బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని 1970ల్లో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత హేమ ధర్మేంద్రతో కలిసి 1970లో వారి తుమ్ హసీన్ మెయిన్ జవాన్ చిత్రంలోమొదటిసారి నటించారు. ఈ సినిమాతోనే హేమమాలిని, ధర్మేంద్ర మధ్య ప్రేమ చిగురించింది. కానీ అప్పటికే ధర్మేంద్రకు పెళ్లై.. పిల్లలు కూడా ఉన్నారు. కానీ ధర్మేంద్ర, హేమ మాలిని 1980లో వివాహం చేసుకున్నారు.
(ఇది చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో ముద్దులాట.. తప్పు మీది.. నన్నెందుకు పంపించేశారు?)
అయితే ఈ జంటకు మొదట ఈషా డియోల్ జన్మించింది. అయితే పాప పుట్టినప్పుడు జరిగిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. హేమమాలిని డెలివరీ కోసం ఏకంగా ఆస్పత్రినే బుక్ చేసుకున్నారట. దీనికి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. అయితే ఈ విషయాన్ని హేమ మాలిని స్నేహితుల్లొ ఒకరు వివరించారు.
హేమ ప్రసవించిన విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఇలా చేశారని చెప్పుకొచ్చారు. ఈషా పుట్టడానికి ధర్మేంద్ర 100 గదుల ఆసుపత్రిని ఎందుకు బుక్ చేయాల్సి వచ్చిందో అప్పుడు చాలామందికి అర్థం కాలేదని వెల్లడించారు. ఓ షోలో పాల్గొన్న హేమమాలినికి ఆమె స్నేహితురాలు నీతూ కోహ్లి ఈ సంఘటనను గురించి అడిగారు. అయితే దీనిపై కొందరు భిన్నంగా స్పందించారు. దీనివల్ల ఇతరులు ఇబ్బందులు పడతారని తెలియదా అని ప్రశ్నించారు. ఇలాంటి పనులు అనవసరమైనవని మండపడుతున్నారు. మరికొందరేమో ఆస్పత్రికి బదులు ఒక ఫ్లోర్ బుక్ చేసుకోవచ్చు కదా అని సూచిస్తున్నారు.
ధర్మేంద్ర, హేమ లవ్ స్టోరీ
కాగా.. హేమ ధర్మేంద్ర 1970లో వారి తుమ్ హసీన్ మెయిన్ జవాన్ చిత్రంలో మొదటిసారి నటించారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న జంట 1980లో వివాహం చేసుకున్నారు. హేమ తల్లిదండ్రులు ధర్మేంద్రను వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకించారు. ఈ జంటకు ఈషా, అహానా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంతకుముందు 1954లో ప్రకాశ్ కౌర్‌ను వివాహం చేసుకోగా.. నలుగురు పిల్లలు జన్మించారు.
(ఇది చదవండి: అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్.. నన్ను కూడా గుర్తుపట్టలేదు: యాంకర్)
Comments
Please login to add a commentAdd a comment