
బాలీవుడ్ సీనియర్ నటుడు రసిక్ దేవ్ కిడ్నీ ఫెయిల్యూర్‌తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న గత శనివారం(జులై30)న తుదిశ్వస విడిచారు. అయితే భర్త చనిపోయిన రెండు రోజులకే నటి కేత్కి దేవ్ షూటింగ్‌లో పాల్గొంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కేత్కి దేవ్.. భర్త చనిపోయినప్పటికీ ఎటువంటి బ్రేక్ తీసుకోలేదని పేర్కొంది.
ముందుగానే డేట్స్ ఇచ్చేసిన కారణంగా తన వల్ల ఎవరూ ఇబ్బంది కూడదనే ఈ విధంగా చేసినట్లు తెలిపింది. 1983లో రసిద్ దేవ్- కేత్కి ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి కూతురు, ఓ కుమారుడు ఉన్నాడు. ‘బాలికా వధు’,క్యోంకీ సాస్ బీ కబీ బహు తీ’ సహా పలు హిందీ, గుజరాతీ సినిమాలతో కేత్కి దేవ్ గుర్తింపును సంపాదించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment