Pakistan Seema Haider To Play Role Of RAW Agent In Bollywood Movie Titled A Tailor Murder Story - Sakshi
Sakshi News home page

కట్టుకున్నోడిని వదిలేసి ఇండియాకు వచ్చిన పబ్జీ ప్రియురాలు.. ఇప్పుడేకంగా సినిమాల్లోకి!

Aug 3 2023 3:05 PM | Updated on Aug 3 2023 5:20 PM

Pakistan Seema Haider To Play Role Of RAW Agent In Bollywood Movie Titled A Tailor Murder Story - Sakshi

సీమా హైదర్‌ పాక్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌ అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆమె సోదరుడు అసిఫ్‌, మామ గులాం అక్బర్‌ కూడా పాక్‌ సైన్యంలో పని చేస్తుండటంతో సీమా

ఫోన్‌లో గేమ్స్‌ అనేవి కాలక్షేపానికి. కానీ ఇక్కడ వీళ్లిద్దరు మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. పబ్జీ ఆటలో పరిచయమైన ఓ యువకుడి కోసం ఓ వివాహిత తన భర్తనే వదిలేసింది. ఆన్‌లైన్‌ ప్రియుడి కోసం ఏకంగా పాకిస్తాన్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తన నలుగురు పిల్లలను వెంటేసుకుని మరీ వచ్చింది. అతడి పేరు సచిన్‌, ఆమె పేరు సీమా గులామ్‌ హైదర్‌. వీరి లవ్‌ స్టోరీ కొద్దిరోజుల నుంచి సోషల్‌ మీడియానే షేక్‌ చేస్తోంది.

భర్తకు గుడ్‌బై..
నా భార్యను పంపించండి మహాప్రభో అని అటు భర్త లబోదిబోమని మొత్తుకుంటుంటే ఇటు సీమ మాత్రం పాక్‌కు తిరిగి వెళ్లేదే లేదని భీష్మించుకుని కూర్చుంది. మే 13న ఆమె ఇండియాలోకి ప్రవేశించగా జూలై 4న పోలీసులకు ఈ విషయం తెలిసింది. అక్రమ చొరబాటు కేసు నమోదు చేసి సీమాను ఆమెకు నివాసం ఇచ్చిన సచిన్‌ను, అతడి తండ్రిని అరెస్ట్‌ చేయగా బెయిల్‌పై బయటకు వచ్చారు. సీమా హైదర్‌ పాక్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌ అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆమె సోదరుడు అసిఫ్‌, మామ గులాం అక్బర్‌ కూడా పాక్‌ సైన్యంలో పని చేస్తుండటంతో సీమాపై అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ ఉగ్రవాద నిరోధక దళం పోలీసులు కూడా ఆమెను పలుమార్లు విచారించారు.

ఆడిషన్స్‌ కూడా!
ఇంత సీన్‌ చేసిన సీమా త్వరలో సినిమాల్లోకి రానుందట! ఎ టైలర్‌ మర్డర్‌ స్టోరీ అనే చిత్రం కోసం ఆమె ఆడిషన్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ టైలర్‌ కన్హయ్య లాల్‌ హత్యోదంతం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న జానీ ఫైర్‌ఫాక్స్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ గ్రేటర్‌ నోయిడాలో సీమాకు ఆడిషన్స్‌ నిర్వహించింది. ఈ క్రమంలో డైరెక్టర్స్‌ జయంత్‌ సిన్హా, భరత్‌ సింగ్‌ను ఆమె కలిసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమె ఐఎస్‌ఐ ఏజెంటా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తను ఏకంగా రా ఆఫీసర్‌గా నటించేందుకు సిద్ధమవుతోందట!

చదవండి: ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆత్మహత్య.. అప్పుల బాధ తట్టుకోలేకే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement