![Twin Brothers Married To Twin Sisters In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/11/twins.jpg.webp?itok=oDcNFqMt)
సాక్షి, హైదరాబాద్: పెళ్ళంటే నూరేళ్ల పంట... బంధువులందరి మధ్య వైభవంగా జరుపుకొనే వేడుక... ఇక ఒకే వేదికపై కవల సోదరులు, కవల సోదరీమణులు మూడుముళ్ళ బంధంతో ఒక్కింటి వారయ్యారు. ఈ అపూర్వ ఘట్టం మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన అంబాల మహేష్, నరేష్ లు కవల పిల్లలు. కురవి మండలం నేరడ గ్రామానికి చెందిన శాంతి, హిమలు కూడా కవల పిల్లలలే. హైదరాబాద్‌లో ఉంటున్నారు. కాగా మహేష్, శాంతిలు గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి.
అదే సమయంలో నరేష్, హిమకు కూడా వివాహం జరిపించాలని బంధు వర్గం ఆలోచించించింది. అనుకన్నదే తడవుగా... వారి అభిప్రాయాలను అడిగారు. ఇందుకు ఇద్దరూ దీనికి వారు అంగీకారం తెలపడంతో ఒకే వేదికపై జంట పెళ్ళిళ్ళు జరిగాయి. ఒకే ముహూర్తానికి.. వేద మంత్రోచ్ఛరణల నడుమ అంగరంగవైభవంగా పెద్దలు కవలల వివాహం జరిపించారు. ఈ పెళ్ళి వేడుకలను తిలకించడానికి బంధు, మిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జంటలతో ఫోటోలు దిగేందుకు పోటీలు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment