వివాహం ఆగిపోవడంతో తిరిగి వెళ్లిపోతున్న బంధువులు
సాక్షి, మహబూబాబాద్(మరిపెడ రూరల్): పీటల మీద ఓ పెళ్లి ఆగిపోవడం కలకలం రేగింది. తాను ఓ యువకుడిని ప్రేమించానని, ఇష్టం లేని పెళ్లిని బలవంతంగా చేస్తున్నారని వధువు కల్యాణ మండపం నుంచే 100 నంబరుకు ఫోన్ చేసింది. ఈ సం ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం లోని ఓ ఫంక్షన్ హాల్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మరిపెడ మండలం గుండెపుడికి చెందిన యామిని కృష్ణమూర్తి, రంగమ్మ దంపతుల కుమారుడు యామిని రాజేశ్‌కు, కురవి మండలం కాంపెల్లికి చెందిన యువతికి పెద్దల సమక్షంలో వివాహం నిర్ణయించారు. చదవండి: (28న సీఎం దత్త పుత్రిక ప్రత్యూష వివాహం)
ఈ మేరకు గురువారం ఉదయం 11:55కి ముహూర్తం ఖరారు చేశారు. ముందుగా కల్యాణ మండపంలో పెళ్లి పీట లపై వధువు కూర్చుంది. పురోహితులు గౌరీ పూజ చేస్తున్న క్రమం లో.. వధువు లేచి ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని చెప్పింది. అక్కడి నుంచే 100 నంబర్‌కు ఫోన్ చేసిం ది. పెళ్లి ఆగి పోవడంతో మండపంలో కలకలం రేగింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. వధువును స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇవ్వగా.. తాను కాంపెల్లికి చెందిన యువకున్ని ప్రేమించానని.. అతడినే వివాహం చేసుకుంటానని చెప్పింది. ఈ విషయం తన తల్లిదండ్రులకు ముందే చెప్పినా వినకుండా బలవంతంగా పెళ్లి చేస్తున్నారని వాపోయింది. కాగా, అదే కల్యా ణ మండపంలో తన బంధువులకు చెందిన మరో యువతితో వరుడు రాజేశ్ వివాహం జరిగింది. పెళ్లికి వచ్చిన బంధువులు వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: (తండ్రి కొట్టాడని అలిగెళ్లి.. పాతికేళ్లకు మళ్లీ!)
Comments
Please login to add a commentAdd a comment