Parvati
-
మెర్సీ ప్లీజ్!
‘‘విధి కన్నెర్ర చేసి కోలుకోని దెబ్బకొట్టినా.. మనిషి తట్టుకుని నిలబడ గలుగుతాడు. కానీ అక్కున చేర్చుకుని ఓదార్చాల్సిన సమాజం ఈసడింపులు, చీదరింపులతో అసహ్యంగా చూస్తే బతకాలన్న కోరిక చచ్చిపోతుంది. కోరిక లేని మనిషికి చావు తప్ప మరోమార్గం కనిపించదు, ఇదే నా జీవితంలో ప్రస్తుతం జరుగుతోంది. కనీసం నన్ను ప్రశాంతంగానైనా చావనివ్వండి ప్లీజ్’’ అని అడుగుతోంది డాక్టర్ పార్వతీ కుమారి. జార్ఖండ్‌లోని చిన్న నగరం ధన్‌బాద్. ఇక్కడే పుట్టింది పార్వతీ కుమారి. తాతయ్య, నాయనమ్మలు, ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ల మధ్య ఆడుతూ పాడుతూ పెరిగింది. పదోతరగతి పాసై∙ఎంచక్కా కాలేజీకి వెళ్దామని అడ్మిషన్ తీసుకుంది. సరిగా అప్పుడే పార్వతికి విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఇంటిచిట్కాలు పాటిస్తూ నొప్పిని తగ్గించుకోవడానికి ప్రయత్నించింది. కానీ తగ్గకపోగా రోజురోజుకి ఎక్కువవుతూ పోయింది. ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా ఫలితం కనిపించలేదు.. ఓరోజున ఉన్నట్టుండి కోమాలోకి వెళ్లిపోయింది పార్వతి. కళ్లు తెరిచింది కానీ.... స్పృహæలేకుండా జీవచ్ఛవంలా పడి ఉన్న పార్వతి... మూడు నెలల తరువాత కోమా నుంచి బయటకు వచ్చింది. కళ్లు తెరిచి చూసింది కానీ ఏమీ కనిపించడం లేదు. సీనియర్ కంటి డాక్టర్‌కు చూపించగా...‘‘వివిధ రకాల మందుల దుష్ప్రభావం వల్ల కంటిచూపు పోయింది’’ అని చెప్పారు. పార్వతికీ, ఆమె తల్లిదండ్రులకు ప్రపంచం తలకిందులైనట్లు అనిపించింది. ఇంట్లో పార్వతి తండ్రి ఒక్కడిదే సంపాదన. ఆమె చికిత్సకు చాలా ఖర్చవడంతో అప్పుల పాలయ్యారు. ‘‘కళ్లులేని అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? బతికుంటే తల్లిదండ్రులకు భారమే అని’’ ఇరుగు పొరుగు ఈసడింపుగా మాట్లాడేవారు. పీహెచ్డీ దాకా... అనేక భయాందోళనల మధ్య ఉన్న పార్వతి మూడేళ్లు గడిపేసింది. ఆ తరువాత డెహ్రాడూన్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్’లో చేరింది. పదకొండో తరగతిలో అడ్మిషన్ తీసుకుని మొదటి మూడు నెలలు బ్రెయిలీ స్క్రిప్ట్‌ను నేర్చుకుంది. డెభ్బై రెండు శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పాసైంది. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ కాలేజీలో బీఏ, దౌలత్‌రామ్ కాలేజీలో ఎమ్.ఏ. చేసింది. తరువాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఎమ్‌ఫిల్, పీహెచ్డీ పూర్తి చేసింది. ఇలా చకచకా చదివేసి జేఆర్‌ఎఫ్‌గా సెలక్ట్ అయ్యింది. ఒక పక్క చదువుతూనే మరోపక్క సాహిత్య సేవ కూడా చేసింది. పుంజుకునేలోపే... కుటుంబ సభ్యులు, కాలేజీ లెక్చరర్లు, తోటి విద్యార్థులు, స్నేహితుల సాయంతో చదివిన పార్వతికి ఓ ఈవినింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. హమ్మయ్య ఇంతకాలానికి ఎవరి సాయం తీసుకోకుండా నా కాళ్లమీద నేను నిలబడ్డాను, ఇప్పుడు నేను కూడా నా కుటుంబ సభ్యులకు, ఇతరులకు సాయం చేయవచ్చు అనుకుని.. సంతోషంగా తన డ్యూటీ చేసుకునేది పార్వతి. కాలేజీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను పర్మినెంట్ చేసే సమయం వచ్చింది. తాను కూడా పర్మినెంట్ ఉద్యోగి అయిపోతుంది అనుకుంది పార్వతి. అయితే పర్మినెంట్ చేయడం మాట అటుంచి కనీసం కారణం కూడా చెప్పకుండా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించేశారు!! దీంతో మరోసారి తన జీవితం అంధకారమైనట్లనిపించింది. ‘‘వెలుగు కోసం వేచిచూస్తూ లైన్లో ఉన్న నన్ను మళ్లీ చీకటిలోకి ఈడ్చిపడేసారు. ఇక నాకు పోరాడే ఓపికలేదు. అందుకే కనీసం ప్రశాంతంగా చనిపోనివ్వండి’ అని ఈ దేశప్రజలు, సమాజాన్ని అడుగుతున్నాను.’’ అని తీవ్రమైన నిరాశతో పార్వతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రొఫెసర్‌గా తానేమిటో ఇప్పటికే నిరూపించుకుంది. తన కాళ్లమీద తాను నిలబడేలా చేసి ఆ కళ్లకు వెలుగు చూపిస్తే పోయేదేముంది? -
గణేష్ ఉత్సవాల్లో విషాదం.. స్టేజ్‌పైనే కుప్పకూలాడు
వైరల్: మనిషి జీవితం.. ఈరోజుల్లో నీటి బుడగలా మారిపోయింది. సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ రికార్డింగ్‌ల వల్ల.. ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు చాలామట్టుకు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు నాటక సమయంలోనే స్టేజ్‌పై కుప్పకూలి కన్నుమూశాడు. గణేష్ ఉత్సవాల సందర్భంగా.. యోగేష్ గుప్తా అనే ఆర్టిస్ట్ పార్వతి దేవి గెటప్ వేసి నాటకంలో పాల్గొన్నాడు. నాటకంలో భాగంగా నృత్యం చేసిన యోగేష్.. ఉన్నట్లుండి కింద పడిపోయాడు. అదీ నాటకంలో భాగమే అనుకుని పొరపడిన శివుడి పాత్రధారి యువకుడు.. దగ్గరగా వచ్చి లేపబోయాడు. కానీ, యోగేష్‌లో చలనం లేదు. దీంతో నిర్వాహకులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే యోగేష్ గుండెపోటు మృతి చెందినట్లు నిర్ధారించారు. దేశవ్యాప్తంగా గత కొన్నిరోజలుగా ఇలాంటి ఆకస్మిక మరణాలకు సంబంధించిన ఉదంతాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మలయాళం దిగ్గజ గాయకుడు ఎడవ బషీర్ సైతం ఇలాగే మే 28వ తేదీన అలపుజ్జాలో ప్రదర్శన ఇస్తూ కుప్పకూలి మృతి చెందారు. అలాగే.. ఈ ఏడాది జూన్‌లో ప్రముఖ సింగర్ కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే.. ప్రదర్శనలో ఇబ్బందిగా ఫీలై.. ఆ తర్వాత గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. వీళ్లే కాదు.. చాలా చోట్ల ఇలా మరణించిన ఘటనల తాలుకా వీడియోలు వైరల్ కావడం చూశాం. #WATCH | One more youth died with cardiac arrest..! Youth named #YogeshGupta who was performing the role of Maa Parvati during a Jagran in Bishnah Tehsil of #Jammu collapsed while dancing and died. He suffered a cardiac arrest. pic.twitter.com/dMRsy8M7up — Subodh Kumar (@kumarsubodh_) September 8, 2022 -
అన్నపూర్ణ అనుగ్రహం ఉంటే ఆకలి ఎందుకు ఉంటుంది ?
కైలాసంలో పరమశివుడు ప్రగాఢ ధ్యానంలో లయించి ఉన్నాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన పార్వతీదేవి ఏదో ఆటగా శివుని కళ్ళు మూసి ఆనందపడింది. పరమేశ్వరుని కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు. అందువలన తక్షణమే అంధకారం సమస్త లోకాలను అలముకుంది. జనులు తల్లడిల్లి పోయారు. అది చూసి పరమశివుడు " దేవీ! ఏం పని చేశావు నువ్వు? అదిగో! లోకులం దరూ అంధకారంలో కొట్టుమిట్లాడుతున్నారు, గమనించావా?" అన్నాడు. అంతా చీకటి మయం కావడంతో నానా ఇబ్బందులు పడడం పార్వతీదేవి కళ్ళారా చూసింది.ఆమె బాధ పడింది. " నాథా! తెలియక చేసిన నా అపరాధాన్ని క్షమించండి. ఈ అంధకారం పోయి వెలుతురు వచ్చే మార్గం చూడండి " అంది పార్వతిదేవి. వెంటనే శివుడు తన పాలనేత్రం తెరిచాడు. జగమంతా వెలుతురుతో నిండి పోయింది. భూలోకంలో ప్రజలు తమ దిన చర్యలో పడ్డారు. పార్వతీదేవి తను తప్పు పని చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోనెంచి తను కొంతకాలం తపస్సు చేస్తానంటు భర్త అనుమతి కోరింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో నీవు లోకమాతవు నీకు పాపం అంటదు. తపస్సుకి వెళ్ళనవసరం నీకు లేదు అని అన్నాడు. ఆమె భర్తతో ఏకీభవించలేదు. దేవతలైనా మనుషులైనా తప్పుకు ప్రాయశ్చిత్తం అవసరమే. ఆ ధర్మమాన్ని మనమే అతిక్రమిస్తే లోకులు మనలనే అనుసరిస్తారు, పాపం పెరిగి పోతుంది అంది హిమరాజతనయ. పార్వతీదేవి భర్త అనుమతి తీసుకుని ఆకాశ మార్గానికి దక్షిణ దిశకు బయలు దేరింది. కాశినగరం మీదుగా వెళ్తూ ఉంటే భూలోకవాసులు ఆకలితో అలమ టించడం ఆమె కంట పడింది. రెండు సంవత్సరాలుగా వర్షాలు లేని కారణంగా క్షామం నెలకొని ఉంది. వారి ఆకలి బాధ చూడలేక అక్కడ దిగి ఒక భవనాన్ని నిర్మించుకొని అన్నపూర్ణ అన్న పేరుతో వంటలు వండి వారికి కడుపు నిండుగా భోజనాలు పెట్టసాగింది. కాశిరాజుకి ఈ విషయం తెలిసి ఎవరీ అన్నదాత అని ఆశ్చర్యపోయాడు. అతని కోశాగారంలో బంగారం, వెండి అమూల్య రత్నాలు నాణేలు ఉన్నాయి. కొందామన్నా ఆహార దినుసులు అంగళ్ళలో లేవు. కాశిరాజు ఆ మాతృమూర్తిని చూడాలని వెళ్ళాడు. కోరినంత ధనం ఇస్తాను, ధాన్యాదులు ఇవ్వమంటాడు. ఆమే నేను అమ్మడానికి రాలేదు.మీరందరు నా సంతానం. మీ ఆకలి బాధ తీర్చడానికి వచ్చాను. నువ్వూ పంక్తిలో కూర్చుని తిను అంది ఆమె. " అమ్మా ! మీరు సామాన్య మానవమాత్రులు కారు. చెప్పండి మీరే దేవతో " అన్నాడు రాజు. ఆమె నిజ అవతారం దాల్చి నేను అన్నపూర్ణను అంది. "అమ్మా! అన్నపూర్ణేశ్వరీ! మీరు స్థిరంగా కాశినగరంలో ఉండిపోవాలని నా ప్రార్ధన" అన్నాడు. అది సాధ్యం కాదు నేను తపస్సు కని కైలాసం నుంచి వస్తున్నాను. కొంత కాలం తరువాత పరమేశ్వరునితో పాటు వచ్చి వుంటాను. ఇక మీదట కాశి నగరంలో కరువుకాటకాలు ఉండవు అంటూ అన్నపూర్ణ అంతర్ధానమైంది. అప్పుడే అక్కడ వర్షం మొదలైంది. అన్నపూర్ణ అనుగ్రహం ఉంటే ఆకలి ఎందుకు ఉంటుంది? -గుమ్మా ప్రసాద రావు చదవండి: అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఉత్తరాయణంలో ఈ వృధా ప్రయత్నాలు ఇకనెందుకు? -
ఫుటేజ్‌ను తీయించే వరకు విశ్రమించను
బేబీగా ఎవరికి కనిపిస్తాం? అమ్మానాన్నకే కదా! చిన్నప్పుడే కాదు, ఇప్పుడూ. ఆ ఫొటోలు బైట పెడతామా? గర్ల్స్ మీకే..! ‘ఒక స్మైల్ రా కన్నా..’ అనగానే.. స్టిల్ ఇచ్చేయకండి. వీడియోలోకి వెళ్లిపోకండి. బాయ్‌ఫ్రెండ్ మంచివాడే. అమ్మానాన్న అయితే కాడు. అనుమానిస్తే ఏం పోయింది? నమ్మితేనే కదా ఏదైనా! ఇంటర్నెట్ను.. మీ.. బేబీ అల్బమ్ కానివ్వకండి. అమ్మానాన్న జాగ్రత్త. ఐదేళ్ల ‘లా’ కోర్సు నాలుగో సంవత్సరంలో ఉన్న సోనా అబ్రహాం ఆరేళ్లుగా ఇంటర్నెట్ నుంచి తన వీడియో క్లిప్పులను తీయించడం కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. 2013లో పద్నాలుగేళ్ల వయసులో ఆమె నటించిన ‘ఫర్ సేల్’ అనే మలయాళీ చిత్రంలోని రేప్ సీన్ వీడియో క్లిప్పులు అవి! ఒక మైనరు బాలికపై కొందరు అత్యాచారం చేస్తారు. దానిని వీడియోలో చిత్రీకరించి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. అది చూసి ఆ బాలిక అక్క ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదీ ఆ సినిమా కథ. మైనరు బాలిక పాత్రను సోనా వేసింది. ఆ సీన్‌ని హ్యాండ్ కెమెరాతో ప్రైవేట్‌గా షూట్ చేశారు. సినిమాలో పది సెకన్లు ఉంటుంది. ‘‘అవసరం అయినంత వరకే వాడుకుని మిగతా ఫుటేజ్‌ని డిలీట్ చేస్తాం’’ అని డైరెక్టరు, నిర్మాత చెప్పారు. సోనా నమ్మింది. సోనా తల్లిదండ్రులూ నమ్మారు. ఏడాది తర్వాత ఆ ఫుటేజ్ (సినిమాలో వాడగా మిగిలిన భాగాలు) యూట్యూబ్‌లో ప్రత్యక్షం అయింది! అంటే వాళ్లు డిలీట్ చేయలేదు. పైగా లీక్ చేశారు. యూట్యూబ్ నుంచి పోర్న్ సైట్‌కు కూడా ఫుటేజ్ చేరిపోయింది! సోనా వణికిపోయింది. తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు తల్లడిల్లిపోయారు. కూతుర్ని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దురదృష్టం.. ఇప్పటికీ ఆ క్లిప్పులు నెట్లో ఎక్కడో ఒక చోట పైకి లేస్తూనే ఉన్నాయి. సోనాకు ఒకటి అర్థం అయింది. మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాలను పోలీసు వ్యవస్థ కూడా ఆపలేకపోతోందని. అయినా నిస్పృహ చెందలేదు. ‘‘ఆనవాళ్లు కూడా లేకుండా క్లిప్పును తీయించేవరకు నేను విశ్రమించను’’ అని అంటున్నారు. అమ్మానాన్న ఆవేదన తీర్చడం ముఖ్యం అనుకుంది. ∙∙ ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ సంస్థ చేపట్టిన ‘రెఫ్యూజ్ ది అబ్యూజ్’ అనే ప్రచారోద్యమం కోసం.. టీనేజ్‌లో తనకు జరిగిన ఆ నమ్మకద్రోహం గురించి సోనా బహిర్గతం చేసినప్పుడు గానీ ఈ విషయం బయటికి రాలేదు. ఇంతకాలం సోనా ఒంటరిగానే పోరాడుతూ వస్తున్నారు. పోలీసులు కూడా చేసిందేమీ లేదు. వీడియో క్లిప్పులు లీక్ అయ్యేలా అలక్ష్యాన్ని ప్రదర్శించిన ఆ నిర్మాత, దర్శకుడు తేలిగ్గానే తప్పించుకున్నారు. సోనా తల్లిదండ్రులు 2014లో ఎర్నాకుళం సిటీ పోలీస్ కమిషనర్‌ను కలిసి కూతురి షూటింగ్ ఫుటేజ్ యూట్యూబ్‌లో రాకుండా చేయమని వేడుకున్నారు. యూట్యూబ్‌కి కమిషనర్ లెటర్ పెట్టినట్లున్నారు. తాత్కాలికంగా అయితే డిలీట్ అయింది. ఆ వెంటనే పోర్న్ సైట్లలోకి, సోషల్ మీడియాలోకి వ్యాపించింది! సోనాకు డైరెక్టర్ రేప్ సీన్‌ను వివరిస్తున్న ఆడియో కూడా ఆ వీడియోకు జత అయి ఉంది. దాంతో అది మామూలు సినిమాకు కాకుండా.. పోర్న్ కోసం చేసిన షూటింగ్‌లా ఉంది. టెన్త్ నుండి ఇంటర్‌కు ఆమెతో పాటు ఆ క్లిప్పులు కూడా వచ్చి జాయిన్ అయ్యాయి! ‘తనే ఆ వీడియోలో ఉంది’ అనే గుసగుస క్లాస్ రూమ్‌లో, కాలేజ్‌లో ఏదో ఒక మూల నుంచి వినిపించేది. గట్టి అమ్మాయి కాబట్టి తట్టుకుని నిలబడింది. ‘‘నమ్మకద్రోహం చేసిన వాళ్లది నేరం అవుతుంది తప్ప, నమ్మి మోసపోయిన వాళ్లది కాదు’’ అని అమ్మానాన్న సోనాను ఊరడిస్తూనే ఉన్నారు. వాళ్లిచ్చిన మానసిక స్థైర్యంతో చదువు మీద దృష్టి పెట్టింది. ‘లా’ చదువుతూనే నటిగా, మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్గా గుర్తింపు సంపాదించింది. ఆ గుర్తింపు ఆమె ‘గతానికి’ భవిష్యత్తు లేకుండా చేసింది. క్లిప్పుల గురించి ఎవరూ మాట్లాడ్డం లేదు. అయితే తను మాత్రం సైబర్ నేర ప్రపంచాన్ని ఊరికే వదిలిపెట్టదలచుకోలేదు. అమాయకులైన ఎందరో అమ్మాయిలను వలలో పడకుండా చేయడానికి, పడితే బయటికి రప్పించడానికి న్యాయశాస్త్రాన్ని ఒక పదునైన ఆయుధంగా మలచుకోబోతున్నారు. ఆమె కేసు ఇప్పుడు హైకోర్టులో ఉంది. కేరళ ఉమన్ కమిషన్ ఆమెకు అండగా ఉంది. కేరళ పోలీస్ హై టెక్ సెల్ ఇంటర్నెట్ నుంచి సోనా క్లిప్పులను సమూలంగా నిర్మూలించేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె ఇప్పుడు న్యాయ విద్యార్థిని మాత్రమే. బాలికలు, మహిళలకు సైబర్ అకృత్యాల నుంచి గట్టి రక్షణ కంచెను నిర్మించబోతున్న భవిష్యత్ న్యాయవాది. తన తల్లిదండ్రుల్లా ఇంకొకరు మానసిక క్షోభ పడకూడదని తీర్మానించుకున్న అమ్మాయి. పోరాటం ఆపను మొదట నా వీడియోలు నెట్లో కనిపించినప్పుడు నా జీవితం ముగిసినట్లే అనిపించింది. అందరూ నన్నే చూస్తూ, నా గురించే మాట్లాడుకుంటున్నారన్న భావన! ‘నాకిలా కావలసిందే’ అనుకున్నాను. నన్ను దోషిగా భావించుకున్నాను. తర్వాత ఆలోచిస్తే, ఇందులో నేను చేసిన తప్పేముంది అనిపించింది. ‘తల వంచుకోవలసింది, అవమాన పడవలసిందీ నేను కాదు’ అనుకున్నాను. న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాను. నా కోసమే కాదు, నాలా మోసపోతున్న అమ్మాయిల కోసం కూడా. – సోనా అబ్రహాం అభినందనలు సోనా సోనా.. జీవితం నరకప్రాయం అవడం అంటే ఏమిటో నేను ఊహించగలను. అమ్మాయిల్ని నిరంతరం ఇలాంటి నరకాలు వెంటాడుతూనే ఉంటాయి.. మన ప్రమేయం ఏమీ లేనివి, నమ్మి మోసపోయినందుకు అనుభవించేవీ! మన ధైర్యమే మన పోరాట శక్తి. నువ్వు ఒక్కరివి, ఒంటరివి కాదు. నీ వైపు నేనున్నాను. నువ్వు చూపుతున్న మనోబలానికి సాటి మహిళగా అభినందనలు, ధన్యవాదాలు. – నటి పార్వతి -
జాతరను తలపిస్తున్న పార్వతి బ్యారేజి ప్రాంతం
-
ముద్దమందారం పార్వతి
పార్వతి ఓ పల్లెటూరి పేదింటి అమ్మాయి. కలవారింటి కోడలు అవుతుంది. పెద్దంటి కోడలిగా ఆ ఇంట్లో ఆమె ఎదుర్కొనే సంఘటనలతో ముద్దమందారం సీరియల్ జీ తెలుగులో ప్రసారమవుతోంది. ఈ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పార్వతిగా పరిచయం అయ్యింది తనూజ. ఈ బెంగుళూరుమందారం తెలుగింటి సింగారంగా ఎలా మారిందో ముచ్చటగా చెప్పుకొచ్చింది తనూజ. ‘‘పార్వతిగా ఇది నా డ్రీమ్ క్యారెక్టర్. సీరియల్లోకి నేను రాకముందే ఒక పల్లెటూరి అమ్మాయిలాంటి క్యారెక్టర్ని చేయడం ఎంత బాగుంటుందో కదా అనుకునేదాన్ని. ఈ మాట మా అమ్మతో తరచూ చెబుతుండేదాన్ని. ‘ముద్దమందారం’లో పార్వతి స్టోరీ చెప్పినప్పుడు మొదట నాకు అంతగా అర్ధం కాలేదు. అప్పుడు నాకు తెలుగు రాదు. ఆఫర్ వచ్చింది కదా అని క్యాజువల్‌గా ఓకే చేశాను. నిజానికి అప్పటికి ఇండస్ట్రీ గురించే అంతగా ఐడియా లేదు. అంతా కొత్త. తర్వాత్తర్వాత యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక్కోటి నేర్చుకుంటూ, కథ తెలుసుకుంటూ, నటిస్తూ.. క్యారెక్టర్లో లీనమైపోయా. పార్వతిగా మారిపోయా. చాలా మంది ఎంతో గొప్పగా పొగుడుతుంటారు. సలహాలు ఇస్తుంటారు. ఇప్పుడు మరో సీరియల్ చేస్తే ‘పార్వతి’గా ఉన్నప్పటి ఫాలోవర్స్ తర్వాత ఉంటారా అని భయపడుతుంటాను. టీచర్ అవ్వమన్నారు నేను పుట్టి, పెరిగింది అంతా బెంగుళూరులోనే. ముందు మా ఇంట్లో వాళ్లెవరికీ నేనీ ఫీల్డ్‌లోకి రావడం ఇష్టం లేదు. వద్దు మనకీ యాక్టింగ్ అనేవారు అమ్మనాన్న. ‘చదువులో ముందుంటున్నావు. బాగా చదువుకో, టీచర్ లేదా లెక్చరర్ అవ్వు’ అనేవారు నాన్న. హాబీ కోసం డ్యాన్స్ నేర్చుకునే టైమ్‌లో ఉదయం టీవీలో యాంకర్‌గా చేశాను. ఆ సమయంలోనే కన్నడలో ఓ షార్ట్ హారర్ మూవీలో నటించాను. అది తెలుగులో ‘చిత్రం కాదు నిజం’గా డబ్ అయ్యింది. మంచి పేరొచ్చింది. అప్పుడే ఈ తెలుగు సీరియల్ ఆఫర్ వచ్చింది. క్యాజువల్‌గా వెళ్లి కలిస్తే సెలక్ట్ అయ్యాను. దీంతో ఇంట్లో వాళ్లను ఒప్పించి ఈ ఫీల్డ్కి వచ్చాను. షార్ట్‌ఫిల్మ్, ఈ సీరియల్ బాగా హిట్టవడంతో అమ్మానాన్నలు ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. అప్పట్లో వాళ్లు భయపడినంతగా ఇక్కడ ఎలాంటి నెగిటివిటీ లేదు. నా పర్సనల్ ఫ్యామిలీకన్నా సీరియల్ ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఎక్కువ అయిపోయింది. సీరియల్ అయిపోతే ఇంత పెద్ద, మంచి ఫ్యామిలీని మిస్ అవుతాను కదా అనిపిస్తుంటుంది. ఈ ఇండస్ట్రీలోనే ఉండాలని వచ్చినదాన్ని కాదు. ఎలాగో వచ్చాను, నా టాలెంట్‌ను చూపించుకోవాలని కృషి చేస్తున్నాను. ఇప్పుడు మరో తమిళ ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇదే నా బ్యూటిఫుల్ జర్నీ అనీ నమ్మి, వర్క్స్ చేసుకుంటూ వెళుతున్నాను. నాదైన ప్రపంచం మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ షూటింగ్‌కి కూడా రారు. ‘నీ ఓపికకు ఓ దండం తల్లీ’ అనేస్తారు. కారణం, ఉదయం ఏడు గంటలకు షూటింగ్ స్పాట్‌కి వెళితే తిరిగి ఎప్పుడు ఇల్లు చేరుకుంటానో నాకే తెలియదు. అలా ఉంటుంది వర్క్షెడ్యూల్. అయినా, ఇంకా వర్క్ కావాలి అనుకుంటున్నాను. బయటి ప్రపంచాన్ని మిస్ అవుతున్నాను అనే భావనే లేదు. నాదైన ఒక ప్రపంచం ఈ ఇండస్ట్రీలోనే ఉంది. పేరెంట్స్‌ని మిస్ అవుతున్నాను అని చెబితే చాలు... వాళ్లు బెంగుళూరు నుంచి వచ్చి ఓ రోజు టైమ్ స్పెండ్ చేసి వెళ్లిపోతారు. ‘మీరు ఈ రోజు సీరియల్లో కాస్త డల్‌గా అనిపించారు. ఎండ ఎక్కువ ఉంది, కేర్ తీసుకోండి’ అని నా ఫ్యాన్స్ చెబుతుంటారు. చాలా ఆనందంగా ఉంటుంది. మరో అదృష్టం ఏంటంటే ఎక్కడకు వెళ్లినా నన్ను అమ్మలా చూసుకునే వాళ్లు దొరుకుతారు. ఇప్పుడు హరిత(అఖిలాండేశ్వరి పాత్రగా నటిస్తున్న హరిత)మ్మ ‘ఇది తిను, కాసేపు రెస్ట్ తీసుకో’.. అని చెబుతుంటారు. డైరెక్టర్, కెమరామెన్.. ఇలా ప్రతి ఒక్కరూ నా గురించి కేర్ తీసుకుంటారు. ముగ్గురు లక్ష్ములు అమ్మానాన్నలకు ముగ్గురం ఆడపిల్లలం. అక్క అనూజ లాయర్, నేను యాక్టర్, చెల్లి పూజ ఇంజనీయర్. మా అమ్మ నాన్న ‘మా ముగ్గురు లక్ష్ములు’ అని గర్వంగా చెబుతుంటారు. మా అమ్మను ఎప్పుడైనా అడుగుతాం ‘ముగ్గురం ఆడపిల్లలమే కదా, మగ పిల్లలు పుడితే బాగుండు అనుకున్నారా!’ అని. అప్పుడు అమ్మ ‘నేను అమ్మాయిలు పుట్టాలనే మొదటి నుంచీ దేవుళ్లకు మొక్కుకున్నాను. మీరు అబ్బాయిలకన్నా ఎందులో తక్కువ’ అంటుంది. అప్పుడైతే చాలా గర్వంగా అనిపిస్తుంటుంది. నాకు కూడా ఫ్యూచర్లో ఆడపిల్లే పుట్టాలని కోరుకుంటాను మా అమ్మ లాగ. కొంచెం మోడ్రన్ ముందు నుంచీ కాస్ట్యూమ్స్ది నాదే బాధ్యత అన్నారు. అందుకే, నా క్యారెక్టర్ మొదట ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉండేలా జాగ్రత్తపడుతున్నాను. కాస్ట్యూమ్స్ విషయంలో మా మమ్మీకి థాంక్స్ చెప్పాలి. మా మమ్మీవి కొత్త కొత్త చీరలన్నీ వచ్చేటప్పుడు దొంగతనంగా తెచ్చేసుకుంటాను (నవ్వుతూ). అమ్మ ఫోన్‌చేస్తుంది ‘పెళ్లికి వెళ్లాలని తీసుకున్నాను, నువ్వు తీసుకెళ్లావా?’ అంటుంది. మా సీరియల్లో కూడా ఈ రోజు పెళ్లి ఉందని నవ్వేస్తాను. అమ్మ కూడా నవ్వేస్తుంది. మా చెల్లెలు పూజ నాకు కాస్ట్యూమ్ విషయంలో, హెయిర్ స్టైల్స్ విషయంలో సూచనలు ఇస్తూ ఉంటుంది. నాకు ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ పెద్దగా ఏమీ లేవు. ఇక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి. వాటిలో మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు పల్లెటూరి అమ్మాయిలా యాక్ట్ చేస్తున్నాను. నెక్ట్స్ సీరియల్లో కొంచెం మోడ్రన్ అమ్మాయిలా క్యారెక్టర్ వస్తే బాగుండు అనుకుంటున్నాను.’ – నిర్మలారెడ్డి -
ఆదిభిక్షువు అన్నపూర్ణ
పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులే కాదు, ఆది ప్రేమికులు కూడా. ఇద్దరి సంపదలు సమానం కావు. ఇద్దరి రూపురేఖలు ఒకటి కావు. ఆగర్భ శ్రీమంతురాలు పార్వతి. శ్మశానంలో తిరుగుతూ కపాలంలో భిక్షాటన చేసే కడు నిరుపేద శివుడు. ఆ మాత్రానికే శివుడి కోసం పార్వతి తపస్సు చేసింది. తన జుట్టంతా ఎర్రగా చిక్కులు పడిపోయినా, తన చెక్కిళ్లు వాడిపోయినా తపస్సు వీడక, మునుల ప్రశంసలు పొందింది. పైపెచ్చు తల్లిదండ్రుల అనుమతితోనే శివుడికోసం ఆ తపస్సును ఆచరించింది! ఎందుకు అంత కష్టపడింది పార్వతి? హిమవంతుడు చిటికె వేస్తే సంపన్నులు, సుందరాకారులు వరుసలో నిలబడతారు. అయితే సంపదలకు, బాహ్య సౌందర్యానికి ఆశపడలేదు పార్వతి. తనతో సమానమైన పరిజ్ఞానం కలిగినవాడే తనకు భర్త కావాలనుకుంది. ఆకులను కూడా రుచి చూడకుండా తపస్సు చేస్తూ ‘అపర్ణ’ అయ్యింది. అందుకే శివపార్వతుల కల్యాణం లోకకల్యాణమైంది. శివపార్వతులు ఆదర్శ దంపతులయ్యారు. ఆ ఆదిభిక్షువు, ఈ అన్నపూర్ణ తమ పెళ్లినాటి సందర్భాలను సంభాషించుకుంటే ఎలా ఉంటుందనే ఊహకొక సృజనకథనమిది. ►పార్వతి: స్వామీ! మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి నేను ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా! ►శివుడు: అంత కష్టపడటం ఎందుకు? మీ తల్లిదండ్రులు నా కంటే యోగ్యులను తీసుకువచ్చి నీ వివాహం ఘనంగా జరిపించేవారు కదా! ►పార్వతి: స్వామీ! మీరే కావాలని నేను ఎందుకు తపస్సు చేశానో మీకు తెలియదా! ►శివుడు: తెలియకేం.. నీ మనసు తెలుసుకోవాలనే కదా, నేను బ్రహ్మచారి వేషంలో నీ దగ్గరకు వచ్చాను. ►పార్వతి: స్వామీ! నన్ను పరీక్షించడం కోసం మిమ్మల్ని మీరు ఎన్నిరకాలుగా నిందించుకున్నారో కదా! మీకు శివుడు తెలుసన్నారు. నేను ఎంత తపస్సు చేసినా ఆయన నాకు ప్రత్యక్షమవ్వకుండా, నన్ను అవమానం చేశాడన్నారు. శ్మశానంలో నివసించేవానితో వివాహం ఏమిటని కూడా వారించారు. ►శివుడు: అవును పార్వతీ! నాకు అన్నీ గుర్తున్నాయి. వివాహం చేసుకునే ముందు ఇద్దరి మనసులు కలవాలి, ఇద్దరి భావాలు కలవాలి. నీ ఉద్దేశం ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. ►పార్వతి: చేతి కంకణం గురించి మీరు అన్న మాటలు నేటికీ నేను మరచిపోలేకపోతున్నాను. మంగళకరమైన వివాహ కంకణం ఉన్న నా చేతిని.. పాము కడియంగా ఉన్న చేతితో పట్టుకోవాలని, అది ఓర్చుకోవడం కష్టమని, ఆలోచించుకోమని నన్ను మీరు భయపెట్టారు. ►శివుడు: మరో మాట కూడా అన్నాను గుర్తుందా. శివుడిని వివాహమాడితే రక్తం కారే తోలుకి, హంసలు చిహ్నంగా ఉన్న పట్టు చీరకు కొంగుముడి వేయాలని. అలాగే ‘మంచి భవనంలో పువ్వుల మీద లత్తుక చిహ్నాలుగా ఉంచడానికి అర్హములైన నీ పాదాలు, వెంట్రుకలు వ్యాపించి ఉన్న కాటిలో ఉంచడానికి పగవాడు సైతం అంగీకరించడు కదా’ అని నీకు జుగుప్స కలిగేలా మాట్లాడాను. ►పార్వతి: గుర్తుంది. నేనేమన్నానో కూడా గుర్తుంది కదా. కీడును పోగొట్టి, సంపదలు కలగడానికి మంగళకరమైన చందనాలు ధరిస్తారు. అవి మళ్లీ కోరికలను పుట్టిస్తాయి. కోరికలే లేనివాడైన శివుడికి వీటితో పని ఏంటి? అన్నాను. అంతేనా ఆయన ధరించిన కాటి బూడిద పవిత్రమైనది కాబట్టే, ఆ బూడిదను దేవతలు శిరస్సు మీద ధరిస్తున్నారని కూడా చెప్పాను కదా. ►శివుడు: నా వాహనం గురించి నేను చెప్పిన మాటలు నీకు గుర్తున్నాయి కదా పార్వతీ! ఏనుగుపై ఊరేగవలసిన నువ్వు ముసలి ఎద్దు వాహనం మీద ఊరేగుతూంటే, మహాజనులంతా నవ్వుతారని చెప్పాను కదా. ►పార్వతి: అందుకు నేను చెప్పిన సమాధానం మరోసారి గుర్తు చేస్తాను స్వామీ. ఐరావతం ఎక్కి తిరిగే ఇంద్రుడు.. పేదవాడై ఎద్దుని ఎక్కి తిరిగే శివుyì కి నమస్కరిస్తున్నాడు అన్నాను. అయినా మీరు అక్కడితో ఆగారా! ఇంకా ఎన్నెన్ని వ్యంగ్యాలు మాట్లాడారు. కండ్లు చక్కనివాడు కాదని, దిసమొల వాడని, శాస్త్రం తెలిసినవాడు కాదని, ఒకటి కాకపోతే ఒక్కటైనా నాకు సరితూగే లక్షణాలు శివుడిలో లేవని చెప్పారు. శివుడిని వివాహం చేసుకునే ప్రయత్నం మానుకోమని కూడా సెలవిచ్చారు. ►శివుడు: అయ్యో! నేనెలా మరచిపోతాను పార్వతీ! బ్రహ్మచారి వేషంలో నేను అలా శివుడికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, నీ కనుబొమలు వంకరయ్యాయి, కండ్ల కొనలు ఎర్రబారాయి, కళ్లు అడ్డంగా తిప్పావు. (ఇష్టం లేని మాట వింటే ఉండే లక్షణాలు). నీ çసమాధానాలకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది పార్వతీ! నీ పరిజ్ఞానంతో ఎంత చక్కటి సమాధానాలు పలికావు. అంతేనా, నా పుట్టుక గురించి వారు నిందిస్తే, దానికి కూడా ఎంత బాగా సమాధానం చెప్పావు నువ్వు. ►పార్వతి: నాకు పొగడ్తలు అక్కరలేదు కానీ, వారు నిందించినా సత్యమే పలికారు. స్వయంభువు అయిన మీ జన్మ మీకు ఎలా తెలుస్తుంది? స్వేచ్ఛగా తిరిగేవారైన మీరు లోకులు ఏమనుకుంటారో అని భయపడరు. ఒకరికి భయపడవలసిన అవసరం మీకు లేదు. ►శివుడు: నువ్వంటే ఒక్క విషయంలో నాకు చాలా గర్వం పార్వతి. నువ్వు ఎన్నో క్లేశాలు అనుభవించి తపస్సు చేశావు. నిన్ను మునులు కీర్తిస్తుంటే నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా. ►పార్వతి: అయ్యో! స్వామీ! మునుల ఆశీర్వాద బలంతోనే కదా నేను తపస్సు ఆచరించగలిగాను. ►శివుడు: పార్వతీ! చివరగా ఒక్కమాట అంటున్నాను, ‘ఈ రోజు మొదలు నీ తపస్సులచే దాసుడనైతిని’ అంటూ పార్వతిని తన శరీరంలో సగ భాగం చేసి అర్ధనారీశ్వరుడయ్యాడు. అలా వారు ఆదిదంపతులయ్యారు. అలా వారి ప్రేమ ఆదర్శదాయకం అయింది. అలాగే ప్రేమికులకు వారి ప్రేమ మార్గదర్శకం కావాలి. వైజయంతి పురాణపండ -
నిధి చాల సుఖమా!
త్యాగరాజు జీవితంలో ఎన్నడూ ఉద్యోగం చేయలేదు. ఒకరి దగ్గరకు వెళ్ళి చేయిచాపలేదు. తెల్లవారిలేస్తే సంధ్యావందనం చేసుకోవడం, కావేరీ నది ఒడ్డుకు వెళ్ళడం, అక్కడినుంచి వచ్చి భాగవత, రామాయణాలు, భగవద్గీతలు చదువుకోవడం. మధ్యాహ్నమయిన తరువాత కీర్తనలు చేసుకుంటూ ఉంఛవృత్తి చేసుకోవడం... అంటే తనవద్ద ఇంట్లో ఎంతమంది శిష్యులు సంగీతం నేర్చుకోవడానికి వచ్చారో వారి ఉదరపోషణకు సరిపడా పదార్థాల్ని సేకరించడానికి ఎన్ని ఇళ్ళ ముందుకు వెళ్ళి చేయి చాపవలసి వస్తే అన్ని ఇళ్ళ వద్దకు వెళ్ళి కీర్తనలు చేయడం, పెట్టినవారూ ఒకటే, పెట్టనివారూ ఒకటే. పదార్థాలు సరిపడా సమకూరాయనిపించగానే తిరిగి వచ్చి భార్య కమల (పెద్దభార్య పార్వతి శరీరం విడిచి పెట్టిన తరువాత తల్లి బలవంతం మీద ఆమె చెల్లెలు కమలను చేసుకున్నారు. వారికి ఒకే సంతానం –సీతామహాలక్ష్మి) వాటిని వండి సిద్ధం చేసేది. దానిని త్యాగరాజుగారు రామచంద్రమూర్తికి నివేదించి తాను, తన కుటుంబం, శిష్యులు స్వీకరించేవారు. దాచుకోవడం చేతకాదు. చెట్టును ఆశ్రయిస్తే, గోత్రనామాలు అడగకుండా నీడ ఎలా ఇస్తుందో అలా ఆయన పాదాలను ఆశ్రయించిన ప్రతివారికీ సంగీత విద్యను నేర్పేవారు. అలా జీవించిన త్యాగరాజు గారికి ఏం లోటు? ఎందరో మహారాజులు ఎలాగయినా వారిని తమ సన్నిధానానికి తెచ్చుకోవడానికి విఫల యత్నాలు చేసారు. తంజావూరు మహారాజయితే మారువేషాల్లో వచ్చి ఆయన కీర్తనలు విని ఆనందిస్తూండేవారు. ఒకరోజు ఆయన జోలెపట్టి వెడుతుంటే దానిలో బంగారు కాసులు వేసారు, ఏం చేస్తారో చూద్దామని. బంగారు కాసులు పడడం చేత ఈవేళ ఈ ఆహారం తినడానికి అయోగ్యమయిందని త్యాగరాజు దానిని మొత్తం తీసుకెళ్ళి చెత్తకుప్పలో వేసారు. ‘నిధి చాల సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా...’’ అని కీర్తన చేసారు. పక్కింట్లోనే అన్నగారు జపేశుడు ఉండేవారు. ఎంతసేపటికీ ఈ విగ్రహాలు పెట్టుకుని, మహారాజులు బహుమతులు ఇచ్చినా పుచ్చుకోనంటున్నాడని కోపమొచ్చి ఆ విగ్రహాలు పోతే తప్ప తమ్ముడికి బంగారం మీద మమకారం కలగదని ఎవరూ చూడకుండా వాటిని తీసుకెళ్ళి కావేరీనదిలో పారేసాడు. వాటికోసం త్యాగయ్య రాత్రింబవళ్ళు పరితపించిపోయి ‘నిన్ను ఎందని వెదకను హరీ...’’ అని కీర్తన చేసాడు. తన ఇష్టదైవం కలలో కనపడి కావేరీ నదిదగ్గరకు రమ్మనమని ఆదేశిస్తే అక్కడ నీటిలో తేలియాడుతూ వచ్చాయి విగ్రహాలు. వంద రెండొందల సంవత్సరాల క్రితం నాటివి ఈ సంఘటనలు.పరమేశ్వరుడున్నాడనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు వీరి జీవితాలు. మనమయితే ఇంట్లో విగ్రహాన్ని పెట్టి పూజచేస్తే... కేవలం విగ్రహంగానే చూస్తాం. దీపం వెలిగించేటప్పడు పొరబాటున చెయ్యి తగిలి విగ్రహం కింద పడ్డా తిరిగి నిలబెట్టి పూజ చేసుకుని వచ్చేస్తాం. త్యాగరాజు అలాకాదు. ఆ విగ్రహాలు కావేరీ నదిమీద తేలుతూ వస్తే...‘‘సుకుమార రఘువీర రారా మా ఇంటికి’’...అని ఆర్తితో కీర్తనను ఆలపిస్తూ తీసుకెళ్ళారు. త్యాగరాజు గారి కుమార్తె వివాహం జరుగుతుంటే దక్షిణ భారతదేశం నుంచి ఒక స్నేహితుడు ఆయనకు రామచంద్రమూర్తి విగ్రహాలను తెచ్చి బహూకరించాడు. అది చూసి కన్నీటి పర్యంతమయిన త్యాగయ్య నాకోసం అంత దూరం నుంచి నడిచి వచ్చావా స్వామీ, నీ కాళ్ళెంత సొక్కిపోయాయో...అంటూ ‘‘నను పాలింపగ నడచి వచ్చితివా...’’అని కీర్తన చేసారు. త్యాగరాజు గారికి ‘సర్వం రామమయం జగత్’. -
మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
కేసముద్రం: టీఆర్ఎస్ నుంచి తనను ఏకగ్రీవం చేయకుండా మరో వ్యక్తిని చేయడం పట్ల మనస్తాపం చెంది ఓ మాజీ సర్పంచ్ పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం రంగాపురం గ్రామంలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పార్వతి కుటుంబం అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరింది. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి టీఆర్ఎస్లోకి వచ్చింది. ఈ సారి జరిగే సర్పంచ్ ఎన్నికల బరిలో నిలబడేందుకు సన్నద్ధమయ్యారు. ఇదే తరుణంలో సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ఇతర పార్టీ నాయకులతో పార్వతి భర్తను చర్చలకు పిలిచారు. ఈ చర్చల్లో మరో అభ్యర్థిని ఎంపిక చేశారు. దీంతో తమకు అన్యాయం జరిగిందంటూ మనస్తాపానికి గురైన పార్వతి పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ మేరకు ఆమెను చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
‘అమ్మ’కు రాజీనామా!
నటి భావనపై వేధింపుల విషయంలో జైలుకు వెళ్లారు మలయాళ నటుడు దిలీప్. ఆయన బెయిల్ మీద బయటకు రాగానే ‘ది అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ’ (అమ్మ)లో తిరిగి ఆయన్ను సభ్యుడిగా తీసుకోవడంపై కొందరు మలయాళ నటీమణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ అతన్ని అసోసియేషన్లోకి ఎలా తీసుకుంటారు? అసోసియేషన్ నుంచి తొలగించాలి? అని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఇటీవల డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టీవ్) సభ్యులందరూ ఓ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సమాధానంగా దిలీప్ అసోసియేషన్ నుంచి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించింది ‘అమ్మ’. ‘‘దిలీప్‌ను రాజీనామా చేయమని కోరాం. ఇది డిసిప్లినరీ యాక్షన్‌గా చేసింది అనుకోవచ్చు. ఒకవేళ దిలీప్ రాజీనామా చేయకపోతే అసోసియేషన్ నుంచి మేమే తొలగించేవాళ్లం’’ అని ‘అమ్మ’ కమిటీ పేర్కొంది. అవకాశలు తగ్గిపోయాయి ‘‘ఎప్పుడైతే డబ్ల్యూసీసీ ఏర్పాటు చేశానో అప్పటి నుంచి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి’’ అని పేర్కొన్నారు జాతీయ అవార్డు అందుకున్న మలయాళ నటి పార్వతి. మలయాళ అసోసియేషన్ ‘అమ్మ’ వైఖరికి ఎదురుగా నిలబడి మాట్లాడారు ఈ హీరోయిన్. ఇలా ధైర్యంగా నిలబడినందుకే నాకు అవకాశాలు తగ్గాయన్నారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘ఇలా బాహాటంగా మాట్లాడినందుకు ఇండస్ట్రీలో నన్ను ఒక్కదాన్ని చేసేశారు. వేరేవాళ్లు నాతో మాట్లాడటానికి కూడా సంకోచించేలా చేస్తున్నారు. నాకు, నా కుటుంబ సభ్యులకు ర క్షణ ఉంటుందో లేదో అని కంగారుగా ఉంది. గత నాలుగేళ్లలో నేను చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్సే. కానీ ఇటీవల ఒకే ఒక్క సినిమాకి అవకాశం వచ్చింది. కేవలం పేపర్లోనే కేరళ మోడరన్ సంప్రదాయాలతో ఉండే రాష్ట్రం. కానీ విషాదకర నిజమేంటంటే జనాలు ఇంకా గుడ్డి నమ్మకాలతోనే బ్రతుకుతున్నారు’’ అని పేర్కొన్నారు. -
చాలెంజింగ్ పాత్రలో...
కథల ఎంపిక, అనుకున్నది మొహమాట పడకుండా ధైర్యంగా బయటకు చెప్పడం వల్ల మలయాళ నటి పార్వతి సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ నటిగా ఎదిగారు. తాజాగా మరో చాలెంజింగ్ పాత్రను పోషించడానికి రెడీ అయ్యారామె. తాజా చిత్రంలో యాసిడ్ అటాక్ బాధితురాలిగా కనిపించబోతున్నారు పార్వతి. మను అశోకన్ రూపొందించబోయే ఈ చిత్రంలో టోవినో థామస్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి రచయిత సంజయ్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం నిజజీవితం నుంచి ప్రేరణ పొందిన కథ కాదు. కానీ యాసిడ్ అటాక్ జరిగిన తర్వాత వాళ్లు ఎటువంటి జీవితాన్ని గడుపుతారు అనే కోణంలో కథ సాగుతుంది. చాలా మంది యాసిడ్ దాడి జరిగిన బాధితులను కలిశాం’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం ఆల్రెడీ బెంగళూర్ మేకప్ ఆర్టిస్ట్‌లతో పార్వతి లుక్ టెస్ట్ కూడా జరిపారట. నవంబర్‌లో చిత్రీకరణ మొదలుకానుంది. -
నాదో విన్నపం మహర్షీ!
‘‘నేను సంతోషంగా రాస్తాను కానీ, వ్యాసమహర్షీ., నాదొక విన్నపం..’’ అన్నాడు వినాయకుడు. ఏమిటన్నాడు వ్యాసుడు. వ్యాసుడు మహాభారతాన్ని రచించడానికి సంకల్పించిన తరువాత దాన్ని లిఖించే సమర్థుడెవరన్న సందేహం కలిగింది. కాసేపు కన్నులు మూసుకుని దేవతలందరినీ తలచుకుంటూ పోతున్నాడు వ్యాసుడు. ఈ క్రమంలో ఓం ప్రథమంగానే పార్వతీ తనయుడైన గణపతి రూపం మదిలో మెదిలింది. తన కావ్య రచనకు సమర్థుడు వినాయకుడే అని అవగతమైంది, ఆయనను ప్రార్థించాడు. వెను వెంటనే గణపతి ఘంటం పట్టుకుని ప్రత్యక్షమైనాడు. ‘ధన్యోస్మి వినాయకా’ అని వేదవ్యాసుడు నమస్కరించగా, ‘‘వేదపారాయణా మీకు నమస్సులు’’ అని గణపతి ప్రతి నమస్కారం చేశాడు. మహాభారతాన్ని తాను చెబుతుంటే, గణపతి లిఖిస్తే బాగుంటుందన్న తన అభిలాషను వ్యక్తం చేశాడు వ్యాసుడు. గణపతి అందుకు ఆనందంగా అంగీకరిస్తూనే, ‘‘నేను సంతోషంగా రాస్తాను కానీ, వ్యాసమహర్షీ., నాదొక విన్నపం..’’ అన్నాడు వినాయకుడు. ఏమిటన్నాడు వ్యాసుడు. ‘‘నా ఘంటం ఆరంభించిన తరువాత ఆగదు, ఆగితే నేను వెళ్లిపోతాను’’ అని చెప్పాడు వినాయకుడు. పెద్ద చిక్కే వచ్చిపడిందే.. అని వ్యాసుడనుకుని ‘‘అయితే నా విన్నపం కూడా ఒకటుంది వినాయకా... నేను చెప్పిన శ్లోకం వెంట వెంటనే లిఖిస్తే సరిపోదు. ఒక్కొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్న తరువాతనే రాయాలి సుమా..’’ అన్నాడు.అమ్మో ఈ వ్యాసుడు సామాన్యుడు కాడు. సరే ననక తప్పదు అనుకుని, ‘నాకూ మంచిదే ఆ మహాగ్రం«థమెన మహాభారతాన్ని అర్థం చేసుకుని లిఖించే అవకాశం దక్కింది’ అని సరిపెట్టుకున్నాడు గణపతి. ఇద్దరూ విజ్ఞాన ఘనులే. లక్షశ్లోకాల మహాభారత రచన ఒక నదీ ప్రవాహంలా నిరాటంకంగా, నిరంతరాయంగా సాగిపోతోంది. వ్యాసుడు చెప్పిన ప్రతి శ్లోకాన్నీ వినాయకుడు అర్థం చేసుకుంటూ తల పంకిస్తూ, ఆ మహాకావ్య అద్భుత కవితా సౌందర్యాన్ని, కథా వైభవాన్ని, కథన సోయగాన్ని ఆస్వాదిస్తూ, ప్రశంసిస్తూ ఆనందిస్తూ దానిని గ్రంథస్థం చేసుకుంటూ పోతున్నాడు. తదుపరి శ్లోక రచనకు తనకు ఇంకాస్త సమయం కావాలనుకున్నప్పుడు వ్యాసుడు ఒక కఠినమైన శ్లోకం చెప్పేవాడు. ఆ శ్లోకాన్ని విశ్లేషిస్తూ గణపతి కాస్త నెమ్మదించినపుడు తరువాత శ్లోకాన్ని మనసులో అల్లుకుంటూ ఉండేవాడు వ్యాసుడు. ఆ విధంగా ఇద్దరూ ఒకరి వైదుష్యానికి మరొకరు భంగం కలిగించకుండా తమ పని తాము చేసుకుంటూ పోయారు ఒకరికొకరు ఏమీ తీసిపోకుండా. అందుకే దేనికైనా సమఉజ్జీలు ఉండాలంటారు. – డి.వి.ఆర్. -
శివుడిగా తేజ్.. పార్వతిగా ఐశ్వర్య..!
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆర్జేడీ శాసనసభ్యుడు చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్య రాయ్‌ను తేజ్ శనివారం పెళ్లి చేసుకోబోతున్నారు. దాణా కుంభకోణం కేసుల్లో జైలులో ఉన్న లాలూ.. కొడుకు పెళ్లి వేడుక కోసం బుధవారం పెరోల్‌పై బయటికు వచ్చారు. ఈ పెళ్లి కోసం లాలూ కుటుంబం ఘనంగా ఏర్పాట్లు చేసింది. అటు ఆర్జేడీ అభిమానులు, కార్యకర్తల కోలాహలం కూడా పెద్దస్థాయిలో ఉంది. పెళ్లి చేసుకోబోతున్న తేజ్ ప్రతాప్ కటౌట్లు, పోస్టర్లు పెద్ద ఎత్తున ఆర్జేడీ కార్యకర్తలు నిలబెట్టారు. ఇందులో లాలూ నివాసం వద్ద ఏర్పాటుచేసిన ఓ కటౌట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెళ్లి కొడుకు తేజ్‌ప్రతాప్‌ను శివుడిగా, పెళ్లికూతురు ఐశ్వర్యను పార్వతిగా చిత్రీకరించిన ఈ కటౌట్‌ను కార్యకర్తలు ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పట్నాలోని వెటినరీ కాలేజీ కాంపౌండ్‌లో జరుగబోతున్న ఈ పెళ్లికి అతిరథ మహారథులు వేంచేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అధినేతలకు, ప్రముఖులకు, మంత్రులకు ఆహ్వానాలు వెళ్లాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక వాద్రా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సమాజ్‌వాద్ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్‌లు ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం 20వేల మంది వరకు ఈ పెళ్లి వేడుకకు హాజరుకాబోతున్నారని బిహార్ ఆర్జేడీ అధ్యక్షుడు రామ్ చంద్ర పూర్వే చెప్పారు. -
నువ్వు అహంకారి అన్నారు
తన ఒపీనియన్ వ్యక్తపరచడంలో ఎప్పుడూ వెనకాడరు మలయాళీ బ్యూటీ ‘పార్వతి’. ‘‘కేవలం యాక్టర్ అయ్యాక వచ్చిన యాటిట్యూడ్ కాదిది. చిన్నప్పటినుంచి నాకు అనిపించింది చెప్పడం అలవాటు. నా ముక్కుసూటితనం వల్ల ఇండస్ట్రీలో తొలినాళ్లలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను’’ అంటున్నారామె. చిన్నప్పటి నుంచి ప్రశ్నించే స్వభావం గురించి పార్వతి మాట్లాడుతూ– ‘‘ఇలా ప్రశ్నలు వేసే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఈ క్వొశ్చనింగ్ నేచర్ చిన్నప్పటి నుంచి నాతో ఉండిపోయింది. అబ్బాయిలే చెట్లెందుకు ఎక్కాలి? అమ్మాయిలెందుకు ఎక్కకూడదు? అని అడిగేదాన్ని. అందరి శరీరాకృతి ఒక్కటే కదా? అందరూ సమానమే కదా. అమ్మాయిలు చెట్లు ఎక్కలేక కాదు. అమ్మాయిల్ని అలా చేయనీకూడదు అని వీళ్లు (సొసైటీ) అనుకున్నారంతే. ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాను. అలాగే కెరీర్ బిగినింగ్‌లో ‘నేను స్క్రిప్ట్ చూడాలి’ అని, ‘ఇంత రెమ్యునరేషన్ కావాలి’ అని అడిగాను. అంతే.. అప్పటి నుంచి నన్ను ‘అహంకారి’ అనేవారు. కానీ, ట్రూ ఆర్టిస్ట్‌ని, ఆర్ట్‌ని ఎవ్వరూ ఆపలేరు కదా?’’ అని పేర్కొన్నారామె. రీసెంట్గా ‘టేక్ఆఫ్’ సినిమాకు పార్వతి బెస్ట్ యాక్ట్రెస్‌గా జాతీయ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. -
పాప ప్రక్షాళనం
ఒకసారి శివపార్వతులు ఆకాశమార్గంలో కాశీ నగరానికి వెళ్తున్నారు. వారికి గంగానదిలో అనేకమంది యాత్రికులు స్నానాలు చేస్తుండటం కనిపించింది. అది చూసి పార్వతి ‘‘నాథా! ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా, నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి, వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగాస్నానం చేసి పోగొట్టుకుంటారు కదా’’ అని సందేహం వెలిబుచ్చింది. శివుడు చిర్నవ్వుతో ‘‘దేవీ! ఇప్పుడు నేను ఒకటి చెబుతాను. నీవు ఆ విధంగా చేయి. అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది’’ అంటూ ఆమె ఏమి చేయాలో చెప్పాడు. ఆ ప్రకారం పార్వతి, పండుముల్తైదు రూపం ధరించి, గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, ‘‘దయచేసి నా భర్తను కాపాడండి’’ అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని చాలామంది గంగలో దూకి, ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు. అది చూసిన వృద్ధురాలు ‘‘అయ్యా! నా భర్తకొక శాపం ఉంది. పాపాత్ములెవరయినా ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి. అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది. కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి’’ అని హెచ్చరించింది. ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్లిపోయారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలో దూకి, కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకుని, తన వీపు మీద ఆయనను మోస్తూ, ఒడ్డుకు తీసుకు వచ్చాడు. వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూనే, నాయనా! నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగల్యం దక్కించావు. నీవు పాపరహితుడవా’’ అని అడిగింది. ఆ వ్యక్తి ‘‘అమ్మా! నేను ఇంతకుముందే గంగా స్నానం చేసి పునీతుడినయ్యాను. అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాను’’ అని చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి, అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి వినువీధులలో విహరించసాగారు. ‘‘చూశావా దేవీ! విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది’’ అన్నాడు పరమేశ్వరుడు. అర్థమైందన్నట్లుగా పార్వతి చిరునవ్వుతో తల పంకించింది. పని చేస్తుందా లేదా అని అనుమానంతో వేసుకుంటే ఔషధం కూడా పని చేయదు. దృఢవిశ్వాసంతో చేసే పని తప్పక ఫలితాలనిస్తుందన్నది నీతి. – డి.వి.ఆర్. భాస్కర్ -
దమ్మున్న అమ్మాయిలు
పెద్ద దర్శకులంటే, పెద్ద హీరోలంటే.. ఇండస్ట్రీలోని పెద్దపెద్దవాళ్లే వణికి చస్తుంటారు. ఈ హీరోయిన్లు చూడండీ.. స్వరా భాస్కర్, పార్వతి.. మనసులో ఉన్నది ఎలా ధైర్యంగా మాట్లాడేశారో! దమ్మున్న అమ్మాయిలు అనిపించారు. స్వరా భాస్కర్ బాలీవుడ్ నటి. ‘పద్మావతి’ సినిమా చూసొచ్చి భన్సాలీని పబ్లిక్‌గా తిట్టేసింది. లాస్ట్ సీన్ ఆమెకు నచ్చలేదు.. దీపికా పదుకోన్, వందల మంది మహిళల్ని వెంటేసుకుని.. ఖిల్జీ నుంచి తప్పించుకోడానికి.. వెళ్లి అగ్నిగుండంలో పడిపోవడం! ‘స్త్రీకి బతికే హక్కులేదా? స్త్రీ అంటే ఇక వేరే అర్థం లేదా? స్త్రీ దేహానికి ఇంకో పరమార్థమే లేదా’ అనే అర్థం వచ్చేలా కాస్త తీవ్రంగానే భన్సాలీపై ఆమె విరుచుకుపడింది. ఇక అప్పట్నుంచీ స్వరా భాస్కర్‌కు భన్సాలీ అభిమానుల టార్చర్ మొదలైంది. ఇంకో అమ్మాయి పార్వతి. మలయాళీ నటి. ‘కసాబా’ (2016) చిత్రంలో మమ్ముట్టీ.. మహిళా పోలీస్ బాస్‌ను అభ్యంతరకరంగా తిడతాడు. ఆ డైలాగ్‌తో ఆ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పించడం డైరెక్టర్ ఉద్దేశం కావచ్చు కానీ, స్త్రీని అనకూడని మాట అది! స్త్రీ దేహధర్మాలను కించపరిచే డైలాగ్ అది. దానిపై మమ్ముట్టిని, డైరెక్టర్‌ను తిట్టిపడేసింది పార్వతి. ఏడాదిగా తిడుతూనే ఉంది. డిసెంబర్లో మళ్లీ ఒకసారి క్రిటిక్ల సభలో ఆమె ఈ విషయాన్ని ఉతికి ఆరేసింది. మమ్ముట్టి అభిమానులు కూడా ప్రతీకారంగా పార్వతిపై ఏదో ఒక రూపంలో దాడి చేస్తూనే ఉన్నారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. సినిమాల్లోనే కాదు, సినిమాల బయటా ధైర్యంగా ప్రశ్నించే అమ్మాయిలు ఉన్నారు! -
పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు
► ముందస్తుగా జిల్లాకు 10 డీఆర్సీలు ► జిల్లా పంచాయతీ అధికారిణి పార్వతి కర్నూలు(అర్బన్): జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా పంచాయతీ అధికారిణి పార్వతి చెప్పారు. శనివారం స్థానిక డీపీఓ కార్యాలయంలో ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ ముందుగా పలు గ్రామ పంచాయతీల్లో సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్లు షెడ్లు ఏర్పాటు చేసి వర్మీకంపోస్టు ఎరువు తయారీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని పాణ్యం, అయ్యలూరు, కోవెలకుంట్ల, హోళగుంద, ఆలూరు, గోనెగండ్ల, గార్గేయపురం, లక్ష్మీపురం, వెల్దురి, పాములపాడు గ్రామ పంచాయతీల్లో డిస్ట్రిక్ట్ రిసోర్సు సెంటర్లు (డీఆర్సీ) ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాల్సి ఉందన్నారు. ఒక్కో సెంటర్‌కు ఐదు గ్రామ పంచాయతీలను అనుసంధానం చేస్తామన్నారు. అక్కడ తడిపొడి చెత్త వేరుచేయడం, వర్మీ కంపోస్టు యూనిట్‌కు అవసరమైన పేడను రైతుల నుంచి సేకరించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అంతకు ముందుగా 14వ ఆర్థిక సంఘం నిధులతో డస్ట్బిన్లను ఆయా గ్రామ పంచాయతీలు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. చెత్త సేకరణ కోసం ప్రతి వెయ్యి జనాభాకు ఒక ట్రైసైకిల్ అందజేస్తామన్నారు. సమావేశంలో కర్నూలు డివిజనల్ పంచాయతీ అధికారి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నీలి ఇంధనం..!
► మాఫియా చేతుల్లో నీలి కిరోసిన్ ►నార్కెట్‌పల్లి రహదారిలో విచ్చలవిడిగా వ్యాపారం ►పౌరసరఫరాల శాఖ నుంచి పక్కదోవ పడుతున్న వైనం ►నోరు మెదపని అధికారులు.. తనిఖీ బృందాలు ప్రతి ఒక్కరూ పేదలపై దండయాత్ర చేసేవారే. వారి నోటి దగ్గర కూడు లాక్కొని భోం చేసేవారే. స్థలాలు.. పొలాల నుంచి కష్టపడి సంపాదించే కూలి దాకా.. పంటల ఉత్పత్తి దాకా! ఇక రేషన్ సరుకుల గురించి చెప్పేదేముంది?ఎంత పిండితే అంత! పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే కిరోసిన్ సంపాదనకు ఇం‘ధనం’గా మారింది. మాఫియా చేతుల్లో వేలాది లీటర్లు పక్క దోవ నుంచి కారిపోతూనే ఉంది. - సంతమాగులూరు చాలా పేద కుటుంబాల్లో ఇప్పటికీ వంట గ్యాస్ లేదు. ఇలాంటి వారందరికీ నీలి కిరోసినే ఆధారం. దానిని స్టౌలలో పోసుకొని కావాల్సిన వంట చేసుకుంటారు. అందుకే పౌర సరఫరాల శాఖ తెల్ల రేషన్‌కార్డు దారులకు ప్రతినెలా రేషన్ డీలర్ల నుంచి కిరోసిన్ సరఫరా చేస్తుంది. అరుుతే కొంతమంది మాఫియాగా ఏర్పడి దీనిని అక్రమ మార్గాల్లో తరలిస్తున్నారు. ఈ తరహా దందాకు అద్దంకి- నార్కెట్‌పల్లి రహదారి నిలయంగా మారింది. ఇక్కడ నుంచి బహిరంగంగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడటంలేదు. సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు సమీపం లోని పాత హోటళ్ల వద్ద భారీ స్టాక్ ఉంటోంది. కిరోసిన్‌ను పీపాల్లో భద్రపరుస్తున్నారు. ఒక్క పీపాలో 220 లీటర్లు పడుతుంది. ఇలాంటివి ప్రతి నెలా 10 డ్రమ్ముల దాకా తరలిపోతోంది. అంటే ప్రతి నెలా దాదాపు 2000 లీటర్ల కిరోసన్ బ్లాక్ మార్కెట్లో అమ్ముడు పోతోంది. దీని విలువ రూ. 5 లక్షల దాకా ఉం టుందని అంచనా. గతంలో ఈ వ్యాపారంపై దినపత్రికల్లో వార్తలు రాగా కాసేపు హడావుడి చేసినా అధికారులు మామూళ్లు పుచ్చుకొని వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నారుు. డీలర్ల పాత్ర? ఏల్చూరు, రొంపిచర్ల, సజ్జాపురం, కొమ్మాలపాడు, మక్కెనవారిపాలెం తదితర గ్రామాల నీలి కిరోసిన్ తరలి వస్తోంది. ఒక్కోడీలర్ నుంచి 100 లీటర్ల దాకా సేకరిస్తున్నారు. అలాగే హైవేపై మద్దిపాడు, మేదరమేట్ల వంటి ప్రాంతాల్లోనూ కిరోసిన్ వ్యాపారం జోరుగా సాగుతోంది. గతంలో రేషన్ డీలర్లకు పంచదార, కిరోసిన్, బియ్యం సరఫరా మధ్య జాప్యం ఉండేది. దీంతో దాదాపు లబ్ధిదారులందరికీ సరుకు ఇవ్వడం అనివార్యమయ్యేది. కానీ ప్రస్తుతం సరకులన్నీ ఒకేసారి రావటంతో డీలర్లు అన్ని రకాల పదార్థాలకు ఒకే సారి వేలిముద్ర వేరుుంచుకొంటున్నారు. అవసరంలేని వారి వద్ద కిరోసిన్ సేకరించి లీటరు రూ. 30 చొప్పున బ్లాక్‌లో అమ్ముకుం టున్నారు. వ్యాపారులు లారీలకు లీటరు రూ. 50 చొప్పున అమ్ముతున్నారు. ఇలా లక్షలాది రూపాయలు వారి జేబుల్లో పడుతున్నారుు. ప్రభుత్వం మాత్రం లీటరు రూ.15కే సరఫరా చేస్తుంది. కొంతమంది దళారులు.. వ్యాపారులకు, డీలర్లకు మధ్య సంబంధాలు నిర్వహిస్తూ చీకటి వ్యాపారాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. లారీ డ్రైవర్లు ఓనర్లకు తెలియకుండా డీజిల్‌ను పక్కదోవ పట్టించి దాని స్థానంలో కిరోసిన్ నింపుతున్నారు. వాహనాలు, ఎరువుల దుకాణాలనే పరిశీలిస్తారా? జిల్లా విజిలెన్స అధికారులు వారానికి ఒక సారి పుట్టావారిపాలెం జంక్షన్లో వాహనాలు తనిఖీ చేస్తుంటారు.- అలాగే ఇటీవల కాలంలో కొమ్మాలపాడులో ఎరువుల దుకాణాల్లోనూ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కానీ ఏల్చూరు- కొమ్మాలపాడు గ్రామాల మధ్య యథేచ్ఛగా సాగుతున్న నీలికిరోసిన్ వ్యాపారాన్ని ఎందుకు కట్టడి చేయడంలేదో వారికే తెలియాలి. అధికారులు దాడులకు ఉపక్రమించిన సమయంలో వ్యాపారులకు కొంతమంది ముందస్తు సమాచారం ఇవ్వటంతో జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: పార్వతి ,తహసీల్దార్ కిరోసిన్ విషయం తన దృష్టికి వచ్చింది. కొత్త గా విధుల్లోకి చేరడం వల్ల కొంత పని ఒత్తిడి ఉంది. మూడు, నాలుగు రోజుల్లో తనిఖీలు చేసి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. -
పవిత్రమైన పాత్రలో నటించి.. బికినీ ఫొటోలా?
మీరు ప్రముఖమైన టీవీ నటులా? అయితే సోషల్ మీడియలో ఫొటోలు పెట్టే విషయంలో కాస్తా జాగ్రత్త ఉండండి! ఎందుకు అంటారా? ఈ విషయాన్ని సోనారికా భడోరియాను అడిగితే.. ఆమె బాగా చెప్పగలదు. 'దేవోన్ కా దేవ్ మహదేవ్' సీరియల్లో ఆమె పార్వతి పాత్రలో నటించింది. పార్వతిగా ఆమె ప్రేక్షకుల మదిలో ముద్రపడినట్టు ఉంది. ఆమె ఆ సీరియల్ నుంచి తప్పుకొని ఇప్పటికీ మూడేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల విహారయాత్రకు వెళ్లిన ఆమె కొన్ని ఫొటోలు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. నీలి అలల తీరంలో సముద్ర ఒడ్డున ఆమె బికినీలో దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది. దీనిపై కొందరు ఆమె అభిమానులు నొచ్చుకున్నారు. ఇదేమిటి? శివుడి ఇల్లాలైన పార్వతీదేవిగా ఎంతో పవిత్రమైన పాత్రలో కనిపించి.. ఇప్పుడిలా కురచ దుస్తులు వేసుకోవడమేమిటని పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె తీరును తప్పుబడుతూ విమర్శల వర్షం కురిపించారు. దీంతో ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. దీంతో సోనిరిక స్పందిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. 'నేను ఏ ప్రపంచంలో ఉన్నానో తెలియడం లేదు. పాశ్చాత్య దేశాల్లో బాడీషేమింగ్ (శరీరాకృతి గురించి విమర్శలు చేయడం)కు వ్యతిరేకంగా పోరాడుతుండగా ఇక్కడ బాడీ షేమింగ్ మాట పక్కనపెట్టండి. కనీసం బికినీ వేసుకున్నన్నా నేరంగా పరిగణిస్తున్నారు. కొన్ని నిమిషాల కిందట నేను బికినీలో దిగిన కొన్ని ఫొటోలను పెట్టాను. వాటిపై వస్తున్న వ్యతిరేక వ్యాఖ్యలు, శాపనార్థాలు తట్టుకోలేక వాటిని డిలీట్ చేస్తున్నాను. వాటన్నింటినీ నేను విస్మరించవచ్చు. కానీ అంత ప్రతికూలతను భరించే పరిపక్వత నాకు రాలేదు. అందుకే ఫొటోలను తీసేశాను' అని ఆమె పేర్కొన్నారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
గుత్తి మండలకేంద్రంలోని దాసరికాలనీలో పార్వతి(28) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి
కారు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ పంఘటన విశాఖ జిల్లా పాడేరు మండలం పోతురాజు గుడి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. నక్కలపుట్టుకు చెందిన సంతల వ్యాపారి పప్పు వెంకటరావు(55) కుటుంబ సభ్యులతో కలిసి కారులో విశాఖపట్నం వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. పోతురాజు గుడి సమీపంలో అదుపు తప్పి లోయాలోకి దూసుకెళ్లింది. దీంతో కారు నడుపుతున్న వెంకటరావు అక్కడికక్కడే మృతిచెందగా.. ఆయన భార్య పార్వతి, చెల్లెలు కొండమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
పోలీసులను ఆశ్రయించిన వడ్డీ బాధితులు
వడ్డీ వ్యాపారులు తమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారంటూ బాధితులు విశాఖ నాలుగో టౌన్ పోలీసులను ఆశ్రయించారు. నగరంలోని నర్సింహనగర్‌కు చెందిన డీఎస్ఎన్ రెడ్డి అనే వ్యక్తి వడ్డీకి అప్పులు ఇస్తుంటాడు. అతడి వద్ద స్థానికులైన బండారు సూర్యారావు, పార్వతి దంపతులు మూడేళ్ల క్రితం రూ.50 వేలు అప్పు తీసుకున్నారు. ఆ సమయంలో వారి నుంచి ఐదు ప్రామిసరీ నోట్లు, ఐదు చెక్కులు తీసుకున్నారు. అప్పటి నుంచి నెలకు వెయ్యి చొప్పున వారు అతడికి వడ్డీ చెల్లిస్తున్నారు. అయితే, ఆ వ్యాపారి ఇటీవల అసలు మొత్తం వెంటనే చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో బాధితులు తమ ఇంటిని విక్రయానికి పెట్టారు. అయితే, కొంటానంటూ ముందుకు వచ్చిన ప్రసాద్ అనే వ్యక్తి బోగస్ పత్రాలిచ్చారంటూ వారిని బెదిరిస్తున్నాడు. ఇదిలా ఉండగా బాధిత దంపతులు బ్యాంకులో ఉన్న తమ నగలను మరో మహిళ ఆర్థిక సాయంతో విడిపించుకున్నారు. కాగా.. సదరు మహిళ ఆ నగలను తన వద్దే ఉంచుకుని రేపుమాపు అంటూ తిప్పుకుంటోంది. దీంతో బాధిత దంపతులు బుధవారం సాయంత్రం నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. డీఎస్‌ఎన్‌రెడ్డి, ప్రసాద్, మరో మహిళపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. -
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
చికిత్స పొందుతూ మృతిచెందిన యువతి ఆస్పత్రిలో కోలుకుంటున్న యువకుడు నక్కపల్లి/పాయకరావుపేట:పెళ్లికితల్లిదండ్రులు నిరాకరిస్తున్నారన్న కారణంగా ప్రేమంజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడగా, యువకుడు తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి తండ్రి సత్తిబాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు, తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాయకరావుపేట మండలం అరట్లకోట గ్రామానికి చెందిన ఉలవకాయల పార్వతి(21) అదేగ్రామానికిచెందిన వేముల నరేంద్రలు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ మేనత్త మేనమామపిల్లలు,పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పార్వతి తల్లిదండ్రులు ఆమెకు బయట వ్యక్తితో వివాహం చేయడానికి సంబంధాలుచూస్తున్నారు. ఈ విషయం తెలిసిన ప్రేమికులిద్దరూ ఈనెల 22న పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇద్దరూ సమీపంలో ఉన్న తోటలో పడిఉండటాన్ని చూసి బంధువులు తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. యవతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో అక్కడకు తీసుకెళ్లారు. అదేరోజు అర్ధరాత్రి సమయంలో ఆమె మృతి చెందినట్లు తండ్రి సత్తిబాబు పోలీసులకు తెలిపాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసువర్గాలు తెలిపాయి. -
భర్త అయినా... మౌనం సమాధానం కాదు!
ఈ విషయం గురించి మాట్లాడాలంటేనే దిగులుగా ఉంటుంది... ఇంత సున్నితమైన విషయాన్ని బజార్లో పెట్టాలంటే ఆలోచించాల్సి వస్తోంది. మేలు చేయబోయి కీడు చేస్తామా? అన్న ప్రశ్న వేధిస్తోంది. కానీ, మౌనం సమాధానం కాదు. ఒక చెల్లి, అక్క, బిడ్డ పడుతున్న వేదనకు మౌనం సమాధానం కాదు. ఆడపిల్లను జాగృతం చెయ్యడం ఒక అవసరం అయితే, మగవారిని సెన్సిటైజ్ చెయ్యడం అత్యవసరం. భార్యాభర్త అన్యోన్యంగా ఉండడానికి ఈ చర్చ ఒక అవకాశం కావాలి. మన ఫ్యామిలీని నిండుగా నూరేళ్లు ఉంచే బాధ్యతను మనందరం తీసుకోవాలి! ‘‘విడాకుల కోసం మా దగ్గరకొచ్చే కేసుల్లో 50 శాతం కేసులు ఇలాంటివే’’ అంటున్నారు హైదరాబాద్‌లో ఉంటున్న ఫ్యామిలీ కోర్టు న్యాయవాది పార్వతి. వారిజ (పేరు మార్చాం) పెళ్లయి ఏడేళ్లు. ఇద్దరు పిల్లలు. ఆమె భర్త ప్రసాద్ (అసలు పేరు కాదు) కమర్షియల్‌టాక్స్ ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నాడు. అయిదేళ్లు బాగానే సాగింది వాళ్ల కాపురం. రెండేళ్ల నుంచే కలతలు మొదలయ్యాయి. అన్ని విషయాల్లో ఇద్దరూ బాగా ఉంటారు. ఆ ఒక్క విషయంలోనే ఇద్దరికీ పొసగడంలేదు. పిల్లల చదువు, ఇంటి బాధ్యతలతో వారిజ విపరీతంగా అలసిపోతోంది. దీంతో తనను పట్టించుకోవడంలేదనేది ప్రసాద్ కంప్లయింట్. విసిగిపోయి పిల్లలిద్దర్నీ తీసుకొని తల్లిగారింటికి వచ్చేసింది. ‘‘పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి నడుం వాల్చేదాకా క్షణం విశ్రాంతి ఉండట్లేదు. యంత్రంలా పనిచేస్తున్నాను. రాత్రిపూటైనా హాయిగా నిద్రపోతున్నానా అంటే అదీ లేదు. స్నేహితులు, సిట్టింగులు అంటూ అర్ధరాత్రి ఇంటికి చేరుతాడు. మంచి నిద్రను చెడగొడ్తాడు. అలసిపోయాను అన్నా వినడు. పైగా మొరటుగా ప్రవర్తిస్తున్నాడు. నావల్ల కావట్లేదమ్మా’’ అని తల్లి దగ్గర వాపోయింది. విషయం అర్థమైంది వారిజ తల్లికి. తన యవ్వనపు రోజులు గుర్తొచ్చాయి. తనూ తన తల్లి దగ్గర దిగాలు పడ్డ క్షణాలు మదిలో మెదిలాయి. అప్పుడు తన తల్లి తనకు చెప్పిన మాటల్నే ఇప్పుడు నా బిడ్డకు చెప్పాలా? ఆ మీమాంసతోనేవారిజ తల్లి నెమ్మదిగా గొంతు సవరించుకుంది.. ‘‘ఇంత చిన్న విషయానికే ఇక్కడికి వచ్చేయాలా? భర్త భార్య దగ్గరకి రాకపోతే ఎక్కడికి వెళ్తాడు? వల్లకాని పక్షంలో మెల్లగా సర్దిచెప్పుకోవాలి.. వినకపోతే నువ్వే ఓపిక పట్టాలి. తప్పదు. నువ్వు కాదంటే అతను వేరే దారి చూసుకుంటాడు. అప్పుడు నెత్తినోరు కొట్టుకున్నా ప్రయోజనం ఉండదు’’ అని చెప్పి కూతుర్ని అత్తారింటికి పంపింది కానీ.. ఇష్టంలేకుండా భర్తకైనా సరే తన శరీరాన్ని అప్పజెప్పడం ఎంత నరకమో తనకు తెలియదా? తప్పు చేశాననే భావన. నీ శరీరం మీద నీకు హక్కు ఉందని బిడ్డకెందుకు తను చెప్పలేకపోయింది? ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోయింది? కుటుంబం, సమాజం, పరువు, మర్యాద అని తన తల్లి భయపడ్డట్టే తనూ భయపడిందా? తన బిడ్డకు తాను సర్ది చెప్పినట్టే.. ఆడపిల్ల మనసు, సున్నితమైన ఆమె శరీరం గురించి అల్లుడికీ ఎవరైనా చెప్పగలిగితే ఎంత బాగుండు.. ఈరోజు నా కూతురికి ఈ సమస్య వచ్చేది కాదు కదా..! ఇవి వారిజ తల్లి ఆలోచనలు మాత్రమే కాదు.. ఇప్పుడు ఒక చర్చ కూడా. తన శరీరం మీద తనకు హక్కులేదా? భర్త అయినంత మాత్రాన బలవంత పెడితే భరించాలా? అన్న ప్రశ్న మ్యారిటల్ రేప్‌ను చట్టం కిందికి తేవాలి అన్నంత పదును తేలింది. ఇంకోవైపు భార్యాభర్తలకు చెందిన ఈ సమస్యను పరస్పర అవగాహన, సహనంతో నాలుగు గోడలమధ్యే పరిష్కరించుకోవాలి.. కుటుంబం కూలిపోకుండా కాపాడుకోవాలి అన్న అభిప్రాయమూ వినపడుతోంది. నేపథ్యం: నిర్భయ సంఘటన జరిగిన తర్వాత నిర్భయ యాక్ట్ సందర్భంలో జస్ట్టిస్ వర్మ కొన్ని మార్గదర్శకాలను సూచించారు. వాటిలో భార్యభర్తల మధ్య జరిగే బలవంతపు శృంగారాన్ని... అంటే భార్య అంగీకారం లేకుండా భర్త జరిపే శృంగారాన్నీ రేప్‌గానే పరిగణించాలని చెప్పారు. కానీ నాటి ప్రభుత్వం దీన్ని అంగీకరించలేదు. పార్లమెంటేరియన్లంతా దీనివల్ల వివాహ వ్యవస్థకున్న పవిత్రత పోతుందని, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని వాటిని వ్యతిరేకించారు. ఇప్పుడు మళ్లీ ఈ అంశం వార్తల్లోకి వచ్చి జస్టిస్ వర్మ సూచన ప్రకారం దీన్ని వైవాహిక అత్యాచారంగా పరిగణించాలనే చర్చ మొదలైంది. భార్య, భర్త జ్యుడీషియల్ సపరేషన్లో ఉన్నా, విడాకులకు సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్నా, ఒప్పందం ప్రకారం ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నా భర్త, భార్యతో బలవంతంగా శృంగారం జరిపితే దాన్ని రేప్‌గా పరిగణించాలనే క్లాజ్ 376బిలో ఇదివరకే ఉంది. భార్య ఫిర్యాదు చేస్తే ఆ క్లాజు ప్రకారం 2 నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధిస్తారు. బ్రూటాలిటీ... బీస్టాలిటీ... పెరిగిన ఒత్తిళ్లు, ఆర్థిక అవసరాలు, కుటుంబ బాధ్యతల దృష్ట్యా భార్యాభర్తల మధ్య సెక్స్ పరంగా సత్సంబంధాలు ఉండడం లేదు. భర్త సెన్సిటైజ్ కావాలి.. అవసరం కూడా. స్త్రీకి భద్రత, భరోసా అవసరం. కాబట్టి బ్రూటాలిటీ, బీస్టాలిటీ కింద పరిగణించి మ్యారిటల్ రేప్‌ను 376బిలో చేర్చాలి. - పార్వతి, ఫ్యామిలీ కోర్టు న్యాయవాది. ఎవరు చేసినా నేరమే! సెక్సువల్ అబ్యూజ్.. సెక్సువల్ అసాల్ట్.. సెక్సువల్ అటాక్.. ఎవరు చేసినా నేరమే. మహిళ సమ్మతి లేకుండా ఆమెను బలవంతం చేస్తే అది రేప్. భర్త చేస్తే మ్యారిటల్ రేప్. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. - సంధ్య, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు బలహీనుల పక్షానే... స్త్రీ్త్ర మానసికంగా బలవంతురాలైనప్పటికీ శారీరకంగా బలహీనురాలు. రాజ్యమెప్పుడూ బలహీనుల పక్షానే నిలబడాలి. వాళ్ల హక్కులకు రక్షణ కల్పించాలి. అందులో భాగంగానే మ్యారిటల్రేప్ను చట్టం కిందికి తీసుకురావాలి. - సామాన్య, రచయిత్రి ఇద్దరూ సమానమే... మన రాజ్యాంగం ప్రకారం మన న్యాయవ్యవస్థలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే. దీనిప్రకారం ఆమె శరీరం మీద ఆమెకు హక్కు ఉన్నట్టే! ఒక మనిషి హక్కును ఇంకో మనిషి బలవంతంగా లాక్కోవడం నేరం. దాన్నే ప్రశ్నిస్తోంది వివాహిత. తన శరీరం మీద తనకున్న హక్కును పరిరక్షించే చట్టం కావాలి. అలాగే పురుషుడినీ సెన్సిటైజ్ చేయాలి. - ప్రజ్ఞారశ్మి సైకాలజిస్ట్ అందుకే విముఖత! సహజంగా భార్య ఇంటిపనితో (ఉద్యోగి అయితే బయటపని కూడా) శారీరకంగా, మానసికంగా అలసిపోయినప్పుడు. హార్మోనల్ ఇమ్బ్యాలెన్స్ ఉన్నప్పుడు. ఎండోమెట్రియాసిస్ ప్రాబ్లమ్, పెల్విక్ ఇన్ఫామెట్రీడిసీస్ ఉన్నప్పుడు. భర్త మొరటు ప్రవర్తన వల్ల కలిగే భయం వల్ల సెక్స్ పట్ల విముఖతతో ఉంటుంది స్త్రీ. ఇలాంటప్పుడు భార్యాభర్తలిద్దరూ కౌన్సెలింగ్‌కు వచ్చి సమస్యను చక్కదిద్దుకోవచ్చు. - డాక్టర్ వి.శోభ, లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
వరంగల్‌కు పార్వతి
అనుబంధాలకు, ఆత్మీయతలకు విలువ తెలియని అఖిలాండేశ్వరి ఇంట్లోకి అడుగుపెడుతుంది పార్వతి. ఎన్ని ఇబ్బందులు పడ్డా ఆ ఇంటి శ్రేయస్సునే కోరుకుంటుంది. అఖిలాండేశ్వరి కొడుకు మహేంద్ర, ఐశ్వర్యల నిశ్చితార్థం జరగాలని వరంగల్‌లోని భద్రకాళీ ఆలయానికి వెళుతుంది పార్వతి. ఈ రోజు 9 గంటలకు ఆ ఆలయానికి విచ్చేస్తున్న పార్వతిని చూడటానికి వరంగల్ పట్టణ ప్రజలు తరలి రావాలని జీ తెలుగు చానల్ ప్రతినిధి కోరారు. -
ఇరు రాష్ట్రాలలో తొలి ఫలితం బీజేపీదే
హైదరాబాద్: మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మెగిస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం బీజేపీకి దక్కింది. పుణెలోని పార్వతి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరుపున బరిలో దిగిన మాధురి సతీష్ మిశాల్ విజయం సాధించారు. అలాగే హర్యానాలో కూడా తొలి ఫలితం బీజేపీనే దక్కించుకుంది. హర్యానా కంటోన్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అనీల్ విజ్ ఆయన ఘన విజయం సాధించారు. -
ఇంతింతై... మహాగణపతియై..
