పెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోయి.. ప్రియుడ్ని.. | Lovers Married In Mahabubabad District | Sakshi
Sakshi News home page

పెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోయి.. ప్రియుడ్ని..

Published Sat, Dec 26 2020 1:55 AM | Last Updated on Sat, Dec 26 2020 1:41 PM

Lovers Married In Mahabubabad District  - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌ (మరిపెడ రూరల్‌): ప్రేమ జంట ఒక్కటైంది. ఇష్టం లేని వ్యక్తితో బలవంతంగా వివాహం చేస్తున్నారని ఓ యువతి పీటల మీద పెళ్లిని అడ్డుకున్న విషయం విదితమే. అయితే.. శుక్రవారం ప్రేమికులిద్దరూ ఓ ఆలయంలో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండల గుండెపుడి గ్రామానికి చెందిన ఓ యువకుడితో కురవి మండలం కాంపెల్లికి చెందిన దివ్య వివాహాన్ని పెద్దల సమక్షంలో నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో గురువారం మరిపెడలో వివాహం జరుగుతున్న క్రమంలో వధువు పెళ్లి పీటల మీద నుంచి లేచి 100కు నంబర్‌కు ఫోన్‌ చేసి పోలీసులను ఆశ్రయించింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, కాంపెల్లి గ్రామానికి చెందిన కొల్లు నరేశ్‌ను ప్రేమించినట్లు చెప్పింది. దీంతో శుక్రవారం మహబూబాబాద్‌ మండలం అనంతారం జగన్నాథ వెంకటేశ్వర ఆలయంలో దివ్య, నరేశ్‌ దండలు మార్చుకున్నారు.  చదవండి: (కొద్ది క్షణాల్లో పెళ్లి.. 100కు కాల్‌ చేసిన వధువు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement