సమావేశంలో మాట్లాడుతున్న శివాజీ మోగే
సాక్షి,ఎదులాపురం(ఆదిలాబాద్) : సమస్యల పరిష్కారంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని మహారాష్ట్ర మాజీ మంత్రి శివాజీ మోగే అన్నారు. ప్రధానమంత్రి మోదీ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజులపాటు 81 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. పాదయాత్రకు మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, ఇతర నాయకులను ఆహ్వానించడానికి సోమవారం ఆయన ఆదిలాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సి.రాంచంద్రరెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదీ పాలనలో రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. అప్పులు ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, కుంభకోణాలపై, ప్రభుత్వ తీరును ప్రజలకు తెలిపేందుకే పాదయాత్రను తలపెట్టినట్లు తెలిపారు. పాదయాత్ర ఈ నెల 5న మహారాష్ట్రలోని పాండ్రకోడ హనుమాన్ మందిర్ నుంచి ప్రారంభమైన 8న దాబడీ వద్ద ముగుస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సి.రాంచంద్రరెడ్డి, కాంగ్రెస్ నాయకులు నరేశ్‌జాదవ్, దిగంబర్‌రావు పాటిల్, అంబకంటి అశోక్, వసీమొద్దీన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment