ఒకప్పుడు బాలీవుడ్ అంటే మెలోడీ సాంగ్స్, హిట్ సినిమాలే గుర్తొచ్చేవి. కానీ ఆ పరిస్థితి తలకిందులైంది. ఇటీవల పఠాన్ సినిమా మినహాయిస్తే వరుస ఫ్లాప్ సినిమాలే దర్శనమిస్తున్నాయి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ రీమేక్‌లపై ఆధారపడిందంటూ పలువురు సినీ ప్రముఖుల నుంచి విమర్శలొచ్చాయి. దీంతో రోజు రోజుకీ హిందీ చిత్రాల పరిస్థితి మరింత దిగజారిపోతోంది.
(ఇది చదవండి: పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!)
దక్షిణాది చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో పోటీ పడుతుంటే.. బాలీవుడ్ మాత్రం ఇంకా రీమేక్‌లపైనే ఆధారపడుతోంది. అయితే ఈ సారి ఏకంగా ఓ పాకిస్థానీ పాటను రీమేక్ చేయడంతో బాలీవుడ్ రేంజ్ మరింత దిగజారింది. యంగ్ హీరో ఇటీవలే అల వైకుంఠపురములో చిత్రాన్ని హిందీలో 'షెహజాదా' పేరుతో రీమేక్ చేసి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు.
అయితే తాజాగా ఆయన నటించిన సత్యప్రేమ్ కీ కథ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో గ్లోబల్ స్థాయిలో ఫేమస్ అయిన పాకిస్థానీ పాట 'పసూరి'ని రీమేక్ చేశారు. గతేడాది ఎక్కువమంది యూట్యూబ్ లో వెతికిన వాటిలో ఈ సాంగ్ అగ్రస్థానంలో నిలిచింది. దీన్నే కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా 'సత్యప్రేమ్ కీ కథ' చిత్రంలో వాడేశారు.
ఇప్పటికే చిత్రబృందం ఈ సాంగ్ రిలీజ్ చేయగా నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సైతం స్పందించారు. ఈ మేరకు ఆయన కాస్తా ఫన్నీగా ట్వీట్ చేశారు. అసలేంటీ ఈ డిజాస్టర్ అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్స్ కూడా అదేస్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు.
(ఇది చదవండి: ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ కూడా చేశా.. విడాకులపై గజినీ హీరోయిన్!)
కాగా.. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిస్తోన్న సత్య ప్రేమ్ కి కథ చిత్రానికి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. భూల్ భూలయ్యా- 2 తర్వాత ఈ జంట మరోసారి ప్రేక్షకులను అలరించనుంది.
Aye ki pasoori paayi ay.
— Shoaib Akhtar (@shoaib100mph) June 27, 2023
Comments
Please login to add a commentAdd a comment