
సాక్షి, కేసముద్రం: నేటి సమాజంలో ఆడపిల్ల పుట్టిందంటే చిన్నచూపు చూడటం సహజం. అయితే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని ఓ కుటుంబంలో ఆడపిల్ల పుట్టిందని తెగ సంబరపడిపోయారు. గ్రామానికి చెందిన సవీన్, రమ్య దంపతులకు మూడు నెలల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆడపిల్ల (సమస్వి) జన్మించింది. శనివారం కూతురితో రమ్య అత్తవారింటికి వచ్చింది. తమ ఇంట మహాలక్ష్మి పుట్టిందని సంబరపడుతూ.. పూలు చల్లి ఇంట్లోకి ఘనస్వాగతం పలికారు. పూల పాన్పులో శిశువును పడుకోబెట్టి ఆనందంతో గడిపారు.
Comments
Please login to add a commentAdd a comment