
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలో ముత్యాలమ్మ బోనాల పండుగ సందర్భంగా వెంకటేశ్వర్లు అనే స్థానికుడు బుధవారం కోడిపుంజుకు చెవి కమ్మలు కుట్టించి, కోడిమెడలో మద్యం బాటిల్ వేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నాడు. ఆలయం వద్దకు వచ్చిన భక్తులంతా ఆ భక్తుడి మొక్కును ఆసక్తిగా తిలకించడంతోపాటు ఆ పుంజును చేతుల్లోకి తీసుకుని ఫొటోలు దిగారు. ప్రతి ఏటా అమ్మవారికి ఇలానే మొక్కులు చెల్లిస్తానని ఆయన తెలిపారు. – కేసముద్రం
Comments
Please login to add a commentAdd a comment