బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, ఆయన కుమారులు బాబీ డియోల్, సన్నీ డియోల్ కలసి స్క్రీన్ మీద నవ్వులు పండించిన చిత్రం ‘అప్నే’. ధర్మేంద్ర, సన్నీ, బాబీ, కత్రీనా కైఫ్, శిల్పా శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం 2007లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ‘అప్నే’కు సీక్వెల్‌గా ‘అప్నే 2’ను తెరకెక్కించే పనిలో ఉన్నట్టు ఆదివారం ప్రకటించారు ధర్మేంద్ర. ‘మీ అందరికీ ‘అప్నే 2’ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’ అని ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
∙సన్నీ డియోల్, ధర్మేంద్ర, బాబీ డియోల్
మళ్లీ వస్తున్నాం
Published Mon, Nov 30 2020 6:18 AM | Last Updated on Mon, Nov 30 2020 6:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment