jubliee hills police station
-
ఇన్స్పెక్టర్ చెప్పాడు.. ఎస్సై చేశాడు!
బంజారాహిల్స్: ఓ చీటింగ్ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో పాటు భవిష్యత్‌లో కేసు రాజీ చేయడానికి జూబ్లీహిల్స్ పోలీసులు రూ.లక్ష నగదు, రెండు ‘వ్యాట్ 69’మద్యం బాటిళ్ళు లంచంగా డిమాండ్ చేశారు. ఇన్స్పెక్టర్ బల్వంతయ్య సూచనల మేరకు అంగీకారం కుదిరిన రూ.50 వేల నగదు, మద్యం బాటిళ్ళు తీసుకుంటున్న ఎస్సై పి.సుధీర్‌రెడ్డి గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఇతడి వాంగ్మూలంతో పాటు ఫోన్ కాల్ రికార్డింగ్ ఆధారంగా బల్వంతయ్య పైనా కేసు నమోదు చేశారు. ఇటు సుధీర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని, పరారీలో ఉన్న బల్వంతయ్య కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వర్రావు మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన అక్షయ్ అనే వ్యాపారి జూబ్లీహిల్స్‌లోని రోడ్ నం.10లో ‘ఫేజ్ 3 లగ్జరీ సెలూన్’నిర్వహిస్తున్నారు. గతేడాది నవంబర్ 27న వంశీకృష్ణ చౌదరి అనే వ్యక్తి తన భార్యను తీసుకుని ఈ సెలూన్‌కు వచ్చారు. అక్కడ రూ. 34,130 విలువైన ట్రీట్మెంట్స్ చేయించాడు. ఈ బిల్లు చెల్లించకుండా వెళ్ళిపోవడంతో అక్షయ్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో వంశీకృష్ణపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే డిసెంబర్ 31నే వంశీకృష్ణకు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఈ స్టేషన్ బెయిల్ ఇచ్చినందుకు, అలాగే ఐపీసీ 406 సెక్షన్ తీసేసి కేసును లోక్ అదాలత్‌కు పంపేలా చేసేందుకు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే రూ.50 వేలు, రెండు మద్యం సీసాలను ఇస్తానని అంగీకరించిన వంశీ ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో బాధితుడి నుంచి ఎస్సై సుధీర్ డబ్బులు, మద్యం బాటిళ్లను తీసుకుంటుండగా మాటేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. కాగా సుధీర్‌రెడ్డి 2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సై కాగా.. బల్వంతయ్య స్పెషల్‌బ్రాంచ్ నుంచి కొన్నాళ్ళ క్రితం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్గా బదిలీపై వచ్చారు. -
మద్యం మత్తులో క్లబ్‌పై యువకుల వీరంగం
-
జూబ్లీహిల్స్ క్లబ్‌పై యువకుల వీరంగం
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ క్లబ్‌పై బుధవారం అర్ధరాత్రి కొందరు యువకులు వీరంగం సృష్టించారు. క్లబ్ బంద్ చేయడంతో ఆగ్రహించిన యువకులు క్లబ్ సిబ్బందిపై దాడి చేశారు. క్లబ్ సమయం ముగిసిందని అక్కడి సిబ్బంది నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. వినిపించుకోని యవకులు మద్యం మత్తులో విచక్షణ లేకుండా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. దాడికి పాల్పడిన యువకులపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగినట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జూబ్లీహిల్స్ క్లబ్‌పై యువకుల వీరంగం
-
ఎనిమిది మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
హైదరాబాద్: ఎనిమిది మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు గురువారం రాత్రి పోలీసులు రంగంలోకి దిగారు. పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 75 వేల నగదుతో పాటు ఎనిమిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
భార్యను తనతో పంపాలని అడిగితే..
బంజారాహిల్స్ : తన భార్యను తనకు అప్పగించాలని అడిగినందుకు మద్యం సీసాతో ఓ వ్యక్తిపై దాడి జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ శ్రీరాంనగర్‌లో నివసించే సబీల్(23) చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటాడు. అయిదేళ్ల క్రితం రేష్మతో పెళ్లయింది. ఒక కూతురు కూడా ఉంది. అయితే ఏడాది క్రితం విజయవాడకు చెందిన రెడ్డినాయుడు(23)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి విజయవాడకు వెళ్లి పెళ్లి చేసుకొని అక్కడే కాపురం పెట్టారు. తన భార్యను అప్పగించాల్సిందిగా సబీల్ ఎన్నోసార్లు రెడ్డినాయుడును వేడుకున్నాడు. కనీసం కన్నకూతురు చూడటానికైనా అంగీకరించాలని విజ్ఞప్తి చేశాడు. అయినాసరే నాయుడు, రేష్మ ఇద్దరూ ఒప్పుకోలేదు. సోమవారం రాత్రి శ్రీరాంనగర్‌లో తన అత్త ఇంట్లో ఉంటున్న కూతురిని చూసేందుకు సబీల్ వెళ్లగా అక్కడే నాయుడు మద్యం తాగుతూ ఉన్నాడు. ఒక్కసారిగా సబీల్‌ను చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. తన భార్యను అప్పగించాల్సిందిగా సబీల్ కోరగా తాగుతున్న మద్యం బాటిల్‌తో తలపై బలంగా మోదాడు. దీంతో సబీల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. -
పోలీస్ స్టేషన్లో విషం తాగిన ప్రేమికులు
కొంతకాలం ప్రేమించుకొని.. కొద్ది రోజుల క్రితం విడిపోయిన ఓ ప్రేమజంట గొడవ పరిష్కారం కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. మాట్లాడుకుంటామంటూ పక్కకు వెళ్లి.. విడివిడిగా వెంటతెచ్చుకున్న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. సకాలంలో పోలీసులు స్పందించి వారిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులతోపాటు స్టేషన్ ప్రాంగణంలోఉన్న పలువురిని కలవరపాటుకు గురిచేసిన ఆ ప్రేమజంట వివరాల్లోకి వెళితే.. ఖైరతాబాద్ లో నివసించే హేమలత, శ్రీకృష్ణనగర్ లో ఉండే శివ కొంతకాలం ప్రేమించుకున్నారు. ఆ తర్వాత విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. ప్రేమ పేరుతో శివ తనను నమ్మించి మోసం చేశాడని, అతనితోనే వివాహం జరిపించాలని అర్ధిస్తూ హేమలత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోలీసులు బుధవారం శివను స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు. ప్రియురాలితో పెళ్లికి అంగీకరించేదేలేదని శివ తేల్చిచెప్పాడు. దీంతో ప్రేమికులిద్దరికీ పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి పరస్పరం చర్చించుకోవాల్సిందిగా సూచించారు. అదేసమయంలో హేమలత, శివ తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును ఒకరి ముందు ఒకరు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఆ ఇద్దరికి ప్రాణాపాయం తప్పిందని, వారిచ్చే ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేస్తామని పోలీసులు చెప్పారు.