
ఇరు రాష్ట్రాలలో తొలి ఫలితం బీజేపీదే
హైదరాబాద్: మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మెగిస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం బీజేపీకి దక్కింది. పుణెలోని పార్వతి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరుపున బరిలో దిగిన మాధురి సతీష్ మిశాల్ విజయం సాధించారు. అలాగే హర్యానాలో కూడా తొలి ఫలితం బీజేపీనే దక్కించుకుంది. హర్యానా కంటోన్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అనీల్ విజ్ ఆయన ఘన విజయం సాధించారు.