా సమయంలో యావత్ప్రపంచమంతా బిక్కు బిక్కుమంటూ గడువుతోంటే పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్, భారత్ కు చెందిన సచిన్ మీనా మాత్రం హాయిగా ప్రేమలో మునిగి తేలారు. పబ్జీ ద్వారా మొదలైన పరిచయాన్ని ప్రేమగా మార్చుకున్నారు. అప్పటికే ఆ మహిళకు పెళ్ళై నలుగురు పిల్లలున్నా కూడా ప్రియుడిని కలుసుకునేందుకు భారత్ వచ్చే సాహసం చేసింది.
వెళ్ళను గాక వెళ్ళను..
జులై 4న గ్రేటర్ నోయిడాలోని ప్రియుడు సచిన్ మీనాను చేరుకున్న సీమా హైదర్ పై అక్రమ చొరబాటు కేసు నమోదైన విషయం, ఆ కేసులో ఆమెకు బెయిల్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటికి కథ సుఖాంతమవడంతో సీమా ఇకపై నేను హిందువునని, తిరిగి పాకిస్తాన్ కు వెళ్ళేది లేదని తెగేసి చెప్పేసింది.
మాక్కూడా నువ్వొద్దు..
తాజాగా ఆమె కుటుంబ సభ్యులు స్పందిస్తూ.. ఎప్పుడైతే హిందువుని వెతుక్కుంటూ వెళిపోయిందో అప్పుడే ఆమెతో సంబంధం తెగిపోయిందని, తను ఇప్పుడు ముస్లిం కాదని చెప్పారు. కానీ నలుగురు పిల్లలను వంటనే వెనక్కు పంపాలని డిమాండ్ చేశారు.
పాకిస్తాన్లో ఆమె నివాసమున్న ఇంటి యజమాని కుమారుడు నూర్ మహమ్మద్ మాట్లాడుతూ.. గులాం హైదర్ అనే వ్యక్తితో సీమాకు పదేళ్ల క్రితం పెళ్లయిందని, ఆయన సౌదీలో పనిచేస్తుంటాడని ఆమె మాత్రం మూడేళ్ళుగా ఇక్కడ పిల్లలతో ఒంటరిగా ఉండేదన్నారు. వాళ్ళ మామయ్యగారు ఇక్కడికి చాలా దూరంగా ఉంటారని తెలిపారు.
ఇది కూడా చదవండి: అసలు పుట్టేవాళ్లే తక్కువ.. మళ్లీ నియంత్రణ గోల ఏంటి?
Comments
Please login to add a commentAdd a comment