సిద్ధమవుతున్న ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలకు షష్టిపూర్తి వచ్చే ఏడాది నుంచి తగ్గనున్న ఎత్తు మహాగణపతి విగ్రహం బరువు: 40 టన్నులు మహా విగ్రహంతో పాటు పక్కనున్న దేవతా విగ్రహాల తయారీకి వాడే పదార్థాలు స్టీలు: 20 టన్నులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్: 40 టన్నులు గోనె సంచులు: 10 వేల మీటర్లు బంకమట్టి: 500 బ్యాగులు (ఒకటిన్నర టన్నులు) నార: 75 బండిళ్లు( రెండున్నర టన్నులు) చాక్ పౌడర్: 100 బ్యాగులు పనివారు: 150 మంది ఖైరతాబాద్ అనగానే భక్తుల మదిలో మెదిలేది ‘మహా’గణపతి రూపం. ఏటా ఒక్కో అడుగూ పెరుగుతూ భిన్నమైన ఆకృతిలో కనువిందు చేస్తూ భక్తులతో ‘జై’ కొట్టించుకుంటున్న గణనాథుడు ఇంత భారీగా దర్శనమివ్వడం ఇదే చివరిసారి. వచ్చే ఏడాది నుంచి లంబోదరుడి రూపం ఒక్కో అడుగూ తగ్గనుంది. అవును మీరు చదివింది నిజమే. ఒక్క అడుగుతో మొదలైన గజాననుడి రూపం ఆరోహణ క్రమంలో పెరిగి ప్రస్తుతం 60 అడుగులకు చేరింది. వచ్చే ఏడాది నుంచి ఒక్కో అడుగు తగ్గుతూ అవరోహణ క్రమంలో రూపు దిద్దుకోనుంది. అందుకే ఈ ఏడాది విఘ్ననాయకుడి మహారూపం తయారీలో ప్రతి విషయమూ ప్రత్యేకమే. ఆ విశేషాలు... ఖైరతాబాద్: గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని ఖైరతాబాద్‌లో ఈ ఏడాది ఏర్పాటవుతున్న 60 అడుగుల మహాగణపతి విగ్రహానికి అన్నీ విశేషాలే. తొలిసారిగా 1954లో ఖైరతాబాద్‌లో గణపతిని ఏర్పాటు చేశారు. ఈ ఏడాదికి 60 ఏళ్లు పూర్తవుతాయి. మహా గణపతి ఈ ఏడాది 60 అడుగుల ఎత్తులో కమలంపై నిల్చొని‘కైలాస విశ్వరూప మహా గణపతి’గా దర్శనమివ్వనున్నారు. షష్టిపూర్తి (60 ఏళ్లు) సందర్భంగా ప్రత్యేకంగా వినాయకుడి కుటుంబాన్ని ఒకే ఫ్రేములోకి వచ్చే విధంగా తయారు చేస్తున్నారు. తలపై మహా సర్పం నీడలో కైలాసంలో శివుడు, పార్వతి, కుమారస్వామి, అయ్యప్ప ఉంటారు. వినాయకుడి పక్కన ఒకవైపు సిద్ధి, మరోవైపు బుద్ధి విగ్రహాలను రూపొందిస్తున్నారు. 20 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పుతో కుడివైపు లక్ష్మీ నృసింహ స్వామి, ఎడమ వైపు దుర్గామాత విగ్రహాలు ఉంటాయి. ఇప్పటి వరకు విగ్రహానికి సంబంధించిన 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ నెల 12వ తేదీలోగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పనులు పూర్తవుతాయి. 15 నుంచి రంగులు వేస్తారు. ఆగస్టు 29 (వినాయక చవితి)కి నాలుగు రోజుల ముందే పనులు పూర్తి కానున్నాయి. మహాగణపతి మొదటి రోజు పూజలకు రాష్ట్ర ముఖ్యమంత్రిని, గవర్నర్ దంపతులను ఆహ్వానిస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. మహిళలు ప్రత్యేకంగా వారికి బోనాలతో స్వాగతం పలుకుతారని చెప్పారు. వినాయకుని తయారు చేసేందుకు ఇప్పటి వరకు రూ.30 లక్షలు ఖర్చయిందని, మరో రూ.పది లక్షలకు పైగా ఖర్చు కానుందని వెల్లడించారు. ప్రసాదాన్ని విక్రయించే ప్రసక్తే లేదు.. ఖైరతాబాద్ మహాగణపతికి ఈ ఏడాది కూడా తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు 5 వేల కిలోల లడ్డూను సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు స్పష్టమైన హామీ ఇవ్వగానే తయారీ పనులు చేపడతానని ఆయన చెప్పారు. శిల్పి రాజేంద్రన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ ఈ విషయమై మాట్లాడుతూ ఐదు వేల కిలోల బరువు మోసేందుకు అనుగుణంగా మహాగణపతి చేతి నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. లడ్డూ బరువులో సగభాగం భక్తులకు పంపిణీ చేస్తామని, మిగిలిన సగభాగం ప్రసాద దాతకే ఇస్తామన్నారు. అంతేగానీ ప్రసాదాన్ని విక్రయించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. -
ఏమైందో ఏమో?
శ్రీకాకుళం క్రైం: ఏం కష్టమొచ్చిందో తలియదు... ఏం జరిగిందో అంతకంటే తెలియదు... తనను నమ్ముకుని ఉన్న మహిళను చచ్చిపోదాం రా అంటూ బలవంతంగా నాగావళి నదిలోకి తీసుకువెళ్లాడు. నదీ ప్రవాహంలో ఆ వ్యక్తి గల్లంతవగా మహిళను స్థానికులు ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. సంఘటనకు సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాలు ఇవీ... హిరమండలం మండలం పిండ్రువాడకు చెందిన జి.పార్వతి, బ్యారేజీ సమీపంలో నివాసముంటున్న బి.నాగరాజు వేర్వేరు కుటుంబాలకు చెందినవారైనప్పటికీ సన్నిహితంగా ఉండేవారు. అయితే దీనికి ఎవరూ అడ్డుచెప్పలేదు. నాగరాజుకు బీపీ ఎక్కువగా ఉండ డం, మానసిక సమస్యలు, పార్వతి నడుం నొప్పితో బాధపడుతూ ఈ నెల 25న రిమ్స్‌లో చికిత్స కోసం చేరారు. అయితే వీరిద్దరు సోమవారం ఉదయం రిమ్స్ నుంచి బయటకు వచ్చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఓ దుకాణంలో నాగరాజు పూటుగా మద్యం సేవించాడు. అక్కడి నుంచి ఇద్దరూ రిమ్స్‌కు వచ్చారు. బహిర్భూమికి వెళ్లాలంటూ నదికి పార్వతిని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా లోపలకు దింపాడు. ఇద్దరం కలిసి చచ్చిపోదామంటూ ముందుకు లాక్కువెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరూ నదిలో కొట్టుకుపోయారు. కొత్త వంతెన దాటిన తర్వాత నాగరాజు ఆచూకీ తెలియకుండాపోగా పార్వతిని ఫాజుల్‌బాగ్‌పేట రేవు వైపు అదే ప్రాంతానికి చెందిన దివాకర్ అనే వ్యక్తి రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చాడు. విషయం తెలిసి టూటౌన్ సీఐ రాధాకృష్ణ సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. అనంతరం పార్వతిని చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నాగరాజు కని పించకపోవటంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పార్వతి కోట్టుకుపోతుండటం, ఆమెను కాపాడటాన్ని కొత్త వంతెన మీద నుంచి కొందరు చూశారు. వారిని చూసి మిగిలిన వారు కూడా వాహనాలు దిగి మరీ చూడటం మొదలుపెట్టారు. దీంతో కొత్త వంతెన మీద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పట్టణ ముఖద్వారం నుంచి డేఅండ్‌నైట్ కూడలి వరకు ట్రాఫిక్ స్తంభించింది. సుమారు గంటసేపు ఇబ్బందులు తప్పలేదు. -
అన్యోన్యంగా.. ఆదర్శంగా..
లక్ష్మీనారాయణౌ గౌరీశంకరౌ భారతీ విధీ ఛాయా సూర్యౌ రోహిణీందూ రక్షేతాం చ వధూవరౌ ఒకప్పటి రోజుల్లో ఈ శ్లోకం పెళ్లికూతురు నుదుట కట్టిన ఫాలపట్టిక (భాషికం)లా- శుభలేఖకి పైభాగంలో కన్పిస్తూ ఉండేది. చాలామంది ఈ శ్లోకాన్నే పెళ్లి శుభలేఖకి పైన ఎందుకుంచేవారు? కారణం - ‘లక్ష్మీనారాయణులూ, పార్వతీ పరమేశ్వరులూ, బ్రహ్మాసరస్వతులూ, ఛాయాదేవీ సూర్యులూ, రోహిణీ చంద్రులూ అనే ఈ ఐదుజంటలూ ప్రస్తుతం వివాహం చేసుకోబోతున్న ఈ జంటను రక్షిస్తూ ఉందురు గాక!’ అని ఈ శ్లోకానికి అర్థం. అదీగాక ఈ ఐదుజంటలూ ప్రేమించుకుని పెళ్లాడిన వాళ్లే. ఇంతకీ ప్రేమపెళ్లెలా ఉంటుంది, ఎలా ఉండాలి? ఈ పురాణ పాత్రల కథలేం చెబుతున్నాయి... - డా.మైలవరపు శ్రీనివాసరావు గెలిచిన ప్రేమ రుక్మిణీ కృష్ణులది ప్రేమవివాహమే. తన శరీరం, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు అనే పంచ జ్ఞానేంద్రియాలూ తనవేనంటూ రుక్మిణి కృష్ణునికి తెలియజేసింది. అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని ద్వారా ఆ వర్తమానాన్ని పంపింది. (‘ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని కర్ణరంధ్రమ్ముల కలిమియేలా..? జన్మమేల ఎన్ని జన్మములకు?...’ అని పోతనామాత్యుడి ‘శ్రీమద్భాగవతం’లో రుక్మిణి అంటుంది). ఆ సందేశంలోని మనఃపూర్వక విధానాన్ని గమనించిన కృష్ణుడు ఆమెను పత్నిగా పరిగ్రహించాడు. భార్యగా కావాలని తీసుకువెళ్లాడు. ఆ కృతజ్ఞతాభావం ఆమెలో ఉంది కాబట్టే శ్రీకృష్ణుడు ఆ తరువాతి కాలంలో ప్రేమపరీక్షా సమయంలో ఒక్క తులసిదళంతో తూగిపోయాడు. ఇక, రాధాకృష్ణులనే ప్రేయసీప్రియుల్లో రాధ అనే ఆమె కృష్ణుని సర్వాంగాలనూ ఆరాధించే ఆరాధన మూర్తి. అయితే, అక్కడ మనమనుకునే తీరుగా ప్రేమ, పెళ్లి, సంతానమనే ధోరణి కలది కాదు. నిజమైన ప్రేమ పరమశివుడు తపస్సు చేసుకుంటుంటే ఆయన వద్ద సేవకురాలిగా చేరింది పార్వతి. ఒకరోజు ఆయన దినచర్యని గమనించింది. అంతే! ఆయన చెప్పనవసరం లేకుండా ఏ సమయానికి ఏది అవసరమో అలా సేవ చేయడం ప్రారంభించింది. అప్పటికి ఇద్దరికీ ఏ విధమైన ఆలోచనా లేనేలేదు. మన్మథుడు ప్రేమబాణం వేయగానే శంకరుడామెని మరోదృష్టితో చూశాడు. కర్తవ్యానికి విఘ్నం కలుగుతోందని గమనించి మన్మథుణ్ణి భస్మం చేశాడు. పార్వతికి ఆ విధానం నచ్చింది. ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని దీక్షతో నెరవేర్చుకుంటూన్న వేళ విఘ్నాన్ని కావాలని కలుగజేసినప్పుడు అతణ్ణి క్షమించడం నేరం కాదనే అభిప్రాయంతో శివుణ్ణే వివాహమాడాలని ప్రేమించ ప్రారంభించింది. తలిదండ్రులు కాదన్నా వినలేదు. తపస్సు ప్రారంభించింది. శంకరుడు మాయారూపంలో బ్రహ్మచారిగా వెళ్లాడు. బూడిద బుస్సన్న- ఇల్లు లేనివాడు- శ్మశాన నివాసి- బిచ్చగాడు- రుద్రాక్షధారి- లయకర్త- వాడితో నీకెందుకన్నాడు పార్వతితో. ‘శంకరుణ్ణి గురించి తెలియక నిందిస్తున్న నీ మాటలను వినడం నేర’మంటూ ఆమె వెళ్లిపోబోయింది. అంతే... శంకరుడామె చేతిని పట్టి వివాహం కావాలన్నాడు. ‘నీ ప్రేమతో దాసుణ్ణి కొనుక్కున్నా’వన్నాడు. అంతేకాదు, తల నుండి కాలి వరకూ తనలో సగభాగాన్ని ఆమెకు బహుమతిగా ఇచ్చేశాడు. తల ఆలోచనకి స్థానమైతే, కాలు ఆచరణకి సంకేతం. కాబట్టి ఆలోచన నుండి ఆచరణ వరకూ ఇద్దరం కలిసే చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ ప్రేమజంట. అంటే... పెళ్లి అయ్యాక కూడా పరస్పరం సహకరించుకుంటే అదే నిజమైన ప్రేమ అని ఈ జంట చెబుతోందన్నమాట. విజయ ప్రేమ పాలసముద్రం దగ్గరికొచ్చారు దేవతలూ రాక్షసులూ. సముద్రంలో దాగున్న లక్ష్మీదేవి గమనిస్తోంది. తాము పాముకి తలవైపు పట్టుకుని చిలుకుతామన్నారు రాక్షసులు. సరేనన్నాడు శ్రీహరి. కొంతసేపయ్యాక తోకవైపు పట్టుకుంటామన్నారు- తలవైపు నుండి విషం వస్తుంటే ఆ ఘాటుకి తట్టుకోలేక. దానిక్కూడ సరేనన్నాడు నారాయణుడు. ఇంతలో కవ్వంగా ఉన్న మందర పర్వతం కాస్తా సముద్రంలో దిగబడిపోయింది. తాబేలు రూపాన్నెత్తి పర్వతాన్ని నిలబెట్టి పనిని కొనసాగింపజేశాడు విష్ణువు. ఇలా ప్రతి సందర్భంలోనూ తన కార్యసాధన పద్ధతిని నిరూపించుకుంటూ మొత్తానికి అమృతాన్ని సాధించాడు జనార్దనుడు. శ్రీమన్నారాయణుని కార్యదీక్షాదక్షతకి ఆనందపడి ఆయనతో చూపులు కలిపింది లక్ష్మీదేవి! విష్ణువు కూడా లక్ష్మితో చూపుల్ని కలిపాడు. వారికి వివాహమైంది. ఆమెకి నివాసంగా తన వక్షఃస్థలాన్ని ఇచ్చాడు శ్రీహరి. ఆమె శ్రీహరి హృదయం మీదే నివసిస్తూ- ఆయన ఏ ఆలోచనతో ఉన్నాడో గమనిస్తూ సహకారాన్ని అందించడం ఆరంభించింది. ‘రావణుణ్ణి ఎలా వధించాలా?’ అని విష్ణువు ఆలోచిస్తుంటే వేదవతి రూపంతో వెళ్లి రావణునికి మరణ శాపాన్నిచ్చి వచ్చింది లక్ష్మి. అంటే ... పెళ్లయ్యాక కూడ పరస్పరం సహకరించుకోవడం జరిగితే ఆ ప్రేమపెళ్లి విజయవంతమైనట్లేనని భావమన్నమాట. పెళ్లికి ముందూ, పెళ్లికాలంలో, పెళ్లయ్యాక కూడ ఉండేదే ప్రేమ అని భావం! -
భయం పుట్టిస్తున్న ప్రేమ
తమిళ సినిమా, న్యూస్‌లైన్: ప్రేమ అంటే ఏహ్యభావం పుడుతుందేమోనన్న భయమేస్తోందని చెబుతోంది నటి నజ్రియా నజీమ్. గ్లామర్ పేరుతో జుగుప్సాకరమైన సన్నివేశాల చిత్రీకరణను ఖండిస్తూ సంచలన హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ మలయాళి కుట్టికి మంచి అవకాశాలు తలుపులు తడుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే వచ్చే ఏడాది ప్రథమార్థం వరకు ఈ బ్యూటీ కాల్షీట్స్ డైరీ ఫుల్ అట. ప్రస్తుతం బాలాజీ మోహన్ దర్శకత్వంలో నటిస్తున్న నజ్రియా కొన్ని ప్రత్యేక విషయాలను వెల్లడించారు. అవేమిటో ఆమె నోటనే విందాం. అదృష్టం అంతా ఒకేసారి నన్ను వరించిందని చెప్పాలి. నేను తొమ్మిదో తరగతి వరకు దుబాయ్‌లో చదివాను. దుబాయ్‌లో నాకు ఎల్కేజీ నుంచే స్నేహితులున్నారు. ఇప్పుడు వాళ్లందరినీ మిస్ అవ్వడం బాధగా ఉంది. ఆ తరువాత తిరువనంతపురంలో చదివాను. అక్కడి పాఠశాలలో ఎన్నో కట్టుబాట్లు, రెండు జడలు వేసుకోవాలి. యూనిఫామ్ దుస్తులు ధరించా లి వంటి షరతులతో ఏమిటో జీవితం అని ఫీలైన సందర్భం లేకపోలేదు. అలాంటి సమయంలో ఆదిరై, పార్వతి, అనామిక, మీనాక్షి వంటి స్నేహితురాలు లభించడం సంతోషకరమైన విషయం. అప్పటి నుంచి పాఠశాల జీవితం ఆనందమయమనే చెప్పాలి. యువి అనే నా మ్యూజిక్ ఆల్బమ్ యూ ట్యూబ్‌లో ప్రేక్షకులను అలరించింది. తిరువనంతపురంలోని కళాశాలలో బి.కాం చదవడానికి సిద్ధమయ్యాను. అయితే ఆ కళాశాలలో అడ్మిషన్‌కు మాత్రమే వెళ్లాను. ఆ తరువాత అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పటికి ఎవరైనా అధ్యాపకులు తారస పడితే తప్పకుండా కళాశాలకు రమ్మని అంటుంటారు. నటి మీరానందన్, మేగ్నారాజ్ కలిస్తే ఊరు చుట్టేస్తాం. ఎక్కడ మంచి హోటల్ ఉంటే అక్కడ చేరిపోతాం. మేగ్నారాజ్ చికెన్ ఐటెమ్స్ బాగా లాగించేస్తోంది. మీరానందన్ రకరకాల దోసెలు ఆరగిస్తుంది. నాకు మాత్రం ఈ రెండూ ఇష్టమే. తమిళ చిత్రాలే ఎక్కువ నేను ఎక్కువగా చేస్తున్నది తమిళ చిత్రాలే. నేరం, రాజారాణి, నయ్యాండి చిత్రాలు ఇప్పటికే విడుదలయ్యాయి. తిరుమణం ఎన్నుమ్ నిక్కా చిత్రం త్వరలో విడుదల కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు నా కాల్షీట్స్ డైరీ పుల్ అయ్యింది. మరిన్ని నూతన అవకాశాలు వస్తున్నాయి. రాజారాణి చిత్రంలో నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. నటుడు ఆర్య ఎప్పుడే నవ్విస్తుంటారు. ఆర్య నా కిప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు. నేనిప్పుడు సంపాదిస్తున్నానని అనవసరంగా ఏది పడితే అది కొనను. సినిమా రంగానికి రాకముందు నాకవసరం అయిన దాన్ని నాన్నే సమకూర్చేవారు. ఇప్పుడు కూడా ఏమి కావాలన్నా నాన్ననే అడుగుతా. నేను నటినైన తరువాత మంచి హ్యాండ్‌బ్యాగ్స్ ఖరీదైన సెల్ఫోన్లు కొనుక్కున్నాను. ఏ చిత్రం చూసినా ప్రేమ పాత్రలే. అయితే కథా కోణం మారుతుంది కాబట్టి అలాంటి పాత్రలు చేయడం నాకు బోర్ అనిపించడం లేదు. అయితే సినిమాల్లో ప్రేమించి, ప్రేమించి నిజ జీవితంలో ప్రేమ మీద ఏహ్యభావం కలుగుతుందేమోనన్న భయం మాత్రం కలుగుతోంది. ఎవరినైనా ప్రేమించాలనే కోరిక కలిగినా సినిమాల్లో అదే కథ చేస్తున్నాం, జీవితంలోనూ అది అవసరమా అనే భావం కలగకూడదుగా అంటోంది సంచలన నటి నజ్రియా. -
వధూవరుల జాతకంలో తప్పకుండా చూడవలసినవి ఏవి?
అసలు వివాహం అంటేనే రెండు పరస్పర విరుద్ధ జాతకాల కలయిక. ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులకు తప్పించి ఏ దంపతుల జాతకాలూ నూటికి నూరుశాతం కలవవన్న సంగతిని గుర్తుకు తెచ్చుకుని, జాతకం చూసేటప్పుడు ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. కేవలం కొన్ని ప్రాథమిక సూత్రాలు, ప్రాథమిక అంశాలు కలిస్తే చాలు. వధూవరులిద్దరి జాతకంలోనూ దశాబలం బాగుందో లేదో చూడాలి. శత్రుదశలు కాకుండా చూసుకోవాలి. షష్టాష్టక దోషం అందరికీ, అన్నింటికీ వర్తించదని కాశీనాథోపాధ్యాయ విరచిత ధర్మసింధు చెబుతోంది. ముఖ్యంగా వధూవరుల అభిరుచులు, వారి మనస్తత్వాలు కలిశాయా లేదా అన్నది ప్రధానంగా పరిశీలించాలి. కుజదోషం కూడా వధువుకు 26 సంవత్సరాలు, వరుడికి 30 సంవత్సరాలు వచ్చాక వర్తించదు. అలాగే కేవలం నక్షత్రాలు లేదా ఒకటి రెండు అంశాలు కలవలేదని సంబంధం మానుకో కూడదు. అయితే వధూవరులు ఒక ప్రాంతం, దేశం, ఒకజాతి కానప్పుడు మాత్రం కొన్ని వివరాలను కూలంకషంగా పరిశీలించక తప్పదు. -
హీరోలతో అలా నటించను
సినిమాలో మార్కెట్ కోసం గ్లామరస్‌గా నటించనని ఖరాఖండిగా చెబుతోంది నటి శరణ్యా మోహన్. కుటుంబ కథా చిత్రాల్లోనే నటిస్తానని మొదట్లో స్టేట్మెంట్స్ ఇచ్చిన చాలా మంది హీరోయిన్లు ఒకటి రెండు చిత్రాల తర్వాత పూర్తిగా గ్లామర్‌కు మారిపోతున్నారు. పూ చిత్రం ఫేమ్ పార్వతి, అనన్య, నజ్రినా నజిమ్ వంటి హీరోయిన్లు మాత్రం గ్లామర్ పాత్రలు చేయడానికి నిరాకరిస్తున్నారు. ఈ కోవకు చెందిన నటి శరణ్యా మోహన్. తమిళంలో వెన్నిలా కబడి కుళు చిత్రం ద్వారా హీరోయిన్గా తెరపైకి వచ్చిన ఈ మలయాళీ భామ బాలనటిగానే చిత్ర రంగ ప్రవేశం చేసింది. పలు చిత్రాల్లో హీరోలకు ముద్దుల చెల్లెలిగా నటించింది. టాలీవుడ్‌లోను హీరోయిన్గా అడపాదడపా నటిస్తున్న ఈ బ్యూటీ గ్లామరస్ పాత్రలకు మాత్రం ససేమిరా అంటోంది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ గ్లామర్‌గా నటిస్తేనే సినిమాలో కొనసాగగలమన్న విషయాన్ని నేను అంగీకరిస్తానని తెలిపారు. అందుకు గ్లామరస్ దుస్తులు అవసరమేనన్నారు. అలా నటించడానికి తాను సిద్ధంగా లేనని పేర్కొన్నారు. చిత్రంలో వ్యాపార దృక్పథం కోసం హీరోలతో అత్యంత సన్నిహితంగా నటించడం తనవల్లకాదన్నారు. అదే విధంగా అరకొర దుస్తులు ధరించి నటించనని వెల్లడించారు. పక్కింటి అమ్మాయిని చూడగానే ఎంత చక్కగా ఉందనిపిస్తుందో అలాంటి మంచి కథా పాత్రల్లోనే నటిస్తానని శరణ్యా మోహన్ పేర్కొన్నారు.