స్కూల్ యూనిఫాంలో సల్మాన్.. | Salman Khan Watched Sholay in His School Uniform | Sakshi
Sakshi News home page

స్కూల్ యూనిఫాంలో సల్మాన్..

Published Tue, Aug 11 2015 11:50 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

స్కూల్ యూనిఫాంలో సల్మాన్.. - Sakshi

స్కూల్ యూనిఫాంలో సల్మాన్..

ముంబయి: బాలీవుడ్లోనే కాక దేశ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు సంపాధించుకున్న చిత్రం షోలేకు ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ స్కూల్ యూనిఫాంలో వెళ్లాడట. ఈ విషయాన్ని ఆయన  స్వయంగా తెలిపారు. ఈ నెలలో షోలే చిత్రం విడుదలై 40 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న క్రమంలో ఆచిత్రంతో తనకున్న అనుభవాలు పంచుకున్నారు. అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సల్మాన్ తండ్రి సలీం ఖాన్ కో స్క్రిప్టును అందించారు.

షోలే ప్రీమియర్ షోకు వెళ్లే సమయంలో తాను తన సోదరుడు అర్బాజ్ ఖాన్తో సింధియా పాఠశాలలో ఉన్నానని, స్కూల్లో ఉండగానే తన తండ్రి సలీంఖాన్ స్కూల్కి వచ్చి నేరుగా మినర్వా థియేటర్కు తీసుకెళ్లాడని, ఆ సమయంలో తాను తన సోదరుడు స్కూల్ యూనిఫాంలో ఉన్నామని తెలిపాడు. తన జీవితంలోని అనుభవాల్లో షోలే చిత్ర ప్రీమియర్కు వెళ్లడం గొప్పదని పేర్కొన్నాడు. ఆ సమయంలో అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ఇంకా జన్మించలేదు కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement