అసలు గబ్బర్ సింగ్ పాత్ర నేను చేస్తానని అడిగా | Bachchan says he wanted to play Gabbar in Sholay | Sakshi
Sakshi News home page

అసలు గబ్బర్ సింగ్ పాత్ర నేను చేస్తానని అడిగా

Published Fri, Aug 14 2015 7:43 PM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM

అసలు గబ్బర్ సింగ్ పాత్ర నేను చేస్తానని అడిగా

అసలు గబ్బర్ సింగ్ పాత్ర నేను చేస్తానని అడిగా

షోలే సినిమా స్క్రిప్టు వినగానే.. అందులోని గబ్బర్ సింగ్ పాత్రను తాను చేయాలని అనుకున్నానని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చెప్పారు. రచయితలైన సలీం -జావేద్లకు తాను అదే విషయం చెప్పానని, కానీ దర్శకుడు రమేష్ సిప్పీ మాత్రం అందుకు ఒప్పుకోలేదని.. తనను 'జై' పాత్రకే ఎంపిక చేశారని అమితాబ్ అన్నారు. వాస్తవానికి గబ్బర్ సింగ్ పాత్రకు తొలుత డానీ డెంజోంగ్పాను అనుకున్నారని, కానీ డేట్స్ కుదరకపోవడంతో అమ్జాద్ ఖాన్ను తీసుకున్నారని చెప్పారు.

అమ్జాద్ను ఆ పాత్రకు సలీం-జావేద్ సూచించారు. అత్యంత భయంకరమైన దోపిడీ దొంగ పాత్ర పోషించిన అమ్జాద్ ఖాన్.. ఆ తర్వాతి కాలంలో టాప్ క్లాస్ విలన్లలో ఒకరిగా మారిపోయారు. అసలు నిజానికి ఆయన ఆ పాత్రను సమర్ధంగా పోషించగలరా.. లేదా అనే అనుమానాలు చాలామందికే వచ్చాయి. కానీ, గబ్బర్ సింగ్ పాత్రలో అమ్జాద్ ఖాన్ పూర్తిస్థాయిలో జీవించారని, ప్రేక్షకులు కూడా భయపడేలా చేశారని బిగ్ బీ చరెప్పారు. తనకు మాత్రం అమ్జాద్ ఖాన్ ఆ పాత్ర చేయడంపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. తనను అమ్జాద్ ఖాన్ సరదాగా 'పొట్టోడా' అని పిలిచేవారని, తాను ఆయనను 'బండోడా' అని పిలిచేవాడినని కూడా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement