బంగ్లాపైనుంచి పడిపోయిన సీనియర్‌ నటుడు! | Veteran Actor Chinmoy Roy Hospitalised | Sakshi
Sakshi News home page

Jul 1 2018 9:20 AM | Updated on Jul 1 2018 11:39 AM

Veteran Actor Chinmoy Roy Hospitalised - Sakshi

కోల్‌కతా : బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్‌ నటుడు చిన్మయ్‌ రాయ్‌ ప్రమాదవశాత్తు తన అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తు నుంచి పడిపోయారు. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. గాయాలతో గ్రౌండ్‌ఫ్లోర్‌లో పడి ఉన్న ఆయనను గుర్తించిన స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దక్షిణ కోల్‌కతాలోని తమ నివాసంలో ఈ ఘటన జరిగిందని, ఈ ఘటన జరిగిన సమయంలో తాను ఇంట్లో లేనని ఆయన కుమారుడు శాంఖ్యా తెలిపారు. 77 ఏళ్ల చిన్మయ్‌ రాయ్‌కి కాళ్లకు, చేతులకు, శరీరంలోని పలుభాగాలకు గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని శాంఖ్యా తెలిపారు.

చార్‌మూర్తి, బసంతా బిలాప్‌, నానిగోపాలెర్‌ బైయే తదితర కళాత్మక క్లాసిక్‌ చిత్రాల్లో చిన్మయ్‌ రాయ్‌ నటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను బెంగాల్‌ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు పలువురు పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement