
సాక్షి,ముంబై: బాలీవుడ నటుడు , మరాఠీ చిత్ర థియేటర్ నటుడు విజు ఖోటే (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారని బంధువులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు ఉదయం చందన్‌వాడిలో అంత్యక్రియలు నిర్వహించనున్నామని ఆయన మేనకోడలు నటుడు భవన బల్సవర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రముఖ బాలీవుడ్ చిత్రం షోలేలో డెకాయిట్ కాలియా పాత్రతో పాపులర్ అయిన విజు ‘‘అందాజ్ అప్నా, అప్నా’’ రాబర్ట్ పాత్రలో ఆకట్టుకున్నారు. అలాగే ‘‘ఖయామత్ సే ఖయామత్ తక్", "వెంటిలేటర్" ‘‘జబాన్ సంభాల్కే" లాంటి టీవీ షోలో కూడా నటించారు. ‘‘గల్తీసే మిస్టేక్ హో గయా’’ డైలాగ్‌తో హాస్యనటుడిగా తనదైన గుర్తింపును సాధించారు విజు ఖోటే.