డేట్‌ మారింది | Yamla Pagla Deewana 3 to now release on August 31 | Sakshi
Sakshi News home page

డేట్‌ మారింది

Jul 7 2018 12:39 AM | Updated on Apr 3 2019 6:34 PM

Yamla Pagla Deewana 3 to now release on August 31 - Sakshi

బాబీ డియోల్, ధర్మేంద్ర, సన్నీ డియోల్‌

ఈ ఏడాది ఆగస్టు 15కు బాక్సాఫీస్‌ వద్ద అక్షయ్‌కుమార్‌ ‘గోల్డ్‌’, జాన్‌ అబ్రహాం ‘సత్యమేవ జయతే’, ధర్మేంద్రల ‘యామ్లా పాగ్లా దీవానా ఫిర్‌ సే’ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. కానీ ఇప్పుడు ‘యామ్లా పాగ్లా దీవానా..’ చిత్రబృందం తమ నిర్ణయాన్ని మార్చుకుని సినిమాను ఆగస్టు 31కి వాయిదా వేసుకున్నట్లు బీటౌన్‌ టాక్‌.

‘గోల్డ్, సత్యమేవ జయతే’ రెండూ దేశభక్తికి సంబంధించిన చిత్రాలే కావడం ఇందుకు కారణమట. నవనీత్‌సింగ్‌ దర్శకత్వంలో తండ్రీకొడుకులు ధర్మేంద్ర, సన్నీ డియోల్, బాబీ డియోల్‌ ముఖ్య తారలుగా రూపొందిన ‘యామ్లా పాగ్లా దీవానా ఫిర్‌ సే’ కామెడీ జానర్‌ మూవీ. రెండు దేశభక్తి చిత్రాలతో కామెడీ జానర్‌ మూవీ ఎందుకు? అని విడుదలను వాయిదా వేసుకున్నారట. ఈ ప్రాంచైజీలో వచ్చిన తొలిపార్ట్‌కు సమీర్‌ కార్నిక్‌ దర్శకత్వం వహించగా, రెండో పార్ట్‌కు సంగీత్‌ శివన్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement