కొడుక్కి సినిమాలు చూపిస్తున్న హీరో
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, తన వారసుడు ఆర్యన్ను సక్సెస్ ఫుల్ హీరోగా పరిచయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. త్వరలో తన కొడుకును వెండితెరకు పరిచయం చేసే ఆలోచనలో ఉన్న షారూఖ్, ఆర్యన్కు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందే.. ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెరకెక్కిన టాప్ క్లాసిక్ సినిమాలను చూడమని చెప్పాడట.
ఆర్యన్ కోసం భారీ కలెక్షన్ను రెడీ చేసిన షారూఖ్, ప్రస్తుతం ద అన్టచబుల్స్, ఫాలింగ్ డౌన్ లాంటి హాలీవుడ్ సినిమాలను ఆర్యన్కు చూపిస్తున్నాడు. జానే బీదో యార్, షోలే, దేవదాస్ లాంటి బాలీవుడ్ క్లాసిక్స్ను సైతం ఆర్యన్కు చూపించేందుకు ఓ కలెక్షన్ను ఏర్పాటు చేశాడు. త్వరలోనే అమెరికాలోని ప్రతిష్టాత్మక ఫిలిం స్కూల్లో జాయిన్ అవుతున్న ఆర్యన్, బాలీవుడ్కు పరిచయం అయ్యేందుకు అన్నిరకాలుగా ట్రైన్ అవుతున్నాడు.
ప్రస్తుతానికి తన వారసులు తన అడుగుజాడల్లోనే నడుస్తున్నారని తెలిపిన షారూఖ్.. ఒకవేళ వారు సినీ రంగంలోకి రాకుండా.. వేరే నిర్ణయం తీసుకున్నా తనకు ఆనందమే అని తెలిపాడు. తండ్రి హీరో అయినంత మాత్రాన కొడుకులు కూడా అదే రంగంలోకి రావాలని లేదని తెలిపాడు.