కొంతకాలం ప్రేమించుకొని.. కొద్ది రోజుల క్రితం విడిపోయిన ఓ ప్రేమజంట గొడవ పరిష్కారం కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. మాట్లాడుకుంటామంటూ పక్కకు వెళ్లి.. విడివిడిగా వెంటతెచ్చుకున్న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. సకాలంలో పోలీసులు స్పందించి వారిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులతోపాటు స్టేషన్ ప్రాంగణంలోఉన్న పలువురిని కలవరపాటుకు గురిచేసిన ఆ ప్రేమజంట వివరాల్లోకి వెళితే..
ఖైరతాబాద్ లో నివసించే హేమలత, శ్రీకృష్ణనగర్ లో ఉండే శివ కొంతకాలం ప్రేమించుకున్నారు. ఆ తర్వాత విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. ప్రేమ పేరుతో శివ తనను నమ్మించి మోసం చేశాడని, అతనితోనే వివాహం జరిపించాలని అర్ధిస్తూ హేమలత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోలీసులు బుధవారం శివను స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు. ప్రియురాలితో పెళ్లికి అంగీకరించేదేలేదని శివ తేల్చిచెప్పాడు. దీంతో ప్రేమికులిద్దరికీ పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి పరస్పరం చర్చించుకోవాల్సిందిగా సూచించారు. అదేసమయంలో హేమలత, శివ తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును ఒకరి ముందు ఒకరు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఆ ఇద్దరికి ప్రాణాపాయం తప్పిందని, వారిచ్చే ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేస్తామని పోలీసులు చెప్పారు.
పోలీస్ స్టేషన్లో విషం తాగిన ప్రేమికులు
Published Wed, Mar 18 2015 8:36 PM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM
Advertisement
Advertisement