school uniform
-
యూనిఫామ్ వేసుకొని పాఠాలు చెప్పే పంతులమ్మ.. ఫుల్ అటెండెన్స్
రాయ్‌పూర్‌లో ఒక టీచర్ పిల్లల్ని వినూత్నంగా ఆకట్టుకుంటోంది. వారానికి ఒకసారి వారిలాగే యూనిఫామ్ ధరించి స్కూల్‌కు వస్తోంది. ‘నేనూ మీలో ఒకదాన్నే’ అనే భావన కలిగించడమే కాదు... టీచర్ అంటే కొట్టే తిట్టే మనిషి కాదనే భరోసా ఇస్తోంది. దీంతో పిల్లలు ఫుల్లుగా స్కూల్‌కు అటెండ్ అవుతున్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి ఆమె చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం అందరి ప్రశంసలు పొదుతోంది. రాయ్‌పూర్ (చత్తిస్గఢ్)లోని గోకుల్‌రామ్ వర్మ ప్రైమరీ స్కూల్ అనే ప్రభుత్వబడిలో వారమంతా పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. శనివారం ఇంకా ఉత్సాహంగా ఉంటారు. దానికి కారణం ఆ రోజు ఆ స్కూల్ టీచర్ జాహ్నవి యదు వారిలాగే తయారయ్యి వారిలాగే యూనిఫామ్ వేసుకుని వస్తుంది. ఆ రోజు కుర్చీలో కూచోదు. వారి మధ్య కూచుని పాఠాలు, కబుర్లు చెబుతుంది. వారితో సంభాషిస్తుంది. అందుకే పిల్లలందరికీ జాహ్నవి యదు టీచర్ అంటే ఇష్టం. కొత్త ఆలోచన గోకుల్ రామ్ వర్మ ప్రైమరీ స్కూల్లో 1 నుంచి 5 వరకూ చదివే 350 మంది పిల్లలు ఉన్నారు. వారంతా ఆ చుట్టుపక్కల బస్తీవాసుల పిల్లలు. వారి తల్లిదండ్రులకు పెద్దగా చదువు లేదు. పిల్లలకు క్రమశిక్షణ అంటే తెలియదు. స్కూల్‌కు రోజూ రావడం ఇష్టం ఉండదు. యూనిఫామ్ వేసుకోరు. గత సంవత్సరం ఇదే బడిలో టీచర్‌గా చేరిన 30 ఏళ్ల జాహ్నవి యదు ఇదంతా గమనించింది. వారితో తిప్పలు పడింది. దారిలో పెట్టలేక సతమతమయ్యింది. ఈ సంవత్సరం అంటే 2023 జూన్‌లో స్కూల్ రీ ఓపెన్ అయినప్పుడు జాహ్నవి యదు కొత్త ఆలోచన చేసింది. హఠాత్తుగా ఒకరోజు వారిలాగా యూనిఫామ్ వేసుకుని వచ్చింది. పిల్లలు ఆశ్చర్యపోయారు. గుమిగూడారు. నవ్వారు. ఆనందించారు. ‘ఎందుకు టీచర్ ఇలా వేసుకొచ్చావ్’ అనంటే ‘స్కూల్‌కి మీరు ఇలాగే రావాలి. అందుకని వేసుకొచ్చా. మనందరం ఒక టీమ్. మనందరం సూపర్‌గా చదువుకోవాలి’ అని వారిని ‘మనం’ చేశాక వాళ్లు సంతోషించారు. టీచర్లా యూనిఫామ్ వేసుకురావాలని వారికీ అనిపించింది. టీచర్ కోసం రోజూ స్కూల్‌కి రావాలని కూడా. అన్నీ ప్రశంసలే జాహ్నవి యదు వారానికి ఒకరోజు అంటే ప్రతి శనివారం స్కూల్ యూనిఫామ్‌లో రావడం రాయ్‌పూర్ అంతా పెద్ద వార్త అయ్యింది. జాహ్నవి యదు చర్య వల్ల పిల్లలు బెరుకు లేకుండా తమ మనసుల్లో ఉన్నది చెప్పుకుంటున్నారని స్కూల్ అనేది టీచర్లు చావబాదే స్థలం కాదని తెలుసుకుని క్లాసులకు హాజరవుతున్నారని ఊరు మొత్తం తెలిసింది. అందరూ జాహ్నవి యదును అభినందిస్తున్నారు. ‘టీచర్లూ పిల్లలూ బడిలో సమానమే అనే భావన వ్యాప్తి చేయడమే నా ఉద్దేశం’ అని జాహ్నవి యదు చెప్పింది. అయితే ఇలాంటి బట్టల్లో రావడానికి ఆమె కొంచెం ఆలోచించింది– అత్తామామలు ఏమంటారోనని. కాని వారు అంగీకరించి దూసుకుపో కోడలు పిల్లా అని ఉత్సాహపరిచారు. దాంతో జాహ్నవి యదు పిల్లలతో ఆడిపాడుతున్నట్టుగా కనిపిస్తూ వారికి పాఠాలు చెబుతూ దారిలో పెడుతోంది. ఫేవరెట్ టీచర్ కొందరు టీచర్లు తమ కెరీర్ మొత్తం ఏ క్లాస్‌కీ ఫేవరెట్ టీచర్ కాకుండానే రిటైర్ అయిపోతారు. కొందరు టీచర్లు ప్రతి సంవత్సరం ఎంతోమంది పిల్లలకు ఫేవరెట్ టీచర్ అవుతారు. పిల్లలతో బంధం వేసుకోవడం టీచర్‌కు చాలా ముఖ్యం. అందులో ఎంతో ఆత్మతృప్తి ఉంటుంది. ఇప్పుడు స్కూల్ మొత్తానికి ఫేవరెట్ టీచర్ అయిన జాహ్నవి యదుని చూసి తాము కూడా పిల్లల కోసం ఏదైనా చేద్దామా అనుకుంటున్నారు మిగిలిన టీచర్లు. అది చాలదూ? టీచర్లూ, పిల్లలూ బడిలో సమానమే అనే భావన వ్యాప్తి చేయడమే నా ఉద్దేశం. – జాహ్నవి యదు -
ఎంసెట్, నీట్, జేఈఈకి ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్, నీట్, జేఈఈకి సన్నద్ధమవుతున్న విద్యార్థులకు టీ–శాట్ ద్వారా ఉచిత శిక్షణ కొనసాగుతుందని ఇంటర్ బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ సమయంలో 2020లో ప్రారంభించిన ఈ శిక్షణకు విద్యార్థుల నుంచి మంచి స్పందన ఉందని, ఇప్పటికే 12 వేల మంది నమోదు చేసుకు న్నారని బోర్డ్ స్పష్టం చేసింది. జాతీయ పోటీ పరీక్షలపై సమగ్ర శిక్షణ ఇవ్వడమే కాకుండా, మోడల్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. టీ–శాట్ ద్వారా సాయంత్రం 6.30 గం టల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సదు పాయాన్ని వినియోగించుకోవచ్చని సూచించింది. ఇంజనీరింగ్ పీజీసెట్– 2022 గడువు పెంపు ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఇంజనీరింగ్ పీజీసెట్ (టీఎస్ పీజీఈసీఈటీ– 2022) దరఖాస్తులకు అపరాధ రుసుము లేకుండా ఈనెల 30 వరకు గడువు పొడిగించి నట్లు కన్వీనర్ లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు. చివరి సంవత్సరం పరీక్షలు రాసే బీఈ, బీటెక్ విద్యార్థులు, వివిధ రకాల సెమిస్టర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూసే ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా పీజీఈసెట్‌కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 15లోగా విద్యార్థులందరికీ యూనిఫాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ జూలై 15లోగా యూనిఫాం అందజేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈమేరకు షెడ్యూల్‌ను రూపొందించి జిల్లా, మండల విద్యాశాఖాధికారులతో పాటు, పాఠశాల ప్రధానోపాధ్యా యులకు పంపింది. మొత్తం 33 జిల్లాల్లో 22,78,569 మంది విద్యార్థులున్నట్టు గుర్తించారు. వీరికి 67,75,522 మీటర్ల వస్త్రం అవసరమని అంచనా వేసి, ఈమేరకు ఆర్డర్లు ఇచ్చారు. మొదటి దశలో 24,69,214 మంది విద్యార్థులకు జూలై 4వ తేదీలోగా యూనిఫాం అందించాలని, మిగతా విద్యార్థులకు జూలై 15లోగా ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశించింది. కొత్తగా ప్రవేశం పొందే వారికి కూడా యూని ఫాం ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామని, ఈ ప్రక్రియ జూలై నెలాఖరుకల్లా పూర్తయ్యే వీలుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. (క్లిక్: గురుకులాల్లో మరో 1,000 కొలువులు!) -
పేదరైతు కొడుకు పాట.. నసీబ్‌ను మార్చేసింది
Viral Kid Sahdev Dirdo: సోషల్ మీడియా ఎప్పుడు.. ఎవరిని.. ఎలా ఫేమస్ చేస్తుందో ఊహించడం కష్టం. అయితే సానుకూల ధోరణి, లేదంటే వ్యతిరేక విమర్శలతోనైనా సరే పాపులర్ అయిపోతుంటారు. ఇక దక్కిన పాపులారిటీని నిలబెట్టుకోలేక కనుమరుగు అయ్యేవాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇదిలా ఉంటే ‘ జానే మేరీ జానేమన్.. బస్‌పన్ క్యా ప్యార్ మేరా..’ అంటూ ఓ సాంగ్ రీమిక్స్ వెర్షన్ నార్త్ ఇండియాను తెగ ఊపేస్తోంది. కారణం ఈ పాటను యూనిఫాల్లో ఉన్న సహదేవ్ అనే పిలగాడు అమాయకంగా పాడడమే. రాయ్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా చింద్‌ఘడ్‌కు చెందిన సహదేవ్ డిర్దో(14).. ఈ కుర్రాడు నార్త్ ఇండియాలో ఇప్పుడు ఇంటర్నెట్ స్టార్. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ పిల్లాడి వీడియో మొత్తం దేశానికి చేరింది. ఆపై రీమిక్స్తోడై సోషల్ మీడియా ఊగిపోతోంది. టీవీ షోల దగ్గరి నుంచి ఫిల్మ్సెలబబ్రిటీల దాకా ఈ చిన్నారి గాత్రాన్ని ఎక్కించేసుకున్నారు. బుల్లితెర రియాలిటీ షోలు అయితే ప్రతీరోజూ ఈ పాటను వాడేసుకుంటున్నాయి. చివరికి ఆ చిన్నారి టాలెంట్-దక్కిన ఫేమ్కి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ సైతం ఫిదా అయ్యారు. సహదేవ్‌ను పిలిపించుకుని ఘనంగా సన్మానించారు కూడా. ఇంతకీ రెండేళ్ల క్రితం ఆ పిలగాడు పాడిన పాట ఎలా వైరల్ అయ్యిందంటే.. बचपन का प्यार....वाह! pic.twitter.com/tWUuWFP71f — Bhupesh Baghel (@bhupeshbaghel) July 27, 2021 కమలేష్ బారోత్ అనే ప్రైవేట్ ఆల్బమ్స్ సింగర్ కమ్ ఆర్టిస్ట్ కంపోజ్ చేసిన ‘బచ్పన్ కా ప్యార్’ సాంగ్ 2019లో యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యింది. నార్త్‌లో రూరల్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది ఈ పాట. ఆ టైంలో స్కూల్లో తన టీచర్ కోసం ‘బచ్(స్)పన్ క్యా ప్యార్’ అంటూ పాడేశాడు ఏడో తరగతి చదివే సహదేవ్. ఆ పాట ఆ టీచర్‌ను ఆకట్టుకోవడంతో ఫోన్లో రికార్డు చేశాడు. ఇంటర్నెట్లో అప్లోడ్ చేసినప్పటికీ.. అది వైరల్ అవ్వడానికి రెండేళ్లు పట్టింది. అటు ఇటు తిరిగి ఈ పాట ర్యాపర్ బాద్షా చేతికి చేరింది. ఇంకేం అతగాడు దాన్నీ రీమిక్స్ చేసి ఇన్స్టాగ్రామ్ వదిలాడు. దీంతో ఆ వాయిస్ ఎవరిదా? అనే ఆరాలు ఎక్కువయ్యాయి. చివరికి మీడియా హౌజ్‌ల చొరవతో ఎట్టకేలకు చిన్నారి సహదేవ్ వెలుగులోకి వచ్చాడు. View this post on Instagram A post shared by BADSHAH (@badboyshah) ఫ్రెండ్సే చూపించారు సహదేవ్ తండ్రి పేద రైతు. ఉన్న కొద్ది భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. తల్లి కూలీ పనులకు వెళ్తుంటుంది. ఇక మనోడు గవర్నమెంట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇంతకీ ఈ పాట ఎలా బట్టీపట్టావ్ అని అడిగితే.. తన ఇంట్లో టీవీ లేదని, రోడ్డు మీద టీవీల్లో చూసి బట్టీపట్టానని అమాయకంగా చెప్తున్నాడు సహదేవ్. ఇక ఇప్పుడు ఇంటర్నెట్లో తన పాట వైరల్ అయ్యింది కూడా తన స్నేహితుడి తండ్రి మొబైల్లోనే చూశాడట. ఊరంతా తనని ‘సూపర్‌స్టార్’ అని పిలుస్తున్నారని మురిసిపోతున్నాడు సహదేవ్. ఈ చిన్నారి కుటుంబ ఆర్థికస్థితి తెలిసి చాలామంది దాతలు సాయానికి ముందుకు వస్తున్నారు. మరోవైపు ఈ సాంగ్ రీమిక్స్ కారకుడైన ర్యాపర్ బాద్షా.. ఈ కుర్రాడికి తనతో కలిసి ఆల్బమ్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. View this post on Instagram A post shared by vishnu_singh91 (@only_mod031zzz) -
స్కూల్ యూనిఫాంలో ప్రధానోపాధ్యాయుడు
సాక్షి, కేసముద్రం: విద్యార్థులు వేసుకునే స్కూల్ యూనిఫాంనే తానూ కుట్టించి ధరించాడు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నర్సింహులగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొడిపాక రమేశ్. శుక్రవారం ఆయన యూనిఫాంతో విధులకు హాజరు కావడంతో విద్యార్థులంతా ఆశ్చర్యంగా చూశారు. అనంతరం హెచ్ఎం పిల్లలతో కలసి మధ్యాహ్న భోజనం కూడా చేశారు. బుధ, శనివారం మినహా మిగతా అన్ని రోజులు స్కూల్ యూనిఫాం వేసుకునే వస్తానని హెచ్ఎం చెప్పారు. ఎలాంటి అసమానతలు లేకుండా విద్యార్థుల్లో కలసిపోయి వారికి విద్యాబుద్ధులు నేర్పడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రమేశ్ చెప్పారు. -
చొక్కా కోసం కోర్టుకెళ్లాడు...
సాక్షి, బళ్లారి: పేదరికంలో మగ్గుతున్న ఓ విద్యార్థి తనకు కష్టం వచ్చిందని బాధపడుతూ కూర్చోలేదు. హక్కుల కోసం న్యాయస్థానం తలుపు తట్టాడు. కొప్పళ తాలూకా కిన్నాళ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థి మంజునాథ్ ఓ రోజు పాఠశాలకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. తాను ధరించిన చొక్కా అపరిశుభ్రంగా ఉంది. మరో చొక్కా వేసుకుందామంటే అదీ చిరిగిపోయింది. ప్రభుత్వం విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫామ్ పంపిణీ చేయాల్సి ఉండగా.. ఒక జత మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకుంది. దీంతో మంజునాథ్ యూనిఫామ్ పంపిణీలో ప్రభుత్వ జాప్యాన్ని, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించకూడదని తండ్రిని అడిగాడు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నించవచ్చని.. కోర్టుకు సైతం వెళ్లవచ్చని తండ్రి దేవరాజ్ చెప్పాడు. కుమారుడిని హైకోర్టు న్యాయవాది అజిత్ వద్దకు తీసుకెళ్లి విషయం తెలిపాడు. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేయొచ్చని న్యాయవాది సలహా ఇవ్వడంతో విద్యార్థి మంజునాథ్ ఈ ఏడాది మార్చి 25న రిట్ వేశాడు. విచారణకు స్వీకరించిన హైకోర్టు ›ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ మహమ్మద్ నవాజ్‌తో కూడిన డివిజన్ బెంచ్ సుదీర్ఘంగా విచారించి గురువారం కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఆర్టీఈ (రైట్ టు ఎడ్యుకేషన్) యాక్ట్ ప్రకారం రెండు నెలల్లోపు యూనిఫామ్‌తోపాటు షూ, సాక్సులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. కేసు వేసిన విద్యార్థికి రెండు వారాల్లోపు రెండు జతల యూనిఫామ్, షూ, సాక్సులు ఇవ్వాలని కోర్టు ప్రత్యేకంగా సూచించింది. కోర్టు తీర్పు అనంతరం బాలుడు మంజునాథ్ మాట్లాడుతూ తన అర్జీపై హైకోర్టు స్పందించి ఆదేశాలు ఇవ్వడం సంతోషం కలిగించిందన్నాడు. తన పోరాటానికి తండ్రి దేవరాజ్ సహకారం ఇవ్వడం వల్లే విజయం సాధించానని చెప్పాడు. -
నేను చెప్పినా కుట్టు పని ఇవ్వరా !
– మీరు కుట్టించిన దుస్తులు ఎలా ఇస్తారో చూస్తా? – అధికారులపై ధర్మవరం నియోజకవర్గ అధికార పార్టీ ముఖ్య నేత ఒత్తిడి – గతేడాది ముదిగుబ్బ మండల విద్యార్థులకు అందని యూనిఫాం – నేటికీ జిల్లా కేంద్రంలో మూలుగుతున్న యూనిఫాం అనంతపురం ఎడ్యుకేషన్ : ‘నా నియోజకవర్గంలో నేను చెప్పిన వాళ్లకు కాకుండా ఎవరికో కుట్టు పని ఇస్తానంటే నేనెలా ఒప్పుకుంటా. మీ ఇష్టానుసారమా? మీరు కుట్టించి పంపిస్తే మావాళ్లు తీసుకోవాలా? ఎలా ఇస్తారో చూస్తా’ ఇదీ ధర్మవరం నియోజకవర్గ ముఖ్యనేత.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంకు సంబం«ధించి అధికారులపై చేసిన ఒత్తిడి. ఫలితంగా 2016–17 విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలకు యూనిఫాం పంపిణీ చేసినా ముదిగుబ్బ మండలానికి ఆగిపోయింది. అధికారులు స్వయంగా సదరు నేతను కలిసి ప్రాథేయపడినా దుస్తులు తీసుకునేందుకు ససేమిరా అన్నట్లు తెలిసింది. ఆయన ఆదేశాల మేరకే ముదిగుబ్బ ఎంఈఓ.. జిల్లా కేంద్రం నుంచి వచ్చిన దుస్తులను తీసుకోకుండా వెనక్కు పంపారు. మండలంలో దాదాపు 80 స్కూళ్లలోని 6,900 మంది విద్యార్థులకు గానూ కేవలం ఏడు స్కూళ్లకు మాత్రమే యూనిఫాం పంపిణీ చేశారు. తక్కిన విద్యార్థులు ఏడాదిగా యూనిఫాం కోసం ఎదురు చూస్తున్నారు. తనవారికి ‘కుట్టు’ బాధ్యతలివ్వలేదనే... ప్రతిసారి సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలోనే యూనిఫాం కుట్టు బాధ్యతలు అప్పగించేవారు. అయితే గతేడాది రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు ఆప్కో అధికారులే క్లాత్ సరఫరాతో పాటు కుట్టించి దుస్తులు సరఫరా చేశారు. అయితే ధర్మవరం నేత.. తన అనుచరులకు కుట్టు బాధ్యతలివ్వాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. తమ చేతుల్లో లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కోవారే చూస్తున్నారని విన్నవించారు. అయినా ఆయన వినలేదు. దుస్తులు తీసుకోకుండా వెనక్కు : కుట్టించిన దుస్తులను జిల్లా కేంద్రం నుంచి ముదిగుబ్బకు తీసుకెళ్తే అక్కడి ఎంఈఓ తీసుకునేందుకు ఒప్పుకోలేదు. తాను దుస్తుల్ని తీసుకోలేనని సదరు ప్రజాప్రతినిధిని కలవాలంటూ సలహా ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో అధికారులు వెళ్లి నేతను కలిసినా...తనవారికి కాకుండా ఎవరికో కుట్టు పనులిస్తే ఎలా ఒప్పుకుంటానని గట్టిగా చెప్పారు. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దుస్తులు తీసుకోరని స్పష్టం చేశారు. దీంతో అధికారులు ఆయన్ను ఒప్పించలేక వెనుతిరిగారు. ఏది ఏమైనా ఆయన నిర్వాకంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు ఏడాదిపాటు యూనిఫాం లేకుండా పోయింది. మరి ఈసారి కూడా ఎలా చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరం. మళ్లీ మాట్లాడతా.. దీనిపై ఆప్కో మేనేజర్ గురుప్రసాద్‌ను వివరణ కోరగా ముదిగుబ్బ మండలానికి సంబంధించి యూనిఫాం ఇంకా సరఫరా చేయలేదని అక్కడ ‘ప్రత్యేక సమస్య’ నెలకొందంటూ దాట వేశారు. తక్కిన విషయాలను మళ్లీ మాట్లాడతానంటూ చెప్పుకొచ్చారు. ఎస్ఎస్ఏ అధికారులను వివరణ కోరగా ‘‘ముదిగుబ్బ మండలానికి సంబంధించిన దుస్తులు తీసుకోకుండా ఎంఈఓకు వెనక్కు పంపారు. ఓ నేతను కలవాలని చెప్పారు. ఆయనేమో ఒప్పుకోలేదు. దుస్తులు వెనక్కు తీసుకొచ్చాం. ఆ దుస్తులకు సంబంధించిన డబ్బులు కూడా అప్కోకు చెల్లించలేదు.’ అన్నారు. -
ఇక అందరికీ ఒకే యూనిఫామ్
వెల్లింగ్టన్: పాఠశాలస్థాయి నుంచే లింగ వివక్షను నిర్మూలించాలన్న ఉద్దేశంతో న్యూజిలాండ్‌లోని ఓ పాఠశాల యూనిఫామ్ విషయంలో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులైనా, విద్యార్థినులైనా ఒకేరకమైన యూనిఫామ్ ధరించేలా కోడ్‌ను రూపొందించింది. దక్షిణ ఐస్లాండ్లోని డునెడిన్ నార్త్ ఇంటర్మీడియట్ స్కూల్‌కు చెందిన విద్యార్థినుల ఫిర్యాదు మేరకు పాఠశాల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. తమకు మగపిల్లల్లా ప్యాంటు, షర్ట్ వేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ డిమాండ్ చేయడంతో పాఠశాల యాజ మాన్యం అనుమతిచ్చింది. అయితే కొంతమంది అమ్మాయిలు మాత్రమే మగపిల్లల్లా యూనిఫామ్ వేసుకొని రావడంతో.. చాలామంది వారిని ఆటపట్టించడం మొదలుపెట్టారు. నువ్వు అమ్మాయివా? అబ్బాయివా? అంటూ పాఠశాల సిబ్బందే ప్రశ్నిం చడంతో.. మరోసారి విద్యార్థినులంతా మరోసారి యాజమాన్యం దగ్గరకు వచ్చారు. దీంతో యూని ఫామ్ విషయంలో మార్పులు చేర్పులు చేయాలని భావించి... లింగభేదం లేకుండా అంతా ఒకే యూనిఫామ్ వేసుకొచ్చేలా నిబంధనలు రూపొం దించారు. అయితే తాము తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల్లో లింగసమానత్వాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. -
అంగన్వాడీ పిల్లలకు యూనిఫాం
శిశు, మహిళా సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ చక్రవర్తి వెల్లడి గుంటూరు వెస్ట్: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లలో సుమారు 11 లక్షల 50 వేల మంది పిల్లలు ఉన్నారని, వారికి యూనిఫాం విధానాన్ని అమలు చేయబోతున్నట్టు శిశు, మహిళా సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ చక్రవర్తి వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవర్గాల సహకారంతో పిల్లలకు యూనిఫాం అందించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడేళ్లలో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు శిశు, మహిళా సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ కేఆర్బీహెచ్ఎన్ చక్రవర్తి తెలిపారు. శిశు, మహిళా సంక్షేమశాఖ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 30 వేల కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. 25 వేల కేంద్రాలకు భవనాలు నిర్మించాల్సి ఉండగా, 4 వేల భవనాలు నిర్మాణదశలో ఉన్నట్టు చెప్పారు. రూ.7.50 లక్షల వ్యయంతో ఒక్కొక్క భవనాన్ని నిర్మించనున్నట్టు చెప్పారు. ఇందులో రూ.5 లక్షలు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.50 వేలు, శాఖాపరంగా రూ.2 లక్షలు ఖర్చుచేయనున్నట్టు తెలిపారు. ఇటీవల 6,600 భవనాల నిర్మాణాలకు పరిపాలనపరమైన అనుమతులు లభించాయని, 1500 భవనాల పనులు ప్రారంభించినట్టు తెలిపారు. బోధనా పద్ధతులపై వర్కర్లకు శిక్షణ అంగన్వాడీ సెంటర్ల ద్వారా పిల్లలకు మంచివిద్యను అందించేందుకుగాను ఈనెల 8వ తేదీ నుంచి ఇంగ్లీష్‌తోపాటు బోధనా పద్ధతులపై రాష్ట్రవ్యాప్తంగా వర్కర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. అంగన్వాడీ సెంటర్లలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి పిల్లల హాజరు నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. యూనియన్లలో చేరమని ఒత్తిడి చేస్తే చర్యలు అంగన్వాడీ కార్యకర్తలను అధికార పార్టీ యూనియన్‌లో చేరమని సూపర్వైజర్లు, సీడీపీఓలు, ఇతర సిబ్బంది ఎవరైనా ఒత్తిడిచేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. యూనియన్లను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కార్యకర్తలకు ఉంటుందన్నారు. -
కుట్టుకూలీలో కమీషన్ల కక్కుర్తి...
యూనిఫామ్‌కు ఎసరు * దాదాపు 17 లక్షల విద్యార్థులకు అందని స్కూలు దుస్తులు * కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం * కుట్టుపనిలోనూ కమీషన్ల కక్కుర్తే కారణం * మహిళా సంఘాలకే కుట్టు పనులివ్వాలని సీఎంవో ఆదేశం * అలా వీలుపడదని విద్యాశాఖ అభ్యంతరం * విద్యాశాఖ అధికారుల ఉత్తర్వులకు అడ్డుపడ్డ మంత్రి గంటా * ఎస్ఎంసీ, సంఘాల మాటున టీడీపీ నేతల అక్రమాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులంటే ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో వారికి రెండు జతల యూనిఫామ్ దుస్తులు ఇవ్వాల్సి ఉన్నా వాటి సరఫరాలో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఏటా అక్టోబర్ 15 లోపల కుట్టుపనులు పూర్తిచేసి.. ఆ నెలాఖరులోపు విద్యార్థులకు దుస్తుల పంపిణీ పూర్తి చేయాలి. కానీ, విద్యా సంవత్సరం మరో నెలన్నరలో ముగియడానికి వస్తున్నా సగానికి పైగా పేద విద్యార్థులకు యూనిఫాంలు ఇప్పటికీ అందించలేకపోయారు. రాష్ట్రంలో 31,51,968 మంది విద్యార్థులకు యూనిఫామ్‌లు సరఫరా చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ కేవలం 14,79,184 మందికి మాత్రమే అందించినట్లు నాలుగు రోజుల క్రితంనాటి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా 16,72,784 మంది విద్యార్థులకు యూనిఫామ్ అందలేదు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క విద్యార్థికీ అందకపోగా, సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి జిల్లా విశాఖపట్నంలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అన్ని రంగాల్లోనూ కమీషన్లకు అలవాటు పడిన పాలకులు.. దుస్తుల కుట్టుకూలీ విషయంలోనూ అదే రీతిన వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో తమకు అనుకూలంగా వ్యవహరించడంలేదన్న కారణంతో ఉన్నతాధికారి ఒకర్ని ఆ బాధ్యతల నుంచి తప్పించిన విద్యాశాఖ పెద్దలు ఆ తరువాత యూనిఫాం అందజేతపై దష్టి సారించిన దాఖలాలు లేవు. ఈ విద్యాసంవత్సరం మరో నెలలో ముగిసిపోతున్నా.. ఇంకా సగం మంది స్కూలు విద్యార్థులకు దుస్తులు అందని దుస్థితి నెలకొంది. ప్రభుత్వం దుస్తుల కోసం రూ. 126 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో సాధ్యమైనంత కమీషన్ల పేరిట దండుకోవడానికి ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అధికారులు, అటు మంత్రి అనుచరగణం ప్రయత్నించడంతో లక్ష్యం నెరవేరలేదు. కమీషన్ల కోసమే.. విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం స్కూల్ మేనేజ్మెంటు కమిటీ (ఎస్ఎంసీ)ల ద్వారా దుస్తులను కుట్టించి విద్యార్థులకు అందించాలి. ఆ ఎస్ఎంసీలకు ముడి వస్త్రాన్ని ఆప్కో పంపిణీ చేయాలి. దానిని ఎస్ఎంసీలు దుస్తులు కుట్టించి విద్యార్థులకు అందిస్తాయి. వస్త్రం, కుట్టు పని చార్జీలు మొత్తం స్కూల్ కమిటీల ద్వారానే చెల్లింపులు చేస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం సహకారమందించే ఈ రూ. 126 కోట్ల పనిని కొన్ని సంస్థలకే అప్పగించి తమ కమీషన్ ముందుగా తీసుకోవాలని అటు సీఎంవో, ఇటు మంత్రి కార్యాలయం అధికారులు భావించారు. దీంతో వారు దుస్తుల కుట్టు పనిని ముందుకు సాగకుండా అడ్డుపడ్డారు. ఎస్ఎంసీలకు బదులు మహిళా సంఘాలకు పనులు అప్పగించాలని సీఎంవో అధికారి ఒకరు కొత్త ప్రతిపాదనలు తె రపైకితెచ్చారు. ఇది సాధ్యం కాదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్‌ఎంసీలకే పనులు అప్పగించేలా 2015 నవంబర్ 15న ఆదేశాలు జారీచేశారు. దీనికి మంత్రి గంటా అభ్యంతరం చెప్పారు. దీంతో ఆ ఉత్తర్వులు పెండింగ్‌లో పడ్డాయి. తర్జనభర్జనల అనంతరం ఎస్‌ఎంసీల ద్వారానే దుస్తుల పనిని కొనసాగించాలని అదేనెల 29న మళ్లీ ఆదేశాలు ఇచ్చారు. అయితే పేరుకు ఎస్‌ఎంసీల ద్వారా చేయిస్తున్నట్లు రికార్డుల్లో చూపుతున్నా జిల్లాల్లో ఈ వ్యవహారాన్ని మహిళా సంఘాల పేరిట ప్రైవేట్ వ్యక్తులకే ధారాదత్తం చేశారు. జిల్లాల్లో అక్రమాలెన్నో.. విద్యార్థుల దుస్తుల పంపిణీ వ్యవహారం జిల్లాల్లో అక్రమాలమయంగా మారింది. స్కూలు యాజమాన్య కమిటీలు, స్వయం సహాయక సంఘాల మాటున అధికార పార్టీకి చెందిన నేతలు కొందరు కోట్లాది రూపాయలు గల్లంతు చేస్తున్నారు. ఎస్ఎంసీ ద్వారానే ఈ దుస్తులను కుట్టించాల్సి ఉన్నా కొందరు అధికారపార్టీ నేతలు ఉన్నతస్థాయిలో ఒత్తిడి తెచ్చి జిల్లాల వారీగా తమ వారికే ఈ పనులు దక్కేలా చేశారు. పేరుకే స్కూలు యాజమాన్యాలు కాగా దుస్తుల వ్యవహారం ఆ కమిటీలకు సంబంధం లేకుండానే సాగుతోంది. సరైన ప్రమాణాలు, కొలతలు పాటించకుండానే దుస్తులను కుడుతున్నారు. దీంతో అవి విద్యార్థులకు సరిపోవడం లేదు. 2015 అక్టోబర్ 15 నాటికి దుస్తుల కుట్టుడం పూర్తికావాలని, అదేనెల 30వ తేదీకి పంపిణీ కూడా పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియా గతంలో ఆదేశాలు జారీచేశారు. కానీ ఆ పంపిణీ ఇప్పటికీ 47 శాతం కూడా పూర్తి కాలేదు. సీఎంవో అధికారుల ఆదేశాలు.. విద్యాశాఖ అధికారులు నిర్లిప్తత ఫలితంగా యూనిఫామ్ పంపిణీ వ్యవహారం అస్తవ్యస్తంగా సాగడంతో పాటు పలు అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎంవో నుంచే నేరుగా ఉత్తర్వులు కేంద్రప్రభుత్వ ఆర్థిక సాయంతో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు రెండు జతల దుస్తులను అందించాలి. ఒక్కొక విద్యార్థికి రూ. 400 ఖర్చు పెట్టాలి. అందులో రూ. 80 కుట్టుకూలికి, రూ. 320 వస్త్రానికి ఖర్చు చేస్తారు. రాష్ట్రంలో ఈ స్కూళ్లలో ఎనిమిదో తరగతి వరకు చదివే విద్యార్థులు 31,51,968 మంది ఉన్నారు. వీరితో పాటు 9, 10 చదువుతున్న 2,17,875 మందికీ యూనిఫామ్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఘనంగా ప్రకటించింది. అయితే ఇప్పటి వరకూ ఒక్కపైసా కూడా విడుదల చేయలేదు. కస్తూర్బా బాలికల పాఠశాలల్లో 8,9,10 తరగతుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్‌లు పంపిణీ చేయాల్సి ఉన్నా ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక దుస్తులు కుట్టించడం.. పంపిణీ ఎస్‌ఎంసీల ద్వారానే చేయించాలని విద్యాశాఖాధికారులు ముందు భావించినా సీఎంవో అధికారుల జోక్యంతో అది వక్రమార్గం పట్టింది. మహిళా సంఘాలను తెరపైకి తెచ్చి.. ఏ జిల్లాలో ఏ సంఘానికి కుట్టుపని అప్పగించాలో కూడా సీఎంవో అధికారులే నిర్దేశించారు. సీఎం చంద్రబాబు సూచించిన సంఘాలకు కుట్టుపనులు ఇవ్వాలని సీఎం సహాయ కార్యదర్శి జి.రామసుబ్బయ్య పేరిట సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) అధికారులకు లేఖ అందింది. దీంతో విద్యాశాఖాధికారులు ఎస్ఎంసీలకు బదులు సంఘాలకు పనులు అప్పగించేలా జిల్లాల అధికారులకు సూచనలు పంపారు. నెల్లూరు జిల్లాలో సగమే.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మొత్తం 3,462 పాఠశాలలున్నాయి. వీటిలో 1,791 పాఠశాలలకు యూనిఫామ్ అందజేశారు. ఇంకా 1,661 పాఠశాలలకు దుస్తులను ఆందజేయాల్సి ఉంది. అధికారులు మాత్రం దుస్తులు టైలర్లు దగ్గర ఉన్నట్లు చెబుతున్నారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని సైదాపురం, డక్కిలితో పాటు మరికొన్ని మండలాల్లో ఇప్పటికీ యూనిఫాం దుస్తులు ఎంఈవో కార్యాలయాల్లోనే ఉన్నాయి. యూనిఫామ్‌ను కుట్టే బాధ్యతను ఎక్కువగా ప్రైవేటు ఏజెన్సీలకు అప్పజెప్పారు. జిల్లాలో ఓబులరెడ్డి, మంజునాథ్ గార్మెంట్స్, సీడ్ స్వచ్ఛంద సంస్థ, అనితారెడ్డి, వీరభధ్ర గార్మెంట్స్, కష్ణమూర్తి తదితర ప్రైవేటు సంస్థలకు ఈ పనులు అప్పగించారు. కొన్ని ప్రాంతాల్లో పొదుపు సంఘాలతో ఈ దుస్తులను కుట్టిస్తున్నారు. విజయనగరం జిల్లాలో పరిస్థితి ఇది విజయనగరం జిల్లాలో 3,044 ప్రభుత్వ, కేజీబీవీ, ఆదర్శ, ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. మొత్తం 34 మండలాలకుగానూ యూనిఫాంలను 14 మండలాలలో మాత్రమే పూర్తి స్థాయిలో పంపిణీచేశారు. డీఆర్డీఏ పరిధిలోని 11 మండలాలలో 7 మండలాలకు, నాలుగు ప్రైవేటు సంస్థల కుట్టు బాధ్యత తీసుకున్న 23 మండలాల్లో 7 మండలాలలో విద్యార్థులకు పంపిణీ చేశారు. కొన్ని మండలాలలో స్థానిక అధికార పార్టీ నేతల చేతులమీదుగా పంపిణీ చేయడానికి నిరీక్షించడం వల్ల దుస్తులు సిద్ధంగా ఉన్నప్పటికీ పంపిణీలో జాప్యమవుతోంది. విద్యాసంవత్సరం ఆరంభించిన రెండు నెలలకు సంబంధిత నిధులు వచ్చాయి. తర్వాత తీవ్ర జాప్యం వల్ల నవంబర్ మొదటి వారంలో జిల్లా కేంద్రానికి వస్త్రం వచ్చింది. 11 మండలాల పరిధిలో సంబంధిత మండలాల మహిళా స్వయం సహాయక సంఘాలకు కుట్టు బాధ్యత అప్పగించారు. మిగిలిన 23 మండలాల్లో దుస్తుల కుట్టు పనిని నాలుగు ప్రైవేటు కుట్టు సంస్థలకు అప్పగించారు. డబ్బులిస్తేనే కుట్టిస్తాం.. జిల్లాల్లో కుట్టుపని పొందిన సంఘాలు తమకు నచ్చిన ప్రైవేటు వ్యక్తులు, కుట్టు సంస్థలకు ఈ పనులు అప్పగించి కమీషన్లు తీసుకున్ననట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని సంఘాలు తమకు ముందుగా కుట్టు పని డబ్బులు ఇస్తేనే దుస్తులు కుట్టి ఇస్తామని మొండికేస్తుండడంతో దుస్తుల పంపిణీ సజావుగా సాగడం లేదు. కుట్టు నిధులను ఎస్‌ఎంసీల ద్వారానే విడుదల చేస్తున్నందున తాము ఆ కమిటీ చుట్టూ తిరగలేమని, నేరుగా నిధులిచ్చేయాలని ఒత్తిడిచేస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లాలకు పూర్తిగా నిధులు విడుదల చేసినా దుస్తుల పంపిణీ మాత్రం పూర్తికాలేదు. మిగిలిన విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం ముగిసేలోగా అందుతాయో లేదో వేచిచూడాలి. తూర్పుగోదావరిలో ఒక్క జత కూడా పంపిణీ కాకపోగా మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సొంత జిల్లా విశాఖ.. దుస్తుల పంపిణీలో ఆఖరి స్థానం దక్కించుకోవడం విశేషం. సీఎం సూచించిన సంఘాలు.. సాయిరాం స్వయంశక్తి సంఘం (శ్రీకాకుళం), సిద్ధివినాయక మహిళాసంఘం (విజయనగరం), అప్పన్నబాబు గ్రూపు(విశాఖ), ధనలక్ష్మీ శక్తిసంఘం, మాద సుభాషిణి గ్రూపు (తూ.గోదావరి), శ్రీప్రేమసాయి గ్రూపు (కృష్ణా), శ్రీశివసాయి ప్రణతి మహిళా గ్రూపు (గుంటూరు), చాముండేశ్వరి గ్రూపు (నెల్లూరు), ఉషోదయా గ్రూపు (వైఎస్సార్), సరస్వతి గ్రూపు (కర్నూలు), బాలాజీ గ్రూపు, పి.స్వాతి గ్రూపు (చిత్తూరు), వెంకటేశ్వర మహిళామండలి (అనంతపురం), సాయిగణేశ మహిళాశక్తి సంఘం (ప్రకాశం) సీఎం సొంత జిల్లాలో ఇలా.. సీఎం సొంత జిల్లా చిత్తూరులో 4,384 మంది బాలురు, 4,376 మంది బాలికలు మొత్తం 8,760 మంది విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాం అందలేదు. జిల్లాలోని 66 మండలాలుకు గాను ఏర్పేడు, రామసముద్రం, కేవీబీ పురం మండలాల్లో ఇంకా పిల్లలకు యూనిఫాం ఇవ్వనేలేదు. గతంలో పాఠశాల ఎస్ఎంసీ ఖాతాలకు యుూనీఫామ్కి సంబంధించి నిధులు విడుదలయ్యేవి. తరువాత ప్రైవేటు సంస్థ నుంచి వస్త్రం కొనుగోలు చేసి కుట్టించి ఇవ్వాల్సి ఉండటంతో యుూనీఫాం అందటం ఆలస్యం అయ్యేవి. ఈ జాప్యాన్ని నివారించటంతోపాటు విద్యా సంవత్సరం ఆరంభం నాటికే విద్యార్థులకు రెండు జతలు దుస్తులు అందించాలనుకున్నారు. అధికారపార్టీ నాయుకులు జోక్యం చేసుకుని కమీషన్ల కోసం యుూనీఫాం కుట్టే బాధ్యత తావుు సిపార్సు చేసిన ఏజెన్సీలకే అప్పగించాలంటూ అధికారులకు హుకుం జారీ చేశారు. కుట్టు బాధ్యత దక్కించుకున్న ఏజెన్సీలు ఇప్పటి వరకు కొన్ని పాఠశాలలకు అందించనేలేదు. బిల్లులు చెల్లించకపోవడంతోనే ఏజెన్సీలు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
స్కూల్ యూనిఫాంలో సల్మాన్..
ముంబయి: బాలీవుడ్లోనే కాక దేశ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు సంపాధించుకున్న చిత్రం షోలేకు ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ స్కూల్ యూనిఫాంలో వెళ్లాడట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలిపారు. ఈ నెలలో షోలే చిత్రం విడుదలై 40 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న క్రమంలో ఆచిత్రంతో తనకున్న అనుభవాలు పంచుకున్నారు. అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సల్మాన్ తండ్రి సలీం ఖాన్ కో స్క్రిప్టును అందించారు. షోలే ప్రీమియర్ షోకు వెళ్లే సమయంలో తాను తన సోదరుడు అర్బాజ్ ఖాన్‌తో సింధియా పాఠశాలలో ఉన్నానని, స్కూల్లో ఉండగానే తన తండ్రి సలీంఖాన్ స్కూల్‌కి వచ్చి నేరుగా మినర్వా థియేటర్‌కు తీసుకెళ్లాడని, ఆ సమయంలో తాను తన సోదరుడు స్కూల్ యూనిఫాంలో ఉన్నామని తెలిపాడు. తన జీవితంలోని అనుభవాల్లో షోలే చిత్ర ప్రీమియర్‌కు వెళ్లడం గొప్పదని పేర్కొన్నాడు. ఆ సమయంలో అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ఇంకా జన్మించలేదు కూడా. -
యూ‘నో’ఫాం
- విద్యాసంవత్సరం ప్రారంభమై 3 నెలలు అవుతున్నా సరఫరా కాని యూనిఫాం - ఇక కుట్టేదెప్పుడు.. కట్టేదెప్పుడు - జిల్లాకు రూ.6 కోట్లు కేటాయింపు - రూ.3 కోట్లు ఆప్కోకు విడుదల - ఎయిడెడ్ విద్యార్థుల పట్ల వివక్ష సాక్షి, కడప : ప్రతి యేడాది లాగే ఈ యేడాది విద్యార్థులకు యూనిఫాం కష్టాలు తప్పడం లేదు. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం మాత్రం అందలేదు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఈ వారంలో మొదలు కావడం చూస్తుంటే మరో మూడు నెలలకైనా యూనిఫాం అందుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,566 పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతులు చదివే విద్యార్థులకు యూనిఫాంను సర్వశిక్షా అభియాన్ పథకం ద్వారా ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. ఈ పథకం ద్వారా జిల్లాలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున యూనిఫాం అందజేయాల్సి ఉంది. ప్రభుత్వం విద్యార్థులకు అందజేయాల్సిన దుస్తులకు సంబంధించిన కాంట్రాక్టును ఆప్కో సంస్థకు కేటాయించారు. అయితే సంస్థకు ఇప్పటి వరకు ఎటువంటి మొత్తం అందజేయకపోవడంతో వారు కేవలం మండలాల వారీగా విద్యార్థుల వివరాలు, ఇండెంట్ మాత్రం సేకరించి మిన్నకుండిపోయారు. కాగా నాలుగు రోజుల క్రితం దుస్తుల కోసం ఎస్ఎస్ఏకు దాదాపు రూ. 6కోట్లు మంజూరు కాగా ఇందులో 50 శాతం నిధులను విడుదల చేసినట్లు తెలిసింది. దీంతో ఆప్కో సంస్థ ఆగమేఘాల మీద విద్యార్థులకు దుస్తులను సమకూర్చే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. కుట్టేదెప్పుడు... కట్టేదెప్పుడు.. విద్యార్థులకు దుస్తులు కుట్టే బాధ్యతను ఎస్ఎస్ఏ అధికారులు మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘాలకు కేటాయించారు. దీంతో వారికి రేపో మాపో దుస్తులు కుట్టే బాధ్యత అప్పగించనున్నారు. ఇప్పటికే మూడు నెలల ముచ్చట ముగిసింది. ఇక దాదాపు 4 లక్షల దుస్తులను ఎప్పుడు కుడతారో.. పాఠశాలలకు ఎప్పుడు అందజేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో దసరా సెలవుల ముందైనా అందజేస్తారా లేదా అన్న మీమాంసలో విద్యార్థులు ఉన్నారు. ప్రతిసారీ ఇదే వరుస.. విద్యార్థుల విషయంలో ప్రతిసారీ ఇదే వరుస కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా.. విద్యార్థుల దుస్తుల విషయంలో మాత్రం పురోగతి కనిపించడం లేదు. ప్రతిసారీ పాఠశాలల పునఃప్రారంభ సమయంలో బడిబాట పేరుతో హంగామా చేసే అధికారులకు యూనిఫాం గుర్తుకు రాకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వాలు విద్యార్థుల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతున్నా ఉన్న పథకాలను విస్మరించకుండా సరైన సమయంలో విద్యార్థులకు యూనిఫాం అందజేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఎయిడెడ్ విద్యార్థుల పట్ల ఎందుకీ వివక్ష.. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ, జిల్లా పరిషత్, నగరపాలక, పురపాలక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నభోజనం, ఉచిత దుస్తులను ప్రభుత్వం అందజేస్తోంది. అయితే అదే ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఎయిడెడ్ పాఠశాలల పట్ల మాత్రం ప్రభుత్వం వివక్ష చూపుతోంది. మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలను అందజేస్తున్న ప్రభుత్వం ఉచిత దుస్తుల విషయంలో మాత్రం ఎందుకు మీనవేషాలు లెక్కిస్తున్నారో అంతుచిక్కడం లేదు.