'మా అబ్బాయిలతో కలిసి నటించాలని ఉంది' | Searching for the right script to work with sons, says Dharmendra | Sakshi
Sakshi News home page

'మా అబ్బాయిలతో కలిసి నటించాలని ఉంది'

Published Wed, Sep 9 2015 7:54 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'మా అబ్బాయిలతో కలిసి నటించాలని ఉంది' - Sakshi

'మా అబ్బాయిలతో కలిసి నటించాలని ఉంది'

న్యూఢిల్లీ : తన కుమారులతో కలిసి నటించాలని ఉందని బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర అన్నాడు. మంచి కథ దొరికితే తన కుమారులతో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. సన్నీడియోల్, బాబీడియోల్లు ధర్మేంద్ర మొదటి భార్య సంతానం అన్న విషయం అందరికి విదితమే.గతంలో వీరు ముగ్గురి కలయికలో  అప్నే, యమ్లా పగ్లా దీవానా చిత్రాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో మరో మూవీ చేయాలని వెటరన్ నటుడు, షోలే సూపర్ స్టార్ ధర్మేంద్ర ఉవ్విళ్లూరుతున్నాడు. తొలి రెండు సినిమాలు హిట్ అయినప్పటికీ, యమ్లా పగ్లా దీవానా సీక్వెల్ ఫ్లాప్ అవడంతో మళ్లీ ఈ ముగ్గురి కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్పై కనిపించలేదు.

ధరమ్ ఘరమ్ అనే ఓ స్టార్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. సన్నీ, బాబీలతో కలిసి మరోసారి వెండితెరపై కనిపించాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. కానీ ఓ మంచి స్క్రిప్ట్ దొరికితే ఈ తండ్రీకొడుకులను మరోసారి సిల్వర్స్ర్ర్కీన్పై అభిమానులను కనువిందు చేస్తామన్నాడు. యాక్టింగ్ కింగ్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ధర్మేంద్ర 1960లలో బాలీవుడ్లో తన ప్రస్థానం ప్రారంభించాడు. అంచెలంచెలుగా ఎదిగినా తనను తాను ఎప్పుడు ఓ స్టార్ అని భావించనని 'షోలే' సూపర్ స్టార్ మరిన్ని ముచ్చట్లను అభిమానులతో పంచుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement