బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తనయుడు, నటుడు కరణ్ డియోల్ ఓ ఇంటివాడయ్యాడు. ప్రేయసి దృష ఆచార్యతో ఏడడుగులు నడిచాడు. జూన్ 18న ఇరు కుటుంబాలు, దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి శ్రీకారం చుట్టే వివాహ వేడుక కోసం సుందరంగా ముస్తాబైందీ కొత్త జంట. నూతన వధువు ఎరుపు లెహంగాలో మెరిసిపోగా, వరుడు కరణ్ డియోల్ షేర్వానీ ధరించాడు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఆదివారం రాత్రి సినీప్రముఖుల కోసం రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నారు. ఇకపోతే కరణ్ డియోల్.. హల్దీ, మెహందీ, సంగీత్ వేడుక సైతం ఘనంగా జరిగింది. బరాత్ వేడుకలో కరణ్ తండ్రి సన్నీ డియోల్‌తో పాటు బాబీ, అభయ్ డియోల్, తాతయ్య ధర్మేంద్ర కూడా స్టెప్పులేస్తూ హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment