నాన్నకు హ్యాట్సాఫ్‌ | Book, docu-drama on veteran actor Dharmendra's life in works | Sakshi

నాన్నకు హ్యాట్సాఫ్‌

Dec 4 2018 12:36 AM | Updated on Dec 4 2018 12:36 AM

Book, docu-drama on veteran actor Dharmendra's life in works - Sakshi

సన్నీడియోల్, ధర్మేంద్ర

బాలీవుyŠ  సూపర్‌స్టార్‌ ధర్మేంద్ర అభిమానులకు ఆయన కుమారుడు సన్నీ డియోల్‌ ఓ గిఫ్ట్‌ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అదేంటంటే... ధర్మేంద్ర జీవితం ఆధారంగా ఓ డాక్యుమెంటరీని రూపొందించనున్నారు సన్నీ. పంజాబ్‌ నుంచి ముంబై వచ్చి సినిమాల్లో సూపర్‌ స్టార్‌గా ధర్మేంద్ర ఎలా ఎదిగారు? అనే విషయాల్ని ఇందులో ప్రస్తావించనున్నారట. అలాగే ధర్మేంద్ర జీవితం ఆధారంగా ఓ పుస్తకాన్ని కూడా రిలీజ్‌ చేయనున్నారు.

ఇందులో నటుడిగా ఆయన చేరుకున్న మైలు రాళ్లు, జ్ఞాపకాలు, ఆశ్చర్యకర సంఘటనలు షేర్‌ చేసుకుంటారట. ‘‘నాన్నగారి లైఫ్‌ గురించి తన ప్రతి అభిమానికి తెలియాలి. అందుకే ఈ డాక్యుమెంటరీ. మా టీమ్‌ అందరితో నాన్నగారు ప్రయాణిస్తారు. తన ప్రతి జ్ఞాపకాలను చూపిస్తారు. వాటిని షూట్‌ చేస్తాం. నాన్నగారితో పని చేసిన అందర్నీ ఇంటర్వ్యూ చేయనున్నాం. నాన్నగారి సుదీర్ఘ ప్రయాణం గ్రేట్‌. నాన్నగారికి హ్యాట్సాఫ్‌’’ అని పేర్కొన్నారు సన్నీ డియోల్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement