![Randeep Surjewala equates Kamal Nath-Digvijaya Singh - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/29/digwa.jpg.webp?itok=0PCfv6GK)
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ల పాత్రపై మరోసారి చర్చ మొదలైంది. దిగ్విజయ్, కమల్‌నాథ్‌ల మధ్య రాజకీయ సమీకరణాలను.. బ్లాక్ బస్టర్ ‘షోలే’ చిత్రంలోని ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్‌లు పోషించిన జై, వీరూ పాత్రల మధ్య బంధంతో కాంగ్రెస్ పార్టీ పోల్చింది.
రాష్ట్రంలో టిక్కెట్ల కేటాయింపులో ఇద్దరు నేతల మధ్య విభేదాల వార్తలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా శనివారం పైవ్యాఖ్యలు చేశారు. ‘షోలే సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్‌ల మధ్య విలన్ గబ్బర్ సింగ్ ఎలా గొడవ పెట్టలేకపోయాడో.. రాష్ట్రంలో గబ్బర్ సింగ్ వంటి బీజేపీ కూడా మధ్య విభేదాలను సృష్టించలేకపోయింది’ అంటూ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment