వధూవరుల జాతకంలో తప్పకుండా చూడవలసినవి ఏవి? | important aspects of astrology for marriage | Sakshi
Sakshi News home page

వధూవరుల జాతకంలో తప్పకుండా చూడవలసినవి ఏవి?

Published Thu, Nov 28 2013 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM

important aspects of astrology for marriage

అసలు వివాహం అంటేనే రెండు పరస్పర విరుద్ధ జాతకాల కలయిక.  ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులకు తప్పించి ఏ దంపతుల జాతకాలూ నూటికి నూరుశాతం కలవవన్న సంగతిని గుర్తుకు తెచ్చుకుని,  జాతకం చూసేటప్పుడు ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. కేవలం కొన్ని ప్రాథమిక సూత్రాలు, ప్రాథమిక అంశాలు కలిస్తే చాలు. వధూవరులిద్దరి జాతకంలోనూ దశాబలం బాగుందో లేదో చూడాలి.  

శత్రుదశలు కాకుండా చూసుకోవాలి. షష్టాష్టక దోషం అందరికీ, అన్నింటికీ వర్తించదని కాశీనాథోపాధ్యాయ విరచిత ధర్మసింధు చెబుతోంది. ముఖ్యంగా వధూవరుల అభిరుచులు, వారి మనస్తత్వాలు కలిశాయా లేదా అన్నది ప్రధానంగా పరిశీలించాలి. కుజదోషం కూడా వధువుకు 26 సంవత్సరాలు, వరుడికి 30 సంవత్సరాలు వచ్చాక వర్తించదు. అలాగే కేవలం నక్షత్రాలు లేదా ఒకటి రెండు అంశాలు కలవలేదని సంబంధం మానుకో కూడదు.
 
అయితే వధూవరులు ఒక ప్రాంతం, దేశం, ఒకజాతి కానప్పుడు మాత్రం కొన్ని వివరాలను కూలంకషంగా పరిశీలించక తప్పదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement