పాకిస్తాన్ నటీనటులు సొంత దేశంలోనే కాకుండా ఇండియా వంటి ఇతర దేశాల్లో వివిధ భాషల్లో సినిమాలు చేస్తేనే మరింత గుర్తింపు, గౌరవం దక్కుతుందంటున్నాడు. తనకు నటుడిగా ఇండియానే గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో అలీ ఖాన్ మాట్లాడుతూ.. 'నా కెరీర్ భారత్‌లోనే మొదలైంది. ఇక్కడే నాకంటూ గౌరవాన్ని, పేరుప్రఖ్యాతలను సంపాదించుకున్నాను. ఇక్కడ దాదాపు ఫేమస్ అయిపోవడంతో పాకిస్తాన్‌లో పని చేసేటప్పుడు నాకంతగా ఇబ్బందులు ఎదురవలేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న అనేక ఇండస్ట్రీలలో పని చేసిన అనుభవం ఉంది.
బడ్జెట్ సమస్య కాదు
పాక్ ప్రజలు తమ సొంతవాళ్లను అంత సులువుగా సపోర్ట్ చేయరు. అదే మేము ఇండియాకు వచ్చి ఇక్కడ పేరు తెచ్చుకుంటే అప్పుడు మాకు గౌరవమర్యాదలు ఇస్తారు. పాక్, ఇండియన్ సినిమాలకు మధ్య తేడా బడ్జెట్ లెక్కలే అని చాలామంది అనుకుంటారు. కానీ అలాంటిదేం లేదు. అప్పట్లో బేజా ఫ్రై అని ఓ సినిమా వచ్చింది. రూ.50 లక్షలు పెడితే రూ.10 కోట్లు వచ్చింది. ఆ పది కోట్లతో సీక్వెల్ తీస్తే ఉన్నదంతా పోయింది. బడ్జెట్ ఒక్కటే ప్రధానమైన తేడా కాదు. ఇక్కడ ఎవరూ సమయపాలన పాటించరు.
అన్నీ ఆలస్యంగానే అవుతాయి
కమర్షియల్ షూటింగ్ కోసం ఎంతో ఖర్చు పెడతారు. మనం సమయానికి అక్కడున్నా సరే యాడ్ షూట్ సాగుతూనే ఉంటుంది. అందరూ డీలా పడిపోతారు. సినిమా షెడ్యూల్స్‌లో భాగంగా 25 రోజుల్లో అయ్యే షూటింగ్ కూడా 50 రోజులు పడుతుంది. చాలా ప్రాజెక్టులు అనుకున్న సమయానికంటే ఆలస్యంగానే పూర్తవుతాయి. శిక్షణ పొందిన ఆర్టిస్టులు పాక్ ఇండస్ట్రీలోకి రానంతవరకు ఇది ఇలాగే కొనసాగుతుంది' అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ నటుడు ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఆ ఆర్చీస్‌లో, అలాగే హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న ద ట్రయల్ వెబ్ సిరీస్‌లలో కనిపించాడు.
చదవండి: తల్లికి క్యాన్సర్.. బిగ్‌బాస్‌కు వెళ్లకుండా ఉండాల్సిందంటూ బోరున ఏడ్చిన నటి
Comments
Please login to add a commentAdd a comment