Veteran actor
-
సీనియర్ నటి కన్నుమూత, చివరి రోజుల్లో దయనీయ స్థితిలో..
అలనాటి అందాల తార సీమా డియో(81) అస్తమించారు. వృద్ధాప్య సమస్యలతో సతమతమవుతున్న సీమా గురువారం నాడు ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె తనయుడు అభినయ్ డియో మీడియాకు వెల్లడించారు. 'గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అమ్మ మరణించింది. అల్జీమర్స్ వ్యాధి వల్ల తను అన్నీ మర్చిపోతూ వచ్చింది. రోజువారీ చేసే పనులకు సైతం ఇబ్బంది పడింది. ప్రతి చిన్న విషయాన్ని మర్చిపోయింది. జ్ఞాపకశక్తి తగ్గిపోవడంతో.. తనకు డిమెన్షియా ఉండేది. అది కాస్తా అల్జీమర్స్‌కు దారి తీసింది. మూడేళ్లుగా ఆమె దీనితో పోరాడింది. దీనివల్ల ఆమె నడవడం అనేది కూడా మర్చిపోయింది. జ్ఞాపకశక్తి తగ్గిపోవడంతో పాటు అవయవాలు కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి పనిచేయడం ఆగిపోతూ వచ్చాయి' అని ఆయన పేర్కొన్నారు. కాగా సీమా డియో అంతిమక్రియలు శివాజీ పార్క్‌లో నేడు సాయంత్రం జరగనున్నాయి. 80కు పైగా సినిమాలు కాగా సీమా డియో హిందీ, మరాఠీ భాషల్లో కలిసి 80కు పైగా చిత్రాల్లో నటించారు. ఆనంద్, కొర కాగజ్ వంటి ఎన్నో చిత్రాలతో ఆమె హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సీమా 1963లో నటుడు రమేశ్ డియోను పెళ్లాడింది. వీరికి ఆజింక్య డియో, అభినయ్ డియో అని ఇద్దరు సంతానం. గతేడాది రమేశ్ కన్నుమూశారు. చదవండి: రేణు దేశాయ్ వీడియో.. ఇంత పెద్ద స్టోరీ నడిచిందా? -
ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అరున్ బాలి(79)కన్నుమూశారు. మస్తీనియా గ్రావిస్ అనే అరుదైన నాడీ కండరాల వ్యాధితో బాధపడుతున్న బాలి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. 3 ఇడియట్స్, పీకే వంటి హిట్ సినిమాలతో పాటు అనేక సీరియళ్లు, సినిమాల్లో ఆయన నటించారు.ఇటీవలే విడుదలైన 'లాల్‌సింగ్ చద్దా' సినిమాలోనూ ఆయన కనిపించారు. బాలి మృతిపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
భర్త చనిపోయిన రెండు రోజులకే ఈ నటి ఏం చేసిందో తెలుసా?
బాలీవుడ్ సీనియర్ నటుడు రసిక్ దేవ్ కిడ్నీ ఫెయిల్యూర్‌తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న గత శనివారం(జులై30)న తుదిశ్వస విడిచారు. అయితే భర్త చనిపోయిన రెండు రోజులకే నటి కేత్కి దేవ్ షూటింగ్లో పాల్గొంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కేత్కి దేవ్.. భర్త చనిపోయినప్పటికీ ఎటువంటి బ్రేక్ తీసుకోలేదని పేర్కొంది. ముందుగానే డేట్స్ ఇచ్చేసిన కారణంగా తన వల్ల ఎవరూ ఇబ్బంది కూడదనే ఈ విధంగా చేసినట్లు తెలిపింది. 1983లో రసిద్ దేవ్- కేత్కి ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి కూతురు, ఓ కుమారుడు ఉన్నాడు. ‘బాలికా వధు’,క్యోంకీ సాస్ బీ కబీ బహు తీ’ సహా పలు హిందీ, గుజరాతీ సినిమాలతో కేత్కి దేవ్ గుర్తింపును సంపాదించుకుంది. -
ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం
Veteran Odia Actor Raimohan Parida Died By Suicide In Bhubaneswar: ఒడియా చిత్ర పరిశ్రమలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఇటీవల బుల్లితెర నటి రష్మీరేఖ ఓజా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ నటుడు రాయ్మోహన్ పరిదా బలవన్మరణానికి పాల్పడ్డారు. 58 ఏళ్ల ఈ వెటరన్ యాక్టర్ శుక్రవారం (జూన్ 24) భువనేశ్వర్‌లోని ప్రాచి విహార్ ప్రాంతంలో ఉన్న ఆయన ఇంట్లో ఉరివేసుకున్నారు. రంగప్రవేశం చేసిన పోలీసులుగా ఆత్మహత్యగా భావించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాయ్మోహన్ పరిదా ఆత్మహత్యతో ఒడియా సినీ లోకం దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు సెలబ్రిటీలు ఆయన ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. 'జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్న వ్యక్తి ఇలా ఆత్మహత్య చేసుకున్నారంటే నమ్మలేకపోతున్నా. అతను తన నటుడిగా ఎంతో విజయవంతమయ్యారు' అని రాయ్మోహన్తో కలిసి నటించిన సిద్ధాంత మహాపాత్ర తెలిపారు. 'జీరో నుంచి హీరోగా మారిన పరిదా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం నమ్మలేకున్నాం' అని మరో నటుడు శ్రీతమ్ దాస్ పేర్కొన్నారు. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ కాగా రాయ్మోహన్ పరిదా ఒడిశాలోని కియోంజర్ జిల్లాకు చెందినవారు. ఆయన సుమారు 100కుపైగా ఒడియా చిత్రాల్లో నటించారు. అలాగే 15 బెంగాలీ సినిమాల్లో కూడా అలరించాడు. రాయ్మోహన్ పరిదా ఎక్కువగా నెగెటివ్ రోల్స్‌లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. అంతేకాకుండా రాయ్మోహన్ ప్రసిద్ధ థియేటర్ ఆర్టిస్ట్. రామ లక్ష్మణ్, ఆసిబు కేబే సాజీ మో రాణి, నాగ పంచమి, ఉదండి సీత, తూ తిలే మో దారా కహకు, రణ భూమి, సింఘ బహిని, కులానందన్, కంధేయి ఆఖిరే లుహా వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో రాయ్మోహన్ పరిదా నటించారు. చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? (మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com) -
ప్రముఖ నటుడు కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ నటుడు రమేశ్ డియో(93) కన్నుమూశారు. హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన బుధవారం(ఫిబ్రవరి 2న) గుండెపోటుతో మరణించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ మధ్యే 93వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా రమేశ్ డియో 1926 జనవరి 30న జన్మించారు. ఆయన నటించిన సినిమాల్లో 'ఆనంద్', 'మేరే ఆప్నే' తనకు మంచి పేరుతెచ్చిపెట్టాయి. ఇవే కాకుండా 'జాలీ ఎల్ఎల్బీ', 'ఘాయల్ వన్స్ ఎగైన్' వంటి పలు హిందీ చిత్రాల్లో నటించారు. 'పట్లచ్చి పోర్' మూవీతో మరాఠీ ఇండస్ట్రీలోనూ ప్రవేశించారు. 'అందాల మగతో ఏక్ దోల' చిత్రంతో కథానాయకుడిగా మారారు. సుమారు 250 సినిమాల్లో నటించిన ఆయన డజన్లకొద్దీ సినిమాలను నిర్మించారు. కొన్నింటికి డైరెక్షన్ కూడా చేశారు. 2013లో 11వ పుణె ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఈ నటుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. -
నటుడు అటల్ బిహారి పండా ఇక లేరు
భువనేశ్వర్: చలనచిత్ర, నాటక రంగ ప్రముఖ నటుడు అటల్ బిహారి పండా (92) కన్నుమూశారు. ఆయన మృతితో చలన చిత్రం, నాటక రంగం కళాప్రియులు, అభిమానులు, నటీనటులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటీవల ఆయన కోవిడ్ –19 బారిన పడి చికిత్సతో కోలుకున్నారు. తదనంతర అనారోగ్య పరిస్థితులతో మరోసారి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించారు. సువర్ణపూర్ జిల్లా బొణికా గ్రామానికి చెందిన ఆయన 1944వ సంవత్సరంలో నాటక రంగంలో ప్రవేశించి 100 పైబడి నాటకాల్లో నటించారు. సంబల్పురి శైలిలో 65 రంగస్థల, ఆకాశవాణి నాటకాలు రచించారు. 83 ఏళ్ల ప్రాయంలో తొలి సారి 'సొలా బుఢా' అనే లఘు చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో నటనకు ఆయన జాతీయ పురస్కారంతో పాటు 25వ ఒడియా చలన చిత్రోత్సవంలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. రెండో చలన చిత్రం 'ఆదిమ్ బిచారొ' వరుసగా రెండోసారి రాష్ట్ర చలన చిత్రోత్సవ పురస్కారం అందుకుంది. ఆయన మృతి పట్ల రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. చదవండి: డాక్టర్‌తో రహస్య పెళ్లి : అందుకే అందరికి చెప్పలేదు.. సంజన -
నటుడు టీకేఎస్ నటరాజన్ కన్నుమూత
సీనియర్ గాయకుడు, నటుడు టీకేఎస్ నటరాజన్(87) బుధవారం చెన్నైలో కన్నుమూశారు. చిన్నతనంలోనే నటనపై ఆసక్తితో టీకేఎస్ నాటక బృందంలో చేరి రంగస్థల నటుడిగా, గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయన టీకేఎస్ నటరాజన్‌గా గుర్తింపు పొందారు. 1954లో రక్తపాశం చిత్రం ద్వారా నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. అలా శివాజీ గణేశన్, ఎంజీఆర్, కమలహాసన్, రజనీకాంత్ వంటి ప్రముఖ హీరోల చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. 50 ఏళ్లలో 500కు పైగా చిత్రాల్లో నటించారు. 1984లో శంకర్ గణేష్ సంగీత దర్శకత్వంలో వాంగ మాప్పిళ్లై వాంగ చిత్రంలో నటరాజన్ పాడిన ‘ఎన్నడీ మునియమ్మ ఉన్న కన్నుల మయ్యి’ పాటతో ఆయన మరింత ప్రాచుర్యం పొందారు. స్థానిక సైదాపేటలో నివసిస్తున్న ఈయన వృద్ధాప్యం కారణంగా బుధవారం ఉదయం 6.30 గంటలకు కన్నుమూశారు. నటరాజన్ మృతికి పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. భౌతిక కాయానికి బుధవారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. చదవండి: ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రారంభిస్తున్న నటి నమిత -
దిలీప్ సాబ్ నా శ్వాస
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆయన చాలా నీరసంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య, నటి సైరా బాను ఓ ఇంటర్వ్యూలో భాగంగా తెలిపారు. దిలీప్ కుమార్ ఆరోగ్యం గురించి సైరా బాను మాట్లాడుతూ– ‘‘దిలీప్ సాబ్ ఈ మధ్య చాలా నీరసంగా ఉంటున్నారు. ఆయన రోగ నిరోధక శక్తి కూడా చాలా తక్కువగా ఉంది. ఇంట్లో తన గదిలో నుంచి హాలు వరకూ నడవగలుగుతున్నారు. గడుస్తున్న ప్రతీ రోజునీ ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అందుకే ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆయన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాం. ఏదో అభినందనల కోసమో, అంకితభావం ఉన్న భార్య అనిపించుకోవాలనో ఆయన్ను చూడటంలేదు. ఆయన్ను తాకడం, హత్తుకోవడం నా జీవితంలో జరుగుతున్న గొప్ప విషయాలుగా భావిస్తాను. దిలీప్ సాబ్ అంటే నాకంత ఆరాధన. ఆయనే నా శ్వాస. ఆయన ఆరోగ్యం కోసం అభిమానులందరూ ప్రార్థించండి’’ అని అన్నారు. డిసెంబర్ 11తో దిలీప్ కుమార్‌కి 98 ఏళ్లు వస్తాయి. 1966 అక్టోబర్ 11న దిలీప్ కుమార్, సైరా బాను వివాహం జరిగింది. -
వెంటిలేటర్‌పై నటుడు.. దాతల కోసం ఎదురుచూపు
