పవిత్రమైన పాత్రలో నటించి.. బికినీ ఫొటోలా? | Sonarika Bhadoria, who played Parvati, trolled for a bikini picture | Sakshi
Sakshi News home page

పవిత్రమైన పాత్రలో నటించి.. బికినీ ఫొటోలా?

Published Mon, May 30 2016 3:43 PM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

పవిత్రమైన పాత్రలో నటించి.. బికినీ ఫొటోలా?

పవిత్రమైన పాత్రలో నటించి.. బికినీ ఫొటోలా?

మీరు ప్రముఖమైన టీవీ నటులా? అయితే సోషల్ మీడియలో ఫొటోలు పెట్టే విషయంలో కాస్తా జాగ్రత్త ఉండండి! ఎందుకు అంటారా? ఈ విషయాన్ని సోనారికా భడోరియాను అడిగితే.. ఆమె బాగా చెప్పగలదు.

'దేవోన్‌ కా దేవ్‌ మహదేవ్‌' సీరియల్‌లో ఆమె పార్వతి పాత్రలో నటించింది. పార్వతిగా ఆమె ప్రేక్షకుల మదిలో ముద్రపడినట్టు ఉంది. ఆమె ఆ సీరియల్‌ నుంచి తప్పుకొని ఇప్పటికీ మూడేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల విహారయాత్రకు వెళ్లిన ఆమె కొన్ని ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్టు చేసింది. నీలి అలల తీరంలో సముద్ర ఒడ్డున ఆమె బికినీలో దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

దీనిపై కొందరు ఆమె అభిమానులు నొచ్చుకున్నారు. ఇదేమిటి? శివుడి ఇల్లాలైన పార్వతీదేవిగా ఎంతో పవిత్రమైన పాత్రలో కనిపించి.. ఇప్పుడిలా కురచ దుస్తులు వేసుకోవడమేమిటని పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె తీరును తప్పుబడుతూ విమర్శల వర్షం కురిపించారు. దీంతో ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్‌ అయ్యారు.

దీంతో సోనిరిక స్పందిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. 'నేను ఏ ప్రపంచంలో ఉన్నానో తెలియడం లేదు. పాశ్చాత్య దేశాల్లో బాడీషేమింగ్‌ (శరీరాకృతి గురించి విమర్శలు చేయడం)కు వ్యతిరేకంగా పోరాడుతుండగా ఇక్కడ బాడీ షేమింగ్ మాట పక్కనపెట్టండి. కనీసం బికినీ వేసుకున్నన్నా నేరంగా పరిగణిస్తున్నారు. కొన్ని నిమిషాల కిందట నేను బికినీలో దిగిన కొన్ని ఫొటోలను పెట్టాను. వాటిపై వస్తున్న వ్యతిరేక వ్యాఖ్యలు, శాపనార్థాలు తట్టుకోలేక వాటిని డిలీట్‌ చేస్తున్నాను. వాటన్నింటినీ నేను విస్మరించవచ్చు. కానీ అంత ప్రతికూలతను భరించే పరిపక్వత నాకు రాలేదు. అందుకే ఫొటోలను తీసేశాను' అని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement