
విద్యార్థులతో కలసి భోజనం చేస్తున్న హెచ్‌ఎం రమేశ్
సాక్షి, కేసముద్రం: విద్యార్థులు వేసుకునే స్కూల్ యూనిఫాంనే తానూ కుట్టించి ధరించాడు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నర్సింహులగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొడిపాక రమేశ్. శుక్రవారం ఆయన యూనిఫాంతో విధులకు హాజరు కావడంతో విద్యార్థులంతా ఆశ్చర్యంగా చూశారు. అనంతరం హెచ్‌ఎం పిల్లలతో కలసి మధ్యాహ్న భోజనం కూడా చేశారు. బుధ, శనివారం మినహా మిగతా అన్ని రోజులు స్కూల్ యూనిఫాం వేసుకునే వస్తానని హెచ్‌ఎం చెప్పారు. ఎలాంటి అసమానతలు లేకుండా విద్యార్థుల్లో కలసిపోయి వారికి విద్యాబుద్ధులు నేర్పడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రమేశ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment