
వరంగల్‌కు పార్వతి
అనుబంధాలకు, ఆత్మీయతలకు విలువ తెలియని అఖిలాండేశ్వరి ఇంట్లోకి అడుగుపెడుతుంది పార్వతి. ఎన్ని ఇబ్బందులు పడ్డా ఆ ఇంటి శ్రేయస్సునే కోరుకుంటుంది. అఖిలాండేశ్వరి కొడుకు మహేంద్ర, ఐశ్వర్యల నిశ్చితార్థం జరగాలని వరంగల్‌లోని భద్రకాళీ ఆలయానికి వెళుతుంది పార్వతి. ఈ రోజు 9 గంటలకు ఆ ఆలయానికి విచ్చేస్తున్న పార్వతిని చూడటానికి వరంగల్ పట్టణ ప్రజలు తరలి రావాలని జీ తెలుగు చానల్ ప్రతినిధి కోరారు.