ముంబై : ప్రముఖ హిందీ నటుడు శివకుమార్ వర్మ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా కూడా సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఆసుపత్రి ఖర్చులకు సైతం డబ్బులు సరిపోవడం లేదని, దాతల సహాయం కోసం వేచిచూస్తున్నారు. ఈ మేరకు సినీ, టీవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్ నటుడు పరిస్థితిపై అఫీషియల్ ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇది చాలా అత్యవసరమని, శివకుమార్ వర్మ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు. శివకుమార్ వర్మ పరిస్థితిపై నటులు అక్షయ్ కుమార్, సల్మాన్‌ఖాన్, విద్యాబాలన్ సహా పలువురు ప్రముఖులను ట్యాగ్ చేశారు. బాజీ జిందగీ కి, హల్లా బోల్ వంటి చిత్రాల్లో శివ్‌కుమార్ వర్మ నటించారు. (సన్నీ డియోల్‌కు కరోనా) AN URGENT CALL FOR HELP! #CINTAA Member Shivkumar Verma is suffering from COPD and is also suspected of COVID-19. He is in need of urgent funds for hospital expenses. We humbly urge you to please help by donating whatever you can @amitbehl @akshaykumar @TeamAkshay @iamvidyabalan pic.twitter.com/DIZYvcZaOW — CINTAA_Official (@CintaaOfficial) December 2, 2020 -
పెద్ద దిక్కును కోల్పోయాం : చిరంజీవి
‘నేను హీరోగా పరిచయం అయిన తొలి రోజుల నుంచి రావి కొండలరావుగారితో పలు చిత్రాల్లో నటించాను. ముఖ్యంగా మా కాంబినేషన్లో వచ్చిన ‘చంటబ్బాయ్, మంత్రిగారి వియ్యంకుడు’ వంటి చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. నాటక, సాంస్కృతిక రంగాలకు కూడా ఆయన మరణం తీరని లోటు. కొండలరావు, ఆయన సతీమణి రాధాకుమారిగార్లు జంటగా ఎన్నో చిత్రాల్లో నటించారు. చిత్ర పరిశ్రమలో ఏ వేడుక జరిగినా ఆ ఇద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లాగా వచ్చి, వారి అభినందనలు, ఆశీస్సులు అందించడం చూడముచ్చటగా ఉండేది. రావి కొండలరావుగారి మరణంతో చిత్రపరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టు అయింది’ అని నటుడు చిరంజీవి అన్నారు. నా కథలు కొండలరావుకి చెప్పేవాణ్ణి – నటుడు గిరిబాబు మద్రాసులో ఉన్నప్పటి నుంచి రావి కొండలరావుగారితో నాకు పరిచయం ఉంది. ఆయన చాలా గొప్పవారు.. మంచి మనిషి. స్నేహశీలి. చక్కని ప్రవర్తన ఉన్నవాడు. నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి. విజయా ప్రొడక్షన్స్ సంస్థకు ఆయన ఎంతో నమ్మకస్తుడు. అందుకే ‘భైరవద్వీపం, బృందావనం, శ్రీకృష్ణార్జున విజయం’ వంటి చిత్రాలు కొండలరావుగారి నిర్మాణ నిర్వహణలోనే పూర్తి చేశారు. నేను, ఆయన కలిసి చాలా సినిమాలు చేశాం. నేను హీరోగా చేసిన ‘వధూవరులు’ చిత్రంలో మంజు భార్గవి తండ్రి పాత్ర చేశారాయన. నా సొంత సినిమా ‘సంధ్యారాగం’లోనూ ఆయనకు మంచి పాత్ర ఇచ్చా. నా సొంత సినిమాలన్నింటికీ నేనే కథలు రాసుకునేవాణ్ణి. జడ్జిమెంట్ కోసం ఆ కథలను ఆయనకు వినిపించేవాణ్ణి. ‘చాలా బాగా రాశావు గిరిబాబు’ అని అభినందించేవారు. మంచి మనిషి ఈ రోజు మనల్ని విడిచి వెళ్లడం బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. ఐదు రోజుల క్రితమే మాట్లాడాను – నటుడు–రచయిత–దర్శకుడు తనికెళ్ల భరణి నేను కాలేజీలో చదువుకునే రోజుల నుండి రావి కొండలరా వుగారు పరిచయం. అదేదో ౖyð రెక్ట్ ముఖ పరిచయం కాదు, మేము నాటకాలు వేసేవాళ్లం కదా.. అలా మాది నాటక పరిచయం. ఆయన రాసిన నాటకాల్ని చదివి ఎంజాయ్ చేసేవాళ్లం. తర్వాత నేను చెన్నై వెళ్లాను. అక్కడ రాళ్లపల్లిగారి ద్వారా ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. అప్పట్లో విజయచిత్ర అని సినిమా వారపత్రిక ఉండేది. ఆయన దానికి సంపాదకునిగా ఉండేవారు. నేను ఆ పుస్తకాన్ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాణ్ని. అందులో ఆయన రాసే ఆర్టికల్స్, ఇంటర్వ్యూలు చదివేవాడిని. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత సినిమాకి సంబంధించిన ఏ సాహిత్య సమావేశం అయినా ఆయన లేకుండా జరిగేది కాదు. అంతటి సాహితీప్రియుడు ఆయన. మంచి వక్త, అందరినీ సరదాగా నవ్విస్తూ ఉండేవారు. కరెక్ట్‌గా ఐదు రోజుల క్రితం అనుకుంటా.. ఫోన్ చూస్తుంటే ‘ఆర్’ అనే అక్షరం దగ్గర ఆయన ఫోన్ నంబర్ కనిపిస్తే, ఆయనకు ఫోన్ చేశాను. గతేడాది ఆయన ఒక సాహిత్య కార్యక్రమం చేయమని అడిగారు. అప్పుడు నేను రాసిన ‘శృంగారా గంగావతరణం’ అనే కావ్యం సత్సంగం ఆయన ఇంట్లో జరిగింది. ఆయనకు తెలిసిన సాహితీ మిత్రులందరినీ ఆహ్వానించారు. ఆయన నాకు సన్మానం చేసి ఆశీర్వదించారు. అది గుర్తుకు వచ్చి నేను ఆయనకు ఫోన్ చేస్తే, ‘ఏమిటి స్వామీ.. ఎలా ఉన్నారు’ అని బాగా మాట్లాడారు. ‘ఏమీ లేదండీ.. కోవిడ్‌లో ఎలా ఉన్నారని ఊరికే పలకరిద్దా’మని అన్నాను. ‘చాలా మంచిదయ్యా.. మాలాంటి వారిని అప్పుడప్పుడు పలకరిస్తే ఉత్సాహంగా ఉం టుంది’ అన్నారు. ‘ఏమిటి మరి హూషారుగా ఉన్నారా’ అంటే... ‘లేదండీ... ఈ మధ్య నేను కింద పడిపోయాను. వాకర్ సాయంతో నడుస్తున్నాను’ అన్నారు. ‘సరేనండీ జాగ్రత్త’ అన్నాను. ఇంతలోనే వెళ్లిపోయారు. ఇండస్ట్రీలోని మరో పెద్ద తలకాయి దూరమైంది. ఆల్‌రౌండర్ అంటే రావి కొండలరావు గారే – రాజేంద్ర ప్రసాద్ ‘‘సినిమా పరిశ్రమలో ఎక్కువ సంవత్సరాలు పని చేసిన వ్యక్తి కొండలరావుగారు. సినిమా నటునిగా పక్కన పెడితే బయట నాటకాల్లోlఆయన చాలా గొప్ప నటుడు. జర్నలిస్ట్, కథకుడు, రచయిత, నటుడు.. ఇలా ఆయన చాలా గొప్పవాడు. సినిమా పరిశ్రమలో ఆల్ రౌండర్ అంటే ఆయన పేరే చెప్పొచ్చు. వాళ్ల ఊర్లో ఆయన ఫేమస్ టీచరు. ఆయన టీచర్‌గా ఎంత ఫేమస్ అంటే మేమందరం ఎప్పుడు కలిసినా ఆయన టీచర్‌గా చేసినప్పటి విశేషాలే మాట్లాడుకునేవాళ్లం. ఆయన భాషలో ఇప్పుడున్న పరిస్థితిని చెప్పాలంటే ‘‘యూ రాస్కెల్ కరోనా, సైలెంట్‌గా ఉండు, ఉండమన్నానా, యూ ఇడియట్...’ ఇలా ఉంటుంది ఆయనతో సంభాషణ. సింపుల్ లివింగ్, గ్రేట్ పర్సన్ అంటే ఆయన పేరే చెప్పాలి. వ్యక్తిగతంగా నేనంటే విపరీతమైన లవ్. లొకేషన్‌కి వచ్చిన దగ్గర్నుండి ప్రసాదూ, ప్రసాదు... అని కలవరించేవారు. ఒక జీవితానికి మరపురాని కలలు ఆ రోజలు. సినిమా పరిశ్రమలో నాకున్న అతి పెద్ద వయసున్న బెస్ట్ ఫ్రెండ్ ఆయనే. నన్ను బిడ్డలా చూసుకునేవారు – సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ రావికొండలరావుగారు మా మాధవపెద్ది కుటుంబాలకు మూడు తరాల నుంచి అత్యంత ఆప్తులు. ఆయన్ను వరసకి తాతయ్యా అని పిలుస్తాను. మా చిన్నాన్నలు సత్యం, గోఖ్లే ఆయనతో ఫ్రెండ్లీగా ఉండేవారు. వైజాగ్‌లో ఓ ప్రోగ్రామ్ కోసం ట్రైన్లో ఆయనా, నేను కలసి ప్రయాణించాం. అప్పుడు సంగీతం పట్ల నాకు ఉన్న అభిరుచినంతా ఆయనతో చెప్పడం జరిగింది. అప్పటికి మ్యూజిక్ డైరెక్టర్‌గా 4–5 సినిమాలు చేశాను. వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత ‘విజయా ప్రొడక్షన్స్ వాళ్లు టీవీ సీరియల్స్ చేయాలనుకుంటున్నారు. దానికి సంగీతం అందించాలి’ అని రావి కొండలరావుగారు అన్నారు. 2పాటలు కంపోజ్ కూడా చేశాను. కానీ అనుకున్నట్టు జరగలేదు. ఆ తర్వాత 1992లో సింగీతం శ్రీనివాసరావు, నేను, రాజేంద్ర ప్రసాద్, డీవీ నరసరాజు.. ఇలా అందరం ఓ సినిమాకి పని చేశాం. ఆ సినిమాకు నిర్మాణ సంచాలకుడిలా ఉంటూనే రావి కొండలరావుగారు చాలావరకు మాటలు కూడా రాశారు. ‘భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం’ సినిమాలకు నా పేరు సూచించింది ఆయనే. ఆయన మేలు ఎప్పటికీ మర్చిపోలేను. కొండలరావుగారు చేసిన ‘కన్యాశుల్కం’ సీరియల్‌కి నేను పని చేశాను. నన్ను ఆయన బిడ్డలానే చూసుకునేవారు. ఈ ఏడాది మార్చి 4న ఆయనకు, ముళ్ళపూడి వెంకట రమణగారి భార్య శ్రీదేవిగారికి, జంధ్యాలగారి భార్య అన్నపూర్ణగారికి, వేటూరిగారి భార్య సీతా మహాలక్ష్మిగారికి సన్మానం చేసుకునే భాగ్యం నాకు దక్కడం చాలా సంతోషం. అప్పుడు చాలా బాగా మాట్లాడారు. అదే ఆయన్ను చివరిసారి చూడటం. ఆరోగ్యం బావుండటం లేదని తెలిసింది. గురువుగారికి ఎలా ఉంది అని వాళ్ల అబ్బాయితో మాట్లాడాను. నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తుల్లో గురువుగారు చాలా ముఖ్యమైనవారు. తాతినేని చలపతిరావు నన్ను మ్యూజిషియన్‌గా పరిచయం చేస్తే, జంధ్యాలగారు నన్ను సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. రావి కొండలరావుగారు నన్ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎలివేట్ చేశారు. నేను, నా కుటుంబం ఆయనకు రుణపడి ఉంటాం. ఆయన లేని లోటు నాకు ఎప్పుడూ ఉంటుంది. మృత్యోర్మా అమృతంగమయా – దర్శకుడు వీఎన్ ఆదిత్య రావి కొండలరావుగారితో మా కుటుంబానికి ఉన్న అనుబంధం వయస్సు నలభై ఐదు ఏళ్లకు పైనే. 1970లలో మా నాన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్‌లో కల్చరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు రావి కొండలరావు, శ్రీమతి రాధాకుమారి దంపతులతో స్నేహం ఏర్పడింది. ‘ఉగాది శుభాకాంక్షలతో... మీ రావికొండలరావు, రాధాకుమారి’ అనే పోస్ట్ కార్డు దాదాపు ముప్పై ఏళ్లు క్రమం తప్పకుండా మేం ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అయితే ఆ అడ్రస్‌కి వచ్చేది. ఆ కార్డు ఆధారంగానే నేను వాళ్లింటికి వెతుక్కుంటూ వెళ్లడం, ‘బృందావనం’ సినిమాకి సింగీతం శ్రీనివాసరావుగారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేయడం, దర్శకుడవ్వాలన్న నా కల సాకారం కావడం.. నాకు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మహా మనీషి రావి కొండలరావుగారు. ‘భైరవద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’ రెండు చిత్రాలకు ఆయన సంభాషణల రచయిత కూడా. సింగీతంగారి దర్శకత్వంలో వచ్చిన ఆ రెండు సినిమాలకు రావి కొండలరావుగారి ప్రోద్బలంతో నేను ఆయనకు అసిస్టెంట్ రైటర్‌గా పని చేయడం నా కెరీక్‌కి గొప్ప బలం. పదిహేను రోజుల క్రితం వెళ్లినప్పుడు ‘నేనో కథ చెప్తాను సినిమాకి, నాకు అసిస్టెంట్‌గా వచ్చి, నేను డిక్టేట్ చేసింది రాస్తావా, డైరెక్టర్ అయిపోయాను కదా, రాయనంటావా’ అనడిగారు. నేను నవ్వి, ‘ఆ అమృతం ఆస్వాదించే అవకాశం నేనింకొకడికి ఎందుకిస్తాను అంకుల్. నేను రోజూ వచ్చి, మీకు అసిస్ట్ చేస్తాను’ అన్నాను. ఇంతలోనే ఇలా... రావి కొండలరావుగారి ప్రతి రచనా తెలుగు సాహిత్య యవనికపై ఒక అమృత ధారగా సజీవంగా ఉంటుంది. ఆయన సినిమాలు, నటన తెలుగు జాతి ఉన్నంతకాలం అమృతంలా మనని అలరిస్తూనే ఉంటాయి. మృత్యువు నుంచి అమృతత్వానికి రావి కొండలరావుగారి కొత్త ప్రయాణం మొదలైందనే భావిస్తాను నేను. ఆయన ప్రోత్సాహాన్ని మరువలేను – ప్రముఖ రచయిత, వ్యాఖ్యాత రాంభట్ల నృసింహ శర్మ రావి కొండలరావుగారితో నాది ఇరవయ్యేళ్ల పైబడిన సాంస్కృతిక ప్రయాణం. 2000సంవత్సరంలో ‘విశాఖ హ్యూమర్ క్లబ్’ స్థాపన, నిర్వహణలో, యాడ్స్ ఫర్ యూ పత్రికలో కాలమిస్ట్‌గా వారు నాకిచ్చిన ప్రోత్సాహం మరువలేను. ‘కన్యాశుల్కం’ టెలీఫిల్మ్ ధారావాహిక శీర్షిక గీతం రచనకు ఇచ్చిన అవకాశం వల్లే నాకు ఉత్తమ గీత రచయితగా ‘నంది పురస్కారం’ లభించింది. ఆయన నాకు తండ్రిలాంటి వారు – రచయిత–దర్శకుడు వర ముళ్లపూడి ‘‘నేను చిన్నప్పటి నుండి రావి కొండలరావుగారిని చూస్తూ పెరిగాను. ఆయన, రాధాకుమారి ఆంటీ మా ఇంటి మనుషుల్లానే ఉండేవారు. నాకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. మా నాన్న తర్వాత మరో తండ్రిలాంటివారాయన. ఈ ఏడాదితో ‘బాలరాజు కథ’ (బాపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రావి కొండలరావు నటించారు) విడుదలై యాభై ఏళ్లయింది. అప్పుడు నేను ఆయన దగ్గర చిన్న వీడియో బైట్ కావాలని అడిగితే, బాపు, రమణ గార్ల గురించి రెండు గంటలు ఆపకుండా చెబుతాను.. నువ్వు రా అన్నారు. ఈ లోపు కోవిడ్ కారణంగా ఆటంకం వచ్చింది. ఆయనేమో పెద్దవారు, నేను అటూ ఇటూ తిరుగుతుంటాను. ఈ సమయంలో ఆయనేకేమైనా ఎఫెక్ట్ అవుతుందేమో, ఎందుకులే అని తర్వాత కలుద్దాం అనుకున్నాను. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవటం చాలా బాధగా ఉంది. ఆయనతో ఆ ఇంటర్వ్యూ చేసినా బావుండేదని ఇప్పుడు అనిపిస్తోంది. చాలా మంచి మనిషి. చెన్నైలో వాళ్లబ్బాయి ఇంట్లో ఆయన ఉండేవారు. అప్పుడు వెళ్లి ఆయన్ని అనేక సార్లు కలవటం జరిగింది. నాకు, బాపుగారబ్బాయికి ఫాదర్ ఫిగర్‌లా అయినప్పటికీ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు మాతో. బెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఆయనకు ఎక్స్లెంట్ సెన్సాఫ్ హ్యూమర్ ఉండేది. స్పాంటేనియస్‌గా జోకులు పేల్చేవారు. ‘పెళ్లి పుస్తకం’ సినిమా టైమ్‌లో నాన్న, బాపుగారు, కొండలరావుగారు.. ముగ్గురూ ఒకచోట కూర్చుని వర్క్ చూస్తుంటే కడుపు నిండిపోయేది. ఆ సినిమా కథ ఈయనదే. ఆయనతో నాకెన్నో మంచి అనుభూతులు ఉన్నాయి. సినిమా పరిశ్రమకు సంబంధించిన ఓ గొప్ప చరిత్ర తెలిసిన మనిషి ఈ రోజుతో కనుమరుగయ్యారు. -
ప్రముఖ నటి గీతాంజలి కన్నుమూత
ప్రముఖ నటి గీతాంజలి (72) ఇక లేరు. బుధవారం హఠాత్తుగా కడుపు నొప్పి అని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను రాత్రి 11.45 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం తెల్లవారు జామున ఆమె తుది శ్వాస విడిచారు. 1947లో కాకినాడలో జన్మించారు గీతాంజలి. ఆమె అసలు పేరు మణి. ఆమె తల్లిదండ్రులకు నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి అయితే మణి రెండో కుమార్తె. మూడేళ్ల వయసు నుంచే అక్క స్వర్ణతో కలిసి కాకినాడలోని గంధర్వ నాట్యమండలిలో నాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది. భర్త రామకృష్ణతో... పలు నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చింది. 1961లో ‘సీతారామ కల్యాణం’తో కథానాయికగా పరిచయమైంది మణి. ఆ సినిమాలోని ‘శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండీ...’ పాట నేటికీ శ్రీరామ నవమి పందిళ్లలో, పెళ్లి పందిళ్లలో వినిపిస్తుంటుంది.‘సీతారామ కల్యాణం’లో సీత పాత్ర ఒప్పుకున్నప్పుడు గీతాంజలి వయసు 14. ఎన్టీఆర్ రావణాసురుడు, రాముడేమో హరనాథ్. అంతకుముందు ‘రాణీ రత్నప్రభ’ అనే సినిమాలో గీతాంజలి చేసిన ఓ డ్యాన్స్ బిట్ చూసి, ‘సీతారామ కల్యాణం’లో సీత పాత్రకు తీసుకోవాలనుకున్నారు ఎన్టీఆర్. ‘నవరాత్రి’లో ఓ దృశ్యం ఆ చిత్రానికి ఆయనే దర్శకుడు. ‘‘ఏం భయపడొద్దు. మీరే సీత అనుకోండి.. చేయండి’’ అని భయపడుతున్న గీతాంజలితో అన్నారు. ఎన్టీఆర్ చెప్పింది చెప్పినట్లు చేశారామె. సినిమా రిలీజైంది. ఘనవిజయం సాధించింది. అప్పుడు గీతాంజలి ఎక్కడ కనిపించినా ‘అదిగో సీత’ అనేవారు. ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయ్యారు గీతాంజలి. ఎన్టీఆర్ తిలకం దిద్దేవారని, ‘సీతారామ కల్యాణం’ వంద రోజుల వేడుక శ్రీరామ నవమి వేడుకలా జరగడం మరచిపోలేనని ఓ సందర్భంలో పేర్కొన్నారామె. ‘మణి’ పేరుతో పరిచయమైన ఆమె గీతాంజలిగా ఎలా మారారంటే? హిందీ చిత్రంతో పేరు మార్పు ఆ మార్పుకి కారణం హిందీ సినిమా ‘పారస్ మణి’ (1963). అందులో గీతాంజలిది రాజకుమారి పాత్ర. సినిమా పేరు ‘పారస్ మణి’, కథానాయిక నిజమైన పేరు ‘మణి’ అంటే కన్ఫ్యూజ్ అవుతారని చిత్రదర్శకుడు బాబూ భాయ్ మిస్త్రీ ‘గీతాంజలి’గా మార్చారు. అప్పటివరకూ దక్షిణాది తెరపై ‘మణి’ పేరుతో పాపులర్ అయిన గీతాంజలి ఆ తర్వాతి నుంచి మార్చిన పేరుతో కొనసాగడం విశేషం. మణి సార్థక నామధేయురాలు అనాలి. పేరుకి తగ్గట్టుగానే నటనలో ‘మణి’ అనిపించుకుని, మంచి ‘నటనామణి’గా తెలుగు చలన చరిత్రలో నిలిచిపోయారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించారు గీతాంజలి. మలయాళ సినిమా ‘స్వప్నంగళ్’లో ఆమె అంధురాలి పాత్ర చేశారు. అప్పుడు గీతాంజలికి 18 ఏళ్లు. ఆ సినిమాలో గీతాంజలి చిన్ననాటి పాత్రను శ్రీదేవి చేయడం విశేషం. అప్పుడు శ్రీదేవికి తొమ్మిదేళ్లు. తమిళంలో శారద, దైవత్తిన్ తాయ్, పనమ్ పడైత్తవన్.. ఇలా పలు చిత్రాల్లో నటించారు. హీరోయిన్ టు హాస్యం ఒకవైపు కథానాయికగా నటిస్తూనే చెల్లెలి పాత్రలూ చేసేవారు. ‘డా. చక్రవర్తి’లో చేసిన ఏయన్నార్ చెల్లెలి పాత్ర, ‘లేత మనసులు’లో చేసిన డ్యాన్స్ టీచర్ తదితర పాత్రలు గీతాంజలికి మంచి పేరు తెచ్చాయి. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో కథానాయికగా చేసిన ‘ఇల్లాలు’ సినిమా కూడా గీతాంజలి కెరీర్‌కి ప్లస్ అయింది. అందులో ఆమె కథానాయికగా, దొంగగా ద్విపాత్రాభినయం చేశారు. అయితే కథానాయికగా కొనసాగుతున్న సమయంలో ‘దేవత’ సినిమాలో హాస్యపాత్ర ఒప్పుకోవడం తాను చేసిన తప్పు అని, పద్మనాభం వల్లే తన కెరీర్ హాస్యం వైపు మళ్లిందని ఓ సందర్భంలో గీతాంజలి చెప్పారు. సినిమా పరిశ్రమలో ఏదైనా పాత్ర బాగా క్లిక్ అయితే ఆ తర్వాత ఆ ఆర్టిస్ట్‌ని ఆ తరహా పాత్రలకు పరిమితం చేయడం ఓ ఆనవాయితీ. అలా ‘దేవత’ చిత్రంలో గీతాంజలి చేసిన హాస్య పాత్రకు మంచి ప్రశంసలు రావడంతో దర్శకులు ఆమెని చూసే దృష్టి కోణం మారిపోయింది. అప్పటినుంచి ఆమెకు కామెడీ పాత్రలకే అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు. అలాగే ‘వ్యాంప్ క్యారెక్టర్స్’, ‘డ్యాన్స్ నంబర్స్’ కూడా చేశారామె. హీరోయిన్గా దాదాపు 50 చిత్రాలు చేసిన గీతాంజలి కెరీర్ కామెడీ ఆర్టిస్ట్‌కి మారింది. అయితే కామెడీ జంటల్లో పద్మనాభం, గీతాంజలిలది హిట్ పెయిర్. ‘మర్యాద రామన్న’, ‘పొట్టి ప్లీడరు’ వంటి చిత్రాల్లో జంటగా నటించారు. అది గీతాంజలి నిజాయతీకి నిదర్శనం మామూలుగా రీమేక్ సినిమాలు చేస్తున్నప్పుడు ‘నా స్టయిల్లో చేశాను. కాపీ కొట్టలేదు’ అని చెబుతుంటారు. కానీ గీతాంజలి మాత్రం ‘కాపీ కొట్టాను’ అని ఒప్పుకోవడం ఆమె నిజాయతీకి నిదర్శనం. తమిళంలో కె. బాలచందర్ తెరకెక్కించిన ‘ఎదిర్ నీచ్చల్’ సినిమాని ‘సంబరాల రాంబాబు’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. అందులో షావుకారు జానకి చేసిన పాత్రను తెలుగులో గీతాంజలి చేశారు. ‘‘తమిళ సినిమాలో షావుకారు జానకి పాత్ర చూశాను. ఆమెను కాపీ కొట్టాను’’ అని ఓ సందర్భంలో గీతాంజలి అన్నారు. బామ్మగా రీ–ఎంట్రీ కెరీర్ సజావుగా కొనసాగుతున్న సమయంలోనే ప్రముఖ నటుడు రామకృష్ణతో గీతాంజలి వివాహం జరిగింది. వాస్తవానికి వారిది ప్రేమ వివాహం అనుకుంటారు కానీ, పెద్దలు కుదిర్చిన పెళ్లే అని గీతాంజలి స్వయంగా పేర్కొన్నారు. పెళ్లి తర్వాత భర్త విశ్రాంతి తీసుకోమనడంతో గీతాంజలి సినిమాలకు దూరమయ్యారు. నటిగా రీ–ఎంట్రీలో ‘పెళ్లైన కొత్తలో’ చిత్రంలో చేసిన బామ్మ పాత్ర క్లిక్ అయింది. ఆ తర్వాత ఆమె ఈ తరహా పాత్రలు చేయడం మొదలుపెట్టారు. తనయుడిని నటుడిని చేయాలనుకున్నారు గీతాంజలి–రామకృష్ణ దంపతులకు ఓ కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్‌ని నటుడిని చేయాలనే ఆకాంక్ష ఇద్దరికీ ఉండేది. 2001లో రామకృష్ణ చనిపోయారు. అప్పటివరకూ చెన్నైలోనే ఉంటున్న గీతాంజలి భర్త దూరమయ్యాక హైదరాబాద్‌కి మకాం మార్చారు. శ్రీనివాస్ ఓ మూడు సినిమాలు కమిట్ అయినా, అవి విడుదల వరకూ రాలేదు. చిత్రప్రముఖుల నివాళి గీతాంజలి హఠాన్మరణం చిత్రపరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. గురువారం ఆస్పత్రి నుంచి ఆమె భౌతిక కాయాన్ని నందీ నగర్‌లోని ఆమె నివాసానికి తరలించారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం ఫిలిం చాంబర్ ఆవరణలో ఉంచారు. ఆ తర్వాత మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణంరాజు, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్, జీవితా రాజశేఖర్, పరుచూరి గోపాలకృష్ణ, వీకే నరేష్.. ఇలా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గీతాంజలి మరణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సినిమాల్లో గీతాంజలి చెరగని ముద్ర వేశారని ఆయన కొనియాడారు. ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించిన గీతాంజలి అక్కడ కూడా తన ప్రతిభ చూపారని పేర్కొన్నారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గీతాంజలి మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘సీతారామ కల్యాణం’తో పాటు అనేక తెలుగు చిత్రాల్లో ఆమె ప్రదర్శించిన నటన గుర్తుండిపోతుందన్నారు. చెమర్చిన కళ్లతో శ్రీనివాస్ -
ప్రముఖ బాలీవుడ్ నటుడు కన్నుమూత
సాక్షి,ముంబై: బాలీవుడ నటుడు , మరాఠీ చిత్ర థియేటర్ నటుడు విజు ఖోటే (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారని బంధువులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు ఉదయం చందన్‌వాడిలో అంత్యక్రియలు నిర్వహించనున్నామని ఆయన మేనకోడలు నటుడు భవన బల్సవర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ చిత్రం షోలేలో డెకాయిట్ కాలియా పాత్రతో పాపులర్ అయిన విజు ‘‘అందాజ్ అప్నా, అప్నా’’ రాబర్ట్ పాత్రలో ఆకట్టుకున్నారు. అలాగే ‘‘ఖయామత్ సే ఖయామత్ తక్", "వెంటిలేటర్" ‘‘జబాన్ సంభాల్కే" లాంటి టీవీ షోలో కూడా నటించారు. ‘‘గల్తీసే మిస్టేక్ హో గయా’’ డైలాగ్‌తో హాస్యనటుడిగా తనదైన గుర్తింపును సాధించారు విజు ఖోటే. -
నట గురువు ఇక లేరు
రజనీకాంత్, చిరంజీవి ఇప్పటి సూపర్‌స్టార్స్. కానీ వాళ్లకు నటనలో ఓనమాలు దిద్దించిన నటగురువు దేవదాస్ కనకాల. వీరే కాదు రాజేంద్రప్రసాద్, ‘శుభలేఖ’ సుధాకర్, నాజర్, ప్రదీప్ శక్తి, భాను చందర్, అరుణ్ పాండ్యన్, రఘువరన్, రాంకీ వంటి నటులందరికీ నటనలో శిక్షణ ఇచ్చిన దేవదాస్ కనకాల ఇక లేరు. నటుడిగా, దర్శకుడిగా, నట శిక్షకుడిగా ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా దేవదాస్ కనకాల ప్రయాణం సాగింది. నిన్నటితో ఆ ప్రయాణం ఆగిపోయింది. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం దేవదాస్ కనకాల మృతి చెందారు. 1945 జూలై 30 యానాంలోని కనకాల పేటలో కనకాల పాపయ్య, మహాలక్ష్మికి జన్మించారు. ఫ్రెంచ్ పరిపాలనలో ఉన్నప్పుడు వీరి తండ్రి ఎమ్మెల్యేగా పనిచేశారు కూడా. దేవదాస్ కనకాల విశాఖపట్టణంలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ చదివారు. సినిమా కోసం ఉద్యోగాన్ని సైతం వదిలేశారాయన. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో విద్యనభ్యసించిన తర్వాత నటనలో శిక్షణ కేంద్రం స్థాపించారు. ఎందరో నటీనటులను తీర్చిదిద్ది ఇండస్ట్రీకి పంపించారాయన. చెన్నైలోని అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, హైదరాబాద్‌లోని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అధ్యాపకునిగా చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. నటుడిగా ‘ఓ సీత కథ, సిరి సిరి మువ్వ, గ్యాంగ్‌లీడర్, మంచు పల్లకి. అమ్మో ఒకటో తారీఖు, మల్లీశ్వరీ, కింగ్, అసాధ్యుడు’ వంటి సినిమాల్లో నటించారు. ‘అమృతం’ టీవీ సీరియల్లో కూడా నటించారు. ‘చలి చీమలు, నాగవల్లి’ అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. దేవదాస్ కనకాల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గురుదక్షిణగా రజనీకాంత్ తన డేట్స్ ఇచ్చినప్పటికీ దేవదాస్ కనకాల తిరస్కరించారట. 1971 నవంబర్ 21న లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారు. వీరి పిల్లలు రాజీవ్ కనకాల, శ్రీ లక్ష్మీ కనకాల ఇద్దరూ నటనా రంగంలోనే ఉన్నారు. రాజీవ్ కనకాల భార్య సుమ ప్రముఖ యాంకర్. శ్రీ లక్ష్మి నాటక రంగ ప్రముఖులు డా. పెద్ది రామారావును వివాహం చేసుకున్నారు. 2018లో దేవదాస్ భార్య లక్ష్మీ దేవి మరణించారు. భార్య దూరం అయిన బాధలో దేవదాస్ ఎక్కువ శాతం ఇంటికే పరిమితం అయ్యారు. మహేశ్‌బాబు నటించిన ‘భరత్ అనే నేను’ ఆయన నటించిన చివరి చిత్రం. దేవదాస్ కనకాల మృతి పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. శనివారం ఉదయం మణికొండలోని స్వగృహానికి దేవదాస్ భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి తరలిస్తారు. ఉదయం 11.30. తర్వాత అంత్యక్రియలు ఆరంభమవుతాయి. భార్య లక్ష్మీదేవి, కొడుకు, కోడలు రాజీవ్, సుమలతో...దేవదాస్ కనకాల -
ప్రముఖ బాలీవుడ్ నటుడు మృతి
బాజీగర్, 36 చైనా టౌన్, ఖిలాడీ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ సీనియర్ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దిన్యార్ కాంట్రాక్టర్ (79) మృతి చెందారు. వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. హిందీ గుజరాతీ సినిమాలతో పాటు పలు టీవీ షోస్‌లోనూ ఆయన నటించారు. చదువుకునే రోజుల్లోనే రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన 1966 నుంచి సినిమాల్లో నటిస్తున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గానూ 2019లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఎన్నో అద్భుత పాత్రల్లో అలరించిన దిన్యార్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
బంగ్లాపైనుంచి పడిపోయిన సీనియర్ నటుడు!
కోల్‌కతా : బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు చిన్మయ్ రాయ్ ప్రమాదవశాత్తు తన అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తు నుంచి పడిపోయారు. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. గాయాలతో గ్రౌండ్‌ఫ్లోర్‌లో పడి ఉన్న ఆయనను గుర్తించిన స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దక్షిణ కోల్‌కతాలోని తమ నివాసంలో ఈ ఘటన జరిగిందని, ఈ ఘటన జరిగిన సమయంలో తాను ఇంట్లో లేనని ఆయన కుమారుడు శాంఖ్యా తెలిపారు. 77 ఏళ్ల చిన్మయ్ రాయ్‌కి కాళ్లకు, చేతులకు, శరీరంలోని పలుభాగాలకు గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని శాంఖ్యా తెలిపారు. చార్మూర్తి, బసంతా బిలాప్, నానిగోపాలెర్ బైయే తదితర కళాత్మక క్లాసిక్ చిత్రాల్లో చిన్మయ్ రాయ్ నటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను బెంగాల్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు పలువురు పరామర్శించారు. -
ఆస్పత్రి పాలైన సీనియర్ నటుడు
ముంబై: అలనాటి బాలీవుడ్ స్టార్ హీరో, అబితాబ్ బచ్చన్‌తో కలిసి 'షోలే' లాంటి సూపర్‌హిట్ సినిమాలో నటించిన ధర్మేంద్ర (81) అస్వస్థతకు గురయ్యారు. జీర్ణకోశ (గ్యాస్ట్రోఎంటెరిటిస్) సమస్యతో బాధపడుతున్న ఆయనను వెంటనే ముంబైలోని నానావతికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీజేపీ ఎంపీ హేమామాలిని ధర్మేంద్రకు సతీమణి. 70వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మాస్ హీరోగా ధర్మేంద్ర అలరించాడు. 1975లో వచ్చిన 'షోలే' సినిమాలో ధర్మేంద్ర కెరీర్లో మేలిమలుపుగా నిలిచిపోయింది. ధర్మేంద్ర ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, రెండురోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేస్తామని ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ విశేష్ అగర్వాల్ తెలిపారు. -
బీజేపీలో చేరిన నటుడు విసు
చెన్నై: ప్రముఖ చలనచిత్ర నటుడు విసు శనివారం బీజేపీలో చేరారు. చెన్నై టీనగర్‌లోగల రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయానికి నటుడు విసు శనివారం ఉదయం చేరుకున్నారు. అక్కడ కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్‌ను కలిసి తాను బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆయనను కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఆ సమయంలో బీజపీ ఉపాధ్యక్షులు వానతి శ్రీనివాసన్, చక్రవర్తి సహా బీజేపీ నిర్వాహకులు వెంట వున్నారు. తర్వాత నటుడు విసు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి అభినందనలు అందుకున్నారు. నటుడు విసుకు పార్టీలో ముఖ్య పదవి లభించగలదని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. -
సినీ రచయిత కాశీ విశ్వనాథ్ హఠాన్మరణం
-
సినీ రచయిత కాశీ విశ్వనాథ్ హఠాన్మరణం
* రైల్లో ప్రయాణిస్తుండగా గుండెపోటు * 1980లో సినీ రంగప్రవేశం.. చిత్రసీమకు నిరుపమాన సేవలు * రంగస్థల, సినీ రచయితగా, దర్శకుడిగా విఖ్యాతి ఖమ్మం క్రైం/విశాఖ కల్చరల్: మరో సినీ దిగ్గజం దివికేగింది. అలనాటి నలుపు తెలుపు చిత్రాల నుంచి.. నేటి డిజిటల్ యుగం వరకు తెలుగు చలన చిత్ర రంగానికి నిరుపమాన సేవలందించిన ప్రఖ్యాత రచయిత, నటుడు, రంగస్థల ప్రయోక్త శిలుకోటి కాశీ విశ్వనాథ్ (69) మంగళవారం కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు రైల్లో వస్తుండగా ఖమ్మం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందారు. ఖమ్మం జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ పుప్పాల శ్రీనివాసరావు కథనం ప్రకారం.. కాశీ విశ్వనాథ్ హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేందుకు సోమవారం రాత్రి లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్ ఎక్కా రు. ఏసీ బీ-1 కోచ్, బెర్త్ నంబర్ 52లో ప్రయాణిస్తుండగా.. ఖమ్మం సమీపానికి రాగానే ఆయనకు గుండెపోటు వచ్చింది. టీసీ త్యాగరాజన్ బోగీలోకి వచ్చి చూసేసరికి కాశీ విశ్వనాథ్ బెర్త్‌పై నుంచి కిందపడి ఉన్నారు. ఎంత లేపినా లేవకపోవడంతో ఖమ్మం రైల్వే అధికారులకు సమాచారమిచ్చారు. తెల్లవారుజామున 2 గంటలకు ఖమ్మంలో రైల్వే సిబ్బంది కాశీ విశ్వనాథ్‌ను కిందకు దించారు. 108 సిబ్బంది పరీ క్షించి ఆయన మృతిచెందినట్లు నిర్ధారించారు. జీఆర్పీ పోలీసులు ఆయన కుమారుడు శ్రీధర్‌కు సమాచారం అందించారు. 1946లో విశాఖలో శిలుకోటి అప్పలస్వామి, బుచ్చయమ్మ దంపతులకు జన్మించిన కాశీ విశ్వనాథ్.. హైస్కూల్ స్థాయి నుంచే రంగస్థల నటుడిగా, నాటక రచయితగా, దర్శకుడిగా.. యూనివర్సిటీ స్థాయిలో జాతీయ క్రీడాకారుడిగా రాణిం చారు. 1980లో సినీ రంగప్రవేశం చేశారు. హాస్యచిత్ర రచయితగా, సంభాషణకర్తగా బహుముఖ సాహితీ సేవలందించారు. మృతదేహం కుమారుడికి అప్పగింత తండ్రి మరణవార్త వినగానే విశాఖలో లోకో పైలట్‌గా పనిచేస్తున్న ఆయన కుమారుడు శ్రీధర్ హుటాహుటిన ఖమ్మం చేరుకున్నారు. పంచనామా అనంతరం పోలీసులు మృతదేహాన్ని ఆయన కుమారుడికి అప్పగించారు. తెల్లవారుజామున 1:50 నిమిషాలకు ఫోన్ చేసి ఏదో చెప్పాలని ప్రయత్నించి.. చెప్పలేక పోయారని, హలో.. హలో అంటున్నా.. అటువైపు నుంచి జవాబు రాలేదని శ్రీధర్ రోదిం చారు. అనంతరం మృతదేహాన్ని వైజాగ్‌లోని స్వగృహానికి తరలించారు. కాశీ విశ్వనాథ్ మరో కుమారుడు కల్యాణ చక్రవర్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చెన్నైలో పనిచేస్తుండగా, కూతురు పుష్పలత గృహిణి. విశ్వనాథ్ భార్య మహాలక్ష్మితో కలసి వైజాగ్‌లో ఉంటున్నారు. -
సీనియర్ నటుడు సీకే విశ్వనాథ్ కన్నుమూత
ప్రముఖ సినీ రచయిత, నటుడు చిలుకోటి కాశీవిశ్వనాథ్ మరణించారు. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైల్లో విశాఖపట్నం వెళ్తుండగా ఆయనకు ఖమ్మం సమీపంలో గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. కాశీ విశ్వనాథ్ మృతదేహాన్ని రైల్వే అధికారులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్తున్నట్లు తెలిసింది. దాదాపు 70 సినిమాలకు ఆయన రచయితగా పనిచేశారు. దాసరి నారాయణరావు, రేలంగి నరసింహారావు, రాజాచంద్ర, విజయ బాపినీడు తదితరుల సినిమాలకు ఆయన రచయితగా పనిచేశారు. గత కొన్నాళ్లుగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మరణిస్తున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తండ్రి, ప్రముఖ రచయిత సత్యమూర్తి, మరో రచయిత శ్రీనివాస్ చక్రవర్తి, అనూప్ రూబెన్స్ తల్లి, నాటకరంగ ప్రముఖుడు చాట్ల శ్రీరాములు, విలక్షణ నటుడు, హీరో రంగనాథ్, నృత్యదర్శకుడు భరత్ కన్నుమూశారు. -
చంద్రమోహన్‌కు గుండెపోటు
-
రావూ.. గోపాల్ రావ్!
-
సినీనటుడి కుమార్తె ఆత్మహత్య
హైదరాబాద్ : ఒంటరితనాన్ని భరించలేక పాతతరం సినీనటుడు కుమార్తె ఒకరు ఆత్మహత్య చేసుకున్నరు. బంజారాహిల్స్ ఎస్ఐ భాస్కరరావు కథనం ప్రకారం ఫిలింనగర్ రోడ్డు నెం.7లోని ఫేజ్-2లో పాతతరం నటుడు సీపీ కృష్ణారావు కుమార్తె ఎన్.ధనలక్ష్మి (50) నివాసముంటున్నారు. ఆరేళ్ల క్రితం ఈమె భర్త ఎన్.నరేందర్ మృతి చెందారు. మరో రెండు రోజుల్లో ఇతని వర్థంతిని నిర్వహించాల్సి ఉంది. ఏడాది క్రితం ఇద్దరు కొడుకుల పెళ్లిళ్లు చేయగా వారు వేరుగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా...శుక్రవారం మధ్యాహ్నం ధనలక్ష్మి తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అటు భర్తను కోల్పోవటం, ఇటు పిల్లలు దూరంగా ఉండటంతో ఒంటరితనంతో ధనలక్ష్మి కొంతకాలంగా ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తోందని, ఈ నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.