Kesamudram
-
Telangana: సర్వే ‘సమగ్ర’మేనా?
రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే తగిన ఫలితం ఇస్తుందా? దాని ఆధారంగా సర్కారు ముందుకు వెళుతుందా? ఆ వివరాలతో సంక్షేమ పథకాల అమలు కుదురుతుందా? అసలు ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతుందా?.. ఇలా ఎన్నో సందేహాలు ముసురుకుంటున్నాయి. సర్వేలో చాలా ప్రశ్నలకు అరకొర సమాచారమే వస్తుండటం.. ముఖ్యమైన ప్రశ్నలకు ప్రజలు ఎదురుప్రశ్నలు వేయడం.. పైగా ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం.. ఎన్యుమరేటర్లు చేసేదేమీ లేక ఆ వివరాల కాలమ్‌లను ఖాళీగా వదిలేస్తుండటంతో సర్వేకు ‘సమగ్రత’ చేకూరడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాల సేకరణే ప్రధానంగా చేపట్టిన ఈ సర్వేపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. ఎన్యుమరేటర్లతో కలసి వెళ్లి... సర్వేలో ప్రజల స్పందన ఎలా ఉందన్నది స్వయంగా పరిశీలించింది.మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామంలోని ఏడవ వార్డులో ఎన్యుమరేటర్ శనివారం సర్వే నిర్వహించాడు. భద్రయ్య కుటుంబాన్ని సర్వే చేస్తుండగా.. బ్యాంకు ఖాతా, టీవీ, కూలర్ ఉన్నాయా అన్న ప్రశ్నలకు అతడు తడబడ్డాడు. జీరో బిల్లుకు ఏమైనా సమస్య వస్తుందా అనే సందేహంతో తడబడినట్లు తెలిపారు. అతనికి కొడుకు, కోడలు, మనుమరాళ్లు ఉండగా వారి వివరాలను తెలపడానికీ ససేమిరా అన్నాడు. తమ ఇల్లు ఇరుకుగా ఉందని, కొడుకుకు రేషన్ కార్డు ఉన్నందున సర్వేను వేరుగా రాస్తే వారికి ప్రభుత్వం నుంచి ఇల్లు, ఇతర పథకాలు వస్తాయని చెప్పుకొచ్చాడు. ఇదే క్రమంలో ఓ వృద్ధురాలిని వివరాలు అడుగుతూ ఇల్లు ఉందా అని ప్రశ్నించగా, తనకు రేకుల ఇల్లు ఉందని మీరు రాసుకున్నంత మాత్రాన తనకు ఇల్లు వస్తదన్న నమ్మకం లేదని.. ఇంతకుముందు కూడా ఇలాగే రాసుకొని వెళ్లారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేలో మెజారిటీ ప్రశ్నలకు ప్రజల నుంచి స్పందన రావడం లేదు. 75 ప్రశ్నలతో సర్వే ఫారాన్ని తయారు చేస్తే.. అందులో 40 వరకు ప్రశ్నలకు ప్రజల నుంచి వివరాలు అందడం లేదు. సాధారణంగా ఏదైనా సర్వే నిర్వహించేటపుడు వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు జవాబులు రాబట్టాలి. అప్పుడే ఆ సర్వే లక్ష్యం నెరవేరుతుంది. కానీ ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర ఇంటింటి సర్వేలో మెజారిటీ ప్రశ్నలకు, అందులోనూ కీలకమైన వాటికి ప్రజల నుంచి స్పందన లేకపోవడం అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం సమగ్ర సర్వే 90 శాతానికిపైగా పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. సర్వే ఫారాల కంప్యూటరీకరణ కూడా సాగుతోంది. 40 ప్రశ్నలకు అరకొర జవాబులు.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలు ఉన్నాయి. అందులో 56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు. మొత్తం ప్రశ్నావళి రెండు భాగాలుగా ఉంది. మొదటి విభాగం (పార్ట్–1)లో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. సాధారణ వివరాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి, భూమి, రిజర్వేషన్లు, రాజకీయాలు, వలసలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు ఉన్నాయి. రెండో విభాగం (పార్ట్–2)లో కుటుంబ ఆర్థిక స్థితిగతుల అంశాలు ఉన్నాయి. రుణాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశు సంపద, స్థిరాస్తి, రేషన్ కార్డు, నివాస గృహానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో చాలా ప్రశ్నలకు ప్రజలు సమాచారం ఇవ్వడం లేదని ఎన్యుమరేటర్లు చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాస్త మెరుగ్గా ఉన్నా.. పట్టణ ప్రాంతాల్లో స్పందన అంతంతగానే ఉందంటున్నారు. 56 ప్రధాన ప్రశ్నల్లో సుమారు 40 ప్రశ్నలకు సరైన విధంగా జవాబులు రావడం లేదని పేర్కొంటున్నారు. ⇒ సర్వే ఫారం మొదటి విభాగంలో 1 నుంచి 10వ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు జనం ఎలాంటి ఇబ్బందిపడటం లేదు. ఇందులో కుటుంబ సభ్యుల పేర్లు, లింగం, మతం, సామాజికవర్గం, కులం, వయసు తదితర ప్రశ్నలున్నాయి. 11, 12వ ప్రశ్నలు ఆధార్, ఫోన్ నంబర్లకు సంబంధించినవి. ఇవి ఐచ్ఛికమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వివరాలను చెప్పేందుకు గ్రామీణ ప్రాంతాల వారు ముందుకొస్తున్నా.. పట్టణ ప్రాంతాల్లో చెప్పేందుకు ఇష్టపడటం లేదు. ⇒ ఇక కాలమ్ 13 నుంచి 19 వరకు ప్రశ్నలు భౌతిక, వివాహ స్థితి, పాఠశాల, విద్యార్హతలు, మాధ్యమం, డ్రాపౌట్ తదితర వివరాలకు సమాధానాలు వస్తున్నాయి. ⇒ కాలమ్ 20 నుంచి 56 వరకు ఉన్న ప్రశ్నలకు సమాచారం చెప్పడంలో జనం వెనక్కి తగ్గుతున్నారు. అందులో చాలావరకు వ్యక్తిగత వివరాలు ఉన్నాయని.. అవి వెల్లడించలేమని నిర్మొహమాటంగా చెబుతున్నారు. ⇒ 20వ కాలమ్ నుంచి ఉన్న ప్రశ్నల్లో ఎక్కువగా వ్యక్తిగత అంశాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలే ఉన్నాయి. వృత్తి, వ్యాపారం, వేతనం, కులవృత్తి, వ్యాధులు, వార్షికాదాయం, పన్ను చెల్లింపులు, బ్యాంకు ఖాతాలు, వ్యవసాయ భూములు, ధరణి పాస్‌బుక్ వివరాలు, భూమి రకం, నీటిపారుదల వనరులు, కౌలు, రిజర్వేషన్ల ద్వారా పొందిన విద్యావకాశాలు, ఉద్యోగ ప్రయోజనాలు, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి, ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం, నామినేటెడ్ పోస్టులు, వలసలు, అందుకు కారణాలు, బ్యాంకు లేదా ఇతర సంస్థల నుంచి రుణాలు, వాటి చెల్లింపులు, పశుసంపద, స్థిర, చరాస్తి వివరాలు, రేషన్ కార్డు, నివాసగృహం, ఇంటికి సంబంధించిన ప్రశ్నలకు సరిగా సమాధానాలు రావడం లేదని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు. ‘అసలు’వివరాలే రావట్లే! సమగ్ర కుటుంబ సర్వేలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాల సేకరణే కీలకం. కానీ ఉద్యోగం, వృత్తి, ఆర్థిక, రాజకీయ అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వకపోతుండటంతో ఎన్యుమరేటర్లు సైతం చేతులెత్తేస్తున్నారు. వివరాలు చెప్పాలని మళ్లీ మళ్లీ అడిగితే... ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో ఇచ్చిన వివరాలు నమోదు చేసుకుంటూ ఇతర కాలమ్స్‌ను వదిలేస్తున్నారు. కొన్ని చోట్ల గట్టిగా ఎదురు ప్రశ్నిస్తుండటంతో చాలామంది ఎన్యుమరేటర్లు తర్వాత అడగడమే మానేశారు. అయితే నిర్దేశించిన ప్రశ్నల్లో సగానికి పైగా సమాధానాలు రాకపోతే సర్వే లక్ష్యం నెరవేరే అవకాశాలు తక్కువేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల ఎన్యుమరేటర్లు పెన్సిల్‌తో సర్వే ఫారం పూరిస్తున్నారు. తర్వాత వాటిని పెన్నుతో రాస్తామని చెప్తున్నారు. తప్పులు దొర్లకుండా ఈ విధానం అనుసరిస్తున్నట్టు ఎన్యుమరేటర్లు చెప్తున్నా... పెన్నుతో రాసే సమయంలో ఇతర వివరాలు నమోదు చేస్తారేమోనని జనంలో ఆందోళన కనిపిస్తున్న పరిస్థితి. ఎన్నో అపోహలు.. మరెన్నో అనుమానాలు! సమగ్ర సర్వేపై ఎన్నో అపోహలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని నివృత్తి చేయడంలో అధికార యంత్రాంగం సఫలీకృతం కాకపోవడంతోనే... సర్వేలో చాలా ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా ఆర్థికపరమైన అంశాలు, ఆస్తులు, అప్పులకు సంబంధించిన సమాచారాన్ని చాలా మంది వెల్లడించడం లేదు. ఒకవేళ ఆస్తుల లెక్కలు చెబితే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో కోత పడుతుందనే ఆందోళన కనిపిస్తోంది. ఈ కారణంగానే ఆధార్ వివరాలను కూడా ఈ కారణంగానే బహిర్గతం చేయడం లేదని అంటున్నారు. వాహనాలు, ఇళ్లు, స్థిర, చరాస్తులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఎక్కువ మంది చెప్పడం లేదు. ప్రధానంగా పింఛన్లు, ఉచిత కరెంటు, రేషన్‌కార్డు, ఉచిత నల్లా కనెక్షన్, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్íÙప్ తదితర పథకాలు ఆగిపోతాయేమోనన్న కారణంతో వాస్తవాలను దాచేస్తున్న పరిస్థితి. స్టిక్కర్లు వేయని ఇళ్ల మాటేంటి? పట్టణ ప్రాంతాల్లో చాలా ఇళ్లకు ఇప్పటికీ స్టిక్కర్లు వేయలేదని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు, నాలుగైదు అంతస్తుల భవనాల్లోని చాలా ఇళ్లకు స్టిక్కర్లు వేయలేదని అంటున్నారు. పూర్తిస్థాయి సర్వేలో ఇలాంటి ఇళ్లను గుర్తించి, వివరాలు నమోదు చేసే అవకాశం లేకుండా పోయిందన్న ఫిర్యాదులు వస్తున్నాయి. సర్వే సమయంలో అలాంటి ఇళ్లను కూడా గుర్తించాలని అధికారులు సూచిస్తున్నా.. ఎన్యుమరేటర్లు వచ్చే సమయం తెలియక ఇబ్బందిగా మారిందని ప్రజలు పేర్కొంటున్నారు. సర్వేతో ఒరిగేదేమిటి.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేశారు. వెంకటేశ్వరకాలనీ 4బీ రోడ్లో నివాసం ఉంటున్న మంద సతీష్ రెడ్డి ఇంటికి రాగా.. సర్వేతో తమకు ఎంత మేరకు ప్రయోజనం చేకూరుతుందని.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సర్వే చేసింది.. అప్పుడు అన్ని చెప్పాం.. మళ్లీ కొత్తగా చెప్పేది ఏముంటుందని ప్రశ్నించారు. దీంతో ఎన్యుమరేటర్ నచ్చజెప్పి వివరాలను నమోదు చేశారు. కుల వృత్తికి సంబంధించి ప్రశ్న అడగ్గా.. రెడ్డిలకు ఏ కుల వృత్తి ఉంటుందని ఎదురు ప్రశ్నించారు. అలాగే, ఆదాయ వివరాలు ఎందుకు చెప్పాలంటూ ఎదురు ప్రశ్నించారు. తాము అప్పులు చేసి కొన్న ఫ్రిజ్, టీవీ, ఏసీ, వాహనం వంటి వివరాలు అడగడం తగదన్నారు. రుణమాఫీ, రైతుబంధు, రేషన్‌కార్డు, పింఛన్లు ఇవ్వకుండా సర్వే చేయడం అనవసరమని చెప్పారు. -
బడికి పోవాలంటే భయం భయం
-
వరి @ రూ.3,010
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో బుధవారం ధాన్యానికి (ఆర్ఎన్ఆర్ పాతరకం) రికార్డుస్థాయిలో ధర రూ. 3,010లు పలికింది. ఈ సీజన్ ప్రారంభమైన నాటినుంచి ధాన్యానికి అత్యధికంగా ధర పలకడం ఇదే తొలిసారి. మద్దతు ధర రూ.2,060 ఉండగా, మద్దతుకు మించే ధర రావడం విశేషం. కాగా, మార్కెట్ కు బుధవారం 1,778 బస్తాల ధాన్యం అమ్మకానికి రాగా, గరిష్ట ధర రూ.3,010, కనిష్ట ధర రూ.2,219 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. -
బావిలోకి దూసుకెళ్లిన కారు
సాక్షి, మహబూబాబాద్/కేసముద్రం/ఇల్లెందు: వాళ్లంతా గిరిజనులు.. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలపడుతున్నారు. చదువుకున్న కొడుకుకు ఉపాధి కల్పించేందుకు కొత్త లారీ కొన్నారు. తనతోపాటు తన బంధువు కూడా లారీ కొనడంతో ఆ సంబురంలో బంధువులతో కలసి దైవదర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న వ్యవసాయ బావిలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. డ్రైవర్, తల్లి, కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు లచ్చీరాం తండా సమీపంలో చోటుచేసుకుంది. కారు అదుపుతప్పడంతో...: మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన బానోత్ భద్రునాయక్ (39) తన దూరపు బంధువు జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి తండాకు చెందిన మధు కుటుంబ సభ్యులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా వద్ద పండుగ చేశారు. పండుగకు భద్రునాయక్, భార్య హచ్చాలి (35), కుమార్తె సుమలతతోపాటు 18 నెలల మనవడు దీక్షిత్‌తో కలసి టేకులపల్లికి చెందిన తన బావమరిది గుగులోత్ బిక్కి నాయక్ కారులో వెళ్లారు. అన్నారం షరీఫ్ దర్గాలో బంధువులతో కలసి దర్శనం చేసుకున్నారు. భోజనాలు చేశారు. తిరిగి టేకులపల్లికి వస్తుండగా అదే పండుగకు వచ్చిన మహబూబాబాద్ పట్టణం భవానీ నగర్ తండాకు చెందిన గుగులోత్ లలిత (45), ఆమె కుమారుడు సురేష్ (15) లిఫ్ట్ అడిగి కారులో ఎక్కారు. అయితే కారు కేసముద్రం మండల కేంద్రం లచ్చీరాం తండా సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడింది. ఈ ప్రమాదంలో భద్రునాయక్, అతని భార్య హచ్చాలి, లలిత, ఆమె కుమారుడు సురేష్ నీటిలో మునిగి మరణించారు. ముందు సీట్లో ఉన్న డ్రైవర్ బిక్కు, భద్రునాయక్ కుమార్తె సుమలత, ఆమె 18 నెలల కుమారుడు దీక్షిత్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద వార్త తెలియగానే మహబూబాబాద్ డీఎస్పీ సైదయ్య ఆధ్వర్యంలో పోలీసులు, గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకొని రెండు గంటలపాటు శ్రమించి క్రేన్ సాయంతో బావిలోంచి కారును బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బావిలో పడిన కారును బయటకు తీస్తున్న దృశ్యం నీటిలో అరగంట తేలుతూ.. కేసముద్రం బైపాస్ రోడ్డును కొత్తగా వేస్తున్నారు. కంకర పోసి ఉండటంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనే నిండు కుండలా ఉన్న వ్యవసాయ బావిలో పడింది. అయితే కారు అద్దాలు మూసి ఉండటంతో దాదాపు అరగంటపాటు బావిలో కారు తేలుతూ ఉంది. క్రమంగా లోపలకు నీరు చేరుతుండటంతో కారులో ఉన్నవారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కారు బావిలో పడిన శబ్ధం రావడంతో అటువైపు మూత్ర విసర్జనకు వెళ్తున్న ఎస్వీవీ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు బుర్రి రంజిత్, నూనావత్ సిద్దూలు ప్రాణాలకు తెగించి బావిలోకి దూకారు. కారు అద్దాన్ని పగలగొట్టి సుమలత, ఆమె కుమారుడు దీక్షిత్‌ను, డ్రైవర్ బిక్కును కాపాడారు. అప్పటికే కారులోకి నీరు ప్రవేశించి కారు మునిగిపోతుండగా హచ్చాలిని, భధ్రులను స్థానికుల సాయంతో బయటకు తీశారు. కానీ అప్పుటికే భద్రు మృతి చెందగా కొనఊపిరితో ఉన్న హచ్చాలిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. వెనుక సీట్లో ఉన్న లలిత, ఆమె కుమారుడు సురేష్‌లు కారులోనే మృతిచెందారు. -
మహబూబాబాద్ : కేసముద్రం వద్ద బావిలోకి దూసుకెళ్లిన కారు
-
ఒకేరోజు జననం.. ఒకేరోజు మరణం
సాక్షి, ఉమ్మడి వరంగల్: వారిద్దరూ ఒకే రోజు జన్మించారు. బంధుత్వంలో ఆప్యాయంగా మెలిగారు. అయితే వారి మరణం కూడా ఒకేరోజు జరగడం విధి విచిత్రం. మహబూబాబాద్ జిల్లాలో కొన్ని గంటల వ్యవధిలోనే వియ్యపురాళ్లు ఒకరి వెంట, మరొకరు మృతి చెందారు. కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దుల బజారుకు చెందిన జానపాటి మల్లమ్మ (85) కుమార్తె అచ్చమ్మను, ఇదే గ్రామానికి చెందిన పంకు యాకమ్మ (85) కుమారుడైన యాకయ్యకు ఇచ్చి వివాహం చేశారు. మల్లమ్మ, యాకమ్మ ఇద్దరి ఇళ్లూ పక్కపక్కనే ఉండడం విశేషం. బంధుత్వంలో వారిద్దరూ అప్యాయంగా ఉండేవారు. శనివారం తెల్లవారుజామున మల్లమ్మ గుండెపోటుతో మృతి చెందింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన యాకమ్మ, మల్లమ్మ మృతదేహం వద్ద విలపించింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఆమె కూడా గుండెపోటుతో మృతి చెందింది. గంటల వ్యవధిలోనే వియ్యపురాళ్లు ఇద్దరూ మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఇదిలా ఉండగా మల్లమ్మ, యాకమ్మలు కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే రోజు జన్మించినట్లు స్థానికులు తెలిపారు. చదవండి: ప్రేమ పేరుతో మోసం తిరుపతిలో నిందితుడి అరెస్టు -
ఒక్క ఫోన్‌కాల్‌తో పీటలపై ఆగిన పెళ్లి; బావా.. ఎంత పని చేస్తివి!
సాక్షి, మహబూబాబాద్ రూరల్: మరికొద్ది గంటల్లో జరగాల్సిన పెళ్లి అంతలోనే వచ్చిన ఓ ఫోన్‌కాల్‌తో పీటల మీదే ఆగిపోయింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని కేసముద్రం మండలం పరిధి గ్రామానికి చెందిన వధువుకు బయ్యారం మండలం పరిధిలో గల వరుడితో వివాహం నిశ్చయమైంది. బుధవారం ఉదయం 10 గంటలకు కురవి మండల కేంద్రంలో వివాహం జరిపేందుకు పెద్దలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెళ్లి మరికొద్ది గంటల్లో ఉందనగా వధువు అక్క భర్త వరుడి తండ్రికి ఫోన్‌చేసి వివాహం ముచ్చట్లు మాట్లాడాడు. బాబాయ్ పెళ్లి ఎక్కడ, ఎలా రావాలి, ఏర్పాట్లు ఎలా చేశారని మంచి చెడు అడిగి తెలుసుకున్నాడు. కాగా, మంగళవారం ప్రధానం వేడుక జరగగా పెళ్లి కుమార్తె వరుడి ఇంట్లో ఉంది. అదే క్రమంలో పెళ్లి కుమార్తె అక్కడే ఉందా అని అడిగాడు. దీంతో వరుడి తండ్రి ఫోన్‌ను నూతన వధువుకు ఇచ్చాడు. ఆమె బావ మాట్లాడుతూ నిన్న నేను అలిగి ప్రధానం సమయంలో నీతో ఫొటో ఎందుకు దిగలేదో తెలుసా.. నీ మీద కోపంతో నేను ఫొటో దిగలేదని మాట్లాడాడు. ఆ మాటలను కాల్ రికార్డ్‌లో విన్న పెళ్లి కుమారుడు తనకు ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని మొరాయించాడు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రాంతంలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు నివాసం ఉంటుండగా వారు పోలీసులను ఆశ్రయించారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ పోలీసులు నూతన వరుడికి కౌన్సెలింగ్ ఇచ్చినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అతడు ఆమెను పెళ్లి చేసుకోనని పట్టుబట్టాడు. టౌన్ సీఐ సతీష్‌ను వివరణ కోరగా బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు. చదవండి: సరూర్ నగర్ హత్య: ‘కాపాడమని కాళ్లు పట్టుకున్నా.. ఎవరూ ముందుకు రాలేదు’ -
కోడిపుంజుకు కమ్మలు కుట్టించి.. మెడలో మందేసి
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలో ముత్యాలమ్మ బోనాల పండుగ సందర్భంగా వెంకటేశ్వర్లు అనే స్థానికుడు బుధవారం కోడిపుంజుకు చెవి కమ్మలు కుట్టించి, కోడిమెడలో మద్యం బాటిల్ వేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నాడు. ఆలయం వద్దకు వచ్చిన భక్తులంతా ఆ భక్తుడి మొక్కును ఆసక్తిగా తిలకించడంతోపాటు ఆ పుంజును చేతుల్లోకి తీసుకుని ఫొటోలు దిగారు. ప్రతి ఏటా అమ్మవారికి ఇలానే మొక్కులు చెల్లిస్తానని ఆయన తెలిపారు. – కేసముద్రం చదవండి: పెళ్లి సందడి షురూ! ముహూర్తాలే ముహూర్తాలు! -
మొబైల్లో మంత్రాలు.. ఆలయంలో పెళ్లి
కేసముద్రం: వేదమంత్రాల నడుమ జరగాల్సిన పెళ్లికి సమయానికి అర్చకుడు హాజరుకాలేకపోయాడు. అయినా వివాహం మాత్రం ఆగలేదు. స్మార్ట్‌ఫోన్‌లో మరో అర్చకుడు మంత్రాలు చదువుతుండగా గుడిలో పెళ్లి కానిచ్చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో ఈ వివాహం జరిగింది. ఒడిశాకు చెందిన కబీర్దాసు, కవిత కూలీ పనులు చేస్తుంటారు. నిరుపేదలైన ఈ ప్రేమజంటకి మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ రవినాయక్ పెళ్లి చేసేందుకు ముందుకొచ్చారు. తాళ్లపూసపల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం పెళ్లికి ఏర్పాట్లు చేశారు. తీరా పెళ్లి సమయానికి అర్చకుడు మరో చోట కార్యం ఉండటంతో రాలేకపోయాడు. దీంతో కౌన్సిలర్ రవినాయక్‌తో పాటు స్థానికులు మరో అర్చకుడికి ఫోన్ చేశారు. ఆయన లైవ్‌లో మంత్రాలు చదువుతుండగా ప్రేమజంట ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చదవండి: వైరల్ : నీ టైం బాగుంది ఇంపాల గుర్రం అంటే ఆయనకు ప్రాణం.. అందుకే.. -
రావమ్మా.. మహాలక్ష్మి!
సాక్షి, కేసముద్రం: నేటి సమాజంలో ఆడపిల్ల పుట్టిందంటే చిన్నచూపు చూడటం సహజం. అయితే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని ఓ కుటుంబంలో ఆడపిల్ల పుట్టిందని తెగ సంబరపడిపోయారు. గ్రామానికి చెందిన సవీన్, రమ్య దంపతులకు మూడు నెలల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆడపిల్ల (సమస్వి) జన్మించింది. శనివారం కూతురితో రమ్య అత్తవారింటికి వచ్చింది. తమ ఇంట మహాలక్ష్మి పుట్టిందని సంబరపడుతూ.. పూలు చల్లి ఇంట్లోకి ఘనస్వాగతం పలికారు. పూల పాన్పులో శిశువును పడుకోబెట్టి ఆనందంతో గడిపారు. -
ఓ జంటది ప్రేమకథ.. మరో జంట..
సాక్షి, హైదరాబాద్: పెళ్ళంటే నూరేళ్ల పంట... బంధువులందరి మధ్య వైభవంగా జరుపుకొనే వేడుక... ఇక ఒకే వేదికపై కవల సోదరులు, కవల సోదరీమణులు మూడుముళ్ళ బంధంతో ఒక్కింటి వారయ్యారు. ఈ అపూర్వ ఘట్టం మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన అంబాల మహేష్, నరేష్ లు కవల పిల్లలు. కురవి మండలం నేరడ గ్రామానికి చెందిన శాంతి, హిమలు కూడా కవల పిల్లలలే. హైదరాబాద్‌లో ఉంటున్నారు. కాగా మహేష్, శాంతిలు గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. అదే సమయంలో నరేష్, హిమకు కూడా వివాహం జరిపించాలని బంధు వర్గం ఆలోచించించింది. అనుకన్నదే తడవుగా... వారి అభిప్రాయాలను అడిగారు. ఇందుకు ఇద్దరూ దీనికి వారు అంగీకారం తెలపడంతో ఒకే వేదికపై జంట పెళ్ళిళ్ళు జరిగాయి. ఒకే ముహూర్తానికి.. వేద మంత్రోచ్ఛరణల నడుమ అంగరంగవైభవంగా పెద్దలు కవలల వివాహం జరిపించారు. ఈ పెళ్ళి వేడుకలను తిలకించడానికి బంధు, మిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జంటలతో ఫోటోలు దిగేందుకు పోటీలు పడ్డారు. చదవండి: (భర్త మోసం చేశాడని... సవతి పిల్లలను చంపి..) -
హైడ్రోక్లోరైడ్ ద్రావణం అందజేసిన ఉప్పరపల్లి వాసి
సాక్షి, కేసముద్రం : మండలంలోని ఉప్పరపల్లికి చెందిన ఆవుల యుగంధర్ కరోనా నియంత్రణకు తన వంతు సాయం చేశాడు. 100 లీటర్ల హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని అందజేశాడు. గ్రామ ఇంజార్జి సర్పంచ్ సారయ్య పంచాయితీ కార్యదర్శి రంజిత్ కు అందజేశాడు. గ్రామంలోని అన్ని వార్డుల్లో పిచికారీ చేయడానికి హైడ్రోక్లోరైడ్ ద్రావణన్ని అందించిన యుగంధర్ ను గ్రామస్థులు అభినందించారు. అనంతరం ప్రతి వార్డులో పది లీటర్ల ద్రావణం పిచికారీ చేయాల్సిందిగా వార్డు సభ్యులకు ద్రావణం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి కృష్ణమూర్తి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సంకు శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ సుధాకర్ వార్డు సభ్యులు కరొబార్ కట్టయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. -
స్కూల్ యూనిఫాంలో ప్రధానోపాధ్యాయుడు
సాక్షి, కేసముద్రం: విద్యార్థులు వేసుకునే స్కూల్ యూనిఫాంనే తానూ కుట్టించి ధరించాడు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నర్సింహులగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొడిపాక రమేశ్. శుక్రవారం ఆయన యూనిఫాంతో విధులకు హాజరు కావడంతో విద్యార్థులంతా ఆశ్చర్యంగా చూశారు. అనంతరం హెచ్ఎం పిల్లలతో కలసి మధ్యాహ్న భోజనం కూడా చేశారు. బుధ, శనివారం మినహా మిగతా అన్ని రోజులు స్కూల్ యూనిఫాం వేసుకునే వస్తానని హెచ్ఎం చెప్పారు. ఎలాంటి అసమానతలు లేకుండా విద్యార్థుల్లో కలసిపోయి వారికి విద్యాబుద్ధులు నేర్పడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రమేశ్ చెప్పారు. -
పిట్టల కోసం స్తంభమెక్కిన పాము
సాక్షి, కేసముద్రం(వరంగల్) : ఎరక్కబోయి ఓ భారీ సర్పం విద్యుత్ స్తంభం ఎక్కింది. జంపర్‌కు తాకడంతో షార్ట్‌సర్క్యూట్ కారణంగా పాము చనిపోవడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ఘటన గురువారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. విద్యుత్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని రైల్వేట్రాక్ పక్కనున్న 11 కేవీ విద్యుత్ స్తంభంపై పిట్టలు గూడుకట్టుకున్నాయి. వాటికోసం పాము స్తంభంపైకి పాకుతూ వెళ్లింది. ఏవీ స్విచ్‌కున్న జంపర్‌ను పాము తగలడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా మృతి చెందింది. మృత్యువాత పడిన పాము జంపర్ వద్ద మెలికలు పడి ఇరుక్కు పోవడంతో సబ్‌సబ్‌స్టేషన్‌లో పవర్ ట్రిప్ అయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమస్య ఎక్కడ తలెత్తిందనే విషయం కనుక్కోవడానికి లైన్మెన్ శ్రీనివాస్, జేఎల్ఎం విజయ్‌కుమార్, లైన్ఇన్స్పెక్టర్ భాస్కరాచారి చాలా ఇబ్బంది పడ్డారు. చివరకు స్తంభంపై పాము ఉన్నట్లు గుర్తించి దానిని కర్రతో తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ ఘటనతో సాయంత్రం 3 నుంచి 3–45 గంటల వరకు కరెంటు నిలిచిపోయింది. మృత్యువాత పడిన పాము సుమారు 6 ఫీట్ల పొడవు ఉందని, జెర్రిగొడ్డుగా గుర్తించినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. -
మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
కేసముద్రం: టీఆర్ఎస్ నుంచి తనను ఏకగ్రీవం చేయకుండా మరో వ్యక్తిని చేయడం పట్ల మనస్తాపం చెంది ఓ మాజీ సర్పంచ్ పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం రంగాపురం గ్రామంలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పార్వతి కుటుంబం అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరింది. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి టీఆర్ఎస్లోకి వచ్చింది. ఈ సారి జరిగే సర్పంచ్ ఎన్నికల బరిలో నిలబడేందుకు సన్నద్ధమయ్యారు. ఇదే తరుణంలో సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ఇతర పార్టీ నాయకులతో పార్వతి భర్తను చర్చలకు పిలిచారు. ఈ చర్చల్లో మరో అభ్యర్థిని ఎంపిక చేశారు. దీంతో తమకు అన్యాయం జరిగిందంటూ మనస్తాపానికి గురైన పార్వతి పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ మేరకు ఆమెను చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ముగ్గురిని బలిగొన్న కుటుంబ కలహాలు!
రైల్వేగేట్(వరంగల్): కుటుంబ కలహాలతో రైలు కింద పడి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. వరంగల్ జీఆర్పీ సీఐ జూపల్లి వెంకటరత్నం కథనం ప్రకారం... కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన కొంగ మహేశ్(33) కొంతకాలం వరంగల్‌లో నివసించాడు. రెండేళ్లుగా సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దొండపాడులో రేఖ కెమికల్ ఫ్యాక్టరీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తన తల్లి పూలమ్మ(60), కూతురు దర్శిని(13), భార్య సంగీత, కుమారుడు కార్తికేయతో కలసి బుధవారం ఖమ్మంలో నాగర్సోల్ రైలు ఎక్కి సాయంత్రానికి వరంగల్ చేరుకున్నారు. సంగీత కార్తికేయతో కలసి కాజీపేటలో తల్లిగారింటికి వెళ్లింది. మహేశ్, పూలమ్మ, దర్శిని మాత్రం కాశిబుగ్గలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి అర్ధరాత్రి వరంగల్ జాన్‌పీరిల సమీపంలోని రైల్వేట్రాక్ వద్దకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబాన్ని సరిగా చూసుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మహేశ్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల వల్లే ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడి నట్లు సీఐ తెలిపారు. సంగీత మాత్రం తమ మధ్య ఎలాంటి గొడవల్లేవని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందో అర్థం కావట్లేదని రోదించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. -
ఎండలకు ఆకుల్లా రాలుతున్న గబ్బిలాలు
చెట్లపైకి పైప్‌తో నీళ్లు కొడుతున్న గ్రామస్తులు కేసముద్రం(మహబూబాబాద్): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని కోమటిపల్లి గ్రామంలో ఎటు చూసినా గబ్బిలాలే దర్శనమిస్తాయి. ఈ వేసవిలో ఎండ తీవ్రత పెరగడంతో అవి మృత్యువాత పడుతున్నాయి. దీంతో స్థానికులు వాటిని కాపాడేందుకు చెట్లపై నీళ్లు చల్లుతూ వాటికి ఉపశమనం కలిగిస్తున్నారు. గ్రామంలోని శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయ సమీపం లోని చెట్లపైనున్న గబ్బిలాలు వడ గాడ్పులకు మృత్యువాత పడుతున్నాయి. దీంతో సర్పంచ్ బాలునాయక్ ఆధ్వర్యంలో గ్రామస్తులు బుధ వారం వ్యవసాయ బావికి మోటారు పెట్టించి పైపుల ద్వారా చెట్ల మీదున్న గబ్బిలాలకు నీళ్లు కొట్టి గబ్బిలాలను బతికించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో వీస్తున్న వడగాడ్పులకు 14 మంది మృతి చెందారు. అందులో 12 మంది ఉమ్మడి వరంగల్ జిల్లా లోనే మరణించారు. మృతుల్లో కరీంనగర్ జిల్లా రాచపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు పంజాల రామయ్య (64), మానకొండూర్ మండలంలోని ముం జంపల్లి గ్రామానికి చెందిన కార్మికుడు పిల్లి రవి (38) కూడా ఉన్నారు. -
చేర్యాలలో నయీం అనుచరులు ఉన్నారా?
మండలంలో చక్కర్లు కొట్టిన కేసముద్రం పోలీసు వాహనం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం! చేర్యాల : కేసముద్రం పోలీసు వాహనం చేర్యాల మండలంలో శనివారం చక్కర్లు కొట్టింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నయీం కేసులో జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రానికి చెందిన టెక్ మధును పోలీసులు 16వ నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆ మండలం పరిధిలోని పోలీసులు చేర్యాలలో పర్యటించడం పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది. భూదందాలు, సెటిల్మెంట్లకు పెట్టింది పేరైన నయీం అనుచరులు చేర్యాల, మద్దూరు మండలాల్లోనూ ఉండొచ్చనే సమాచారం అందడంతో ఆ దిశగా రహస్య దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ అంతా సిట్ బృందం కనుసన్నల్లో జరుగుతోందనే అంచనాలు వెలువడుతున్నాయి. నయీం గ్యాంగ్‌తో సంబంధాలు కలిగి ఉండొచ్చని భావిం చిన పలువురిని విచారించిన పోలీసులు, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మెుత్తంమీద శనివారం చేర్యాల పోలీసు స్టేషన్లో కేసముద్రం పోలీసులు గంటపాటుగడిపారు. ఈ సమయంలో స్థానికంగా ఉన్న అనుమానితుల నేపథ్యం, నేరచరిత్ర వంటి అంశాలపై ఆరాతీసి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారని భావిస్తున్న ఇద్దరు వ్యక్తులు మాజీ మావోయిస్టులా? ఇతర రంగాల వ్యక్తులా? అనేది తెలియరాలేదు. దీనిపై సీఐ చంద్రశేఖర్‌గౌడ్‌ను వివరణ కోరగా ‘చేర్యాల, మద్దూరు మండలాల్లో నయీం అనుచరులు ఎవ్వరూ లేరు. ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. పోలీసు వాహనం వేరే పనిపై వచ్చింది’ అని బదులిచ్చారు. -
నయీం ముఠాలో టెక్ మధు
ఎ–16గా కేసు నమోదు మధు స్వస్థలం కేసముద్రం 2006లో లొంగిపోయిన మాజీ మావోయిస్టు వరంగల్: ఎన్కౌంటర్లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం ముఠాలో జిల్లాకు చెందిన టెక్ మధు ఉన్నట్లు వెలుగు చూసింది. నయీం కేసులో పోలీసులు టెక్ మధును ఎ–16గా చేర్చడం జిల్లాలో చర్చనీయాంశమైంది. కేసముద్రం మండల కేంద్రానికి చెందిన మధు నయీం ముఠాలో చురుకుగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు చెందిన ఆయుధ ఫ్యాక్టరీకి ఇంచార్జ్‌గా ఉన్న మధు వారికి రాకెట్ లాంఛర్లను తయారు చేసి ఇవ్వడంతో వార్తల్లోకి ఎక్కాడు. తోట కుమారస్వామి అలియాస్ టెక్ మధు అలియాస్ శ్రీనివాసరెడ్డి అప్పటి పీపుల్స్‌వార్ పార్టీలో చేరాడు. మజ్జిగ రాజు అనే పీపుల్స్‌వార్ సిటీ అర్గనైజర్తో పరిచయం ఏర్పడడంతో మధు 1990నుంచి 1991వరకు హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించాడు. 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర స్థాయి టెక్నికల్ టీం ఏర్పాటు చేయడంతో అందులో సభ్యునిగా నియమించబడ్డాడు. అనంతరం పార్టీ ఆదేశాల మేరకు బయటకు వచ్చిన మధు కోయంబత్తూరు ఇంజనీరింగ్ కాలేజీలో డిప్లొమో పొందాడు. కోర్సు పూర్తయిన వెంటనే 2002లో నల్లమల ఫారెస్టుకు వెళ్లి పార్టీలో జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి సందే రాజమూళి అలియాస్ కృష్ణా, అక్కిరాజు హరగోపాల్, శాఖమూరి అప్పారావులాంటి పీపుల్స్‌వార్ సీనియర్ నేతల పర్యవేక్షణలో పనిచేశాడు. అక్కడే అయన రాకెట్ లాంచర్లకు డిజైన్ చేసినట్లు తెలిసింది. 2003లో ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దులోని మల్కన్‌గిరి క్యాంపులో రాకెట్ లాంచర్ల ప్రాజెక్టును అభివృద్ధి చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అక్కడే లాంచర్లను ప్రయోత్మకంగా వినియోగించినట్లు తెలిసింది. అక్కడ రాకెట్ లాంచర్ల కర్మాగారం ఉన్నట్లు పసిగట్టిన పోలీసులు దాడులు నిర్వహించడంతో మధు చాకచక్యంగా తప్పుకున్నాడు. అనంతరం మావోయిస్టులతో వచ్చిన భేదాభిప్రాయాలతో పోలీసులకు లొంగిపోయాడు. తన భార్య సుధారాణి అలియాస్ వసంతతో కలసి 2006 నవంబర్ 5న జిల్లాలో డీఐజీ రవిగుప్తా, అప్పటి ఎస్పీ సౌమ్యమిశ్రా ఎదుట లొంగిపోయారు. గత సంవత్సరం లొంగిపోయిన మావోయిస్టులకు జిల్లా కేంద్రంలో పోలీసులు మధు చేత ఉపన్యాసం ఇప్పించారు. మావోయిస్టు పార్టీలో తనకు ఎదురైన ఇబ్బందులను మధు వివరించాడు. ఆ తర్వాత మధు గ్యాంగ్‌స్టర్ నయీంతో పరిచయం ఏర్పడి ఆయన గ్యాంగ్ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలిసింది. నయీం గ్యాంగ్‌కు మధు ఆయుధాలు సరఫరా చేశాడన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. -
పనామాలో కేసముద్రం వాసి..?
కేసముద్రం :ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పనామా పత్రాల’ వ్యవహారంలో కేసముద్రం మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి పేరు వినబడడం చర్చనీయూంశమైంది. సదరు వ్యాపారి పేరు బుధవారం వివిధ చానళ్లలో వచ్చింది. ఆ వ్యాపారి కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే ఓ కంపెనీని నడుపుతూ స్థిరపడ్డాడు. గత రెండు రోజులుగా పనామాలో డబ్బులు దాచుకున్న పలువురు ప్రముఖుల పేర్లు ఐసీఐజే బయటపెట్టడం సంచలనం రేకిత్తించింది. ఇదే క్రమంలో కొందరి తెలుగువారి పేర్లు పనామా వ్యవహారంలో ఉన్నట్లు బుధవారం పలు టీవీ చానళ్లలో రావడం, అందులో కేసముద్రం వాసి పేరు వినిపించడం కలకలం రేపింది. -
కేసముద్రంలో పట్టపగలు చోరీ
69 గ్రాముల బంగారం, రూ.10 వేల నగదు అపహరణ కేసముద్రం : గుర్తు తెలియని వ్యక్తి పట్టపగలు ఒకరి ఇంట్లో చొరబడి 69 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు రూ.10 వేలు, వెండి వస్తువులను ఎత్తుకెళ్లిన సంఘటన మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మం డల కేంద్రంలోని జెడ్పీ పాఠశాల ఎదుట పసిక నాగిరెడ్డి అనే వ్యక్తి తన ఇంటిలో కొద్ది రోజులుగా క్లినిక్ నడుపుతున్నాడు. అయితే మధ్యాహ్నం వరకు రోగులను పరీక్షించిన తర్వాత అతడు భార్యతో కలిసి ఇంటి వెనకున్న చెట్లకు నీళ్లు పెడుతున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి నాగిరెడ్డి ఇంట్లో చొరబడి గదిలోని బీరువా తలుపును తెరిచి 69 గ్రాముల బంగారు ఉంగరాలు, గొలుసులు, వెండివస్తువులు, రూ.10 వేల నగదు ఎత్తుకుని వెళ్లాడు. అప్పటికే మనుషుల అలికిడి విన్న దంపతులు ఇంటిలోకి ఎవరో వచ్చారని పిలుస్తూ వస్తుండగా సదరు వ్యక్తి పరారయ్యాడు. కాగా, బీరువాకు ఉన్న తాళం సాయంతో ఇంట్లోని వస్తువులు ఎత్తుకెళ్లారని గుర్తించి దంపతులు బోరున విలపిం చారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఫణిధర్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. -
రైల్వే ట్రాక్‌పై బాంబు?
కేసముద్రం (వరంగల్) : బాంబు భయంతో వరంగల్ జిల్లా కేసముద్రం, ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం రాత్రి 7.40 గంటల సమయంలో ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. ట్రాక్‌పై వైర్లు కనిపించడంతో బాంబు అమర్చినట్టు అనుమానించిన సిబ్బంది ఆ మార్గంలో సికింద్రాబాద్ వైపు వెళుతున్న ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. దాంతో మరికొన్ని రైళ్లు కూడా నిలిచినట్టు సమాచారం. -
తల్లీబిడ్డల్ని కలిపిన వాట్సాప్
కేసముద్రం(వరంగల్): తప్పిపోయిన మూడేళ్ల చిన్నారి వాట్సాప్ సహకారంతో తల్లి చెంతకు చేరిన ఘటన వరంగల్ జిల్లా కేసముద్రంలో సోమవారం వెలుగుచూసింది. కేసముద్రం గ్రామానికి చెందిన చిట్టె సునీత తన మూడేళ్ల కూతురు రచనతో తల్లిగారి ఊరైన ఉప్పరపల్లికి తండ్రితో బయలుదేరింది. తొలుత కొన్ని వస్తువులు కొనుగోలు చేసి సునీత ఆటో ఎక్కాక ఓ వస్తువు మరిచిపోవడంతో కుమార్తెను తండ్రికి అప్పగించి మళ్లీ వెళ్లింది. మూడేళ్ల రచన కూడా ఆటో దిగింది. తల్లి వెనుకే వెళ్తుందిలే అని సునీత తండ్రి భావించాడు. కానీ, చిన్నారి తల్లిని చేరుకోలేక తప్పిపోయింది. ఆ తరువాత కొద్దిసేపటికి రైల్వేస్టేషన్ లో కూర్చొని ఏడుస్తున్న రచనను కల్వలకు చెందిన దుర్గమ్మ అనే మహిళ గమనించి వెంట తీసుకెళ్లింది. నేరుగా మండల కేంద్రానికి చెందిన పీడీఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు బనిషెట్టి వెంకటేశ్ వద్దకు పాపను తీసుకెళ్లింది దుర్గమ్మ. అక్కడ పాప ఫొటో తీసి వాట్సాప్ గ్రూపులో పెట్టాడు వెంకటేశ్. ఇదే క్రమంలో బిడ్డ కోసం వెతుకుతున్న సునీతకు తారసపడిన... శ్రీహరి తన గ్రూప్‌కు వచ్చిన ఫొటోను చూపించాడు. ఆమె తన కుమార్తెనని చెప్పడంతో వెంటనే వెంకటేశ్ వద్దకు తీసుకువెళ్లి కేసముద్రం గ్రామ ఉపసర్పంచ్ మేకల వీరన్న సమక్షంలో అప్పగించారు. వాట్సాప్‌లో ఫోటో పెట్టిన వెంకటేశ్‌ను పలువురు అభినందించారు. -
కేసముద్రంలో 4 లక్షలతో పట్టుబడ్డ కాంగ్రెస్ నేత!
కేసముద్రం: జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు 4 లక్షల రూపాయలను అక్రమంగా తరలిస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిని వరంగల్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఎన్నికల తనిఖీలో భాగంగా కేసముద్రం స్టేషన్ పరిధిలోని సబ్ స్టేషన్ తండా వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రంజిత్ కుమార్ కు కాంగ్రెస్ నేత దస్రూ నాయక్ తారసపడ్డారు. ఆయన కారులో సోదా చేయగా 4 లక్షల రూపాయలను దొరికాయి. పట్టుబడిన సొమ్ముకు వివరాలు వెల్లడించకపోవడంతో కాంగ్రెస్ నేతను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న డబ్బును ఆదాయపు పన్ను అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. -
వరంగల్ జిల్లాలో పరువు హత్య
కేసముద్రం, న్యూస్‌లైన్: కూతురి ప్రేమవ్యవహారం ఇంటి పరువు తీస్తుందని భావించిన ఓతండ్రి ఆమెను కడతేర్చాడు. వరంగల్ జిల్లా కేసముద్రం మండల సీఐ వాసాల సతీష్ కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం సర్నేనిగూడెంకు చెందిన నర్ర సత్యం, జయ దంపతులు బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం కేసముద్రం మండల కేంద్రానికి వచ్చారు. అద్దె ఇంట్లో ఉంటూ, కంప్రెషర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు కాగా, పెద్ద కుమార్తెకు పెళ్లయింది. చిన్నకుమార్తె మహేశ్వరి (17) పదో తరగతి చదువు తుండగా ఓ యువకుడి ప్రేమలో పడింది. గమనించిన తండ్రి ఆమెను మందలించి, హన్మకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో చేర్పించాడు. కొద్దిరోజుల తర్వాత కూతురి సెల్‌ఫోన్‌కు ఆ యువకుడు మేసేజీలు రావడం చూసి, ఆమెను ఇంటికి తీసుకొచ్చి, మరోసారి గట్టిగా మందలించాడు. ఆమె వినిపించుకున్నట్లు కనిపించలేదు. దీంతో కూతురి ప్రేమ వ్యవహారంతో ఇంటిపరువు పోతుందని భావించిన సత్యం బుధవారం రాత్రి నిద్రిస్తున్న కూతురి మెడకు చున్నీ బిగించి చంపాడు. చున్నీని మెడకు గట్టిగా చుట్టి, దానికి మరో చున్నీని ముడివేసి మంచం కోడుపై భాగాన కట్టి ఉరివేసుకున్నట్లు చిత్రీకరించాడు. గురువారం వేకువజామున మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు బయటకు పొక్కడంతో మహబూబాబాద్ డీఎస్పీ రమాదేవి, రూరల్ సీఐ వాసాల సతీష్, ఎస్సై కరుణాకర్‌లు వచ్చి విచారణ చేపట్టారు. ఇంటి పరువు పోతుందనే తాను ఈ ఘటనకు పాల్పడినట్లు మహేశ్వరి తండ్రి సత్యం పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.