
పార్వతి
కథల ఎంపిక, అనుకున్నది మొహమాట పడకుండా ధైర్యంగా బయటకు చెప్పడం వల్ల మలయాళ నటి పార్వతి సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ నటిగా ఎదిగారు. తాజాగా మరో చాలెంజింగ్ పాత్రను పోషించడానికి రెడీ అయ్యారామె. తాజా చిత్రంలో యాసిడ్ అటాక్ బాధితురాలిగా కనిపించబోతున్నారు పార్వతి. మను అశోకన్ రూపొందించబోయే ఈ చిత్రంలో టోవినో థామస్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి రచయిత సంజయ్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం నిజజీవితం నుంచి ప్రేరణ పొందిన కథ కాదు. కానీ యాసిడ్ అటాక్ జరిగిన తర్వాత వాళ్లు ఎటువంటి జీవితాన్ని గడుపుతారు అనే కోణంలో కథ సాగుతుంది. చాలా మంది యాసిడ్ దాడి జరిగిన బాధితులను కలిశాం’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం ఆల్రెడీ బెంగళూర్ మేకప్ ఆర్టిస్ట్‌లతో పార్వతి లుక్ టెస్ట్ కూడా జరిపారట. నవంబర్‌లో చిత్రీకరణ మొదలుకానుంది.
Comments
Please login to add a commentAdd a comment