
ఆస్పత్రి పాలైన సీనియర్ నటుడు
ముంబై: అలనాటి బాలీవుడ్ స్టార్ హీరో, అబితాబ్ బచ్చన్‌తో కలిసి 'షోలే' లాంటి సూపర్‌హిట్ సినిమాలో నటించిన ధర్మేంద్ర (81) అస్వస్థతకు గురయ్యారు. జీర్ణకోశ (గ్యాస్ట్రోఎంటెరిటిస్) సమస్యతో బాధపడుతున్న ఆయనను వెంటనే ముంబైలోని నానావతికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీజేపీ ఎంపీ హేమామాలిని ధర్మేంద్రకు సతీమణి. 70వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మాస్ హీరోగా ధర్మేంద్ర అలరించాడు. 1975లో వచ్చిన 'షోలే' సినిమాలో ధర్మేంద్ర కెరీర్‌లో మేలిమలుపుగా నిలిచిపోయింది.
ధర్మేంద్ర ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, రెండురోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేస్తామని ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ విశేష్ అగర్వాల్ తెలిపారు.