Chinmoy Roy
-
Bangladesh: జనవరి 2 వరకూ జైల్లోనే చిన్మయ్ దాస్
ఢాకా: బంగ్లాదేశ్‌లోని హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో ఆయన తరపున వాదించేందుకు చిట్టగాంగ్ కోర్టులో న్యాయవాది ఎవరూ లేరు. ఈ నేపధ్యంలోనే విచారణ జనవరి 2కు వాయిదా పడింది. బంగ్లాదేశ్‌లోని హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు తరపు న్యాయవాది రమణ్ రాయ్‌పై దాడి జరిగిందని ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధారమణ్ దాస్ తెలిపారు. ఆయన ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారని, చిన్మయ్ ప్రభు తరపున వాదించడమే ఆయన చేసిన తప్పులా ఉందని దాస్ పేర్కొన్నారు.ఐసీయూలో ఉన్న రాయ్ ఫోటోను ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి దాస్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. న్యాయవాది రమణ్ రాయ్ కోసం ప్రార్థించాలని ఆయన హిందువులను కోరారు. ఇస్లామిక్ ఛాందసవాదులు అతని ఇంటిని ధ్వంసం చేసి, అతనిపై దాడి చేశారని దాస్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సమిత సనాతనీ జాగరణ్ జోట్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభును ఢాకాలోని హజ్రత్ షాజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ కోర్టు అతనికి బెయిల్ మంజూరును నిరాకరించి, జైలుకు తరలించింది.ఇది కూడా చదవండి: సీఎం పదవిపై వీడని ఉత్కంఠ.. వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేతలు -
బంగ్లాపైనుంచి పడిపోయిన సీనియర్ నటుడు!
కోల్‌కతా : బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు చిన్మయ్ రాయ్ ప్రమాదవశాత్తు తన అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తు నుంచి పడిపోయారు. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. గాయాలతో గ్రౌండ్‌ఫ్లోర్‌లో పడి ఉన్న ఆయనను గుర్తించిన స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దక్షిణ కోల్‌కతాలోని తమ నివాసంలో ఈ ఘటన జరిగిందని, ఈ ఘటన జరిగిన సమయంలో తాను ఇంట్లో లేనని ఆయన కుమారుడు శాంఖ్యా తెలిపారు. 77 ఏళ్ల చిన్మయ్ రాయ్‌కి కాళ్లకు, చేతులకు, శరీరంలోని పలుభాగాలకు గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని శాంఖ్యా తెలిపారు. చార్మూర్తి, బసంతా బిలాప్, నానిగోపాలెర్ బైయే తదితర కళాత్మక క్లాసిక్ చిత్రాల్లో చిన్మయ్ రాయ్ నటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను బెంగాల్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు పలువురు పరామర్శించారు.