నటి భావనపై వేధింపుల విషయంలో జైలుకు వెళ్లారు మలయాళ నటుడు దిలీప్. ఆయన బెయిల్ మీద బయటకు రాగానే ‘ది అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ’ (అమ్మ)లో తిరిగి ఆయన్ను సభ్యుడిగా తీసుకోవడంపై కొందరు మలయాళ నటీమణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ అతన్ని అసోసియేషన్‌లోకి ఎలా తీసుకుంటారు? అసోసియేషన్ నుంచి తొలగించాలి? అని డిమాండ్ చేశారు.
ఈ విషయమై ఇటీవల డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టీవ్) సభ్యులందరూ ఓ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సమాధానంగా దిలీప్ అసోసియేషన్ నుంచి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించింది ‘అమ్మ’. ‘‘దిలీప్‌ను రాజీనామా చేయమని కోరాం. ఇది డిసిప్లినరీ యాక్షన్‌గా చేసింది అనుకోవచ్చు. ఒకవేళ దిలీప్ రాజీనామా చేయకపోతే అసోసియేషన్ నుంచి మేమే తొలగించేవాళ్లం’’ అని ‘అమ్మ’ కమిటీ పేర్కొంది.
అవకాశలు తగ్గిపోయాయి
‘‘ఎప్పుడైతే డబ్ల్యూసీసీ ఏర్పాటు చేశానో అప్పటి నుంచి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి’’ అని పేర్కొన్నారు జాతీయ అవార్డు అందుకున్న మలయాళ నటి పార్వతి. మలయాళ అసోసియేషన్ ‘అమ్మ’ వైఖరికి ఎదురుగా నిలబడి మాట్లాడారు ఈ హీరోయిన్. ఇలా ధైర్యంగా నిలబడినందుకే నాకు అవకాశాలు తగ్గాయన్నారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘ఇలా బాహాటంగా మాట్లాడినందుకు ఇండస్ట్రీలో నన్ను ఒక్కదాన్ని చేసేశారు.
వేరేవాళ్లు నాతో మాట్లాడటానికి కూడా సంకోచించేలా చేస్తున్నారు. నాకు, నా కుటుంబ సభ్యులకు ర క్షణ ఉంటుందో లేదో అని కంగారుగా ఉంది. గత నాలుగేళ్లలో నేను చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్సే. కానీ ఇటీవల ఒకే ఒక్క సినిమాకి అవకాశం వచ్చింది. కేవలం పేపర్‌లోనే కేరళ మోడరన్ సంప్రదాయాలతో ఉండే రాష్ట్రం. కానీ విషాదకర నిజమేంటంటే జనాలు ఇంకా గుడ్డి నమ్మకాలతోనే బ్రతుకుతున్నారు’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment