మాజీ సర్పంచ్‌ ఆత్మహత్యాయత్నం | The former Sarpanch suicide attempt at kesamudram | Sakshi
Sakshi News home page

మాజీ సర్పంచ్‌ ఆత్మహత్యాయత్నం

Published Mon, Jan 14 2019 4:51 AM | Last Updated on Mon, Jan 14 2019 4:51 AM

The former Sarpanch suicide attempt at kesamudram - Sakshi

కేసముద్రం: టీఆర్‌ఎస్‌ నుంచి తనను ఏకగ్రీవం చేయకుండా మరో వ్యక్తిని చేయడం పట్ల మనస్తాపం చెంది ఓ మాజీ సర్పంచ్‌ పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం రంగాపురం గ్రామంలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ పార్వతి కుటుంబం అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరింది. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి టీఆర్‌ఎస్‌లోకి వచ్చింది.

ఈ సారి జరిగే సర్పంచ్‌ ఎన్నికల బరిలో నిలబడేందుకు సన్నద్ధమయ్యారు. ఇదే తరుణంలో సర్పంచ్‌ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు, స్థానిక ఇతర పార్టీ నాయకులతో పార్వతి భర్తను చర్చలకు పిలిచారు. ఈ చర్చల్లో మరో అభ్యర్థిని ఎంపిక చేశారు. దీంతో తమకు అన్యాయం జరిగిందంటూ మనస్తాపానికి గురైన పార్వతి పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ మేరకు ఆమెను చికిత్స నిమిత్తం మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement