sholay
-
థియేటర్లలో ఫ్లాప్.. కానీ 25 కోట్ల టికెట్స్ సేల్.. ఆ సినిమా ఏదంటే? (ఫొటోలు)
-
బాహుబలి, దంగల్, ఆర్ఆర్ఆర్.. ఆ సినిమాను టచ్ కూడా చేయలేకపోయాయి!
ప్రస్తుతం సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడడం లేదు. భారీ బడ్జెట్ సినిమాలకు సైతం బాక్సాఫీస్ వద్ద అభిమానుల నుంచి ఆదరణ కరువవుతోంది. కానీ సినిమా హిట్ అయిందంటే చాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీల ప్రభావంతో ఎంత హిట్ సినిమా అయినా నెల రోజుల్లోపే స్ట్రీమింగ్కు వస్తుండడంతో థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కలెక్షన్ల పరంగా ఓకే అనుకున్నప్పటికీ తొందరగానే థియేటర్ల నుంచి కనుమరుగవుతున్నాయి. కానీ.. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్, జవాన్, కేజీఎఫ్-2 లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు సైతం ఆ ఒక్క విషయంలో మాత్రం ఇప్పటికీ ఆ రికార్డ్‌ను అధిగమించలేకపోయాయి. నాలుగు దశాబ్దాల క్రితం నమోదైన ఆ రికార్డ్‌ను ఇప్పటివరకు ఏ చిత్రం దాటలేకపోయింది. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం. అప్పట్లోనే అంటే.. నాలుగు దశాబ్దాల క్రితం సినిమా నెలకొల్పిన రికార్డ్ మాత్రం ఇప్పటిదాకా చెక్కు చెదరలేదు. థియేటర్లలో అత్యధికంగా వీక్షించిన భారతీయ చిత్రంగా నిలిచింది ఆ మూవీనే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల టిక్కెట్లు అమ్ముడైన సినిమాగా సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక టికెట్స్ అమ్ముడైన మూవీగా చరిత్రలో నిలిచిపోయింది. అదే అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని నటించిన షోలే మూవీ. రమేశ్ సిప్పీ డైరెక్షన్లో 1975లో వచ్చిన ఈ సినిమా క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక టికెట్స్ విక్రయించిన సినిమాగా రికార్డులకెక్కింది. అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన ఇండియన్ సినిమా షోలే చిత్రాన్ని మిగతా ఇండియన్ సినిమాల కంటే ఎక్కువ మంది థియేటర్లలో వీక్షించారు. బాక్సాఫీస్ వద్ద అందిన సమాచారం ప్రకారం 1975-80 మధ్య కాలంలో కేవలం భారతదేశంలోనే రికార్డు స్థాయిలో 18 కోట్ల టిక్కెట్లను విక్రయించారు. అంతే కాకుండా ఈ సినిమా 60 థియేటర్లలో స్వర్ణోత్సవాలు కూడా జరుపుకుంది. బొంబాయి మినర్వా థియేటర్లో ఏకంగా ఐదేళ్లపాటు ప్రదర్శించారు. ఈ మూవీ ఓవర్సీస్లో దాదాపు 2 కోట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అప్పటోనే ఈ చిత్రం సోవియట్ రష్యాలో విడుదల కాగా..4.8 కోట్ల మంది ప్రేక్షకులు ఆదరించారు. ఇండియాతో పాటు ఓవర్సీస్ కలిపితే మొత్తం ఈ చిత్రం 25 కోట్ల టికెట్స్ అమ్ముడయ్యాయి. షోలే ఫ్లాప్ టాక్.. అయితే థియేట్రికల్ రన్ ముగిసే సరికి ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్ల వసూళ్లు సాధించింది. మొఘల్-ఎ-ఆజామ్, మదర్ ఇండియా రికార్డులను అధిగమించింది. మొదట ఈ చిత్రానికి హిట్ టాక్ రాలేదు. మొదటి రెండు వారాల్లో ఫ్లాప్ మూవీగా ముద్ర వేశారు. కానీ చివరికీ అన్నింటిని అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. బాహుబలి, దంగల్, ఆర్ఆర్ఆర్లు, కేజీఎఫ్ సినిమాలు సైతం షోలేను దాటలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల కలెక్షన్స్ వచ్చినప్పటికీ టికెట్స్ అమ్మకం విషయంలో అధిగమించలేకపోయాయి. బాహుబలి -2 ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 20 కోట్ల ప్రేక్షకులు వీక్షించగా.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ -2 చిత్రాలకు పది కోట్ల మంది థియేటర్లకు వచ్చారు. అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం దంగల్ కూడా 10 కోట్ల మంది మాత్రమే థియేటర్లలో వీక్షించారు. గతేడాది రిలీజైన షారూక్ ఖాన్ జవాన్ కేవలం రూ.4 కోట్ల మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ రోజుల్లో చాలా సినిమాలు కోటి టిక్కెట్ల అమ్మకాలు కూడా దాటలేకపోతున్నాయి. -
దిగ్విజయ్–కమల్నాథ్లది జై– వీరూ బంధం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ల పాత్రపై మరోసారి చర్చ మొదలైంది. దిగ్విజయ్, కమల్‌నాథ్‌ల మధ్య రాజకీయ సమీకరణాలను.. బ్లాక్ బస్టర్ ‘షోలే’ చిత్రంలోని ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్లు పోషించిన జై, వీరూ పాత్రల మధ్య బంధంతో కాంగ్రెస్ పార్టీ పోల్చింది. రాష్ట్రంలో టిక్కెట్ల కేటాయింపులో ఇద్దరు నేతల మధ్య విభేదాల వార్తలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా శనివారం పైవ్యాఖ్యలు చేశారు. ‘షోలే సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్‌ల మధ్య విలన్ గబ్బర్ సింగ్ ఎలా గొడవ పెట్టలేకపోయాడో.. రాష్ట్రంలో గబ్బర్ సింగ్ వంటి బీజేపీ కూడా మధ్య విభేదాలను సృష్టించలేకపోయింది’ అంటూ వ్యాఖ్యానించారు. -
బసంతీ... వాట్ ఈజ్ యువర్ నేమ్?
‘హాలీవుడ్ షోలే’ పేరుతో విడుదలైన ఏఐ జెనరేటెడ్ వీడియో ఇమేజ్‌లు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ‘షోలే’లోని ప్రధాన క్యారెక్టర్లకు హాలీవుడ్ ప్రముఖ నటుల ముఖాలను సూపర్ ఇంపోజ్ చేశారు. ఈ వీడియో క్లిప్‌లలో రాబర్ట్ డి నిరో ‘జై’, అల్ పసినో ‘వీరు’, జూలియా రాబర్ట్స్ ‘బసంతి’, కెవిన్ స్పేసీ ‘ఠాకూర్’, జాక్ నికల్సన్ ‘గబ్బర్‌సింగ్’లుగా కనిపిస్తారు. ‘అంతా బాగానే ఉందిగానీ ఠాకూర్ పాత్రకు కెవిన్‌ను ఎంపిక చేసుకోవడం బాగోలేదు. ఎందుకుంటే ఠాకూర్ నిజాయితీపరుడు. ముక్కుసూటి మనిషి. కెవిన్ సైకో పాత్రలకు పెట్టింది పేరు’ ‘షోలే అనేది ఎన్నో హాలీవుడ్ సినిమాల కాపీ. మెయిన్ ప్లాట్ 7 సమురాయ్, కొన్ని పవర్ఫుల్ సీన్లను వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ వెస్ట్ సినిమాలలో నుంచి తీసుకున్నారు’... ఇలా రకరకాలుగా నెటిజనులు స్పందించారు. -
Holi 2021: కలర్‌ఫుల్ కలర్స్
ఒక్కరు ఆడరు. మనుషులు గుంపులు. రంగులు బోలెడు. మీసం రంగు మారుతుంది. గాజులు వేరే రంగుకొస్తాయి. ఆట ఒక రంగు. పాట ఒక రంగు. వయసులో ఉన్న కుర్రదీ కుర్రాడూ ఒక రంగు. హోలీ వెలిసిన క్షణాలను దూరంగా విసిరేస్తుంది. ఉత్సాహ కణాలను దేహంలో నింపుతుంది. ఈ పండుగను పెద్ద తెర పండుగ చేసుకుంది. హిందీ సినిమాల్లో హోలీది మహాకేళీ. అందరికీ రంగుల చెమేలీ పూలు. హోలీలో ఎన్ని రంగులు ఉంటాయి? అన్నీ. హిందీ సినిమాల్లో హోలీని అడ్డు పెట్టుకుని ఎన్ని సీన్లు ఉంటాయి? అన్నే. వెండితెర అంటేనే కలర్ఫుల్గా ఉంటుందని కదా... మరి ఆ కలర్‌ఫుల్ తెరకే రంగులు అద్దితే ఎలా ఉంటుంది? చూద్దాం.. ‘మదర్ ఇండియా’ను మొదట చెప్పుకోవాలి. కలర్లో పాత్రలు హోలీ ఆడింది ఆ సినిమాలోనే. ఆడించినవాడు దర్శకుడు మెహబూబ్ ఖాన్. ‘హోలీ ఆయిరే కన్హాయి హోలీ ఆయిరే’ పాట అందులోదే. వితుంతువైన తల్లి నర్గిస్ తన ఇద్దరు కొడుకులు సునీల్ దత్, రాజేంద్ర కుమార్ గ్రామస్తులతో కలిసి పాడుతూ ఉంటే పులకించి భర్త రాజ్‌కుమార్‌తో తాను హోలి ఆడిన రోజులను గుర్తు చేసుకుంటుంది. కొడుకుల జీవితం, భవిష్యత్తు రంగులమయం కావాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. కాని వారిలో ఒక కొడుకు చెడ్డ రంగును, ద్రోహపు రంగును, ఊరికి చేయదగ్గ అపకారపు రంగును పులుముకుంటే ఆ తల్లి ఏం చేస్తుంది? ఆ రంగును కడిగి మురిక్కాలువలో పారేస్తుంది. ‘మదర్ ఇండియా’లో నర్గిస్ అదే చేస్తుంది. బందిపోటుగా మారిన కొడుకు సునీల్‌దత్‌ను ఊరి అమ్మాయిని ఎత్తుకుని పోతూ ఉంటే కాల్చి పడేస్తుంది. దేశం గురించి సంఘం గురించి ఆలోచించేవారు ఆ పనే చేస్తారు. సొంత కొడుక్కి తల్లి కావడం ఎవరైనా చేస్తారు. దేశానికి తల్లి కాగలగాలి. మదర్ ఇండియా చెప్పేది అదే. ‘కటీ పతంగ్’ రాజేష్ ఖన్నా 1969–71ల మధ్య ఇచ్చిన వరుస 17 హిట్స్‌లో ఒకటి. ఆ కథ ఒక ‘వితంతువు’ ఆశా పరేఖ్‌కు కొత్త జీవితం ప్రసాదించడం గురించి. నిజానికి ఆశాపరేఖ్ వితంతువు కాదు. మరణించిన స్నేహితురాలి కోసం వితంతువుగా మారింది. ఆమెను రాజేష్ ఖన్నా ప్రేమిస్తాడు. వైధవ్యం పాపం, శాపం కాదని అంటాడు. హోలి వస్తుంది. ‘ఆజ్ న ఛోడేంగే బస్ హమ్ జోలి’అని రాజేష్ ఖన్నా పాట అందుకుంటాడు. కాని తెల్లబట్టల్లో ఉన్న ఆశా పరేఖ్ దూరంగా ఉంటుంది. ఎందుకంటే వితంతువులు హోలి ఆడకూడదు. వారికి ఇక శాశ్వతంగా మిగిలేది తెల్లరంగే. కాని రాజేష్ ఖన్నా ఇందుకు అంగీకరించడు. పాట చివరలో రంగుల్లోకి లాక్కువస్తాడు. క్లయిమాక్స్‌లో ఆమెకు రంగుల జీవితం ఇస్తాడు. భర్త చనిపోవడంతో జీవితపు రంగులు ఆగిపోవడం ఒక వాస్తవం కావచ్చు. కాని జీవితం ముందు ఉంది. కొత్త రంగును తొడుక్కుంటే అది తప్పక మన్నిస్తుంది. ‘షోలే’లో గబ్బర్ సింగ్ మనుషుల్ని ఠాకూర్ సంజీవ్ కుమార్ ఆదేశం మేరకు అమితాబ్, ధర్మేంద్రలు తన్ని తగలేస్తారు. మరి గబ్బర్ సింగ్ ఊరుకుంటాడా? రామ్‌గఢ్‌పై దాడి చేయాలనుకుంటాడు. ‘కబ్ హై హోలి.. హోలి కబ్ హై’ అని అడుగుతాడు. ఈ సంగతి తెలియని రామ్‌గఢ్ వాసులు హోలీ వేడుకల్లో మునిగి ‘హోలికె దిన్ రంగ్ మిల్ జాయేంగే’ అని పాడుకుంటూ ఉంటారు. హటాత్తుగా గబ్బర్ ఊడిపడతాడు. ఊరంతా అల్లకల్లోలం. అగ్నిగుండం. అమితాబ్ దొరికిపోతాడు. ధర్మేంద్ర కూడా దొరక్క తప్పదు. ‘నా కాళ్ల మీద పడి క్షమాపణ కోరితే వదిలేస్తాను’ అంటాడు గబ్బర్ వాళ్లతో. అమితాబ్ బయలుదేరుతాడు. ఏం జరుగుతుందా అని అందరిలోనూ ఉత్కంఠ. గబ్బర్ కాళ్ల దగ్గరకు నమస్కారం పెట్టడానికన్నట్టు వొంగిన అమితాబ్ అక్కడ కింద ఉన్న రంగులు తీసి తటాలున గబ్బర్ కళ్లల్లో కొడతాడు. చూసిన ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. ఈ సీన్ హోలి సీన్లన్నింటిలో తలమానికం. గబ్బర్ భరతం పట్టిన సీన్ అది. ‘సిల్సిలా’లో అమితాబ్ రేఖా ప్రేమించుకుంటారు. కాని అమితాబ్ జయా బచ్చన్‌ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. రేఖ సంజీవ్ కుమార్‌ను. రెండు జంటలూ తమ జీవితాలు గడుపుతూ ఉండగా అమితాబ్, రేఖ తిరిగి తారసపడతారు. తమలో ఇంకా ప్రేమ ఉందనుకుంటారు. తమ పెళ్లిళ్లు అర్థం లేనివని భావిస్తారు. తమ తమ భాగస్వాముల మధ్య ఆ సంగతి సూచనగా చెప్పడానికి హోలిని ఎంచుకుంటారు. ‘రంగ్ బర్సే’ పాటను అమితాబ్ పాడుతూ పరాయివ్యక్తి భార్య అని కూడా తలవకుండా రేఖ వొడిలో తల పెట్టుకుని కేరింతలు కొడతాడు. కాని పెళ్లయ్యాక ఈ దేశంలో గతన్నంతా బావిలో పారేయాల్సి ఉంటుంది. పెళ్లికే విలువ. దాని పట్లే స్త్రీ అయినా పురుషుడైనా విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి. చివరిలో ఆ సంగతి అర్థమయ్యి అమితాబ్, రేఖ తమ తమ పెళ్లిళ్లకు నిబద్ధులవుతారు. కాని ఈలోపు వారి వివాహేతర ప్రేమను చూపే పద్ధతిలో ట్రీట్మెంట్ దెబ్బ తిని సినిమా కుదేలైంది. ఇదో చేదురంగు. ‘దామిని’లో హోలీ క్రూర రంగులను చూపిస్తుంది. అందులో మీనాక్షి శేషాద్రి పెద్దింటి కోడలు. కాని మరిది ఆ ఇంట్లో హోలీ రోజున ఆ గోలలో పని మనిషిపై అత్యాచారం చేస్తాడు. మీనాక్షి శేషాద్రి ఆ దుర్మార్గాన్ని చూస్తుంది. దారుణంగా బాధను అనుభవించిన పని మనిషికి న్యాయం చేయడానికి మీనాక్షి శేషాద్రి తన వైవాహిక బంధాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడుతుంది. అన్యాయానికి తగిన శిక్ష అనుభవించాల్సిందే అని నిలబడుతుంది. ఆమె మీద ఎన్నో దాడులు. కాని దాడులు నిండినదే లోకం అయితే లోకం ఉంటుందా? ఎవరో ఒకరు తోడు నిలుస్తారు. మీనాక్షి శేషాద్రికి తోడుగా సన్ని డియోల్ నిలుస్తాడు. పోరాడతాడు. న్యాయం జరిగేలా చూస్తాడు. న్యాయం గెలిచినప్పుడు ఆ రంగులకు వచ్చే తేజం గొప్పది. ‘డర్’ సినిమా దౌర్జన్యప్రేమను చూపిస్తుంది. అసలు ‘నో’ అనే హక్కు, స్వేచ్ఛ స్త్రీలకు ఉందని కూడా కొందరు మూర్ఖప్రేమికులకు తెలియదు. ఉన్మత్తంగా ప్రేమించినంత మాత్రాన ఆ ప్రేమ గొప్పది అయిపోదు. ‘డర్’లో జూహీ చావ్లాను ప్రేమించిన షారూక్ ఖాన్ ఆమె వివాహం అయ్యాక కూడా వెంటపడతాడు. ఆమె ఇంట్లో హోలీ చేసుకుంటూ ఉంటే ముఖాన రంగులు పూసుకుని ప్రత్యక్షమవుతాడు. భయభ్రాంతం చేస్తాడు. ఎంత హింస అది. రంగు ముఖానికి పూసుకుంటే బాగుంటుంది. కళ్లల్లో పడితే బాగుంటుందా? కళ్లల్లో పడే రంగును ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. చివరకు ఆ రంగు సముద్రంలో కలిసిపోతుంది. రంగులు అన్నీ మంచివే. కాని కొన్ని రంగులు కొందరికి నచ్చవు. అలాగే కొన్ని జీవన సందర్భాలు కూడా నచ్చవు. కాని నచ్చని రంగులు ఉన్నప్పుడే నచ్చే రంగులకు విలువ. నచ్చని జీవన సందర్భాలు ఉన్నప్పుడే నచ్చే జీవన సందర్భాలకు విలువ. పాడు రంగులనూ పాత గాయాలనూ వదిలి కొత్త రంగుల్లోకి కొత్త ఉత్సాహాల్లోకి ఈ హోలి అందరినీ తీసుకెళ్లాలని కోరుకుందాం. హ్యాపీ హోలీ. – సాక్షి ఫ్యామిలీ -
అప్పట్లోనే రూ. 35 కోట్లు వసూలు చేసిందా సినిమా
ఒక పర్ఫెక్షనిస్ట్ చెక్కిన సినీ శిల్పం... షోలే రమేశ్ సిప్పికి నేడు 74వ జన్మదినం జరుపుకొని 75 లోకి అడుగుపెడుతున్నాడు. ఇంకో నాలుగేళ్లకు షోలే వచ్చి 50 ఏళ్లు అవుతుంది. రమేష్ సిప్పి, షోలే, భారతీయ కమర్షియల్ సినిమా వేరు వేరు కాదు. వాటిని ఒక స్థాయికి తీసుకెళ్లి పెద్ద సినిమాల రథానికి బావుటా కట్టి పరిగెత్తించినవాడు అతడు. సగటు ప్రేక్షకులను గట్టి కథతో రంజింప చేయవచ్చని నమ్మి అతడు తీసి షోలే నేటికీ కోట్లాది ప్రేక్షకులకు ఆరాధ్య చిత్రం. దర్శకుడు రమేశ్ సిప్పి పూనుకోకపోతే, ధైర్యం చేయకపోతే, హ్యూజ్‌గా ఇమేజిన్ చేయకపోతే భారతీయులు గర్వంగా చెప్పుకోవడానికి, ఆరాధించడానికి, పదే పదే చూడటానికి ‘షోలే’ ఉండేది కాదేమో. ‘సుపుత్రా కొంప పీకరా’ అని సామెత. కాని రమేష్ సిప్పీ ‘సుపుత్రా గంపకెత్తరా’ అన్నట్టు తండ్రి జి.పి.సిప్పీ చేత భారీ పెట్టుబడి పెట్టించి, ‘షోలే’ తీయించి దాని మీద తరతరాలు డబ్బు గంపకెత్తేలా చేశాడు. 1975లో మూడు కోట్లతో తీసిన సినిమా అది. కాని ఎంత వసూలు చేసిందో తెలుసా ఆ రోజుల్లో? 35 కోట్లు. అంటే ఇవాళ్టి లెక్కలో 800 కోట్ల రూపాయలు. అదీ ఫస్ట్ రీలీజ్లో. ఆ తర్వాత షోలే సంవత్సరాల తరబడి రీ రిలీజ్ అవుతూనే ఉండింది. కోట్లు సంపాదిస్తూనే ఉండింది. సిప్పీలకు చిల్లర ఖర్చు కావాల్సినప్పుడల్లా షోలే రిలీజ్ చేస్తుంటారన్న జోక్ కూడా ఉంది. రమేశ్ సిప్పి తండ్రి జి.పి.సిప్పిని చూసి సినిమాల్లోకి వచ్చాడు. జావేద్ అఖ్తర్‌లతో స్నేహం కట్టి ‘సీతా ఔర్ గీతా’ తీశాడు. ఆ సినిమా హిట్ అయ్యాక ‘అబ్బాయ్... ఏదైనా పెద్ద సినిమా తీయరా’ అని తండ్రి కోరితే అకిరా కురసావా ‘సెవన్ సమురాయ్’, హిందీలో వచ్చిన ‘మేరా గావ్ మేరా దేశ్’ సినిమాల స్ఫూర్తితో జావేద్ అఖ్తర్‌లతో కలిసి షోలే కథ తయారు చేసుకున్నాడు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ‘దొంగను పట్టుకోవడానికి దొంగలను నియమించడం’ దీని కథ. ఆ దొంగ గబ్బర్ సింగ్, అతణ్ణి పట్టుకునే దొంగలు వీరూ, జయ్. రమేశ్ సిప్పీ షోలే కోసం అంతముందు లేని చాలా మార్పులను సినిమాల్లోకి తెచ్చాడు. సినిమాస్కోప్, సెవెంటి ఎంఎం. స్టీరియోఫొనిక్... ఇవన్నీ ఆయన తప్పనిసరి అనుకున్నాడు. గతంలో బందిపోటు సినిమాలంటే గుహలు, చంబల్ లోయలు, నల్లబట్టలు, పెద్ద పెద్ద తిలకాలు ఉండేవి. సిప్పి ఆకుపచ్చ మైదానాలు, కొండగుట్టలు ఉన్న కర్ణాటక ప్రాంతం ఎంచుకున్నాడు. స్టంట్స్ కోసం ప్రత్యేకంగా విదేశీ నిపుణులను తీసుకొచ్చాడు. ఆర్.డి.బర్మన్ రీరికార్డింగ్ ఈ సినిమాకు అమోఘంగా కుదిరింది. షోలే దాదాపు రెండేళ్లు తీశారు. ఆ రోజుల్లో జితేంద్ర వంటి హీరోలు ఇంత వ్యవధిలో మూడు సినిమాలు చేసేవారు. కాని రమేశ్ సిప్పి తన పర్ఫెక్షనిజమ్ పిచ్చితో తాను నచ్చిన విధంగా షాట్ వచ్చినప్పుడే ఓకే చేశాడు. సినిమా మొదలులో వచ్చే ట్రైన్ రాబరీ కోసం మొత్తం 49 రోజులు పని చేశారు. కుటుంబాన్ని గబ్బర్‌సింగ్ చంపేశాక ఠాకూర్‌గా సంజీవ్ కుమార్ వచ్చి వారి శవాలను చూసే సీన్ సినిమాలో రెండు మూడు నిమిషాలు ఉంటుంది. కాని దానిని 7 రోజులు తీశారు. ‘రమేశ్ సిప్పీ ఏం చేయబోతున్నాడో’ అని అందరూ భయపడే స్థాయిలో సినిమా తీశాడు. రమేశ్ సిప్పి ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే షోలే లో ‘స్టేషన్ సే గాడీ జబ్’ పాటలో హేమమాలిని టాంగా నడుపుతూ ఉంటే ధర్మేంద్ర ఆమెను టీజ్ చేస్తూ పాడుతూ ఉంటాడు. ఒక షాట్లో దూరంగా ట్రైన్ వస్తూ ఉంటే షాట్ తీయాలని అనుకున్నారు. ట్రైన్ వచ్చే టైము తెలుసుకొని షాట్ కోసం రెడీగా ఉన్నారు అంతా. ఆ షాట్ ఫెయిల్ అయితే మళ్లీ రేపు ట్రైన్ వచ్చే వరకూ ఆగాలి. ట్రైన్ వస్తున్నట్టు దూరం నుంచి కూత వినిపిస్తూ ఉంది. అందరూ షాట్‌కి రెడీ అయ్యారు. కాని రమేశ్ సిప్పికి సడన్‌గా హేమమాలిని తలలో పూలు లేవని గుర్తుకొచ్చింది. కంటిన్యుటీ ప్రకారం పూలు ఉండాలి. అసిస్టెంట్ వైపు చూసేసరికి అతని పై ప్రాణం పైనే పోయింది. కాని ప్రాణాలకు తెగించి పరిగెత్తి హేమమాలిని తలలో పూలు పెట్టి దూరంగా గెంతి వెళ్లిపోతే సరిగ్గా షాట్ మొదలెట్టి సరిగ్గా పూర్తి చేశారు. షోలే రిలీజయ్యాక మొదటి వారం ఫ్లాప్ టాక్ వచ్చింది. సినిమాని ఏం చేయాలా అని రమేశ్ సిప్పి క్లయిమాక్స్ మార్చే ఆలోచనలు చేశాడు. కాని ఎందుకైనా మంచిదని దానికి ముందు థియేటర్‌కు వెళ్లి ‘సినిమా ఎలా ఉంది’ అని యజమానిని అడిగితే అతడు లేచి క్యాంటిన్ వైపు చూపుతూ ‘చూడండి... ఎలా ఈగలు తోలుకుంటుందో’ అన్నాడు. రమేశ్ సిప్పి నీరుగారిపోయాడు. ‘అసలు జనం సిగరెట్లు బీడీలు టీ కోసం కూడా బయటకు రావడం లేదండీ’ అన్నాడు అసలు సంగతి వివరిస్తూ. అప్పటికి గాని రమేశ్ సిప్పికి తన సినిమాలో సూపర్‌హిట్ లక్షణాలు కనిపించలేదు. రమేశ్ సిప్పి షోలే తర్వాత ‘షాన్’, ‘సాగర్’, ‘శక్తి’ వంటి చెప్పుకోదగ్గ సినిమాలు తీసిన ‘షోలే’లో జరిగిన మేజిక్ రిపీట్ కాలేదు. అయినా సరే ‘షోలే’ చాలు మనకి. రమేశ్ సిప్పిని ప్రశంసించేందుకు ప్రతి సందర్భం చాలు. రమేశ్ సిప్పి జిందాబాద్. -
ప్రముఖ బాలీవుడ్ నటుడు కన్నుమూత
సాక్షి,ముంబై: బాలీవుడ నటుడు , మరాఠీ చిత్ర థియేటర్ నటుడు విజు ఖోటే (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారని బంధువులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు ఉదయం చందన్‌వాడిలో అంత్యక్రియలు నిర్వహించనున్నామని ఆయన మేనకోడలు నటుడు భవన బల్సవర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ చిత్రం షోలేలో డెకాయిట్ కాలియా పాత్రతో పాపులర్ అయిన విజు ‘‘అందాజ్ అప్నా, అప్నా’’ రాబర్ట్ పాత్రలో ఆకట్టుకున్నారు. అలాగే ‘‘ఖయామత్ సే ఖయామత్ తక్", "వెంటిలేటర్" ‘‘జబాన్ సంభాల్కే" లాంటి టీవీ షోలో కూడా నటించారు. ‘‘గల్తీసే మిస్టేక్ హో గయా’’ డైలాగ్‌తో హాస్యనటుడిగా తనదైన గుర్తింపును సాధించారు విజు ఖోటే. -
మోదీ షోలే సినిమాలో అస్రానీ: ప్రియాంక
మిర్జాపూర్/గోరఖ్‌పూర్(యూపీ): నరేంద్ర మోదీ ఒక నటుడని, ప్రధాని పదవికి అమితాబ్ బచ్చన్ సరైన వ్యక్తి అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా పేర్కొన్నారు. అమితాబ్ నటించిన షోలే సినిమాలోని ‘అస్రానీ’ పాత్ర మోదీకి సరిపోతుందని వ్యాఖ్యానించారు. శుక్రవారం మిర్జాపూర్, గోరఖ్‌పూర్‌లలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ఆమె పాల్గొన్నారు. ‘ప్రధాని మోదీ నాయకుడు కాదు, ఒక నటుడు. అమితాబ్ బచ్చన్‌ను ప్రధానిగా చేస్తే బాగుంటుంది. ‘బ్రిటిష్ వారి కాలంలో...’ అంటూ కనిపించిన ప్రతిసారీ ఒకే డైలాగ్ చెప్పే షోలే సినిమాలో అస్రానీ పాత్ర లాంటివాడు మోదీ. నెహ్రూ, ఇందిర, రాజీవ్‌గాంధీ ఏం చేశారో ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. గత ఐదేళ్లలో తను ఏం చేసింది మాత్రం ఎన్నడూ చెప్పరు’ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీల్లో ఒక్కటీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందన్నారు. ‘నోట్లరద్దుతో నల్లధనం వెనక్కివస్తుందని చెప్పారు. నల్లధనం తీసుకురాలేకపోయారు. దానివల్ల కష్టాలు మాత్రం వచ్చాయి’ అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం బలహీనం చేసిందని ఆరోపించారు. రైతులకు ఇవ్వాల్సిన బీమా సొమ్ము పారిశ్రామికవేత్తలకు, బీమా కంపెనీలకు చేరిందని విమర్శించారు. -
రోడ్డెక్కిన గబ్బర్ సింగ్, సాంబ
గురుగ్రాం : ‘అరెవో సాంబ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల లాభమా? నష్టమా?’అని గబ్బర్ ప్రశ్నించగా.. ‘ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ లేకపోవడం వలన తలకు తీవ్ర గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదం ఇంకా పెద్దదయినపుడు ఆ వ్యక్తి కోమాలోకి వెళ్లవచ్చు కొన్ని సార్లు ప్రాణాలూ విడవచ్చు. ఎలా చూసినా హెల్మెట్ లేకుండా వాహనం నడపడం ప్రయాణికుడికి తీవ్ర నష్టమే’అంటూ గబ్బర్ ప్రశ్నకు సాంబ సమాధానమిస్తాడు. ఏంటీ గబ్బర్, సాంబల పేర్లు చెప్పి షోలే సినిమా డైలాగులు కాకుండా వేరే డైలాగులు చెబుతున్నారనుకుంటున్నారా?. అయితే వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలను వివరించడానికి హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం జిల్లా ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న వినూత్న ప్రయత్నం ఇది. ట్రాఫిక్ నియమాలు పాటించమని ఎన్ని సార్లు చెప్పినా, ప్రచారాలు చేసినా, భారీ జరిమానాలు విధించినా వాహనదారుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో పోలీసులు విసుగెత్తిపోయారు. దీంతో ఏదైన వెరైటీగా చేసయినా సరే ప్రజల్లో చైతన్యం తీసుకరావాలని ఆలోచన మెదలెట్టారు గురుగ్రాం ట్రాఫిక్ పోలీసులు. దీంతో స్థానిక విద్యార్థులతో కలిసి ప్రజలకు ట్రాఫిక్ పాఠాలు చెప్పాలని నిశ్చయించుకున్నారు. దీనిలో భాగంగా దీపక్, అరుణ్‌లు గబ్బర్ సింగ్, సాంబ వేషధారణలో ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపేవారికి క్లాస్ తీసుకుంటున్నారు. షోలే సినిమాలోని పవర్ఫుల్ డైలాగ్‌లను ట్రాఫిక్ భాషలో చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకరావాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ట్రాఫిక్ పోలీసులు, విద్యార్ధులు ప్రయత్నానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
రోడ్డెక్కిన గబ్బర్ సింగ్, సాంబ
-
షోలేభరణం
క్లాస్ సినిమాలు ఉంటాయి. మాస్ సినిమాలు ఉంటాయి. ఈ రెండిటినీ కలిపి నాటకం తయారుచేస్తే? తయారుచేయడమేమిటి? ఆల్రెడి తయారైపోయింది. ‘అదుర్స్’ అనే నాటకసంస్థ క్లాస్ సినిమా శంకరాభరణం, మాస్ సినిమా షోలేలను కలిపి ‘షోలేభరణం’ అనే నాటకాన్ని తయారుచేసి ప్రతి ఊళ్లో ప్రదర్శిస్తుంది. ఈ నాటకాన్ని మీరు కూడా చూడండి... ‘‘రేయ్...గబ్బర్ ఎక్కడ దాగావురా? రారా బయటికి’’ అరుస్తున్నాడు ఠాకూర్. గబ్బర్ రావడం ఏమిటోగానీ... ఈ అరుపులకు భయపడిన బసంతి ఇంటి నుంచి పరుగెత్తుకు వచ్చింది. ‘‘మీరు గబ్బర్...గబ్బర్ అని అరవడం వల్ల...మీకు బీపి వస్తుందే తప్ప గబ్బర్ రాడు. వాడు గుర్తుకు వచ్చినప్పుడల్లా ... ఎవడి పాపాన వాడే పోతాడు అనుకోండి చాలు....ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి’’ అని సలహాతో పాటు గ్లాసులో నీళ్లు కూడా ఇచ్చింది బసంతి. ‘నిజమే’ అనిపించింది ఠాకూర్‌కు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని రోజులు ఇంటి నుంచి ఎక్కడికైనా వెళ్లాలి అనిపించింది. ఆంధ్రాలో ఉన్న తన ఫ్రెండ్ అప్పారావు గుర్తుకు వచ్చాడు. వెంటనే పనిమనిషిని పిలిచి... ‘‘నేను మనశ్శాంతి కోసం రేపు ఆంధ్రా వెళుతున్నాను. ఇల్లు జాగ్రత్త’’ అని చెప్పాడు. ‘‘మనశ్శాంతి ఎవరండీ...మన విజయశాంతికి ఏమవుతారు?’’ ఆరా తీశాడు పనివాడు. తల పట్టుకున్నాడు ఠాకూర్. రెండు రోజుల తరువాత...ఆంధ్రాలో ఉన్న స్నేహితుడి ఇంటికి చేరుకున్నాడు ఠాకూర్. ‘‘ఠాకూర్జీ...మీకో విషయం తెలుసా? ఈ ఊళ్లో శంకరాభరణం శంకరశాస్త్రి అనే గొప్ప గాయకుడు ఉన్నాడు. ఆయన నోటి నుంచి శంకరాభరణం రాగం వింటే జన్మ ధన్యమైపోయినట్లే’’ అన్నాడు ఠాకూర్ స్నేహితుడు అప్పారావు. ఇద్దరు కలిసి శంకరశాస్త్రి ఇంటికి వెళ్లారు. ఆయనతో చాలాసేపు మాట్లాడిన తరువాత ఠాకూర్ మైండ్‌లో ఒక ఐడియా ఫ్లాష్‌లా మెరిసింది. ‘‘అయిపోయావురా...గబ్బర్ ’’ కసిగా అనుకున్నాడు ఠాకూర్. రెండురోజుల తరువాత రామ్‌ఘడ్‌లోని ఠాకూర్ ఇంటికి గెస్ట్‌గా వచ్చాడు శంకరశాస్త్రి. ఈలోపు ఒక పుకారు చాలా స్పీడ్‌గా చుట్టుపక్కల ఊళ్లలో షికారు చేసింది. ‘‘గబ్బర్‌సింగ్‌ను మట్టుబెట్టడానికి ఆంధ్రా నుంచి శంకరశాస్త్రి అనే షూటర్ వచ్చాడు’’ అనేదే ఆ పుకారు. ఈ పుకారు గబ్బర్ వరకు చేరింది. ‘‘అరేవో సాంబ... ఆ శంకరశాస్త్రిని కిడ్నాప్ చేసుకొని రండి’’ అని ఆర్డర్ వేశాడు గబ్బర్‌సింగ్. గబ్బర్గ్యాంగ్ అలాగే చేసింది. ఇప్పుడు శంకరశాస్త్రి గబ్బర్ ముందు ఉన్నాడు. ‘‘ ఏమయ్యా పెద్దమనిషీ...నన్ను ఎన్కౌంటర్ చేయడానికి వచ్చావట కదా! ఎన్ని హృదయకాలేయాలు నీకు!’’ నలుదిక్కులు అదిరేలా గర్జించాడు గబ్బర్. ‘‘మీరు చాలా పొరబడుతున్నారు. నాకు సంగీతం గురించి తప్ప ఎన్కౌంటర్ల గురించి ఏమీ తెలియదు’’ కంచుకంఠంతో అన్నాడు శంకరశాస్త్రి.‘‘నువ్వు గాయకుడివి అంటే నాకెందుకో డౌటుగా ఉంది. ఏదీ... ఒకరాగం పాడు చూద్దాం’’ గద్దించాడు గబ్బర్. ఠాకూర్ ఇచ్చిన ఐడియా గుర్తుకు వచ్చింది శంకరశాస్త్రికి. ‘‘జస్ట్ రెండు రోజుల క్రితమే...‘మంకినీ’ అనే కొత్తరాగాన్ని సృష్టించాను. అది మీకు వినిపిస్తాను’’ అని ఆ రాగాన్ని వేడివేడిగా వినిపించాడు శంకరశాస్త్రి. ఆ రాగం విన్నాడో లేదో గబ్బర్ గుర్రం దిగి కోతిలా గంతులు వేయడం మొదలుపెట్టాడు. ఆ తరువాత...కనిపించిన చెట్టును, గుట్టను ఎక్కడం మొదలుపెట్టాడు...అటువైపుగా కోతుల గుంపు ఒకటి వస్తే అందులో కలిసిపోయి ‘కోతిలో కోతినై’ అని పాడుకుంటూ అడ్రస్ లేకుండా పోయాడు. రామ్ఘడ్కు గబ్బర్‌సింగ్ పీడ విరగడైంది. ఠాకూర్ కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. నాటకం పూర్తయింది. స్టేజీపై టమాటాలు, గుడ్లు వరదలా వచ్చిపడ్డాయి. స్టేజీపై గుడ్లు, టమాటాలు ఎందుకు పడ్డాయి? అనే కదా మీ డౌటు! విషయం ఏమిటంటే... ఈ నాటకం ఒకవైపు ‘శంకరాభరణం’ వీరాభిమానులకు, మరోవైపు ‘షోలే’ వీరాభిమానులకు విపరీతంగా కోపం తెప్పించింది. వాళ్లు చాలా పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ నాటకం చూడ్డానికి వచ్చారు. అది వారి అంచనాలకు దూరంగా ఎక్కడో ఉంది. దాని ఫలితమే... ఈ టమాటాలు, కోడిగుడ్లు! ‘‘స్టేజీ మీద గుడ్లు, టమాటాలు పడ్డాయంటే ప్రేక్షకులకు కోపం వచ్చినట్లే అని అర్థం. ఈ నిజం తెలిసి కూడా ఈ నాటకం కంపెనీ వాళ్లు ఊరూరా ఎందుకు తిరుగుతున్నట్లు. ఇది పిచ్చిపనా? లేకుంటే దీనివెనకాల ఏదైనా పరమార్థం దాగి ఉందంటావా? కరెక్ట్ ఆన్సర్ ఇస్తే...నిన్ను ప్రతి రోజూ మెట్రో రైలు ఎక్కిస్తా’’ అంది విక్రమార్కుడి భుజాల మీద ఉన్న శవం. ‘‘నీ ప్రపోజల్ బాగుంది. నేను ఈమధ్య షోల్డర్ పెయిన్‌తో బాధ పడుతున్నాను. నిన్ను మోయలేక ఛస్తున్నాను. ఇక నుంచి ఎక్కడికి వెళ్లినా మెట్రోరైళ్లోనే వెళదాం. నువ్వు నా పక్క సీట్లోనే కూర్చోవాలి’’ అన్నాడు విక్రమార్కుడు. ‘‘అదిసరేగానీ...నేను అడిగిన సందేహానికి జవాబు చెప్పు’’ అడిగింది భుజం మీది శవం.‘‘స్టేజీ మీద టమాటాలు, కోడిగుడ్లు పడుతున్నాయని తెలిసీకూడా ఆ డ్రామా కంపెనీవాళ్లు ఊరూరా తిరగడానికి కారణం టమాటాలు,కోడిగుడ్లే’’ అన్నాడు విక్రమార్కుడు.‘‘నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు’’ అయోమయంగా అంది శవం.‘‘అయితే విను’’ అంటూ ఇలా వివరంగా చెప్పాడు విక్రమార్కుడు...‘‘ చరిత్రలో ఎన్నడూ లేనట్లు ఆ సంవత్సరం ప్రొడక్షన్ ఎక్కువై టమాట, కోడి గుడ్ల ధరలు ఘోరంగా పడిపోయాయి. కృత్రిమంగానైనా సరే వీటి ధరలను అమాంతంగా పెంచడం ఎలా? అనే ఆలోచనలో నుంచి పుట్టిందే ‘షోలేభరణం’ అనే నాటకం. ఈ నాటకం పుణ్యమా అని టమాటాలు, గుడ్ల డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నాటకం ఆడిన ప్రతి ఊళ్లోనూ ప్రజలు టమాట, గుడ్లను బ్లాక్‌లో కొనడానికి కూడా వెనకాడలేదు. నాటకం వల్ల ప్రేక్షకులను రంజింప చేయడమే కాదు...టమాట, కోడిగుడ్ల డిమాండ్ కూడా పెంచవచ్చునని ప్రయోగాత్మకంగా నిరూపనైంది. అదీ విషయం!’’ – యాకుబ్ పాషా -
43 ఏళ్ల తరువాత బయటపెట్టిన ‘షోలే’ దర్శకుడు
ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు వరుసగా సెన్సార్ బోర్డ్ తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ విషయంపై స్పందించిన సీనియర్ దర్శకుడు రమేష్ సిప్పి ఇది కొత్త వచ్చిన సమస్య కాదని.. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో సెన్సార్ సమస్యలు ఉన్నాయిని వెల్లడించారు. ఈసందర్భంగా షోలే సినిమా విడుదల సమయంలో తన అనుభవాలను పంచుకున్నారు. పుణే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న ఆయన 43 ఏళ్ల తరువాత షోలే సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. షోలే సినిమా క్లైమాక్స్ ను దర్శకుడు మరో రకంగా చిత్రీకరించాలని భావించాడట. అయితే సెన్సార్ సభ్యులు ఠాకూర్, గబ్బర్‌సింగ్‌ను కాళ్లతో తన్ని చంపటంపై, వయలెన్స్ ఎక్కువగా ఉండటంపై అభ్యంతరాలు తెలపటంతో తాను అనుకున్నది తెరకెక్కించకుండా కొద్ది పాటి మార్పులు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఆ మార్పులు చేయటం తనకు ఇష్టం లేకపోయినా.. సెన్సార్ సభ్యుల సూచనల మేరకు చేయక తప్పలేదన్నారు. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో కంటెంట్ ఉండటం లేదన్న విమర్శలను సైతం రమేష్ సిప్పి ఖండించారు. రాజ్‌కుమార్ హిరానీ లాంటి దర్శకులు మంచి కథా కథనాలతో సినిమాలు రూపొందిస్తున్నారని, యువ దర్శకులు మంచి ఆలోచనలతో కొత్త సాంకేతికతతో సినిమాలు రూపొందిస్తున్నారని తెలిపారు. -
అరెవో సాంబ! షోలే థీమ్ పార్క్ ఎక్కడ?
బెంగళూరు: 1975లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన బాలీవుడ్ చిత్రం ‘షోలే’ గురించి తెలియని తరంగానీ, వినని తరంగానీ ఉండదేమో! అందులో ఏదో సీను, ఎప్పుడోసారి ప్రేక్షకుల మనోఫలకంపై ప్రతిఫలిస్తూనే ఉంటుంది. అందుకనే బెంగళూరు–మైసూర్ మధ్య పర్యటించే పర్యాటకులు షోలే సినిమా షూటింగ్ జరిగిన కర్ణాటకలోని రామనగర ప్రాంతాన్ని సందర్శిస్తారు. ‘అదిగో ఆ పర్వతంపైనే, అక్కడే గబ్బర్ సింగ్ గుర్రంపై వచ్చి ఠాకూర్ బల్దేవ్ సింగ్ భార్య, పిల్లల్ని కాల్చి చంపుతాడు. ఈ పక్కన బల్దేవ్ సింగ్ ఇల్లు సెట్టింగ్ ఉండేది. అదిగో అల్లంత దూరాన ఠాకూర్ రెండు చేతులు నరికేసిన గబ్బర్ సింగ్ డెన్’ అంటూ దారినపోయే దానయ్యలెందరో ఇక్కడికొచ్చిన పర్యాటకులకు చెబుతుంటారు. ఈ రామనగరాన్నే సినిమాలో రామ్‌గఢ్‌గా వ్యవహరించారు. ఈ ప్రాంతాన్ని ‘షోలే’ థీమ్‌తోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేసి సొమ్ము చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. కానీ అటవి శాఖ మాత్రం అందుకు అనుమతించడం లేదు. షోలే షూటింగ్ జరిగిన ప్రాంతం కేంద్ర రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తోందని, తాము ఎట్టి పరిస్థితుల్లో పర్యాటక ప్రాంతంగా అభివద్ధి చేసేందుకు అనుమతించమని ఆ శాఖ ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. ఈ భూమంతా తమ రెవన్యూ శాఖ పరిధిలోనే ఉన్నందున షోలే థీమ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే చెబుతున్నారు. ఇక్కడ షోలో సినిమాలో ఉన్నట్లుగానే గ్రామం సెట్టింగ్, గబ్బర్ సింగ్ గుడారాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా 120 ఎకరాల పరిధిలో ట్రెక్కింగ్, ఇతర సాహస క్రీడలను ప్రోత్సహించే సౌకర్యాలు, ఎంటర్టైన్మెంట్ పార్కులు ఉంటాయని ఆయన చెప్పారు. రాబందుల సంరక్షణ కేంద్రం దేశంలో నానాటికి అంతరించిపోతున్న రాబందులను సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇక్కడే 2012లో 346 హెక్టార్లలో ఓ శాంక్చరీని ఏర్పాటు చేసింది. భారత్, నేపాల్, పాకిస్థాన్ దేశాల్లో కనిపించే లాంగ్ బిల్డ్ జాతితోపాటు ఈజిప్టు, వీపు తెలుపురంగులో ఉండే మరోజాతి రాబందులు ఇప్పుడు ఈ శాంక్చరీలో ఉన్నాయి. భారత దేశంలో లాంగ్ బిల్డ్ జాతి రాబందులు 97 శాతం, ఈజిప్టు జాతి రాబందులు 99 శాతం నశించి పోయిన నేపథ్యంలో కేంద్రం ఈ శాంక్చరీని ఏర్పాటు చేసింది. అభ్యంతరం పెడుతున్న పర్యావరణవేత్తలు షోలే థీమ్ పార్క్‌ను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనను పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివద్ధి చేస్తే శాంక్చరీకి ముప్పు వాటిల్లుతుందని ఈ కేంద్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ప్రముఖ పర్యావరణవేత్త శివనంజయ్య తెలిపారు. గబ్బర్ సింగ్ గుహ వాస్తవానికి సాంక్చరీ లోపల ఉన్నప్పటికి అక్కడికి పర్యాటకులను అనుమతించమని, శాంక్చరీ సరిహద్దు నుంచే ఆ గుహ గురించి చెబుతామని, పైగా శాంక్చరీకి పది కిలోమీటర్ల ఇవతల నుంచి నిర్మించే షోలే థీమ్ పార్కులోనే గబ్బర్ గుహను ఏర్పాటు చేస్తామని పర్యాటక మంత్రి ఖర్గే చెబుతున్నారు. రాబందులవి చాలా సున్నితమైన జీవితాలని, వాటికి సరిహద్దులు గుర్తించే తెలివితేటలు కూడా లేవని శివనంజయ్య అంటున్నారు. ఇప్పటికే శాంక్చరీ లోపలున్న రామ మందిరాన్ని సందర్శించేందుకు భక్తులు రావడం, అప్పుడప్పుడు ఉత్సవాలు జరపడం వల్ల రాబందులకు ముప్పు వాటిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ప్యాసేజ్ టూ ఇండియా’ కూడా ఇక్కడ తీసిందే ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు డేవిడ్లీన్ తీసిన ‘ఏ ప్యాసేజ్ టు ఇండియా’ చిత్రం కూడా ఇక్కడ తీసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం షూటింగ్‌ను 1983–1984లో ఇక్కడ రామనగరలో నిర్వహించారు. అప్పడు ఇక్కడి పర్వతాలపై కొన్ని బండరాళ్లను బాంబులతో పగులగొట్టడం వల్ల పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లిందని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఇదే ప్రాంతంలో తొలిసారిగా 1966లో జాన్‌బెర్రీ తీసిన జంగిల్ అడ్వెంచర్ చిత్రం ‘మాయా’ షూటింగ్ జరిగింది. ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన రామ్ యెదేకర్ ఆ తర్వాత ‘షోలే’కు పనిచేశారు. యెదేకర్ సూచన మేరకే రమేష్ సిప్పీ షోలే షూటింగ్‌ను ఇక్కడ తీశారు. నాటి జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తున్నాయి షోలో షూటింగ్ నాటి జ్ఞాపకాలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని రాబందుల శాంక్చరీకి వాచ్‌మేన్‌గా పనిచేస్తున్న 60 ఏళ్ల వీరయ్య తెలిపారు. షూటింగ్ నాటికి 18 ఏళ్లు ఉన్న వీరయ్య ఆ సినిమాలో ఓ చిన్న పాత్రను కూడా పోషించారు. అవసరమైనప్పుడల్లా గబ్బర్ సింగ్‌కు తుపాకీ తెచ్చియ్యడమే తన పాత్రని, ప్రభుత్వం థీమ్ పార్క్‌ను అభివద్ధి చేస్తే తాను గైడ్‌గా పనిచేస్తానని వివాదంతో సంబంధంలేని వీరయ్య చెప్పారు. షోలో థీమ్ పార్క్ అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన ప్రయత్నాలు కూడా వివాదాల కారణంగా ఫలించలేదు. ఈసారి ఎందుకో తమ ప్రయత్నాలు ఫలిస్తాయన్న ఆశతో ఉంది. -
కొడుక్కి సినిమాలు చూపిస్తున్న హీరో
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, తన వారసుడు ఆర్యన్‌ను సక్సెస్ ఫుల్ హీరోగా పరిచయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. త్వరలో తన కొడుకును వెండితెరకు పరిచయం చేసే ఆలోచనలో ఉన్న షారూఖ్, ఆర్యన్‌కు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందే.. ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెరకెక్కిన టాప్ క్లాసిక్ సినిమాలను చూడమని చెప్పాడట. ఆర్యన్ కోసం భారీ కలెక్షన్‌ను రెడీ చేసిన షారూఖ్, ప్రస్తుతం ద అన్‌టచబుల్స్, ఫాలింగ్ డౌన్ లాంటి హాలీవుడ్ సినిమాలను ఆర్యన్‌కు చూపిస్తున్నాడు. జానే బీదో యార్, షోలే, దేవదాస్ లాంటి బాలీవుడ్ క్లాసిక్స్‌ను సైతం ఆర్యన్‌కు చూపించేందుకు ఓ కలెక్షన్‌ను ఏర్పాటు చేశాడు. త్వరలోనే అమెరికాలోని ప్రతిష్టాత్మక ఫిలిం స్కూల్లో జాయిన్ అవుతున్న ఆర్యన్, బాలీవుడ్‌కు పరిచయం అయ్యేందుకు అన్నిరకాలుగా ట్రైన్ అవుతున్నాడు. ప్రస్తుతానికి తన వారసులు తన అడుగుజాడల్లోనే నడుస్తున్నారని తెలిపిన షారూఖ్.. ఒకవేళ వారు సినీ రంగంలోకి రాకుండా.. వేరే నిర్ణయం తీసుకున్నా తనకు ఆనందమే అని తెలిపాడు. తండ్రి హీరో అయినంత మాత్రాన కొడుకులు కూడా అదే రంగంలోకి రావాలని లేదని తెలిపాడు. -
ది బర్నింగ్ ట్రైన్....
బి.ఆర్.చోప్రా కొడుకు రవిచోప్రా భారీగా తీసిన సినిమా ఇది. ఇంత భారీగా తీయడం వెనుక ‘షోలే’ ఘన విజయం ఉంది. 1975లో విడుదలైన షోలే సృష్టించిన కలెక్షన్లు అసామాన్యమైనవి. దీంతో రవి చోప్రా కూడా చాలా ఖర్చు పెట్టి భారీ హంగామాతో సినిమా తీసి హిట్ కొట్టాలనుకుని ఈ కథ తీశాడు. ఢిల్లీ నుంచి ముంబైకి వెళుతున్న కొత్త రైలు ‘సూపర్ ఎక్స్‌ప్రెస్’ అగ్ని ప్రమాదానికి గురైతే అందరూ కలిసి దానిని ఎలా ఆపారు, ప్రయాణికులను ఎలా రక్షించారు అనేది కథ. ధర్మేంద్ర, వినోద్ ఖన్నా, జితేంద్ర, పర్విన్బాబీ, హేమమాలిని, నీతూ సింగ్ ఇంత మంది హేమాహేమీలు ఈ సినిమాలో నటించారు. డానీ విలన్. 1980 మార్చిలో విడుదలైంది. ఓపెనింగ్స్ భారీగా వచ్చినా చాలా తొందరగా కలెక్షన్లు పడిపోయాయి. షోలేలో ఉన్న కథ, మానవోద్వేగాలు, విలన్ ఇందులో అంత గట్టిగా లేకపోవడం కథ రైలు వరకే కుదించుకోవడం ప్రేక్షకులకు నచ్చలేదు. కాని టెక్నికల్‌గా సినిమా మంచి ప్రమాణాలు అందుకుంది. ఇందులో రఫీ ఖవాలి (సాహిర్ రచన) ‘పల్ దో పల్ కా సాథ్ హమారా... పల్ దో పల్ కే యారానే హై’ పెద్ద హిట్. ఈ సినిమాకు సంబంధించి ఈ పాటే మిగిలింది. -
రామ్ గోపాల్ వర్మకు రూ. 10 లక్షల జరిమానా
షోలే సినిమా విడుదలై 40 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికే ఏదో ఒక సందర్భంలో ఈ సినిమా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఢిల్లీ హై కోర్టు తీర్పుతో షోలే మరోసారి తెరమీదకు వచ్చింది. 1975లో ఘనవిజయం సాధించిన షోలే సినిమాను రామ్ గోపాల్ వర్మ ఆగ్ పేరుతో 2007లో రీమేక్ చేశాడు. ఒరిజినల్ సినిమాలో హీరోగా నటించిన అమితాబ్ రీమేక్ లో మాత్రం తనకు ఎంతో నచ్చిన గబ్బర్ సింగ్ పాత్రలో కనిపించారు.. అయితే ఆగ్ ఆశించిన స్ధాయి విజయం మాత్రం సాదించలేకపోయింది. షోలే ను రీమేక్ చేయటం చారిత్రాత్మక తప్పిదం అంటూ వర్మ అంగీకరించినా, అభిమానులు మాత్రం క్షమించలేదు. భారతీయ సినీ చరిత్రలో క్లాసిక్ లాంటి అద్భుతాన్ని వర్మ పాడు చేశాడన్నది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అయితే ఆగ్ రిలీజ్ అయి ఏడేళ్లు గడుస్తున్నా వర్మ ఇంకా విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. తాజాగా ఢిల్లీ హైకోర్టు కూడా ఈ సినిమా విషయంలో వర్మకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఒరిజినల్ సినిమా నిర్మాతల మనవడు సస్చాసిప్పీ కాపీరైట్ యాక్ట్ కింద వర్మపై నమోదు చేసిన కేసులో, తీర్పును ప్రకటించిన ఉన్నత న్యాయస్థానం, పది లక్షల రూపాయల జరిమానా విధించింది. నిర్మాతల అనుమతి తీసుకోకుండా సినిమాలో సన్నివేశాలు, పాత్రలు, నేపథ్య సంగీతం వాడుకున్నందుకు కోర్టు ఈ తీర్పును ప్రకటించింది. వర్మతో పాటు ఆగ్ సినిమా నిర్మాతలైన ఆర్ జి వి ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, వర్మ కార్పొరేషన్ లిమిటెడ్, మధు వర్మ కూడా కేసులో దోషులుగా ఉన్నారు. అయితే 2007 ఆగస్టు 31న ఆగ్ రిలీజ్ కాగా 2015లో అదే రోజు ఈ సినిమా పై కాపీరైట్ విషయంలో తీర్పు వెలువడింది. -
సిల్వర్‌స్క్రీన్ మూవీ ’షోలే’ చిత్రీకరణ రామనగరం దగ్గరే
-
ఇది ఇంకో షోలే
భారతీయ సినిమా రంగంలో షోలే స్థానం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 1975 ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా దాని నిర్మాత, దర్శకులకు ఎన్ని వందల కోట్లు ఆ రోజుల్లోనే కలెక్ట్ చేసి పెట్టిందో ఎవరి ఊహకూ అందదు. అంతులేని సంపదను ఇప్పటికీ షోలే అందిస్తూనే ఉంది. ఎందరో నిర్మాతలకు, దర్శకులకు స్ఫూర్తినిచ్చిన ఈ సినిమా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 40 విడ్డూరాలు తెలుసుకుందాం. ►షోలే దర్శకుడు రమేశ్ సిప్పి నిర్మాత జి.పి.సిప్పీ కుమారుడు. అందాజ్ (1971), సీతా ఔర్ గీతా (1972) తీశాడు. తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి ఈసారి భారీ సినిమా తీద్దాం అని నిర్ణయించుకోవడంతో షోలేకు అంకురార్పణ జరిగింది. ►సిప్పీలు సింథీలు. స్వస్థలం కరాచి. జి.పి.సిప్పీ కాశ్మిర్ నుంచి కార్పెట్లు తెచ్చి అమ్మేవాడు. ఆ తర్వాత బిల్డర్ అయ్యి డబ్బు సంపాదించి నిర్మాతగా మారాడు. ►రచయితలు సలీమ్-జావేద్ అప్పటికి ఇంకా గొప్ప పేరులోకి రాలేదు. కొన్ని కథల నుంచి ఒక కథను తయారు చేయడంలో సిద్ధహస్తులు. మన రాముడు- భీముడును తిరగేసి సీతా-గీత స్క్రిప్ట్ రాశారు. ఆ టాలెంట్ కనిపెట్టి వీరిద్దరినీ ఒక నెల పాటు కూచోబెట్టి రమేష్ సిప్పి ఈ కథను తయారు చేయించాడు. ► ‘వీరూ’ పాత్రకు ధర్మేంద్ర ముందే ఖాయమయ్యాడు. అయితే ‘జయ్’ పాత్ర శతృఘ్నసిన్హాను వరించాల్సింది. అమితాబ్‌కు రాసిపెట్టి ఉంది. అయితే ఇందులో ధర్మేంద్ర రికమండేషన్, జయబాధురి వేడుకోలు ఉన్నాయని అంటారు. ►గబ్బర్ సింగ్ అనే బందిపోటు 1950లలో నిజంగానే ఉండేవాడు. సలీమ్ తండ్రి గ్వాలియర్ ప్రాంతంలో పోలీస్ కావడం వల్ల ఆయన ద్వారా సలీమ్‌కు బందిపోట్ల కథలు తెలుసు. అలా ఆ పాత్ర వచ్చింది. దీనికి ముందు డేనీ డెంజోప్పాని అనుకున్నారు. కాని కొత్త నటుడు అంజద్‌ఖాన్ దీని కోసం ఇది వరకే పుట్టి ఉన్నాడు. ►షోలే కంటే ముందే హిందీలో అలాంటి కథాంశంతో ‘ఖోటే సిక్కే’, ‘మేరా గావ్ మేరా దేశ్’ సినిమాలు వచ్చాయి. ఆ రెండూ చూసినవారికి షోలే చూడటంలో థ్రిల్ కొంచెం తగ్గుతుంది. ►షోలే ఆదాయంలో కొంతభాగం నిజానికి జపాన్ దర్శకుడు అకిరా కురసావాకు దక్కాలి. షోలేకు మూలం లాంటి ‘సెవన్ సమురాయ్’ ఆయనే తీశాడు. ►షోలే డైలాగ్స్ రాసింది జావేద్ అక్తర్. కాని సినిమా మొత్తాన్ని ఆలోచించింది సలీమ్. పని విభజన అలా జరిగిందని తెలుసుకోవాలి. ►నిజజీవితంలో హేమమాలిని చాలా తక్కువ మాట్లాడుతుంది. జయబాధురి వాగుడుకాయ. షోలేలో ఈ స్వభావాలకు పూర్తి భిన్నమైన పాత్రలను వాళ్లిద్దరూ పోషించారు. ►షోలేలో నటించిన అమితాబ్, జయబాధురి అప్పటికే దంపతులు. ధర్మేంద్ర, హేమమాలిని సినిమా విడుదలైన 5 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నారు. ►బందిపోటు సినిమాలను అప్పటి వరకూ చంబల్లోయలో తీయడం ఆనవాయితీ. రమేష సిప్పీ దీనిని నిరాకరించడంతో ఆర్ట్ డెరైక్టర్ రామ్ ఎదేకర్ దేశమంతా ఒక కారేసుకుని తిరిగి బెంగుళూరు మైసూరు దారిలో ఉన్న కొండప్రాంతాన్ని ఎంపిక చేశారు. షోలే భక్తులు ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. అక్కడ రామ్‌నగర్ అనే ఊరు కూడా ఉంది. ►షోలేను 1973లో మొదలుపెట్టి రెండున్నరేళ్లు తీశారు. గబ్బర్ అసిస్టెంట్ ‘సాంబ’ పాత్రను పోషించిన మెక్ మోహన్ లాంటి నటుడు ముంబై నుంచి బెంగుళూరుకి 26 సార్లు తిరగాల్సి వచ్చింది. ►సినిమాటోగ్రాఫర్ ద్వారకా ద్వివేచాకు పర్ఫెక్షనిస్ట్ అని పేరు. రాజీపడేవాడు కాదు. అరవైఏళ్లు పైబడిన ఆయన ఈ షూటింగ్ సమయంలో స్థానికంగా ఉండే ఒక ఇరవై ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. ►యూనిట్ బస చేసిన బెంగుళూరులో రోజూ పార్టీలు జరిగేవి. అందరికంటే ఎక్కువ తాగడం మేల్కోవడం అనే బాధ్యత సంజీవ్ కుమార్ తీసుకునేవాడు. ►షోలేలో చిన్న పాత్రలు వేసినవాళ్లకు చిరకీర్తి లభించింది. కాలియా పాత్రను ధరించిన విజూ ఖోటే ఈ పాత్ర వల్లే ఇండస్ట్రీలో కొనసాగాడు. ►ముస్లిం ఇమామ్ పాత్ర పోషించిన కె.ఎ.హంగల్‌కు చాలా పేరు వచ్చింది. అయితే హంగల్ ఆ పాత్రను అలా కాకుండా వేరేలా చేసి ఉండాల్సిందనే అసంతృప్తితోనే చివరి వరకూ గడిపాడు. ►జయబాధురి దీపాలు వెలిగించే సీన్ సినిమాలో ఒకటి రెండు నిమిషాలు ఉంటుంది. కాని దానిని పందొమ్మిది రోజులు తీశారు. ►షోలేలో హింస ఉంది కాని రక్తం కనపడదు. ఠాకూర్ మనవణ్ణి గబ్బర్‌సింగ్ కాల్చడం ఇందులో చాలా కలచివేసే దృశ్యం. కాని శవాన్ని చూపించరు. చీమను చంపడం ద్వారా ఇమామ్ కొడుకైన సచిన్‌ను చంపినట్టు సజెస్టివ్గా చూపిస్తాడు దర్శకుడు. ►రామ్‌లాల్ పాత్ర వేసిన సత్యన్‌కు ఇండస్ట్రీలో చాలా గౌరవం ఉండేది. ఆయన లెఫ్టిస్ట్. సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేసేవాడు. ►షోలే కోసం హాలీవుడ్ స్టంట్స్మెన్ ఇద్దరు వచ్చి పని చేశారు. వాళ్లు తెచ్చిన సేఫ్టీ ఎక్విప్మెంట్ వల్లే ప్రమాదాలు లేకుండా ఆ పోరాటాలన్నీ తీయగలిగారు. ►సూర్మా భోపాలి పాత్రను వేసిన జగ్దీప్ పాత్ర ఎంత ఫేమస్ అంటే చివరకు ఆ పేరుతోనే అతడు హీరోగా యాక్ట్ చేసి సినిమా తీశాడు. ►జైలర్ పాత్ర అస్రానీకి చాలా పేరు తెచ్చింది. ఇప్పటికీ అలాగే నటించమని అతణ్ణి దర్శకులు పీక్కుతింటుంటారు. ►మౌసీ దగ్గరకు వెళ్లి ధర్మేంద్రతో బసంతి పెళ్లి గురించి అమితాబ్ మాట్లాడే సీన్ చాలా హిలేరియస్‌గా ఉంటుంది. కాని అది కిశోర్ కుమార్ నటించిన హాఫ్ టికెట్ సినిమాలోని సీన్‌కు కాపీ. ►ధర్మేంద్ర వాటర్ ట్యాంకర్ మీదెక్కి గోల చేసే సీన్‌ను బెంగుళూర్ ఎయిర్‌పోర్ట్‌లో జావేద్ అక్తర్ హడావిడిగా రాసిచ్చి బొంబాయి ఫ్లయిట్ ఎక్కాడు. ►సినిమాకు రాసిన ప్రతీ డైలాగ్ హిట్టే. జో డర్ గయా సంఝో మర్గయా... తేరా క్యా హోగా కాలియా.... యే హాత్ ముఝే దేదే ఠాకూర్... బసంతీ... ఇన్ కుత్తోంకే సామ్నే మత్ నాచ్నా.... ప్రతిదీ హిట్టే. ►షోలే విడుదలయ్యాక మొదటి రెండు వారాలు సూపర్ ఫ్లాప్. ప్రొడ్యూసర్ పారిపోబోతున్నాడనే పుకార్లు రేగితే ఫైనాన్షియర్లు ఎయిర్పోర్ట్ దగ్గర జి.పి.సిప్పీ కోసం కాపు కాచారు. ►{పివ్యూ చూసి షోలేను రాజ్‌కపూర్ కూడా అంచనా వేయలేకపోయాడు. మొదటి పది నిముషాల్లోనే అంత పెద్ద ట్రైన్ రాబరీ పెట్టేయడం ఆయనకు మింగుడు పడలేదు. ►బ్లాక్ టికెట్లు అమ్ముకున్నవాళ్లు ఈ సినిమాతో సెటిలైపోయారని అంటారు. ►సినిమా ఫ్లాపైతే తమ మీదకు ఎక్కడ వస్తుందోనని జావేద్ అఖ్తర్‌లు భయపడ్డారు. ఎందుకైనా మంచిదని అంజద్‌ఖాన్ మీద నెపం వెతుక్కున్నారు. ఒకవేళ ఫ్లాప్ అయితే అతని యాక్టింగ్ వీక్‌గా ఉండటం వల్లే పోయింది అని చెప్పాలనుకున్నారు. కాని సినిమా రిలీజయ్యి అంజాద్ ఖాన్‌కు ఎక్కడ లేని కీర్తి తెచ్చి పెట్టింది. అయితే వీళ్ల పథకం తెలిసిన అంజాద్ ఖాన్ మనసు కష్టపెట్టుకుని ఆ తర్వాత జావేద్ అఖ్తర్‌లు రాసిన ఏ సినిమాలోనూ పని చేయలేదు. ►ధర్మేంద్ర మెయిన్‌రోల్ వేసిన సినిమాల్లో అమితాబ్ యాక్ట్ చేశాడు తప్ప అమితాబ్ మెయిన్ రోల్ వేసిన సినిమాల్లో ధర్మేంద్ర యాక్ట్ చేయలేదు. షోలేలో ధర్మేంద్రదే మెయిన్ రోల్. ►ఆర్.డి.బర్మన్ ఈ సినిమాకు ఇచ్చిన రీరికార్డింగ్ పెద్ద హిట్. ఏ దోస్తీ పాట స్నేహానికి ఒక జాతీయ గీతంలా స్థిరపడింది. ►షోలేలో రఫీ ఒక్క పాట కూడా పాడలేదు. ►మెహబూబా... మెహబూబా... పాట మొదట ఆశాభోంస్లేతో అనుకున్నారు. కాని ఆర్.డి.బర్మన్ పాడాడు. హెలన్ డాన్స్ చేసింది. పాటగాడిగా జలాల్ ఆగా యాక్ట్ చేశాడు. అప్పటికే ఆమె సలీమ్‌తో ప్రేమలో ఉంది. ►స్టీరియోఫొనిక్లో తీయడం వల్ల సినిమా చివర్లో అమితాబ్ కాయిన్ విసిరితే ప్రేక్షకులు కుర్చీల కింద వెతికేవారు. ►షోలేలో ధర్మేంద్ర, అమితాబ్‌లు వాడిన బట్టలు రెండు మూడు జతలకు మించి ఉండవు. ►షోలేని కాస్త అటూ ఇటూ మార్చి శోభన్‌బాబుతో కక్ష తీశారు. ఈ కథను గుహనాథన్ తయారు చేశాడు. ►షోలేలోని కొన్ని సన్నివేశాలు అడవి రాముడులో కనిపిస్తాయి. ►షోలేకి రామ్‌గోపాల్ వర్మ ఎంత వీరాభిమాని అంటే దానిని రీమేక్ చేసి ఎక్కడలేని అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. ►షోలే సినిమా వల్లే పవన్ కల్యాణ్‌కు గబ్బర్‌సింగ్ అనే హిట్ సినిమా టైటిల్ దొరికింది. ►విలన్‌ను కాళ్లు చూపిస్తూ ఇంట్రడ్యూస్ చేయడం ఆ తర్వాత వందలాది సినిమాలో విలన్లకూ హీరోలకూ అనుకరించారు. -
ఇప్పటికీ బసంతి అనే పిలుస్తున్నారు
ముంబై : షోలే లాంటి గొప్ప చిత్రంలో తాను నటించడం గర్వంగా ఉందని బాలీవుడ్ అందాల తార, బీజేపీ ఎంపీ హేమామాలిని అన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీకి షోలే చిత్రం విడుదలై 40 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా హేమామాలిని శనివారం తన మదిలో నిక్షిప్తమైన 'షోలే' జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఇప్పటికీ తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు, అభిమానులు తనను చుట్టుముట్టి బసంతి అని పిలుస్తారని ఆమె గుర్తు చేసుకున్నారు. షోలే చిత్రం విడుదలై 40 ఏళ్లు గడిచిన ప్రేక్షక దేవుళ్ల మదిలో ఇప్పటికీ బలంగా నిలిచి ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తనను ఈ చిత్రం మరో శకాని తీసుకువెళ్తుందని హేమామాలిని ఈ సందర్భంగా పేర్కొన్నారు. శనివారం హేమమాలిని ట్విట్టర్లో తెలిపారు. ప్రముఖ దర్శకుడు రమేశ్ సిప్పీ దర్శకత్వంలో తెరకెక్కిన షోలే చిత్రం 1975 ఆగస్టు 15న దేశవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని, జయబాదురి సంజీవ్ కుమార్‌తోపాటు అంజాద్ ఖాన్ నటించారు. ఈ చిత్రంలో జై పాత్రలో అమితాబ్ బచ్చన్ ... వీరూ పాత్రలో ధర్మేంద్ర ... ఠాకూర్ బల్దేవ్ సింగ్ పాత్రలో సంజీవ్ కుమార్... బసంతి పాత్రలో హేమమాలిని... బందిపోటు గబ్బర్ సింగ్ పాత్రలో అంజాద్ ఖాన్ ఒదిగిపోయి నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని సంభాషణలు ఇప్పటికీ ప్రజల నాలుకలపై నాట్యం చేస్తున్నాయి... చేస్తునే ఉంటాయి. -
అసలు గబ్బర్ సింగ్ పాత్ర నేను చేస్తానని అడిగా
షోలే సినిమా స్క్రిప్టు వినగానే.. అందులోని గబ్బర్ సింగ్ పాత్రను తాను చేయాలని అనుకున్నానని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చెప్పారు. రచయితలైన సలీం -జావేద్‌లకు తాను అదే విషయం చెప్పానని, కానీ దర్శకుడు రమేష్ సిప్పీ మాత్రం అందుకు ఒప్పుకోలేదని.. తనను 'జై' పాత్రకే ఎంపిక చేశారని అమితాబ్ అన్నారు. వాస్తవానికి గబ్బర్ సింగ్ పాత్రకు తొలుత డానీ డెంజోంగ్పాను అనుకున్నారని, కానీ డేట్స్ కుదరకపోవడంతో అమ్జాద్ ఖాన్‌ను తీసుకున్నారని చెప్పారు. అమ్జాద్‌ను ఆ పాత్రకు సలీం-జావేద్ సూచించారు. అత్యంత భయంకరమైన దోపిడీ దొంగ పాత్ర పోషించిన అమ్జాద్ ఖాన్.. ఆ తర్వాతి కాలంలో టాప్ క్లాస్ విలన్లలో ఒకరిగా మారిపోయారు. అసలు నిజానికి ఆయన ఆ పాత్రను సమర్ధంగా పోషించగలరా.. లేదా అనే అనుమానాలు చాలామందికే వచ్చాయి. కానీ, గబ్బర్ సింగ్ పాత్రలో అమ్జాద్ ఖాన్ పూర్తిస్థాయిలో జీవించారని, ప్రేక్షకులు కూడా భయపడేలా చేశారని బిగ్ బీ చరెప్పారు. తనకు మాత్రం అమ్జాద్ ఖాన్ ఆ పాత్ర చేయడంపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. తనను అమ్జాద్ ఖాన్ సరదాగా 'పొట్టోడా' అని పిలిచేవారని, తాను ఆయనను 'బండోడా' అని పిలిచేవాడినని కూడా తెలిపారు. -
'ఆ మూవీ ఇప్పుడు చూసినా బోర్ కొట్టదు'
న్యూఢిల్లీ : బాలీవుడ్ క్లాసిక్ మూవీ 'షోలే' రీమేక్ అనేది తన దృష్టిలో చాలా చెడ్డ నిర్ణయమని స్టార్ హీరో అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డాడు. తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2007 లో 'ఆగ్' మూవీ తీసి ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయాన్ని ఈ నటుడు గుర్తుచేశాడు. రమేస్ సిప్పి దర్శకత్వంలో వచ్చిన షోలే సినిమా పాత్రలను ఏ ఒక్కరూ భర్తీ చేయలేరన్నాడు. ఇప్పటికీ ఆ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగానే ఉందని, ఇప్పుడ చూసినా అసలు బోర్ కొట్టడని ఈ హీరో అన్నాడు. బ్రదర్స్ మూవీ ప్రమోషన్లలో అక్షయ్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నాడు. 1975లో విడుదలైన ఆ మూవీలో స్టార్డమ్ ఉన్న అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని, జయాబచ్చన్ తదితరులు నటించిన విషయం తెలిసిందే. ఈ స్వాతంత్ర్యదినోత్సవం నాడు షోలే మూవీ 40 ఏళ్లు పూర్తిచేసుకోనున్న సందర్భంగా ఈ సినిమా విశేషాలను అక్షయ్ గుర్తుచేశారు. ఆ గొప్ప సినిమా రీమేక్ చేస్తే ఏ పాత్రలో నటిస్తారని మీడియా ప్రశ్నించగా... అక్షయ్ ఈ విధంగా సమాధానమిచ్చాడు. ఆ సినిమాను ఎప్పటికీ రీమేక్ చేయలేమని, ఆ పాత్రలకు వేరెవరూ న్యాయం చేయలేరని అభిప్రాయపడ్డాడు. తాను నటించిన 'బ్రదర్స్' మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ అక్షయ్, జాక్వెలైన్ ఫెర్నాండేజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మూవీ శుక్రవారం నాడు విడుదలకు సిద్ధంగా ఉంది. -
స్కూల్ యూనిఫాంలో సల్మాన్..
ముంబయి: బాలీవుడ్లోనే కాక దేశ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు సంపాధించుకున్న చిత్రం షోలేకు ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ స్కూల్ యూనిఫాంలో వెళ్లాడట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలిపారు. ఈ నెలలో షోలే చిత్రం విడుదలై 40 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న క్రమంలో ఆచిత్రంతో తనకున్న అనుభవాలు పంచుకున్నారు. అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సల్మాన్ తండ్రి సలీం ఖాన్ కో స్క్రిప్టును అందించారు. షోలే ప్రీమియర్ షోకు వెళ్లే సమయంలో తాను తన సోదరుడు అర్బాజ్ ఖాన్‌తో సింధియా పాఠశాలలో ఉన్నానని, స్కూల్లో ఉండగానే తన తండ్రి సలీంఖాన్ స్కూల్‌కి వచ్చి నేరుగా మినర్వా థియేటర్‌కు తీసుకెళ్లాడని, ఆ సమయంలో తాను తన సోదరుడు స్కూల్ యూనిఫాంలో ఉన్నామని తెలిపాడు. తన జీవితంలోని అనుభవాల్లో షోలే చిత్ర ప్రీమియర్‌కు వెళ్లడం గొప్పదని పేర్కొన్నాడు. ఆ సమయంలో అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ఇంకా జన్మించలేదు కూడా. -
త్వరలో పాక్‌లోనూ 'అరె ఓ సాంబా'
అరె ఓ సాంబా.. కిత్నే ఆద్మీ థే.. ఈ డైలాగులు ప్రపంచంలో హిందీ సినిమాలు చూసే ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇప్పుడీ డైలాగులు త్వరలోనే పాకిస్థాన్‌లో కూడా ప్రతిధ్వనించనున్నాయి. అవును.. భారతదేశంలో విడుదలైన 40 ఏళ్ల తర్వాత ఇన్నాళ్లకు పాకిస్థాన్‌లో ఆ సినిమా విడుదల కాబోతోంది. అక్కడి సినీరంగానికి చెందిన ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తొలిసారిగా తమ దేశంలో కూడా షోలే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. మాండ్వీవాలా ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ 2డి, 3డి వెర్షన్లలో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించింది. రమేష్ సిప్పీ దర్శకత్వంలో, ఆయన తండ్రి జీపీ సిప్పీ నిర్మాతగా 1975లో వచ్చిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, రేఖ, హేమ మాలిని, సంజీవ్ కుమార్, అంజాద్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషించారు. అయితే, ఇన్నాళ్లూ పాక్‌లో కేవలం పైరసీ వెర్షన్ మాత్రమే చూసేవారని, ఇప్పుడు తాము దాన్ని విడుదల చేస్తున్నామని మాండ్వీవాలా ఎంటర్టైన్మెంట్ అధినేత నదీమ్ మాండ్వీవాలా చెప్పారు. బాలీవుడ్ సినిమాలకు పాక్‌లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అందుకే అలనాటి ఈ క్లాసిక్ చిత్రాన్ని కూడా అందించబోతున్నారు. -
‘డ్రీమ్‌గర్ల్’తో మళ్లీ రమేశ్ సిప్పీ
‘డ్రీమ్గర్ల’ హేమమాలిని ‘షోలే’ దర్శకుడు రమేశ్ సిప్పీ దర్శకత్వంలో మళ్లీ నటించనున్నారు. ‘షోలే’ విడుదలైన 39 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హేమమాలినిని డెరైక్ట్ చేసే అవకాశం దొరకడంతో రమేశ్ సిప్పీ సంబరపడుతున్నారు. ‘సిమ్లా మిర్చి’ పేరిట తెరకెక్కనున్న ఈ చిత్రంలో ‘సిటీ లైట్స్’ నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్ర పోషించనున్నారు. ‘సిమ్లా మిర్చి’ షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది. -
షోలే 3dలో...
-
జాతీయ భావాలే బీజేపీ వైపు నడిపించాయి
వ్యవసాయ కుటుంబం మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. నాన్న స్వామిరెడ్డి, అమ్మ ఆండాళమ్మ. నాతోపాటు నలుగురు సంతానం. మా మేనమామకృు సంతానం లేకపోవడంతో నన్ను పెంచుకున్నారు. దీంతో నా బాల్యమంతా ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్‌గూడలో సాగింది. అక్కడే ప్రాథమిక విద్యనభ్యసించా. ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో హైస్కూల్లో టెన్త్ పూర్తి చేశా. యాకుత్‌పురాలోని ధర్మవంత్ కాలేజీలో ఇంటర్, టూల్ డిజైనింగ్‌లో డిప్లొమా చేశా. రాజకీయాలంటే ఆసక్తి విద్యార్థి దశ నుంచే రాజకీయాలంటే ఆసక్తి. టెన్త్క్లాస్లోనే సాంస్కృతిక విభాగం కన్వీనర్‌గా పనిచేశా. ఇంటర్లో కార్యదర్శిగా గెలిచా. ఆ తర్వాత డిప్లొమా కోర్సు చేసేటప్పుడు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యా. సామాజిక సేవ చేయాలనే తపనతో ఎన్సీసీ క్యాడెట్‌గా చేరి.. కెప్టెన్‌గా వ్యవహరించా. అక్కడి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించా. బీజేపీ యువమోర్చా రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌గా పనిచేశా. పార్టీ ఆఫీసులో 16 ఏళ్లు నా జీవితమంతా పార్టీ సేవలోనే గడిచింది. కాలేజీ రోజుల్లో.. ఆ తర్వాత కూడా పార్టీ కార్యాలయమే నా నివాసం. దాదాపు 16 ఏళ్లు బర్కత్‌పురాలోని పార్టీ ఆఫీసే నా కేరాఫ్ అడ్రస్. ఇక ఇప్పుడంటారా.. ఉదయం 8.30 గంటలకు జొన్న రొట్టె తిని బయటకొస్తా. 11 గంటల వరకు నియోజకవర్గంలో పర్యటించడం.. సమస్యలను తెలుసుకోవడం తొమ్మిదేళ్లుగా చేస్తున్నా. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమవుతా. బయటే మధ్యాహ్న భోజనం. కుదిరితే రాత్రి ఇంట్లో మరోసారి రొట్టెతో భోజనం ముగిస్తా. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకే నా తొలి ప్రాధాన్యత. ఆ తర్వాత ఇతర పనులు. షోలే.. భలే చదువుకునే రోజుల్లో అడపాదడపా సినిమాలు చూసేవాణ్ణి. నాకు బాగా నచ్చిన చిత్రం ‘షోలే’. మూడుసార్లు చూశాననుకుంటా. తెలుగు సినిమాల విషయానికొస్తే అల్లూరి సీతారామరాజు. ఇప్పుడు సినిమాలు చూసే టైమ్ దొరకడం లేదు. దీంతో అటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. ‘గుండె’ బరువెక్కింది హృద్రోగంతో చిన్నారులు మరణించడం నన్ను కలచివేసింది. బాధిత కుటుంబాలకు చేయూతనివ్వాలని నిర్ణయించుకున్నా. ఆలోచన వచ్చిందే తడ వుగా మంద క ృష్ణతో కలిసి 3వేల మంది బాధితులతో ప్రత్యేక సభ ఏర్పాటు చేశా. ఈ సభ ప్రాంగణంలోనే ఓ చిన్నారి గుండె జబ్బుతో మరణించడంతో నా హ ృదయం బరువెక్కింది. ఈ అంశంపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని బాధితులతో అక్కడే బైఠాయించాం. మా ఉద్యమానికి ప్రభుత్వం స్పందించడం... చిన్నారుల చికిత్సకు ఒప్పుకోవడం ఆనందాన్ని కలిగించింది. ఇప్పటివరకు దాదాపు 55వేల మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించామనే త ృప్తి మిగిలింది. వెరీ హ్యాపీ.. భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీవ్రవాదంపై ఢిల్లీలో ప్రత్యేక సదస్సు నిర్వహించా. దానికి అప్పటి ప్రధాని వాజ్‌పేయి హాజరయ్యారు. తీవ్రవాదంపై జరిగిన ఈ సదస్సుకు 150 దేశాల ప్రతినిధులు వచ్చారు. ఈ సదస్సు మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది. డబుల్ ధమాకా.. రెండుసార్లు రాష్ట్ర బీజేపీకి రథసారథిగా ఎన్నికయ్యా. ఎమ్మెల్యే, ఫ్లోర్‌లీడర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, అధిష్టానం మాటను కాదనలేకపోయా. రెండోసారి బీజేపీ పగ్గాలు తీసుకోవాలనే ఆదేశాలను శిరసావహించా. రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొం దడం చాలా ఆనందాన్ని కలిగించింది. ప్రస్తు తం బీజేఎల్పీ నేతగానే కాకుండా... అంతర్జాతీయ తీవ్రవాద వ్యతిరేక యువజన మండలి (వైకాట్) చైర్మన్‌గా కూడా పనిచేస్తున్నా. మోడీ.. నేను..ఔర్! యువమోర్చాలో పనిచే స్తున్నప్పుడు తొమ్మిదేళ్లు ఢిల్లీలోనే ఉన్నా. నేను, నరేంద్రమోడీ, గోవిందాచార్య ముగ్గురం ఒకే ఆవరణలో వేర్వేరు గదుల్లో ఉండేవాళ్లం. పార్టీ పటిష్టత, ప్రజా సమస్యలపై ప్రతి రోజూ ముగ్గురం చర్చించేవారు. మోడీ సీఎంగా గుజ రాత్‌కు వెళ్లిపోగా.. నేను రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చేశా. తీరిక దొరకడంలేదు నా భార్య కావ్య. గృహిణి. పాప వైష్ణవి.. ఇంటర్మీడియట్, తన్మయ్ సెవెన్త్ క్లాస్. చిన్నప్పుడు మేనమామ ఇంట్లో పెరగడంతో అమ్మానాన్నలకు దూరంగా ఉన్నాననే బెంగ ఉండేది. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ కావడంతో ఫ్యామిలీకి సమయం కేటాయించలేకపోతుండడం దిగులు ఉంటుంది. సమీప బంధువుల ఇళ్లలో కార్యక్రమాలకు వెళ్లే తీరిక కూడా ఉండదు. ఇది నన్ను అసంతృప్తికి గురిచే స్తుంది. సంక్రాంతికి లేదా దసరా పండుగలకు సొంతూరుకు వెళ్లి కుటుంబ సభ్యులతో గడుపుతా. ఎన్ని పనులున్నా.. శ్రీరామ నవమి కోసం మాత్రం తిమ్మాపూర్‌కు పయనమవుతా. రేపటి గురించి ఆలోచించను ప్రత్యేకించి లక్ష్యం ఏమీ లేదు. రేపటి కోసం ఆలోచించను. ఈ పూట చేయాల్సిన పనిని అంకితభావంతో, చిత్తశుద్ధితో చేసేస్తా. ఒక రకంగా చెప్పాలంటే ఇదే నా లక్ష్యం. చివరి వర కూ పార్టీ కోసం శ్రమిస్తా. ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అన్నివేళల్లో అందుబాటులో ఉంటా. అంబర్‌పేట ‘చే’ నంబర్ చౌరస్తాలో ఫై ్లఓవర్ కట్టించాలనేది నా కల. సమస్యలపై స్పందించండి.. సమాజంలోని సమస్యలపై యువత స్పందించాలి. పరిష్కారానికి ప్రభుత్వంతో యుద్దం చేయాలి. ఇదే నేను యువతకిచ్చే సందేశం. సేవాభావం ఉన్న వాళ్లు రాజకీయాల్లోకి రావాలి. దేశాన్ని ఆదర్శవంతంగా తీర్చే బాధ్యత యువత చేతుల్లోనే ఉంది. రాజకీయాలు కలుషితమయ్యాయి అనే బదులు.. వాటిని ప్రక్షాళన చేసేందుకు నడుంబిగిస్తే మంచిది.