
బీజేపీలో చేరిన నటుడు విసు
చెన్నై: ప్రముఖ చలనచిత్ర నటుడు విసు శనివారం బీజేపీలో చేరారు. చెన్నై టీనగర్‌లోగల రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయానికి నటుడు విసు శనివారం ఉదయం చేరుకున్నారు. అక్కడ కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్‌ను కలిసి తాను బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు.
ఆయనను కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఆ సమయంలో బీజపీ ఉపాధ్యక్షులు వానతి శ్రీనివాసన్, చక్రవర్తి సహా బీజేపీ నిర్వాహకులు వెంట వున్నారు. తర్వాత నటుడు విసు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి అభినందనలు అందుకున్నారు. నటుడు విసుకు పార్టీలో ముఖ్య పదవి లభించగలదని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.