
కేసముద్రం: ఆలస్యంగా పరీక్ష కేంద్రా నికి చేరుకున్న విద్యార్థినిని హాల్‌లోకి అనుమతించకపోవడంతో మనస్తాపా నికి గురైన ఆమె ఇంటి వద్ద పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం భూక్యా రాంతండా గ్రామపంచాయతీ శివారు కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన జాటోతు లచ్చిరాం, శారద దంపతుల చిన్న కుమార్తె సమీరా కేసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్(హెచ్‌ఈసీ) చదువుతోంది.
అదే కళాశాలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫస్టియర్ పరీక్ష రాసేందుకు కేంద్రం వద్దకు 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని కేంద్రం నిర్వాహకులు చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంటికి చేరుకుని.. పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సమీరా చికిత్స పొందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment