ప్రముఖ బాలీవుడ్ నటుడు రమేశ్ డియో(93) కన్నుమూశారు. హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన బుధవారం(ఫిబ్రవరి 2న) గుండెపోటుతో మరణించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ మధ్యే 93వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు.
కాగా రమేశ్ డియో 1926 జనవరి 30న జన్మించారు. ఆయన నటించిన సినిమాల్లో 'ఆనంద్', 'మేరే ఆప్నే' తనకు మంచి పేరుతెచ్చిపెట్టాయి. ఇవే కాకుండా 'జాలీ ఎల్‌ఎల్‌బీ', 'ఘాయల్ వన్స్ ఎగైన్' వంటి పలు హిందీ చిత్రాల్లో నటించారు. 'పట్లచ్చి పోర్' మూవీతో మరాఠీ ఇండస్ట్రీలోనూ ప్రవేశించారు. 'అందాల మగతో ఏక్ దోల' చిత్రంతో కథానాయకుడిగా మారారు. సుమారు 250 సినిమాల్లో నటించిన ఆయన డజన్లకొద్దీ సినిమాలను నిర్మించారు. కొన్నింటికి డైరెక్షన్ కూడా చేశారు. 2013లో 11వ పుణె ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ నటుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment